వారికి పాలిగ్రాప్ పరీక్షలు చేయొచ్చు | Delhi Court allows polygraph tests to be conducted on 3 key witnesses | Sakshi
Sakshi News home page

వారికి పాలిగ్రాప్ పరీక్షలు చేయొచ్చు

Published Wed, May 20 2015 4:32 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

వారికి పాలిగ్రాప్ పరీక్షలు చేయొచ్చు

వారికి పాలిగ్రాప్ పరీక్షలు చేయొచ్చు

న్యూఢిల్లీ: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు శశిథరూర్ ఇంటి సహాయకులపై నిజనిర్దారణ పరీక్షకు(పాలిగ్రాప్ టెస్ట్) ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఈ మేరకు అనుమతి పొందింది. అయితే, ఇది ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. శశిథరూర్ భార్య అయిన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై పలు అనుమానాలు దారితీయడంతో కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. వారి దర్యాప్తులో భాగంగా థరూర్ సేవకులైన నరేన్ సింగ్, డ్రైవర్ బజ్ రంగీ, స్నేహితుడు సంజయ్ దెవాన్పై పాలిగ్రాప్ పరీక్షలు చేయాలని నిర్వహించింది. వారు ఏవో నిజాలు దాస్తున్నారని, ఈ పరీక్ష ద్వారా అవి తెలిసి కేసులోని పలు అనుమానాలకు పరిష్కారం చూపినట్లవుతుందని సిట్ భావించింది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement