సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసును ఢిల్లీలోని సెషన్స్ కోర్టు ఈనెల 21న విచారించనుంది. సునందా పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశి థరూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సునందా పుష్కర్ కేసును అంతకుముందు అదనపు చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సెషన్స్ కోర్టుకు బదలాయించింది.
కాగా,ఈ కేసులో విజిలెన్స్ నివేదికను పదిలపరచాలని ఢిల్లీ పోలీసులను సెషన్స్ కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో న్యాయస్ధానానికి సహకరించేందుకు అనుమతించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. కాగా సునంద పుష్కర్ కేసును దర్యాప్తు చేసిన సిట్ శశిథరూర్‌పై హత్యారోపణలు చేయలేదు. భార్య సునందా పుష్కర్‌ను శశిథరూర్ నిత్యం వేధింపులకు గురిచేయడం ఆమె మరణానికి దారితీసిందని చార్జ్‌షీట్‌లో సిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment