polygraph test
-
కోల్‌కతా కేసులో ట్విస్ట్: సంజయ్ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పింది ఇదే..
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌కి జరిపిన పాలీగ్రాఫ్ టెస్టులో కొన్ని కీలక అంశాలు వెల్లడించాడు. నేరం జరిగిన రోజున వారు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు.కాగా, ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతిలో సంజయ్‌కు పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్బంగా నిందితుడు కీలక విషయాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు వివరాలను వెల్లడించారు.నేరం జరిగిన రోజు రాత్రి జరిగింది ఇది..ఆగస్టు 8వ తేదీన రాత్రి నిందితుడు ఆసుపత్రికి చేరుకున్నాడు.11:15 PM: రాయ్ తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లాడు.బయట మద్యం సేవించి.. అనంతరం, నార్త్ కోల్‌కతాలోని సోనాగాచీ రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లారు.కాసేపటి తర్వాత అక్కడి నుంచి సౌత్ కోల్‌కతాలో ఉన్న చెట్లా రెడ్‌లైట్ చేరుకున్నారు.అక్కడ నిందితుడి స్నేహితుడు ఓ మహిళతో గదిలోకి వెళ్లిపోయాడు. నిందితుడు మాత్రం బయటే ఉన్నాడు.ఈ సందర్భంగా రాయ్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. తన నగ్న ఫొటోలను పంపాలని కోరాడు. దీంతో, ఆమె ఫొటోలను పంపించింది.అదే వీధిలో ఓ మహిళను అతడు వేధింపులకు గురిచేశాడు.కాసేపటి తర్వాత వారిద్దరూ ఆసుపత్రికి చేరుకున్నారు.ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున 4:03 AM ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు(సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం) ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో, ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్‌లకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి సంజయ్‌ను ప్రశ్నించారు. దీంతో, మాట మార్చిన నిందితుడు హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్టు చెప్పాడు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సీబీఐ ఆరోపిస్తుంది. Sanjoy Roy, the prime accused in the rape and murder of a trainee doctor at Kolkata's R.G. Kar Medical College and Hospital, has reportedly claimed in a lie detector test that the victim was dead when he reached the hospital's seminar hall.Sanjay Roy was subjected to a… pic.twitter.com/N6zmkYPBd4— Shyam Awadh Yadav parody© (@shyamawadhyada2) August 26, 2024 -
కోల్‌కతా ఘటన: మాట మార్చిన నిందితుడు.. అక్కడ సీబీఐ సోదాలు
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక, కేసులో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్.. జైలులో గార్డులతో చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. తనకూ ఈ కేసులో ఎలాంటి సంబంధంలేదని చెప్పడం సంచలనంగా మారింది.కాగా, ఆర్జీ కార్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యచార కేసులో సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ రోజు ఏం జరిగిందో అంతా వివరించాడు. కానీ, తాజాగా జైలు గార్డులతో మాత్రం మరోలా చెప్పడం గమనార్హం. అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని జైల్ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అంతకుముందు కూడా.. తనకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను నిర్దోషిని అంటూ అందుకే లై డిటెక్టర్ టెస్ట్‌కి అంగీకరించానని కోర్డులో జడ్జ్ ముందే చెప్పాడు.అయితే, హత్యాచార ఘటన సమయంలో సెమినార్ రూమ్ వైపు ఎందుకు వెళ్లావ్ అని పోలీసులు ప్రశ్నించగా.. సంజయ్ దానికి సమాధానం చెప్పలేదు. పొంతన లేని సమాధానాలు చెప్పి విచారణ అధికారులను తప్పుదోవ పట్టించాలని చూశాడు. క్రైమ్ సీన్లో తెల్లవారుజామున 4.03 గంటలకు కనిపించాడుతన ముఖంపై గాయాల గురించి విచారిస్తే సరైన బదులు ఇవ్వడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.CCTV footage shows accused entering hospital!Sanjay Rai is seen wearing jeans & t-shirt with a helmet in hand on August 9 night when he committed the heinous crime.BJP & CPM claimed that Sanjay was a scapegoat framed by @KolkataPolice to shield others.#KolkataDoctorDeathCase pic.twitter.com/TrGz3fWoTV— Nilanjan Das (@NilanjanDasAITC) August 23, 2024ఇదిలా ఉండగా.. ఆగస్టు 24వ తేదీనే(శనివారం) సంజయ్‌కు పాలిగ్రఫీ టెస్ట్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో, నేడు ఆదివారం(ఆగస్టు 25) ఈ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ప్రస్తుతానికి జైల్లో ఉన్న సంజయ్ రాయ్‌ని అక్కడే ఉంచి ఈ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అతని సెల్ వద్దే సీసీ కెమెరాలు పెట్టారు. నిఘా పెంచారు.#WATCH | Kolkata, West Bengal: CBI Anti Corruption Branch reaches the administrative block of RG Kar Medical College and Hospital. CBI started a corruption investigation against former principal Sandeep Ghosh by filing an FIR, yesterday. pic.twitter.com/2KnCsHZXSN— ANI (@ANI) August 25, 2024మరోవైపు.. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సీబీఐ అధికారులు.. సందీప్ ఘోష్‌కు సంబంధించిన ఇళ్లు, పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. -
కోల్‌కతా డాక్టర్ కేసు: నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్
కోల్‌కతా: కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మురం చేస్తోంది. తాజాగా ఆదివారం ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ హోష్, మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ టెస్ట్‌లు నిర్వహించటం కోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (SEPSLA) ప్రత్యేక బృందం కోల్‌కతా చేరుకున్నట్లు తెలిపారు. పాలిగ్రాఫ్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇక.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జైలులోనే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తామని, మిగతావారికి సీబీఐ కార్యాలయంలో టెస్ట్‌లు కొనసాగుతున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.Kolkata doctor rape-murder: Polygraph test of former RG Kar principal Sandip Ghosh among others to be held todayRead @ANI Story | https://t.co/cTnTQQqCBa#Kolkata #RGKarHospital #SandipGhosh pic.twitter.com/udWo2KLl2F— ANI Digital (@ani_digital) August 24, 2024బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్టియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టైనీలు, ఒక హౌస్ సర్జన్, ఇంటర్న్‌షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు. వీరందరూ కలిసి బాధిత డాక్టర్‌తో కలిసి ఘటన జరగడానికి ముందు భోజనం చేశారు. ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి స్టేట్మెంట్లు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. డాక్టర్ హత్యాచారానికి గురవడానికి ముందు, తర్వాత ముందుగా వీరే చూశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీళ్లు ఏమైనా ప్రయత్నించారా? అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా తెలుసుకోవాలని దర్యాప్తు సంస్థ సీబీఐ భావిస్తోంది. ఇక.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు కోల్‌కతా హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. -
మృగాళ్ల వేటలో శివంగులు
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ‘పాలిగ్రాఫ్’ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్‌జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్ మీనా, సీమా పహుజాల పరిచయం.అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసును ఆగస్టు 13న కోల్కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్ సీమా పహూజాను నియమించింది. మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.ఇద్దరు అధికారులు ఏం చేశారు?జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్ ఘోష్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్‌రే యూనిట్... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ (ఒక విధమైన లై డిటెక్టర్ టెస్ట్) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.సంపత్ మీనా1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్ మీనాది రాజస్థాన్‌లోని సవాయిమధోపూర్. జార్ఘండ్‌లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్.పి.గా పని చేసింది. బి.పి.ఆర్ అండ్ డి (బ్యూరో ఆఫ్ ΄ోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్‌లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్‌లోని నక్సలైట్ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. సీమా పహుజా1993లో ఢిల్లీ ΄ోలీస్లో సబ్ ఇ¯Œ స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ చూసి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్‌ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్‌కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్ మెడల్ కూడా వరించింది. కాబట్టి కోల్‌కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం. -
నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిలి్చన వైద్యురాలి రేప్, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి సోమవారం స్థానిక కోర్టు అనుమతించింది. ఆర్జి కార్ ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్‌ను అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడికి ఏరోజు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలనేది సీబీఐ ఇంకా ఖరారు చేయలేదు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని తెలుసుకోవడానికి సీబీఐ ఇదివరకే సైకోఅనాలసిస్ టెస్టు చేసింది. మరోవైపు కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకేనని పోలీసులు చెబుతుండగా, నిరసనకారుల గళం నొక్కేందుకేనని విపక్షాలు మండిపడుతున్నాయి. వైద్యురాలి హత్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సీనియర్ డాక్టర్లు కునాల్ సర్కార్, సువర్ణ గోస్వామిలకు సమన్లు జారీ చేయడంతో వారు భారీ ర్యాలీతో కోల్‌కతా పోలీసు కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వైద్య రంగానికి చెందిన వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘యువ డాక్టర్‌కు న్యాయం కోరుతున్నాం. మేమేమీ నేరం చేయలేదు. పోలీసులు తమ సమన్లను వెనక్కి తీసుకున్నారు. వైద్య పరివారం సహకారాన్ని కోరారు’ అని డాక్టర్ కునాల్ సర్కార్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీని బెదిరించినందుకు, బాధితురాలి పేరును సోషల్ మీడియాలో బహిర్గతపర్చినందుకు పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఆర్జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ వరుసగా నాలుగోరోజు కూడా విచారించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. కేంద్ర ఆరోగ్యశాఖతో సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని, అంగీకారయోగ్యమైన ఒప్పందానికి రాలేకపోయామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. వైద్యుల సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది. నేడు సుప్రీంకోర్టు విచారణ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె, తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం పీజీ డాక్టర్ హత్యోదంతంపై సుమోటోగా విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు విచారణ చేపడుతుంది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సలె్టంట్స్ ఆఫ్ ఇండియా (ఫామ్కీ), ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)లు సుమోటో కేసులో తమను భాగస్వాములను చేయాలని సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంలో పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బదనాం చేస్తూ, రాజీనామా చేయాలని ఆమెవైపు వేలెత్తి చూపుతున్న వారి వేలు విరిచివేయాలని సీనియర్ మంత్రి ఉదయన్ గుహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మమతపై దాడి చేస్తూ ఆమెను వేలెత్తి చూపుతున్న వారు. రాజీనామాకు డిమాండ్ చేస్తున్న వారు ఎప్పటికీ సఫలం కాలేరు. మమత వైపు ఎత్తిన వేళ్లను విరిచేస్తాం’ అని ఉదయన్ అంటున్న వీడియో వైరల్‌గా మారింది. -
నాకు స్వర్గం గ్యారెంటీ.. అక్కడ అప్సరసలతో ఆనందిస్తా..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పాలిగ్రాఫ్ టెస్టులో నివ్వెరపరిచే అంశాలు బయటపెట్టాడు. నమ్మి సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్‌ను అత్యంత పాశవికంగా కడతేర్చినందుకు తనకు ఇసుమంతైనా పశ్చాత్తాపం లేదని కుండబద్దలు కొట్టాడు! ‘‘నన్ను ఉరితీసినా బాధ లేదు. ఎందుకంటే నేను స్వర్గానికే వెళ్తా. అక్కడ నన్నంతా ఓ హీరోలా చూస్తారు. అప్సరసలతో ఆనందిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘శ్రద్ధను చంపేటప్పుడు గానీ, శవాన్ని ముక్కలుగా నరుకుతున్నప్పుడు గానీ ఏమాత్రం బాధగా అనిపించలేదు. అసలు ముంబైలో ఉండగానే శ్రద్ధను చంపి ముక్కలు చేయాలని భావించా’’ అని వెల్లడించాడు. అంతేకాదు, ‘‘శ్రద్ధతో సహజీవనం చేస్తూనే మరోవైపు 20 మందికి పైగా అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నా! బంబుల్ యాప్ సాయంతో వారిని ట్రాప్ చేసేవాడిని. శ్రద్ధను చంపాక ఓ సైకాలజిస్ట్‌ను ఫ్లాట్‌కు ఆహ్వానించి ఆమెతో గడిపా. శ్రద్ధ తాలూకు రింగును ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చా’’ అని వివరించాడు. ఇవన్నీ విని షాకయ్యామని పోలీసులు చెప్పుకొచ్చారు. విచారణ అనంతరం అతను ఏ చీకూచింతా లేకుండా ఇట్టే నిద్రలోకి జారిపోయేవాడని వివరించారు. పరీక్ష అనంతరం అతని ఫ్లాట్ నుంచి ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
శ్రద్ధ హత్య కేసు.. నేరం అంగీకరించని అఫ్తాబ్.. పోలీస్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోరడంతో అంగీకరించింది. సాకెత్ కోర్టులో మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఘటన క్షణికావేశంలోనే జరిగిందని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు. విచారణ అనంతరం అఫ్తాబ్ తరఫు న్యాయవాది అవినాశ్ మాట్లాడుతూ.. అతడు ఇంకా కోర్టులో నేరాన్ని అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఘటన సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కూడా న్యాయస్థానం ఎదుట ఒప్పుకోలేదని వివరించాడు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు అతడ్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అఫ్తాబ్‌కు ఐదు రోజుల్లో నార్కో టెస్టు నిర్వహించాలని గత సెషన్లో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అతను విచారణకు సహకరించడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అందుకే నార్కో టెస్టుకు ముందు పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ బాయ్ ఫ్రెండ్ అఫ్తాబే ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. అయితే ఈ కేసులో అఫ్తాబ్ ఉపయోగించిన కత్తి, శ్రద్ధ దుస్తులు, మొబైల్ ఫోన్, ఇంకా కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్.. -
శ్రద్ధా హత్య కేసు: నిజాలు నిగ్గు తేల్చేందుకు..
శ్రద్ధా వాకర్ హత్య కేసులో.. నిందితుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడి అతిక్రూర స్వభావం బయటపడడంతో ఆధారాలను పక్కాగా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో.. నిందితుడిపై పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టు అనుమతి కోరారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సోమవారం సాకేత్ కోర్టులో ఢిల్లీ పోలీసులు పిటిషన వేశారు. ఈ కేసులో తొలుత పోలీసులను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించాడు నిందితుడు అఫ్తాబ్. అయితే చివరికి నేరం ఒప్పుకున్నప్పటికీ.. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉంటున్నాయని పోలీసులు అంటున్నారు. ఇంతకు ముందు అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు సాకేత్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు.. అఫ్తాబ్‌పై పాలీగ్రాఫ్ పరీక్షల నిర్వహణకు అనుమతించాలని సాకేత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలా ఉంటే మెజిస్ట్రేట్ విజయశ్రీ రాథోడ్.. అఫ్తాబ్‌పై నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహణకు అనుమతించారు. దీంతో.. పాలిగ్రాఫ్ అనుమతించే విషయంపై తేల్చాల్సిందిగా మెజిస్ట్రేట్ రాథోడ్ అభిప్రాయసేకరణకు పోలీసుల పిటిషన్‌ను పంపించారు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు ఐదురోజుల కస్టడీ గడువు ముగియడంతో ఢిల్లీ పోలీసులు.. అఫ్తాబ్‌ను కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఢిల్లీ పోలీసులు కోర్టుకు ‘అఫ్తాబ్ తప్పుడు సమాచారం అందించాడని, దర్యాప్తును తప్పుదోవ పట్టించే యత్నం చేశాడ’ని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఇక నిందితుడు అఫ్తాబ్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని దర్యాప్తు అధికారులను ఆదేశించిన న్యాయస్థానం.. నార్కో అనాలసిస్‌ను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని గత గురువారం ఆదేశించింది. అయితే సోమవారం నిర్వహించాల్సిన ఈ పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక అతని తరపు న్యాయవాది ఎవరూ వాదించేందుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయవాది హర్షిత్ సాగర్‌ను లీగల్ ఎయిడ్ కౌన్సెల్‌గా నియమించిన సంగతి తెలిసిందే. పాలీగ్రాఫ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే.. పాలీగ్రాఫ్ టెస్ట్.. నేర పరిశోధనలో ప్రయోగాత్మకమైన పద్ధతి. లైడిటెక్టర్ పరీక్ష అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజాలను రాబట్టడం అనడం కంటే.. అబద్ధాలను గుర్తించడం అనే ట్యాగ్‌తో ఈ పరీక్షగా ఎక్కువగా పాపులర్ అయ్యింది. 1921లో కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడికో జాన్ అగస్టస్ లార్సన్ ఈ విధానాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. వైర్లు, ట్యూబుల్లాంటి వాటితో శరీరానికి సెన్సార్ల వంటి నిర్దిష్ట పరికరాలను జోడించి.. బీపీ, పల్స్, వివిధ భావోద్వేగాలు, శరీర కదలికలను జాగ్రత్తగా పర్యవేక్షించడం ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తుంటారు. శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా గమనించి ఆ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో అనే నిర్ధారణకు అధ్యయనం చేపట్టడం ద్వారా వస్తారు. క్రిమినల్ కేసుల దర్యాప్తుల్లో కీలకంగా వ్యహరిస్తుంటుంది ఈ పరీక్ష. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. నేరస్థులు ప్రాక్టీస్ ద్వారా ఈ పరీక్ష నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ పరీక్ష ఖచ్చితత్వంపై తరచు విమర్శలు వినిపిస్తుంటాయి. నార్కో టెస్ట్.. ఈ పరీక్షకి ముందు కొన్ని మందులు లేదంటే ఇంజెక్షన్లు ఇస్తారు. తద్వారా నిందితుడు/అనుమానితుడు అపస్మార స్థితిలోకి జారుకుంటాడు. మనస్సుపై నియంత్రణ కోల్పోతాడు. అప్పుడు అతని ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో, సదరు వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవచ్చు. డోస్ ఎక్కువగా ఇస్తే కోమాలోకి వెళ్లిపోవడం లేదంటే చనిపోవచ్చూ కూడా. కాబట్టి, నార్కో టెస్ట్‌కు కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థల అనుమతి తప్పనిసరి. అంతేకాదు.. అతను నార్కో టెస్ట్‌కు అర్హుడేనా? అనేది కూడా బాడీ టెస్ట్ ద్వారా ధృవీకరించుకుంటారు. ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, మనస్తత్వవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగే టైంలో వీళ్లలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆ టెస్ట్ ఆపేయాల్సిందే!.. ఇక కొందరు ఈ పరీక్షలో కూడా దర్యాప్తు బృందాన్ని కూడా తప్పించుకుంటున్నారు. అందుకే ఈ పరీక్షపైనా తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, మన దేశంలో నార్కో టెస్ట్, పాలీగ్రాఫ్ టెస్ట్‌ల ద్వారా కేసుల దర్యాప్తులో పురోగతి సాధించిన సందర్భాలు, కేసుల చిక్కుముడులు విప్పిన దాఖలాలే ఎక్కువగా నమోదు అయ్యాయి. -
ఎస్పీకి పాలిగ్రాఫ్ పరీక్షలు?
పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయన నుంచి నిజాలు రాబట్టాలంటే ఈ టెస్టు చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తన కారును హైజాక్ చేసి, తనను కొట్టి పారేశారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు తన సెల్‌ఫోన్ కూడా లాక్కోవడంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నారు. తాను తరచు పఠాన్‌కోట్‌లోని గురుద్వారాకు వెళ్తుంటానని, అలా వెళ్లి వస్తుంటేనే తన కారును హైజాక్ చేశారని సల్వీందర్ చెప్పారు. అయితే, గురుద్వారా కేర్‌టేకర్ సోమరాజ్ మాత్రం, ఆయనను తొలిసారి డిసెంబర్ 31నే చూశానని అన్నారు. సల్వీందర్ గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దానిపై ఐజీ స్థాయి అధికారి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు కూడా సల్వీందర్ చెబుతున్న విషయాలకు ఒకదానికి, మరోదానికి పొంతన కుదరడం లేదు. అందుకే ఆయనను బెంగళూరు లేదా ఢిల్లీ తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్టు చేయించాలని భావిస్తున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు సల్వీందర్ తన అంగీకారం తెలిపారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. తన వ్యక్తిగత వాహనానికి నీలిరంగు సైరన్ లైటు పెట్టుకోకూడదని తెలిసినా, ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న అంశంపై కూడా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఆ వాహనంలోనే ఉగ్రవాదులు పోలీసు చెక్‌పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేశారు. ఈ కేసు గురించి తనకేమీ తెలియదని.. తాను కూడా వాళ్ల బాధితుడినేనని మాత్రమే ఇంతవరకు సల్వీందర్ చెబుతూ వస్తున్నారు. సల్వీందర్‌ను సస్పెండ్ చేయలేదని మాత్రం పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా చెప్పారు. -
అవును.. నేను పాకిస్థానీనే: నవేద్
పాక్ ఎంత కాదన్నా.. నిజం నిప్పులా బయటపడింది. జమ్ము కాశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ దళాలపై దాడిచేసి, పట్టుబడినది పాకిస్థానీ ఉగ్రవాదేనన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. తాను పాకిస్థానీనేనని, లష్కరే తాయిబేనే తనకు శిక్షణ ఇచ్చిందని ఉధంపూర్ దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్ అంగీకరించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్వహించిన పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్( పరీక్షలలో అతడు ఈ వివరాలు చెప్పాడు. భారత భద్రతా దళాలపై దాడులు చేయాల్సిందిగా తమను ఆదేశించి పంపారని కూడా అంగీకరించాడు. -
వారికి పాలిగ్రాప్ పరీక్షలు చేయొచ్చు
న్యూఢిల్లీ: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు శశిథరూర్ ఇంటి సహాయకులపై నిజనిర్దారణ పరీక్షకు(పాలిగ్రాప్ టెస్ట్) ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఈ మేరకు అనుమతి పొందింది. అయితే, ఇది ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. శశిథరూర్ భార్య అయిన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు దారితీయడంతో కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. వారి దర్యాప్తులో భాగంగా థరూర్ సేవకులైన నరేన్ సింగ్, డ్రైవర్ బజ్ రంగీ, స్నేహితుడు సంజయ్ దెవాన్పై పాలిగ్రాప్ పరీక్షలు చేయాలని నిర్వహించింది. వారు ఏవో నిజాలు దాస్తున్నారని, ఈ పరీక్ష ద్వారా అవి తెలిసి కేసులోని పలు అనుమానాలకు పరిష్కారం చూపినట్లవుతుందని సిట్ భావించింది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది.