kolkata doctor
-
సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన సీల్దా కోర్టు
-
కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి - శిక్ష ఖరారు
-
హోం మంత్రి అమిత్ షాకు కోల్‌కతా డాక్టర్ తండ్రి లేఖ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో హత్యాచారానికి గురైన యువ లేడీ డాక్టర్ తండ్రి మంగళవారం(అక్టోబర్22) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటోందని లేఖలో ఆయన అమిత్‌షాకు తెలిపారు.‘నా కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేం నిస్సహాయులమని అనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు,మా కుమార్తెకు న్యాయం జరిగేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. మంత్రికి బాధితురాలి తండ్రి తన లేఖను ఈ-మెయిల్ చేశారు.ఇదీ చదవండి: వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
ఈ పాటకు చప్పట్లు కొట్టకండి అంటూ ఎమోషనల్ అయిన శ్రేయ ఘోషల్
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో దేశ ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత దారణంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు అందరినీ బాధించింది. ఈ ఘటనపై ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన పాట అందరినీ కదిలిస్తుంది.వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగినట్లు వార్తలు వచ్చిన సమయంలో శ్రేయా ఘోషల్ నిర్వహించాలనుకున్న మ్యూజిక్ కాన్సర్ట్ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసుకుంది. దేశంలో ఇంతటి ఘోరం జరిగితే.. తాను ఎలా ఈ కార్యక్రమానికి వెళ్లగలను అంటూ ఆమె భావోద్వేగానికి నాడు లోనైంది. ఈ ఘటన వల్ల తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రూరమైన చర్య తనపై చాలా ప్రభావం చూపిందని గతంలో ఆమె పర్కొన్నారు.అయితే, తాజాగా ఆమె కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఆల్ హార్ట్స్ టూర్లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఒక ఎమోషనల్ సాంగ్‌ను అక్కడ శ్రేయా ఘోషల్ పాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 'గాయపడిన నా శరీర భాధను నేడు మీరందరూ వింటున్నారు' అంటూ సాగే ఈ పాటను ఆమె చాలా ఉద్వేగంతో ఆలపించారు. ఇలాంటి ఘటన సమయంలో బాధితురాలి ఆవేదన ఎలా ఉంటుందో పాట రూపంలో శ్రేయా తెలిపింది. అయితే, ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొదని ప్రేక్షకులను కోరింది. ఆమె పాటకు అక్కడున్న వారందరూ కూడా ఉద్విగ్నం అయ్యారు. ఆమెకు న్యాయం జరగాలి అంటూ స్టేడియం మొత్తం నినాదాలు చేశారు.మహిళల భద్రతపై శ్రేయా ఘోషల్ పాడిన పాటతో నెటిజన్లతో పాటు తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. వైద్యురాలి ఘటనపై శ్రేయా ఘోషల్ చాలా బాధపడ్డారని ఆయన తెలిపారు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు అవసరమని ఆయన పేర్కొన్నారు. -
కోల్‌కతా కేసు: ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారానికి సంబంధించి సాక్ష్యాలు నాశనం చేసిన కేసులో ఘోష్ సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 25దాకా కోర్టు పొడిగించింది. ఘోష్‌తో పాటు ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన కోల్‌కతా తాలా పోలీస్‌స్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా కోర్టు సెప్టెంబర్ 25 దాకా సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారం వెనుక ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తో కలిసి ఘోష్, మండల్ ఏదైనా కుట్ర చేశారా అని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. కుట్ర కోణంలో సీబీఐ వీరిని విచారించనుంది. కాగా, మెడికల్ కాలేజీలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోష్ మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇదీ చదవండి.. మాపైనే నిందలా..? సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
వీలైనంత త్వరగా సుప్రీం కోర్టు తీర్పునివ్వాలి: గంగూలీ
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సర్వోన్నత న్యాయస్థానం వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విజ్ఞప్తిచేశాడు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలన్నాడు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు దుండగులు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరుపుతోంది.ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలిఈ క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ఘటనకు సంబంధించిన దర్యాప్తు తాజా నివేదికను సెప్టెంబరు 17లోగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం నాటి విచారణలో భాగంగా ఈ మేరకు గడువు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన సౌరవ్ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీం కోర్టు ఈరోజు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో నాకు పూర్తి సమాచారం లేదు.అయితే, బాధితురాలికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడారు. రాజకీయాలకు అతీతంగా వీధుల్లో నిరసన చేశారు. వారందరికీ న్యాయం జరగాలి. న్యాయస్థానం విచారణ ప్రక్రియకు సమయం పడుతుందని తెలుసు. అయితే, వీలైనంత సత్వరంగా తీర్పును ఇవ్వాలని సుప్రీం కోర్టును అభ్యర్థిస్తున్నా. ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలి.ఇదీ చదవండి: అభయ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం!చెడు ఆలోచనలు చేసే వారి గుండెల్లో గుబులుపుట్టేలా ఉండాలి. బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు న్యాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. రాజకీయ రగడకాగా ఈ హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయా పార్టీల అభిమానులు సైతం రెండుగా చీలిపోయి.. పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. చదవండి: కోల్‌కతా డాక్టర్ కేసు: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం -
మృగాళ్ల వేటలో శివంగులు
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ‘పాలిగ్రాఫ్’ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్‌జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్ మీనా, సీమా పహుజాల పరిచయం.అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసును ఆగస్టు 13న కోల్కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్ సీమా పహూజాను నియమించింది. మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.ఇద్దరు అధికారులు ఏం చేశారు?జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్ ఘోష్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్‌రే యూనిట్... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ (ఒక విధమైన లై డిటెక్టర్ టెస్ట్) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.సంపత్ మీనా1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్ మీనాది రాజస్థాన్‌లోని సవాయిమధోపూర్. జార్ఘండ్‌లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్.పి.గా పని చేసింది. బి.పి.ఆర్ అండ్ డి (బ్యూరో ఆఫ్ ΄ోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్‌లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్‌లోని నక్సలైట్ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. సీమా పహుజా1993లో ఢిల్లీ ΄ోలీస్లో సబ్ ఇ¯Œ స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ చూసి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్‌ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్‌కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్ మెడల్ కూడా వరించింది. కాబట్టి కోల్‌కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం. -
డాక్టర్ దగ్గర రూ. 10 లక్షల కొత్త నోట్లు!
పెద్దనోట్ల రద్దు తర్వాత దేశమంతా ఒకవైపు నగదు లేక అల్లాడుతుంటే.. కోల్‌కతాలోని ఒక వైద్యుడి వద్ద ఏకంగా 10 లక్షల రూపాయల కొత్తనోట్లు దొరికాయి. దాంతోపాటు వివిధ దేశాలకు చెందిన రూ. 4 లక్షల విలువ చేసే కరెన్సీ కూడా దొరికింది. దీంతో అతడిపై ఫెమా, పీఎంఎల్ఏ చట్టాల కింద ఈడీ అధికారులు కేసులు పెట్టారు. దేశవ్యాప్తంగా కొత్త కరెన్సీ నోట్లకు తీవ్రంగా కొరత ఏర్పడటంతో ఈడీ అధికారులు దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఎక్కడైనా అక్రమంగా పాత నోట్లను మార్చి కొత్తనోట్లు తీసుకుంటున్నారేమో చూశారు. ఇందుకోసం వివిధ నగరాల్లో ఎక్కడికక్కడ స్థానిక పోలీసులతో కలిసి బృందాలుగా ఏర్పడ్డారు. కోల్‌కతాలో ఆరు, భువనేశ్వర్‌లో రెండు, పారాదీప్‌లో రెండు, గువాహతిలో రెండుచోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భాగంగానే కోల్‌కతా వైద్యుడి బండారం బయటపడింది. పది లక్షల రూపాయల కొత్త కరెన్సీ ఒక్కరి దగ్గరే బయటపడటం అంటే చిన్న విషయం కాదని, దీన్ని కచ్చితంగా నల్లధనంతోనే మార్పిడి చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.