మృగాళ్ల వేటలో శివంగులు | CBI Officers Sampat Meena And Seema Pahuja Assigned To Kolkata Rape-Murder Case | Sakshi
Sakshi News home page

మృగాళ్ల వేటలో శివంగులు

Published Thu, Aug 22 2024 12:52 AM | Last Updated on Thu, Aug 22 2024 1:20 PM

CBI Officers Sampat Meena And Seema Pahuja Assigned To Kolkata Rape-Murder Case

విచారణ

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు ‘పాలిగ్రాఫ్‌’ టెస్ట్‌ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్‌జి కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌కు కూడా పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్‌ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ  ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్‌ మీనా, సీమా పహుజాల పరిచయం.

అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ కేసును ఆగస్టు 13న కోల్‌కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్‌ డైరెక్టర్‌ సంపత్‌ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్‌ సీమా పహూజాను నియమించింది.  మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్‌ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.

ఇద్దరు అధికారులు ఏం చేశారు?
జూనియర్‌ డాక్టర్‌ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్‌ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్‌ ఘోష్‌ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్‌ ఘోష్‌ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్‌రే యూనిట్‌... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు.

 ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ (ఒక విధమైన లై డిటెక్టర్‌ టెస్ట్‌) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ పైన కూడా పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.

సంపత్‌ మీనా
1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సంపత్‌ మీనాది రాజస్థాన్‌లోని సవాయిమధోపూర్‌. జార్ఘండ్‌లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్‌.పి.గా పని చేసింది. బి.పి.ఆర్‌ అండ్‌ డి (బ్యూరో ఆఫ్‌ ΄ోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కింద ఆమె చైల్డ్‌ ట్రాఫికింగ్‌ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్‌లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్‌లోని నక్సలైట్‌ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్‌ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్‌ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. 

సీమా పహుజా
1993లో ఢిల్లీ ΄ోలీస్‌లో సబ్‌ ఇ¯Œ స్పెక్టర్‌గా రిక్రూట్‌ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్‌ క్రైమ్‌ యూనిట్‌లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్‌ స్కిల్స్‌ చూసి  2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్‌ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్‌ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్‌ కేసులో సంపత్‌ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్‌కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్‌ మెడల్‌ కూడా వరించింది. కాబట్టి కోల్‌కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement