డాక్టర్ దగ్గర రూ. 10 లక్షల కొత్త నోట్లు!
డాక్టర్ దగ్గర రూ. 10 లక్షల కొత్త నోట్లు!
Published Thu, Dec 1 2016 10:12 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
పెద్దనోట్ల రద్దు తర్వాత దేశమంతా ఒకవైపు నగదు లేక అల్లాడుతుంటే.. కోల్‌కతాలోని ఒక వైద్యుడి వద్ద ఏకంగా 10 లక్షల రూపాయల కొత్తనోట్లు దొరికాయి. దాంతోపాటు వివిధ దేశాలకు చెందిన రూ. 4 లక్షల విలువ చేసే కరెన్సీ కూడా దొరికింది. దీంతో అతడిపై ఫెమా, పీఎంఎల్ఏ చట్టాల కింద ఈడీ అధికారులు కేసులు పెట్టారు. దేశవ్యాప్తంగా కొత్త కరెన్సీ నోట్లకు తీవ్రంగా కొరత ఏర్పడటంతో ఈడీ అధికారులు దేశంలోని 40 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఎక్కడైనా అక్రమంగా పాత నోట్లను మార్చి కొత్తనోట్లు తీసుకుంటున్నారేమో చూశారు. ఇందుకోసం వివిధ నగరాల్లో ఎక్కడికక్కడ స్థానిక పోలీసులతో కలిసి బృందాలుగా ఏర్పడ్డారు.
కోల్‌కతాలో ఆరు, భువనేశ్వర్‌లో రెండు, పారాదీప్‌లో రెండు, గువాహతిలో రెండుచోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భాగంగానే కోల్‌కతా వైద్యుడి బండారం బయటపడింది. పది లక్షల రూపాయల కొత్త కరెన్సీ ఒక్కరి దగ్గరే బయటపడటం అంటే చిన్న విషయం కాదని, దీన్ని కచ్చితంగా నల్లధనంతోనే మార్పిడి చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
Advertisement