
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో హత్యాచారానికి గురైన యువ లేడీ డాక్టర్ తండ్రి మంగళవారం(అక్టోబర్22) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటోందని లేఖలో ఆయన అమిత్‌షాకు తెలిపారు.‘నా కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
మేం నిస్సహాయులమని అనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు,మా కుమార్తెకు న్యాయం జరిగేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. మంత్రికి బాధితురాలి తండ్రి తన లేఖను ఈ-మెయిల్ చేశారు.
ఇదీ చదవండి: వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment