బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై చోటుచేసుకున్న అఘాయిత్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ ఆరో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో సమరి్పంచింది. వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ రూపొందించడానికి ఏర్పాటైన నేషనల్ టాస్‌్కఫోర్స్(ఎన్‌టీఎఫ్) సైతం తమ నివేదికను అందజేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ఈ నివేదికను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని ఎన్‌టీఎఫ్‌కు సూచించింది. 10 మంది సభ్యులతో ఎన్‌టీఎఫ్‌ను సుప్రీంకోర్టు గతంంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పశ్చిమబెంగాల్‌లోనే కొనసాగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై కోల్‌కతా కోర్టులో ఈనెల 4న అభియోగాల నమోదయ్యాయని, ఈ నెల 11 నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment