sunanda pushkar
-
శశి థరూర్‌కు తప్పని చిక్కులు.. ఆ కేసులో కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో శశిథరూర్‌కు క్లీన్చిట్ ఇవ్వటంపై హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ పోలీసులు. థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టవేస్తూ గతేడాది పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఢీకే శర్మ.. పిటిషన్ కాపీని శశి థరూర్ న్యాయవాదికి అందించాలని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాదికి సూచించారు. పిటిషన్ కాపీ తమకు అందలేదని, అది ఉద్దేశ పూర్వకంగానే మరో మెయిల్‌కు పంపి ఉంటారని థరూర్ న్యాయవాది ధర్మాసనానికి తెలపడంతో ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు.. రివిజన్ పిటిషన్ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని శశి థరూర్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని సూచించింది ధర్మాసనం. కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. ఇదీ కేసు.. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో సునందా పుష్కర్ అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం సృష్టించింది. తొలుత హత్య కోణంలో దర్యాప్తు జరిపినా.. చివరకు ఆత్మహత్యగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్ కోర్టు.. 2021, ఆగస్టులో ఆ అభియోగాలను కొట్టివేస్తూ థరూర్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. ఇదీ చదవండి: రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ -
సునంద పుష్కర్ మృతి కేసు: శశిథరూర్‌కు ఊరట
న్యూఢిల్లీ: భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారలు లేవన్న ప్రత్యేక కోర్టు శశిథరూర్ మీద ఉన్న ఆరోపణలను కొట్టిపారేసింది. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్లో శవమై కనిపించింది. ఈ క్రమంలో శశి థరూర్‌పై ఢిల్లీ పోలీసులు ఆత్మహత్య, క్రూరత్వ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. -
భార్య మృతి: శశిథరూర్‌కు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: భార్య మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌కు చుక్కెదురైంది. తమ కూతురు సునంద పుష్కర్ చాలా ధ్రుడమైన మనిషి అని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ముందు ఇదే విషయం చెప్పారు. దీంతో శశిథరూర్ ఇరకాటంలో పడ్డట్టు అయ్యింది. తమ కుమార్తె సునంద హత్యకు గురయ్యిందని కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌కు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరిగింది. హత్య చేశారని ఎలాంటి ఆధారాలు లేవని శశి తరఫు న్యాయవాది వికాస్ పావా కోర్టుకు విన్నవించారు. స్పెషల్ జడ్జి గీతాంజలి గోయెల్ ఇరు వైపు వాదనలు విన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా పడింది. అంతకుముందు దీనిపై వాదోపవాదనలు జరిగాయి. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కుటుంబసభ్యుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలు ఏ ఆధారంగా చెబుతున్నారని శశి తరఫు న్యాయవాది పావా ప్రశ్నించారు. కనీసం అదనపు కట్నం, వేధింపులపై ఒక్క ఆధారం కూడా లేదని పావా స్పష్టం చేశారు. ఓ విలాసవంతమైన హోటల్ 2014, జనవరి 17వ తేదీన సునంద పుష్కర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసులో శశి థరూర్‌పై కొన్ని కేసులు నమోదయ్యాయి. -
ప్రణయ సందేశాలను చూసి కోపం తట్టుకోలేక!
అందగాడైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అంతరంగపు వికృతరూపం త్వరలో ప్రత్యక్షమవబోతోందా! ఆయన భార్య సునందా పుష్కర్ హఠాన్మరణానికి సంబంధించి అతడిని వేలెత్తి చూపించే సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు వాదనల సమయంలో మళ్లొకసారి కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న పర్యవసానమే సునంద మరణం అనే అనుమానం బలపడుతోంది. తోపులాట కారణంగా సునంద శరీరంపై మొత్తం పదిహేను చోట్ల బలమైన గాయాలు అయినట్లు పోలీసులు గతంలోనే చార్జిషీటు దాఖలు చేశారు. పాకిస్తానీ మహిళా జర్నలిస్టుకు భర్త పంపిన ప్రణయ సందేశాలను చూశాక సునంద కోపం తట్టుకోలేకపోయారని, ఆ గొడవలో శశి థరూర్‌తో జరిగిన పెనుగులాటలో ఆమె గాయపడి, మరణించారని పోలీసులు గట్టిగా విశ్వసిస్తున్నారు. -
21న సునందా పుష్కర్ హత్య కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసును ఢిల్లీలోని సెషన్స్ కోర్టు ఈనెల 21న విచారించనుంది. సునందా పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశి థరూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సునందా పుష్కర్ కేసును అంతకుముందు అదనపు చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సెషన్స్ కోర్టుకు బదలాయించింది. కాగా,ఈ కేసులో విజిలెన్స్ నివేదికను పదిలపరచాలని ఢిల్లీ పోలీసులను సెషన్స్ కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో న్యాయస్ధానానికి సహకరించేందుకు అనుమతించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. కాగా సునంద పుష్కర్ కేసును దర్యాప్తు చేసిన సిట్ శశిథరూర్‌పై హత్యారోపణలు చేయలేదు. భార్య సునందా పుష్కర్‌ను శశిథరూర్ నిత్యం వేధింపులకు గురిచేయడం ఆమె మరణానికి దారితీసిందని చార్జ్‌షీట్‌లో సిట్ పేర్కొంది. -
‘ఆ నివేదిక వెలుగుచూస్తే శశిథరూర్‌కు షాక్’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసుల అంతర్గత విచారణ నివేదిక వెలుగుచూస్తే శశిథరూర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలకు బదులు హత్య ఆరోపణలు మోపేవారని వ్యాఖ్యానించారు. శశి థరూర్ సహకారంతో సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఢిల్లీ పోలీసుల అంతర్గత విచారణలో వెల్లడైందన్నారు. ఈ నివేదిక బయటకు వస్తే ఆయనపై కేవలం ఆత్మహత్యకు సహకరించారనే ఆరోపణల స్ధానంలో హత్య కేసు అభియోగాలు నమోదయ్యేవని స్వామి పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన తమ మాజీ సహోద్యోగులను కాపాడుకునేందుకు ఈ నివేదికలో అంశాలను బహిర్గతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు వెనుకాడుతున్నారన్నారు. ఈ నివేదిక వెలుగుచూడాలని పోలీసులు కోరుకోవడం లేదని, ఏమైనా న్యాయమూర్తులు చివరకు ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. చార్జిషీట్లో సాక్ష్యాల తారుమారు నివేదికను ప్రస్తావించకుంటే పూర్తి విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2014, జనవరి 17న సునందా పుష్కర్‌ను ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవిగా గుర్తించారు. కాగా శశిథరూర్ ఇల్లు పునర్మిర్మాణంలో ఉండటంతో థరూర్ దంపతులు హోటల్లో విడిది చేశారు. -
శశి థరూర్‌కు సాధారణ బెయిలు
న్యూఢిల్లీ: భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీలోని ఓ కోర్టు కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు శనివారం సాధారణ బెయిలు మంజూరు చేసింది. ఓ సెషన్స్ కోర్టు జూలై 5నే తనకు ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయాన్ని థరూర్ కోర్టుకు తెలియజేశారు. తర్వాత జడ్జి ముందస్తు బెయిలును సాధారణ బెయిలుగా మారుస్తూ లక్ష రూపాయల బాండు, రూ.లక్ష ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించారు. సునంద 2014లో ఢిల్లీలోని ఓ హోటల్లో మృతి చెందారు. -
థరూర్‌కు ముందస్తు బెయిల్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు ఊరట లభించింది. భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఢిల్లీలోని ఓ న్యాయస్థానం ఆయనకు గురువారం ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఈ సందర్భంగా థరూర్ విదేశాలకు పారిపోయే అవకాశముందన్న ప్రాసిక్యూషన్ వాదనల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించరాదనీ, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని సూచించింది. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్లో సునంద విగతజీవిగా కనిపించారు. మరుసటి ఏడాది జనవరిలో కేసు నమోదుచేసిన పోలీసులు చివరికి దీన్ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్) అప్పగించారు. విచారణ చేపట్టిన సిట్ థరూర్‌ను నిందితుడిగా చేరుస్తూ కోర్టుకు చార్జ్‌షీట్‌ను సమర్పించింది. దీంతో జూలై 7లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం థరూర్‌కు సమన్లు జారీచేసింది. ఈ కేసును గురువారం విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్.. శశిథరూర్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరుచేశారు. ఇందుకోసం రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండ్‌తో పాటు పూచీకత్తును సమర్పించాలని ఆదేశించారు. -
శశిథరూర్‌కు భారీ ఊరట
భార్య మృతి కేసులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌కు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. సునంద మృతిలో కేసులో 3000 పేజీల చార్జిషీట్‌ను రూపొందించిన ఢిల్లీ పోలీసులు.. థరూర్ పేరును నిందితుడిగా చేర్చారు. ఐపీసీలోని 498-ఏ(గృహహింస), 360(ఆత్మహత్యకు ప్రేరేపించటం) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతదాకా అరెస్ట్ మాత్రం చేయని పోలీసులు.. తాజాగా జూలై 7న కోర్టు విచారణకు మాత్రం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో థరూర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ దొరికితే ఆయన దేశం విడిచిపోతారని పోలీసులు వాదించగా, కోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు. లక్ష రూపాయల పూచీకత్తు, దేశం విడిచిరాదన్న షరతుల మేరకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ గదిలో సునంద అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందగా, కేసుపై దర్యాప్తు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. స్వామి వెటకారం... కాగా, సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్‌కు బెయిల్ లభించటంపై బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ‘థరూర్ ఇప్పుడు వేడుకలు జరుపుకోవటం అప్రస్తుతం. అతనేం తీహార్ జైల్లో కూర్చోడు. రాహుల్, సోనియా గాంధీలతో కూర్చుంటాడు. అఫ్కోర్స్.. వాళ్లు కూడా బెయిల్ వాలాస్(బెయిల్‌పై ఉన్నవాళ్లే) కదా! మంచి కంపెనీ’ అంటూ స్వామి ఛలోక్తులు విసిరారు. -
ముందస్తు బెయిల్‌కు శశి థరూర్ అప్పీల్
సాక్షి, న్యూఢిల్లీ : సునందా పుష్కర్ హత్య కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ముందస్తు బెయిల్ కోసం మంగళవారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు థరూర్‌ను నిందితుడిగా గుర్తిస్తూ జులై ఏడున విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. అయితే తనపై ఆరోపణలు నిరాధారమైనవని, సునందా పుష్కర్ మృతితో తనకు సంబంధం లేదని శశి థరూర్ వాదిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు సమర్పించిన 3000 పేజీల చార్జిషీట్లో సునందా పుష్కర్ హత్య కేసులో శశి థరూర్ ప్రమేయం ఉందని ఆయనను నిందితుడిగా పేర్కొంటూ థరూర్ భార్య పట్ల క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు. ఈ కేసులో శశి థరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ కీలక సాక్షిగా మారారు. కాగా 2014, జనవరి 17న సునందా పుష్కర్ ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ గదిలో విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
గొల్లభామ సునంద
కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు.. వెళ్లే దారికి ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటాయి. అయినప్పటికీ పట్టువీడకుండా ప్రయత్నిస్తే కాలం కార్పెట్ పరిచి మరీ గులామ్ అయిపోతుంది. అందుకు ఉదాహరణ సునంద సాధించిన విజయం. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని కుటుంబం కోసం గృహిణిగా ఉండిపోయిన సునందను ఆ కాలమే ‘గొల్లభామ సునంద’గా మార్చేసింది. దాదాపు నలభై ఏళ్ల క్రితమే అంతరించిపోయిన నూరేళ్ల నాటి ‘గొల్లభామ’ చేనేత కళకు మళ్లీ ఊపిరిపోసినందుకు సునందకు ఈ గుర్తింపు, గౌరవం దక్కాయి. సునంద.. కర్ణాటకలో స్త్రీ శిశుసంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. భర్త, ఇద్దరు పిల్లలు. సాఫీగా గడిచిపోతున్నాయి రోజులు. భర్త రవీంద్రకు హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. భర్త హైదరాబాద్‌లో, తను కర్ణాటకలో. ‘కుటుంబం కావాలా, ఉద్యోగం కావాలా!’ అనే డోలాయమాన పరిస్థితి. తుదకు కుటుంబమే కావాలని.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పిల్లలిద్దరినీ తీసుకొని అలా పద్నాలుగేళ్ల కిందట భర్తతో పాటు హైదరాబాద్ వచ్చేశారు సునంద. ‘వచ్చేశాక ఏమీ అర్థం కాలేదు. ప్రాంతం వేరు, ఇక్కడి భాష తెలియదు. పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయాక నాకేం చేయాలో తోచేది కాదు. ఏడాది పాటు ఖాళీగానే ఉన్నాను. అప్పటికే టెక్స్టైల్ టెక్నాలజీలో చేసిన ఎమ్మెస్సీ చదువు ఉంది నాకు. దీంతో టెక్స్టైల్స్ వైపు పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం వెతికాను. ఆ క్రమంలో హ్యామ్స్టెక్ వంటి ఫ్యాషన్ డిజైనర్ ఇన్స్టిట్యూట్లలో హెచ్ఓడీగా చేశాను. 2009లో ఆప్కోలో హ్యాండ్లూమ్ డిజైనింగ్‌లో క్యాడ్ ట్రెయినింగ్ తీసుకున్నాను. ఆ తరువాత ఏడాది మెదక్‌లోని దుబ్బాక క్లస్టర్‌కి డిజైనర్ పోస్ట్ వచ్చింది. అప్పుడు హ్యాండ్లూమ్లో నాకో ప్లాట్ ఫామ్ దొరికింది..’ అంటూ, తన కెరీర్ ప్రస్థానాన్ని వివరించారు సునంద. ముగిసిన కథ మళ్లీ మొదలైంది! ‘‘దుబ్బాక క్లస్టర్ డిజైనర్‌గా ఉన్నప్పుడు సిద్ధిపేట ప్రాంతంలో ‘గొల్లభామ’ చేనేత చీరల గురించి తెలిసింది. వందేళ్ల క్రితం ఓ చేనేతకారుడు అందమైన పడతి తన తలమీద పాలు, పెరుగు కుండలు పెట్టుకొని అమ్మడం చూసి బొమ్మగా గీసుకున్నారట. ఆ బొమ్మను నేతలో డిజైన్‌గా తీసుకొచ్చారట. అలా వచ్చిన గొల్లభామ చీరలకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. తర్వాత.. దాదాపు 40 ఏళ్లు.. అంటే ఒక తరానికి తరం గొల్లభామను మర్చిపోయింది. ఆ డిజైన్ని సేకరించి 2015లో సిద్ధిపేటకు వెళ్లి చేనేతకారులను కలిసి ‘గొల్లభామ’ డిజైన్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద కావాలని అడిగాను. ‘మేడమ్, ఆ కథ అక్కడితోనే అయిపోయింది. వదిలేయండి. ఒక్క బొమ్మ తేవాలంటే రోజంతా పట్టుద్ది. దీన్నే నమ్ముకుంటే మాకు రోజు గడవదు’ అన్నారు. మా పైఅధికారులను కలిశాను. ‘సార్, ఆ నేతకారుల దగ్గర కళ ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి. కావల్సినన్ని వనరులు కల్పిస్తే మూలనపడేసిన ‘గొల్లభామ’ వర్క్‌కు జీవం పోసిన వాళ్లం అవుతాం’ అన్నాను. అందుకు ‘సరే’ అనే అంగీకారం లభించింది. కొత్త సొబగులతో గొల్లభామ గొల్లభామ బొమ్మ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాను. సిద్ధిపేట వీవర్స్‌ను మళ్లీ కలిసి ఈ డిజైన్ని ఎలాగైనా సరే బట్ట మీద నేసి ఇవ్వాలని చెప్పాను. డిజైన్ బాగుందన్నవారే కానీ, ఎవ్వరూ ముందుకు రాలేదు. రోజులు నెలలు అవుతున్నాయి. ఆ టైమ్‌లోనే మోడిఫై చేసిన డిజైన్‌కి జిఐ (జాగ్రఫీ ఇండికేషన్) వచ్చింది. అంటే, గొల్లభామ డిజైన్ సిద్ధిపేట చేనేతకారులు తప్ప మరెవ్వరూ తయారుచేయడానికి లేదన్నమాట. ఇది తెలిసిన వెంటనే మళ్లీ వీవర్స్‌ని కలిశాను. మీటింగ్ పెట్టాను. ఈ డిజైన్ దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా నేయరు. ఇది ఈ ప్రాంతం ప్రత్యేకత. దీనిని బతికించాలి. ఒక్కసారి చేసి చూపించండి’ అని రిక్వెస్ట్ చేశాను. చివరకు ఇద్దరు వీవర్స్ ముందుకు వచ్చారు. వాళ్లకా డిజైన్ ఇచ్చి, ఎప్పుడు పూర్తయితే అప్పుడే చెప్పమని నా పనిలో పడిపోయాను. మార్కెటింగ్ ప్లస్‌లూ మైనస్సులు హ్యాండ్లూమ్కి సంబంధించిన నాలెడ్జ్ నాకు ఇంకా అవసరం అనిపించింది. అందుకే హ్యాండ్లూమ్, పవర్లూమ్లలో నానోటెక్నాలజీపై పీహెచ్‌డి చేశాను. హ్యాండ్లూమ్ మార్కెటింగ్‌లోని ప్లస్ అండ్ మైనస్‌లు తెలుసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరాను. కొన్ని నెలలు అక్కడే ఉండి మార్కెట్లో నైపుణ్యాలు నేర్చుకున్నాను. తర్వాత మళ్లీ సిద్ధిపేట వెళ్లి వీవర్స్‌ని కలిసి ‘మీకు గొల్లభామ రివైవల్ డిజైన్ ఇచ్చాను కదా ఏమైంది’ అని అడిగాను. ‘మేడమ్, ఈ గొల్లభామ బొమ్మ చాలా పెద్దగా ఉంది. అంత చేయలేం. కొన్ని ఇంచులు తగ్గిస్తే చేసిస్తాం అన్నారు. వాళ్లు చెప్పిన విధంగా డిజైన్ని తగ్గించి ఇచ్చాను. అలా మొత్తానికి 2016 నవంబర్ 15 న డిజైన్ నా చేతికి వచ్చింది. చూసిన ప్రతీ ఒక్కరూ ఈ డిజైన్ బ్రహ్మాండంగా వచ్చింది అన్నారు. ఆ ప్రశంసలు నాలో పట్టుదలను మరింత పెంచాయి. బతుకుకు కొత్త దారి ట్రెడిషనల్ గొల్లభామ నుంచి రివైవ్డ్ గొల్లభామ డిజైన్ని అంచు మీద, చీరలో అక్కడక్కడా బుటాగా అంతా సెట్ చేసుకుని ఒక చీర నేసివ్వాలని కోరాను. ముందు దుపట్టా చేసిచ్చారు. అది సక్సెస్ అయ్యింది. ‘వీటి ఉత్పత్తి పెంచాలంటే జాల మగ్గాలు సరిపోవు. జకార్డ్ మిషనరీ కావాలి’ అన్నారు. జకార్డ్ ఎక్కడ దొరుకుతుంది? మళ్లీ వెతుకులాట. అన్ని చేనేత యూనిట్స్ వద్ద సర్వే చేయించాను. మొత్తానికి 120 జకార్డ్ని తెచ్చి సెట్ చేయించాను. పని మొదలయ్యింది. 14 ఇంచుల గొల్లభామ హ్యాండ్లూమ్ మీద వన్నెలు పోయింది. తర్వాత ఒక పెద్ద గొల్లభామ, రెండు చిన్న గొల్లభామలు, దుపట్టా గొల్లభామ, ప్లెయిన్ ఫ్యాబ్రిక్.. ఇలా దశలవారీగా తీసుకున్నాం. దుబ్బాకలో పనిచేసినప్పుడు అక్కడ రెండు జకార్డ్ మగ్గాలను చూశాను. అక్కడ వాటిని ఎవరూ ఉపయోగించడంలేదు. దీంతో వాటిని అక్కడ నుంచి సిద్ధిపేటకు తీసుకొచ్చాను. కర్ణాటక నుంచి మిషనరీ ఫిట్‌చేసే ఇద్దరిని తీసుకొచ్చి మిషనరీ సెట్ చేయించాను. జకార్డ్ మీద ‘గొల్లభామ’ డిజైన్ పని వేగం పుంజుకుంది. ‘జకార్డ్ వల్ల పని సౌకర్యంగా ఉంది. కాళ్ల నొప్పులు తగ్గాయి’ అన్నారు వీవర్స్. ఈ చేనేతకారుల్లో టాలెంట్ ఉంది. కానీ, బతుకుదెరువు లేదు. నెలంతా కష్టపడితే 4–5 వేలు సంపాదన. వీళ్లకి మంచి బతుకుదెరువు లభిస్తే నా పనికి సార్థకత అనుకున్నాను. మరో 4 జకార్డ్స్ పెట్టించడంతో చేనేతకారులు పెరిగారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి వచ్చినట్టు చేనేతకారులు పోటీ పడటంతో నాకు చాలా ఆనందమేసింది. కిందటేడాది ఆగష్టు 17న మొదటిసారి ‘గొల్లభామ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్’ ద్వారా ఈ కళ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడా చేనేతకారుల ఒక్కొక్కరి నెలసరి ఆదాయం 10 నుంచి 15వేల పైనే ఉంటుంది. ప్రోత్సహిస్తే ఫలితాలు సిద్ధిపేటకు గొల్లభామ ఎలా స్పెషల్ అయ్యిందో మిగతా ప్రాంతాలలోని చేనేత పట్ల కూడా అలా శ్రద్ధ వహిస్తే ఆ ప్రాంతాలూ అలా స్పెషల్ అవుతాయి. ఒక కార్పోరేట్ కంపెనీకి దీటుగా చేనేత ఎదగాలన్నదే నా ఆకాంక్ష’’ అంటున్నారు సునంద. ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్శిటీలో పోస్ట్ ప్రాజెక్టర్గా వర్క్ చేస్తున్న సునంద.. ‘చేసే పని పట్ల నిబద్ధత, పట్టుదల ఉంటే మన చుట్టూ ఉన్నవారి సహకారం తప్పక ఉంటుంద’న్నారు. మేడమ్ మార్పులు చేశారు మొదట జాల మీద నేసినప్పుడు గొల్లభామ డిజైన్ చిన్నగా వచ్చింది. టైమ్ కూడా ఎక్కువ పట్టింది, సునంద మేడమ్ డిజైన్‌లో మార్పులు చేశారు. ఈ డిజైన్ వల్ల పని సులువు అయ్యింది. డిజైన్ అందంగా వచ్చింది. ఇప్పుడు 17 ఇంచుల గొల్లభామ డిజైన్ని కూడా నేస్తున్నాం. పల్లూ వేరేగా తీయాలి. చిన్న చిన్న బుటా ఒకలా తీసుకోవాలి. ఒక్క చీర నేయాలంటే మూడున్నర రోజులు పడుతుంది. – కైలాస్, చేనేతకారుడు, సిద్ధిపేట సమంత కూడా వచ్చారు మేడమ్ గొల్లభామ డిజైన్ని అందంగా మార్పులు చేశారు. డిజైన్ బాగా వచ్చింది. ముందు దుపట్టా చేశాం. తర్వాత చీరలు. సినీ నటి సమంత కూడా మా దగ్గరికి గొల్లభామ డిజైన్ చీరల కోసం వచ్చారు. ఫ్యాషన్ డిజైనర్లు వచ్చారు. దీంతో గొల్లభామ చీరలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. ప్రస్తుతానికి కాటన్ ఫ్యాబ్రిక్ మీద గొల్లభామ డిజైన్ని నేస్తున్నాం. పట్టు మీద నేసే అవకాశం ఉంటే అలాగే నేస్తాం. – సత్యం, చేనేతకారుడు, సిద్ధిపేట – నిర్మలారెడ్డి -
చట్టం ఊరుకుంటే ఊరుకోదు
ఆత్మహత్యాయత్నం నేరం. ఆత్మహత్యను ఆపే ప్రయత్నం చేయకపోవడం కూడా నేరమే. మనకు తెలిసినవాళ్లెవరైనా ఆత్మహత్య చేసుకోబోతున్నారనిమనకు తెలిపినా.. మనకు తెలిసినాఆపకపోవడం, ఆపలేకపోతే.. వెంటనే పోలీసులకు చెప్పకపోవడం‘అబెట్మెంట్’ టు సూయిసైడ్ అవొచ్చు.అంటే.. ఆత్మహత్యకు ప్రేరేపించడం. అబెట్‌మెంట్‌కు కూడా శిక్ష.. ఉంటుందని తెలుసుకోండి. ఆత్మహత్యా యత్నానికి శిక్ష ఉన్నట్లే, ఆత్మహత్యను ప్రేరేపించినందుకూ భారతీయ శిక్షాస్మృతిలో శిక్ష ఉంది. ఆత్మహత్యకు ప్రేరేపించడాన్ని ‘అబెట్మెంట్’ అంటారు. సెక్షన్ 306 ప్రకారం అబెట్‌మెంట్‌కు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య కేసులో ఆమె భర్త శశిథరూర్‌పై ఢిల్లీ పోలీసులు తాజాగా 498ఎ కేసుతో పాటు, ‘అబెట్మెంట్’ కేసూ పెట్టారు. జూలై 7న థరూర్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు ఉదయం పది గంటలకు హాజరు కావాలి. కొట్టానా! తిట్టానా?! కానీ.. ‘‘నేను అమాయకుడిని’’ అంటున్నారు థరూర్. ‘‘కొట్టానా! తిట్టానా! తను ఆత్మహత్య చేసుకుంటే నా తప్పెలా అవుతుంది? అందుకు నేనెలా కారణం అవుతాను’’ అని థరూర్ వాదిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మరి కొందరు వాదిస్తున్నారు. అసలు ఆ పాత విక్టోరియన్ కాలం నాటి సెక్షన్నే మార్చిపడేయాలని అంటున్నారు. ‘‘నువ్వు దూకు.. అంటే దూకేస్తారా? ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కు అంటే నొక్కేస్తారా? చచ్చిపో అంటే చచ్చిపోతారా? భార్య ఆత్మహత్య చేసుకుంటే.. భర్తెలా దానికి కారణం అవుతాడు? మానవ సంబంధాల్లోని క్షణికావేశాల పర్యవసానాలకు కోర్టులు తీర్పులు చెప్పడం ఏంటి?’’ అని థరూర్‌ని సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు. అమాయకత్వం కూడానా! నిజమే. థరూర్ అమాయకుడే. భార్య ఫీలింగ్స్‌ని గమనించలేనంత అమాయకుడే. భార్య చనిపోతుందేమోనని ఊహించలేనంత అమాయకుడే. ‘నాకు బతకాలని లేదు’ అని సునంద తన చివరి ఈమెయిల్లో చెప్పినా, సీరియస్‌గా తీసుకోనంత అమాయకుడే. ఈ అమాయకత్వం కారణంగానే సునందను రక్షించుకోలేక (రక్షించలేక) పోయాడు కాబట్టి అతడి అమాయకత్వాన్ని కూడా చట్టం అబెట్మెంట్గా పరిగణిస్తుంది. థరూర్ తన భార్యను హింసించలేదంటున్నాడు. నిజంగానే హింసించలేదనుకుందాం. కనీసం తిట్టనైనా తిట్టలేదంటున్నాడు. నిజంగానే తిట్టలేదనుకుందాం. హింసంటే కొట్టడమూ, తిట్టడమేనా?! మౌనంతో కూడా రాచిరంపానపెట్టే మృదుస్వభావులు మనలో ఎంతమంది లేరు?! భార్యాభర్తలకే కాదు... ఐపీసీ 306 కేవలం భార్యాభర్తలకు మాత్రమే ఉద్దేశించిన సెక్షన్ కాదు. ఒక వ్యక్తి ఎవరైనా ఇంకో వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తే ఈ సెక్షన్ పరిధిలోకి వస్తారు. థరూర్ ‘అబెట్మెంట్’పై డిబేట్ పెట్టిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ ఆర్ణబ్ గోస్వామి మీద కూడా అబెట్మెంట్ కేసు ఉంది. ఆర్ణబ్ భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ తమకు చెల్లించవలసిన ఐదున్నర కోట్ల రూపాయల బకాయీలను ఎగవేసిందని నోట్ రాసి 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్, ఆమె తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఆర్ణబ్‌పై అబెట్మెంట్ కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె బాయ్‌ఫ్రెండ్ రాజ్ సింగ్‌ని కూడా ఇదే సెక్షన్ కింద ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిషాద్’ చిత్రంలో అమితాబ్‌తో కలిసి నటించిన జియాఖాన్ 2013 నాటి ఆత్మహత్య ఘటనలో ఆమె బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పాంచాలీపై అబెట్మెంట్ కేసింకా విచారణలో ఉంది. ప్రతి ఆత్మహత్య వెనుక ఒక ఆవేదన ఉన్నట్లే.. ఆ ఆవేదన వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఒక మనిషే కనుకైతే అబెట్మెంట్ కింద అతడు దోషి అవుతాడు. శశిథరూర్ ప్రస్తుతానికైతే నిందితుడు. ముచ్చటైన జంట. పచ్చని కాపురం. శశి (థరూర్) అందగాడు. సంస్కారవంతుడు. కేరళ నాయర్ల అబ్బాయి. లండన్‌లో పుట్టాడు. పెద్ద చదువులు, పెద్దపెద్ద పదవులు. ఈ 62 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా కనిపిస్తారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ. సునంద (పుష్కర్) అందగత్తె. ఆయన కన్నా ఆరేళ్లు చిన్న. కశ్మీరీ పండిట్ల అమ్మాయి. ఈవెంట్ మేనేజర్. బిజినెస్ ఉమన్. సునంద శశికి మూడో భార్య. శశి సునందకు మూడో భర్త. మొదటి భార్య తిలోత్తమకు, రెండో భార్య క్రిస్టా గైల్స్‌కు శశి విడాకులు ఇచ్చాక; మొదటి భర్త సంజయ్ రైనాకు, రెండో భర్త సుజీత్ మీనన్‌కు సునంద విడాకులు ఇచ్చాక 2010లో శశి, సునందల పెళ్లి జరిగింది. నాలుగేళ్లు కలిసున్నారు. శశి జీవితంలోకి నాలుగో స్త్రీ ప్రవేశిస్తుండగా సునంద శశితో బాగా గొడవపడ్డారు. ఆ నాలుగో స్త్రీ పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్. ఆత్మహత్యపై అనుమానాలు గొడవపడిన మర్నాడే, 2014 జనవరి 17న న్యూఢిల్లీ చాణక్యపురిలోని లీలాప్యాలెస్ హోటల్ రూమ్ నెంబర్ 345లో బెడ్ మీద సునంద డెడ్‌బాడీ పడి ఉంది. సొంతింటికి పెయింట్లు వేయిస్తున్న ఈ జంట, ఆ పని పూర్తయ్యేవరకు ఉండడం కోసం హోటల్లో గది అద్దెకు తీసుకుంది. సునంద మృతదేహాన్ని శశి థరూర్ ఆ సాయంత్రం వరకు గమనించనేలేదు! పోస్టుమార్టమ్‌లో సునందది ఆత్మహత్య అని తేలింది. ‘ఎయిమ్స్’ డాక్టర్లు ఆమె దేహం మీద గాయాలున్నట్లు రిపోర్ట్‌లో రాశారు. అయితే ఆ గాయాల వల్లే ఆమె చనిపోయిందని చెప్పలేం అని కూడా రాశారు. సునంద మృతదేహాన్ని దక్షిణ ఢిల్లీలోని లోథీ శ్మశాన వాటికలో దహనం చేశారు. కానీ ఆమె మరణంపై ఉన్న అనుమానాలు ఆమెతో పాటు దహనమైపోలేదు! రాంగ్ రిపోర్ట్ కోసం ఒత్తిడి! సునంద చనిపోడానికి కొద్దిరోజుల ముందు ఆమెకు సాధారణ వైద్య పరీక్షలు జరిపిన త్రివేండ్రంలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సునందకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని ప్రకటించడంతో ఆమె మరణంపై అనుమానాలకు మరింత బలం చేకూరింది. అదొక్కటే కాదు. చనిపోడానికి ముందు సునంద తన ఆత్మహత్య గురించి హింట్ ఇచ్చారన్న విషయం బయటపడింది! తర్వాత 2014 జూలై 1న ‘ఎయిమ్స్’ డాక్టర్ సుధీర్ గుప్తా బయటపడ్డారు. తప్పుడు వైద్య నివేదిక ఇవ్వవలసిందిగా తన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని ఆయన వెల్లడించారు. పనిమనిషికి కొంత తెలుసు సునంద మరణంపై దర్యాప్తు జరుపుతున్న వైద్య బృందం ఒకటి విష ప్రయోగం వల్లనే సునంద చనిపోయిందని అక్టోబర్ 10న నిర్థారించింది! ఢిల్లీ పోలీసులు దీనిని హత్యకేసుగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకున్నారు. సునంద పనిమనిషి కూడా సాక్ష్యం ఇచ్చింది. ‘హత్య’కు కొద్దిరోజుల ముందు సునంద శశితో పెద్దగా గొడవ పెట్టుకున్నారట. ‘అన్నీ బయటికి చెప్పేస్తాను. నీ పని ఫినిష్ అవుతుంది’ అని భర్తను దారికి తెచ్చే ప్రయత్నం చేశారట. చివరికి వేళ్లన్నీ శశివైపు తిరిగాయి. నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత ఈ మే నెలలో శశిపై చార్జిషీటు నమోదు అయింది. మాటలతో, చేతలతో హింసించడం ద్వారా భార్య ఆత్మహత్యకు ప్రేరకుడు అయ్యాడన్నది అతడిపై అభియోగం. -
శశి థరూర్‌కు సమన్లు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. జూలై 7న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. థరూర్‌పై విచారణ జరపడానికి ఆధారాలున్నాయని కోర్టు నమ్ముతున్నట్టు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తెలిపారు. శశి థరూర్.. సునంద పుష్కర్ ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలకు ఆధారాలున్నాయని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేయాలని మే 14న ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. భార్య సునంద పుష్కర్ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వారి వద్ద పనిచేసే నారాయణ్ సింగ్ ఈ కేసులో కీలక సాక్షిగా వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498ఎ (భర్త లేదా భర్త తరఫు బంధువులు భార్యపై క్రూరంగా వ్యవహరించడం) కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ చార్జ్‌షీట్‌ను ఆధారం చేసుకుని థరూర్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై థరూర్ లాయర్ వికాస్ పహ్వా స్పందిస్తూ చార్జిషీట్ కాపీని కోరామని, దానిలో అంశాలు పరిశీలించి నిర్ణయిస్తామని అన్నారు. ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తానన్న స్వామి కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించడానికి అనుమతించాలని బీజేపీ ఎంపీ, న్యాయవాది సుబ్రమణ్యం స్వామి కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసులో విజిలెన్స్ విచారణపై నివేదిక సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించాలని అభ్యర్థించారు. దీన్ని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వ్యతిరేకించారు. కోర్టు ఈ దరఖాస్తును వచ్చే నెల 7 వరకు పెండింగ్‌లో ఉంచింది. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణానికి సంబంధించి పోలీసులు 2015 జనవరి 1న ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఆరోపణలు హాస్యాస్పదం: శశి థరూర్ ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో శశి థరూర్ స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదం, నిరాధారమన్నారు. కక్ష సాధింపు ధోరణితో తనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొడతానని అన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా నిజమేంటో బయటపడుతుందన్నారు. -
సునంద హత్య కేసులో శశిథరూర్‌కు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : సునంద పుష్కర్ హత్య కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కేసులో నిందితుడైన శశి థరూర్‌ను జులై 7న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నేరానికి పాల్పడినట్టు థరూర్‌కు వ్యతిరేకంగా స్పష్టమైన అనుమానాలున్నాయని సమన్లు జారీ చేస్తూ కోర్టు అభిప్రాయపడింది. కేసులో నిందితుడిగా ఆయనకు సమన్లు జారీ చేయాలా అనే అంశంపై కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచిన వారం రోజుల తర్వాత తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. తన భార్య సునందా పుష్కర్‌కు తీవ్రంగా వేధించి ఆత్మహత్యకు పురిగొల్పేలా శశి ధరూర్ వ్యవహరించారనే ఆరోపణలను కూలంకషంగా పరిశీలించిన మీదట అదనపు చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ సమర్ విశాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా శశి థరూర్‌పై తగినన్ని ఆధారాలున్నాయని, ఆయనను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయాల్సిందిగా మే 14న ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. భార్య సునంద పుష్కర్ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని 3000 పేజీల చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో 2014, జనవరి 17న సునందా పుష్కర్ విగతజీవిగా పడిఉన్న విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. శశిథరూర్‌పై భార్యను తీవ్రంగా వేధించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శశిథరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్‌ను కీలక సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నారు. -
బతకాలని లేదు: సునంద
న్యూఢిల్లీ: ‘నాకు బతకాలనే కోరిక లేదు. చావు కోసం ప్రార్థిస్తున్నా’... చనిపోవడానికి సరిగ్గా 9 రోజుల ముందు సునంద పుష్కర్, తన భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు పంపిన ఈ–మెయిల్లోని మాటలివి. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్ గదిలో సునంద అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడం తెలిసిందే. భర్తకు ఆమె పంపిన ఈ–మెయిల్లోని అంశాలను పోలీసులు సోమవారం స్థానిక కోర్టుకు సమర్పించారు. విషపు మాత్రలు శరీరంలోకి వెళ్లడం వల్లే సునంద చనిపోయారనీ, అంతకుముందే ఆమెకు కొన్ని గాయాలు కూడా అయినట్లు పోస్టుమార్టమ్ నివేదికలోనే తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆమె శశి థరూర్‌కు పంపిన మెయిల్, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులనే మరణ వాంగ్మూలాలుగా పరిగణించాలని కోరారు. ‘ఒకవేళ సునంద ఆత్మహత్య చేసుకుందని భావిస్తే అంతకుముందు ఆమె ఎన్నో వేధింపులకు గురై బాధను భరించి ఉంటుంది. ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశంపై థరూర్‌ని నిందితుడిగా చేర్చాలి’ అని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సునందను థరూర్ శారీరక, మానసిక హింసకు గురి చేశారనీ, ఆమె ఆత్మహత్య చేసుకుందనీ భావించినా అందుకు కారణం ఆయనేనని ఈ నెల 14న కూడా పోలీసులు కోర్టుకు విన్నవించడం తెలిసిందే. కాగా, థరూర్‌ను నిందితుడిగా చేర్చేందుకు ఆయనకు నోటీసులు పంపాలా వద్దా అనే నిర్ణయాన్ని కోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. -
నాకు బతకాలన్న కోరిక లేదు
న్యూఢిల్లీ : ‘ నాకు బతకాలన్న ఏ కోరికా లేదు’ అని సునంద పుష్కర్, ఆమె భర్త మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు తాను చనిపోయే ముందు మెయిల్ చేసిందని ఢిల్లీ పోలీసులు సోమవారం కోర్టులో తెలిపారు. శశి థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఈ మేరకు 3 వేల పేజీల చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్వీట్లు, మెయిల్స్, మెసేజ్‌లే ఆమె మరణ వాంగ్మూలం కింద తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. శశి థరూర్ నిందితుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని కోర్టుకు విన్నవించారు. ‘ నాకు జీవించాలన్న కోరిక లేదు..చావు కోసం ఎదురు చూస్తున్నాను’ అని జనవరి 8వ తేదీన సునంద, థరూర్‌కు ఈ మెయిల్ చేసిందని, ఢిల్లీలోని ఓ లక్జరీ హోటల్లో ఆమె సూట్లో సరిగ్గా చనిపోవడానికి తొమ్మిది రోజుల ముందు ఈమెయిల్ చేసినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. పాయిజనింగ్ కారణంగా ఆమె చనిపోయినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. ఆమె రూంలో 27 అల్ప్రాక్స్ టాబ్లెట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఆమె ఎన్ని మాత్రలు మింగిందనేది స్పష్టంగా చార్జిషీటులో పేర్కొనలేదు. సునంద పుష్కర్ డిప్రెషన్లోకి వెళ్లినా ఒక భర్తగా శశి థరూర్ పట్టించుకోకపోవడం వల్లే, ఆమె అల్ప్రాక్స్ టాబ్లెట్ మింగిందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్), చార్జిషీటులో పేర్కొంది. దంపతులిద్దరూ తరచూ కొట్లాడుకునేవారని, ఆమె ఒంటిపై గాయాలు అంత సీరియస్ గాయాలు కానప్పటికీ తరచూ వాదులాడుకునేవారని సిట్ చార్జిషీటులో వెల్లడించింది. ఆమె యాంటీ డిప్రెషన్ టాబ్లెట్లు కూడా వాడేదని పేర్కొన్నారు. శశి థరూర్‌కు, పాకిస్తాన్ జర్నలిస్ట్‌తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కలగడంతో ఇరువురి మధ్య పబ్లిక్‌గా ట్విటర్లో యుద్ధం కూడా జరిగింది. సునంద పుష్కర్ కాల్ చేస్తే ఆమె భర్త థరూర్ డిస్కనెక్ట్ చేయడం, అసలు పట్టించుకోకపోవడం కూడా చేశాడని సిట్, చార్జిషీటులో తెలిపింది. శశి థరూర్‌కు, సునంద పుష్కర్ల వివాహం 2010లో జరిగింది. శశి థరూర్‌కు సునంద మూడో భార్య కాగా..సునందకు కూడా శశి థరూర్ మూడో భర్తే. పెళ్లి అయిన నాలుగేళ్లకే సునంద అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇది ఇలా ఉండగా మాజీ కేంద్ర శశి థరూర్ మాత్రం తాను భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించానని చార్జిషీటు దాఖలు చేయడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. -
సునంద మృతి కేసులో కీలక విషయాలు
-
శశిథరూర్‌పై చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై చార్జిషీట్ నమోదైంది. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్యకు థరూర్ ప్రేరేపించారని అందులో ఆరోపించారు. ఈ మేరకు 3 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో శశిథరూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని చార్జ్‌షీట్‌లో కోర్టుకు తెలిపారు. కేసులో థరూర్‌ను ఏకైక నిందితుడిగా పేర్కొంటూ.. అతనిపై చట్టపరంగా ముందుకెళ్లేందుకు తగిన ఆధారాలున్నాయన్నారు. తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతున్న శశి థరూర్‌కు సమన్లు జారీచేయాలని కోర్టును పోలీసులు కోరారు. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ ముందు దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌పై మే 24న విచారణ జరగనుంది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో సునంద శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐపీసీ 498 ఏ(గృహ హింస), 306(ఆత్మహత్యకు పురికొల్పడం)సెక్షన్ల కింద శశిథరూర్‌పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ అర్థరహితమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని శశిథరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. -
సునంద మృతి కేసు: శశిథరూర్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ నేత, ఆమె భర్త శశిథరూర్‌కు షాక్. ఢిల్లీ పోలీసులు ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. థరూరే సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని అందులో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పటియాలా కోర్టులో ఛార్జ్‌షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. అనంతరం కేసును మే 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. జనవరి 17, 2014లో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ ఆమె అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సునంద విష ప్రభావం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించటంతో ఈ కేసులో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే అల్ప్రాక్స్ మత్తు పదార్థం ఆమె శరీరంలో మోతాదుకు మించిన ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సునందే వీటిని తీసుకున్నారా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారా? మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. -
మహేశ్‌బాబుకు సూసైడ్ నోట్ రాసి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఎస్ఐ చింతకాయల వెంటేశ్ తెలిపిన మేరకు.. గుంటూరు సిద్ధార్థ నగర్‌కు చెందిన పులి శ్రీనివాస్ రెడ్డి బెంగళూర్‌లో ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తూ భార్య మయూరితో కలిసి అక్కడే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారులు పులి సునంద్ కుమార్ రెడ్డి(21) ట్రిపుల్ ఐటీలో సీఎస్డీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ట్రిపుల్ ఐటీ పలాస్ నివాస్ ఓల్డ్ బాయ్స్ హస్టల్లోని రూమ్ నెంబర్ 267లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి స్నేహితుడు సాయి సాహిత్ ఫోన్ చేస్తే సునంద్ స్పందించలేదు. అతను ఇదే విషయాన్ని స్నేహితుడు రోహిత్‌కు తెలియజేశాడు. మధ్యాహ్నం సెమిస్టర్ పరీక్ష ఉండటంతో గురువారం ఉదయం 11.45 గంటలకు రోహిత్ వెళ్లి సునంద్ గది డోర్ కొట్టినా స్పందించలేదు. ఎంత పిలిచినా పలకకపోవడంతో కిటీకిలోంచి చూడగా సునంద్ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేశ్ ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహంతో పాటు రెండు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి తన తల్లిదండ్రులకు రాసి ఉంది. ‘అమ్మా.. నాన్న.. నేను ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి. మీరంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మీ తరుఫున బంధువులంటే నాకు ఇష్టం లేదు.. వారు కేవలం అవసరానికి వచ్చి వెళ్లేవారు.. భారతీయ బంధుత్వ వ్యవస్థ బాగా లేదు..’ అని ఒక లేఖలో రాశాడు. మహేశ్.. యు ఆర్ మై డాక్టర్ సునంద్ రెడ్డి హీరో మహేశ్ బాబుకు వీరాభిమాని. అతని గది నిండా మహేశ్ ఫొటోలు అంటించినట్లు పోలీసులు తెలిపారు. ఒత్తిడికి లోనైనప్పుడు గదిలోకి వెళ్లి మహేశ్ బాబు సినిమాలు చూస్తాడని స్నేహితులు తెలిపారు. ‘నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మీ సినిమాలే చూస్తాను.. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మీరే నా డాక్టర్, మీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు....’ అంటూ రాసిన లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
‘పిల్‌ను రాజకీయ వ్యాజ్యంగా మార్చారు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశీ థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) స్వామి రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సునంద హత్య కేసులో ఆమె భర్త శశీ థరూర్ జోక్యాన్ని నివారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జరుపుతున్న విచారణను పర్యవేక్షించాలని స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్ మురళీధర్, ఐఎస్ మెహతాల ధర్మాసనం.. పిటిషనర్ కోర్టుకు సమర్పించిన ఆధారాలతో సిట్ విచారణను పర్యవేక్షించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తాను శశీ థరూర్, ఢిల్లీ పోలీసులపై చేసిన ఆరోపణలకు సంబంధించి`న రహస్య సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పిస్తానని స్వామి చెప్పారు. -
సునంద కేసు.. స్వామికి చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై ఆయన వేసిన పిల్‌ను గురువారం కొట్టేసింది. కేసును శశిథరూర్ ప్రభావితం చేస్తున్నారని.. కోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిగేలా ఆదేశించాలంటూ స్వామి ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే స్వామి వేసిన పిటిషన్ ఓ రాజకీయ ప్రయోజన వ్యాజ్యంలా ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అయితే స్వామి ఆరోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయాడని జస్టిస్ ముదలియర్, జస్టిస్ మెహతా నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. కోర్టుకు సమర్పించిన అంశాలను స్వామి రహస్యంగా ఉంచారని ఈ సందర్భంగా జడ్జిలు పేర్కొన్నారు. నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కేసులు వేయటం సరికాదని.. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యహరిస్తుందని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కేసును తప్పుదోవ పట్టించేందుకు శశిథరూర్ జోక్యం చేసుకున్నారంటూ స్వామి ఆరోపణలు చేయగా.. వాటిని ఢిల్లీ పోలీసులు, కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాటిని ఖండించారు. -
రూమ్ నంబర్ 345.. అవసరం తీరింది
సాక్షి, న్యూఢిల్లీ : లీలా ప్యాలెస్ హెటల్ యాజమాన్యానికి ఎట్టకేలకు ఊరట లభించింది. సునంద పుష్కర్ మృతి కేసులో ఆ హోటల్లోని గదిని దాదాపు నాలుగేళ్లుగా సీల్ చేసి ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం గదిని తెరిచి హోటల్ యాజమాన్యానికి అప్పగించారు. 2014 జనవరి 17న కాంగ్రెస్ సీనియర్ నేత, శశిథరూర్ భార్య సునంద పుష్కర్(51) హోటల్ గది నంబర్ 345లో అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, ఏడాది దర్యాప్తు అనంతరం ఆమెకు విషమిచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించసాగారు. ఆమె చనిపోయిన నాటి నుంచే ఆ గదిని సీల్ చేసి తమ ఆధీనంలోఉంచుకున్నారు. విచారణ పేరిట తరచూ హోటల్‌కు వెళ్లి ఆ గదిని పరీశించారు కూడా. అయితే మూడేళ్లుగా ఇలా గదిని మూసేయటం ద్వారా గది పాడైపోయిందని.. పైగా అది వ్యాపారం మీద కూడా ప్రభావం చూపుతోందని హోటల్ యాజమాన్యం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఆర్థికంగా కూడా తమకు చాలా నష్టం కలిగిందని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో అక్టోబర్ 10న ఈ పిటిషన్ విచారణకు రాగా.. గదిని తిరిగి హోటల్‌కు అప్పగించేయాలని ఆరు రోజుల గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు దాదాపు పూర్తయి పోవటం.. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించటంతోపాటు... ఎలాగూ ఫోరెన్సిక్ తుది నివేదిక త్వరలో రానున్న నేపథ్యంలో ఇంకా హోటల్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో దాదాపు మూడున్నరేళ్ల తర్వాత మూసిన తలుపులను తెరిచారు. -
సునందాపుష్కర్ కేసు: స్వామికి చుక్కెదురు!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో బీజేపీ ఎంపీ సుబ్రహ్యణ్యస్వామికి చుక్కెదురైంది. సునందా పుష్కర్ మృతిపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు ఉంటే రెండువారాల్లోగా సమర్పించాలని, ఆలోగా ఏమీ సమర్పించకపోతే.. ఒక ఈ కేసు విషయాన్ని తామే చూసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో వాదనలు వినిపించిన సుబ్రహ్మణ్యస్వామి విషం వల్ల సునందపుష్కర్ మరణించిందని దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తే.. ఇంకా అది ఏ తరహా విషమో విశ్లేషించడంలో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అమెరికా ఎఫ్‌బీఐ, ఇతర ఏజెన్సీల చేత ఫోరెన్సిక్ దర్యాప్తును విశ్లేషించడం.. కేసు దర్యాప్తులో జాప్యం చేయడమేనని చెప్పారు. -
క్లాస్‌రూంలో విద్యార్థుల ముందు..
బెంగుళూరు: వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తేడాలు ఓ టీచర్ ప్రాణాలు తీశాయి. ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్న టీచర్ సునంద(50)పై ఓ వ్యక్తి కిరోసిన్ పోశాడు. విద్యార్థులందరూ చూస్తుండగానే ఆమెపై వెంట తెచ్చుకున్న డబ్బాలోని కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన బెంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. టీచర్ మంటల్లో కాలిపోతే కేకలు వేయడాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు నిర్ఘాంతపోయారు. కొందరు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. ఘటనాస్ధలికి చేరుకున్న ఇతర టీచర్లు సునందను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవరాం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సునంద ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రూంలోకి వచ్చిన ఓ వ్యక్తి.. సునందను గద్దించి మాట్లాడినట్లు చెప్పారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. సునంద అతన్ని పాఠశాల నుంచి వెళ్లిపోవాలని కోరినట్లు తెలిపారు. అతను వెంట తెచ్చుకున్న డబ్బాను తెరిచి సునందపై కిరోసిన్ పోసి నిప్పంటిచినట్లు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతను పారిపోయినట్లు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు. -
సునంద కేసు వివరాలివ్వండి: హైకోర్టు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో.. సమగ్ర నివేదిక దాఖలు చేయాలని పోలీసులను గురువారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో ఈ నివేదికను అందజేయాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సీబీఐ నివేదికను కోర్టులోనే తనకు అందజేసిందని, వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని ఢిల్లీ పోలీస్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోరారు. దీంతో కోర్టు ఆగస్టు 1 తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ నివేదిక ప్రతిని సునంద పుష్కర్ మృతిపై కోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇవ్వాలని సూచించింది. -
సునంద కేసును సిట్‌కు అప్పగించండి..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసును సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్) అప్పగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్యణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో గురువారం పిల్ దాఖలు చేశారు. సునంద కేసు విచారణలో మితిమీరిన జాప్యం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇది న్యాయవ్యవస్థకే మచ్చలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రా, ఢిల్లీ పోలీసుల నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. -
సీనియర్ జర్నలిస్టుపై పరువునష్టం దావా
సీనియర్ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి పైన, ఆయన కొత్తగా ప్రారంభించిన రిపబ్లిక్ టీవీపైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రూ. 2 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు. తన భార్య సునందా పుష్కర్ మృతికి సంబంధించిన కథనాలు ప్రసారం చేసే సందర్భంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పోలీసుల విచారణ ముగిసేవరకు తన భార్య మృతి గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఆ టీవీ చానల్‌ను నిరోధించాలని కూడా హైకోర్టును ఆయన కోరారు. ఈ కేసులో అర్ణబ్ గోస్వామితో పాటు రిపబ్లిక్ టీవీ యాజమాన్యం అయిన ఆర్గ్ ఔట్లియర్ మీడియా ఏషియానెట్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆ చానల్లో ప్రసారం చేసిన కథనాల్లో తన భార్య మృతికి సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టినట్లు థరూర్ చెబుతున్నారు. ఏమీ లేనిచోట ఏదో ఉందన్నట్లుగా చూపించడం ద్వారా తన ప్రజా జీవితానికి, తన ఇమేజికి భంగం కలిగేలా ఆ టీవీచానల్ ప్రవర్తించిందని అన్నారు. వాళ్లు ప్రసారం చేసిన కథనాలను చూసినవాళ్లకు.. తానే తన భార్యను హతమార్చినట్లుగా అర్థం అవుతోందని శశి థరూర్ చెప్పారు. ఇలాంటి కథనాల వల్ల పోలీసుల దర్యాప్తుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. తన పరువుకు కలిగిన నష్టానికి గాను రూ. 2 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారని, ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారని చెప్పారు. 2014 జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ సూట్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. -
'నా భార్య మరణంపై దాచిందేం లేదు'
తిరువనంతరపురం: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మంగళవారం మీడియాపై ఎదురుదాడి చేశారు. తన భార్య సునంద పుష్కర్ హత్యకు గురయ్యారని ఓ జాతీయ టీవీ చానెల్ వేసిన కథనంపై ఆయన స్పందించారు. పుష్కర్ మరణం గురించి తాను దాచిందేం లేదని అన్నారు. 2014 జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్లో పుష్కర్ చనిపోయి కనిపించారు. పుష్కర్ మరణంపై తాజాగా ఓ కథనం వేసిన జాతీయ చానెల్.. ఆమె మరణం వెనుక శశిథరూర్ హస్తం ఉందని పేర్కొంది. దీంతో షాక్‌కు గురైన శశిథరూర్.. మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా మీడియా రంగంలోకి వచ్చిన చానెల్ గుర్తింపు కోసం తనపై బురద జల్లుతోందని ఆరోపించారు. వ్యవస్ధలో మీడియాకు చాలా ముఖ్య పాత్ర ఉన్నా.. ఓ జడ్జికి రాజ్యాంగా పరంగా లభించిన హక్కు దానికి లేదని అన్నారు. పుష్కర్ మృతిపై పోలీసులతో తన వద్ద ఉన్న సమాచారం మొత్తం చెప్పానని తెలిపారు. గత మూడేళ్లుగా పోలీసుల విచారణలో ఉన్న అంశాలనే చానెల్ కూడా చూపించిందని చెప్పారు. సునంద మరణం హత్యో.. కాదో.. పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదని చెప్పారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పుష్కర్ మరణం విష ప్రయోగం వల్ల సంభవించిదని పేర్కొన్న విషయం తెలిసిందే. చానెల్ కథనం ఏంటి? పుష్కర్ మరణం అనంతరం లీలా హోటల్లో ఆమెను ఉన్న గది నుంచి మరో గదికి మార్చినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి శశిథరూర్‌కు సన్నిహితుడైన ఓ వ్యక్తికి.. చానెల్ న్యూస్ కరస్పాడెంట్‌కు మధ్య జరిగిన 19 కాల్ల సంభాషణలను వినిపించింది. పోలీసులు హోటల్‌కు చేరుకునే లోపు పుష్కర్ బాడీని హోటల్లోని రూం నెంబర్ 307 నుంచి రూం నెంబర్ 345కు మార్చారని పేర్కొంది. ఆ సమయంలో హత్యను ఆత్మహత్యగా చిత్రికరించేందుకు యత్నించినట్లు చెప్పింది. పుష్కర్ మరణానికి ముందు భర్త శశిథరూర్‌తో వాగ్వాదం జరిగిందని పేర్కొంది. అంతకుముందు రోజు పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్‌ను ఉద్దేశించి పుష్కర్ ట్వీట్ చేసినట్లు వెల్లడించింది. థరూర్, తరార్‌ల మధ్య ఉన్న సంబంధంపై ఆమె ట్వీట్లో పేర్కొన్నట్లు తెలిపింది. పుష్కర్ ట్వీట్‌ను తరార్ థరూర్‌కు పంపినట్లు పేర్కొంది. పోస్టుమార్టం రిపోర్టులో పుష్కర్ ఎక్కువ స్లీపింగ్ పిల్స్‌ను తీసుకోవడం వల్ల మరణించిందని ఉందని చెప్పింది. పుష్కర్ హత్యకు గురయ్యారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయం ధ్రువీకరించలేకపోతున్నట్లు రిపోర్టులో ఉందని సదరు చానెల్ వివరించింది. -
సునంద మృతిపై చేతులెత్తేసిన బోర్డు
-
సునంద మృతిపై చేతులెత్తేసిన మెడికల్ బోర్డు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతికి కారణం కనుగొనడంలో మెడికల్ బోర్డ్ చేతులెత్తేసింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ, ఎయిమ్స్ కనుగొన్న అంశాలను పరిశీలించిన బోర్డు సునంద మరణంపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నామని తెలియజేస్తూ ఈ కేసును అధ్యయనం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కు నివేదిక సమర్పించింది. సునంద మృతికి కారణం తెలియడంలేదంటూ నెలరోజులక్రితం మెడికల్ బోర్డు నివేదిక సమర్పించింది. అయితే ఎఫ్‌బీఐ, ఎయిమ్స్ నివేదికల ఆధారంగా మరోసారి పరిశీలించాల్సిందిగా వారిని కోరాము అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. మెడికల్ బోర్డు చేతులెత్తేయడంతో పోలీసులు మరోకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మొబైల్ ఫోన్ నుంచి డిలీటైన మెస్సేజ్‌లను తిరిగి తీసుకురావడం ద్వారా ఆమె ఎవరితో మాట్లాడిందో తెలిస్తే దర్యాప్తు కొంతవరకు ముందుకు తీసుకుపోవచ్చని భావిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో 2014 జనవరి 17 రాత్రి సునందా పుష్కర్ (51) అనుమానస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. -
‘రైతులు ఆందోళన చెందొద్దు’
బాల్కొండ : ఈ ఏడాది పీ.టీ.ఎస్–10 రకం పసుపు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యనవన శాఖ డీడీ సునంద రాణి పేర్కొన్నారు. గురువారం ఆమె జలాల్పూర్లో పసుపు పంటను పరిశీలించారు. రైతులకు పంట సాగులో సలహాలు, సూచనలు ఇచ్చారు. పీ.టీ.ఎస్–10 రకం పసుపు పూర్తి స్థాయిలో మొలకెత్తడం లేదని రైతులు ఆందోళన చెంద వద్దన్నారు. సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, కొన్నాళ్లు కోల్డ్ స్టోరేజీలో ఉంచడం వల్లే ఇప్పటికిప్పుడు మొలకెత్తలేకపోతోందన్నారు. మెల్లమెల్లగా మొలకలు వస్తాయని పేర్కొన్నారు. ఆలస్యంగానైనా విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తే అవకాశం ఉందన్నారు. బెడ్ విధానంలో సాగు చేయడంతో ఎకరానికి 29 వేల మొక్కలు సరిపోతాయన్నారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండడం వల్ల పసుపు పంటకు దుంపకుళ్లు సోకే ప్రమాదం ఉందన్నారు. అందుకే రైతులు ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, 2 కిలోల సూడోమోనాస్, 2 కిలోల పొటాష్, 2 కిలోల పీ.ఎస్.బి బాగా మాగిన పశువుల ఎరువులో వేప పిండితో కలిపి చల్లుకోవాలని సూచించారు. ఆమె వెంట ఏడీ శ్రీధర్ రావు, హెచ్‌ఈవో విద్యాసాగర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
'ఆయనతో ఎటువంటి సంబంధం లేదు'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సునందా పుష్కర్ మృతి కేసులో పాకిస్థాన్ రచయిత్రి మెహర్ తరార్ ను ప్రశ్నించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఆమెను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ప్రశ్నించినట్టు తెలిపాయి. సునంద పుష్కర్ తో ఏమైనా విభేదాలున్నాయా అనే దానిపై మెహర్ ను అధికారులు అడిగినట్టు సమాచారం. శశి థరూర్‌తో తనకు సాన్నిహిత్యం లేదని ఆమె వెల్లడించినట్టు తెలిసింది. ఆయనతో తనకు సంబంధం ఉందన్న ఆరోణలను ఆమె తోసిపుచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద్ స్నేహితురాలు నళిని సింగ్ చేసిన ఆరోపణలను కూడా మెహర్ కొట్టిపారేశారు. ఫిబ్రవరిలోనే శశిథరూర్ ను ఐదుగంటల పాటు పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2014 జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ తానున్న హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. -
మానేరు డ్యాంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ మానేరులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మంగమ్మతోటకు చెందిన బీరెల్లి అరుణ్(16) శ్రీగాయాత్రి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన సునంద్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. వీరిద్దరు ఈ రోజు ఉదయం మరో ఐదుగురు స్నేహితులతో కలిసి లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వె ళ్లారు. ఈ క్రమంలో ఈతకొడుతూ వీరిద్దరు నీట మునిగారు. ఇది గుర్తించిన తోటి స్నేహితులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మిస్టరీగానే సునంద హత్య కేసు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో మిస్టరీ వీడలేదు. సునంద మృతి కేసులో వేరే వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు తాను భావించడం లేదని, ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకోవడం వల్లే మరణించిందని శశిథరూర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. శనివారం ఢిల్లీ పోలీసులు ఐదుగంటల పాటు ఆయన్ను విచారించారు. సునంద విష ప్రభావం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే అల్ప్రాక్స్ మత్తు పదార్థం ఆమె శరీరంలో మోతాదుకు మించిన ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సునందే వీటిని తీసుకున్నారా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారా? మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. హత్య కేసుగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు శశి థరూర్ ఇంట్లో పనిచేసేవారిని, సునంద డాక్టర్‌ను పలుమార్లు ప్రశ్నించారు. శశి థరూర్‌ను మరోసారి పిలిపించి విచారించారు. అయినా సునంద హత్య కేసు మిస్టరీకి ముగింపు పడలేదు. -
శశి థరూర్‌కు త్వరలో లై డిటెక్టర్ పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశముంది. త్వరలోనే ఢిల్లీ పోలీసులు థరూర్‌ను విచారించడంతో పాటు ఆయనకు సత్యశోధన పరీక్షలు నిర్వహించనున్నట్టు వార్తలు వెలువడ్డాయ. సునంద విష ప్రభావంతోనే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక వ్యక్తులను ఢిల్లీ పోలీసులు మరోసారి విచారించారు. శశి థరూర్ డ్రైవర్ బజరంగి, సహాయకుడు నరైన్ సింగ్, థరూర్ కుటుంబ స్నేహితుడు సంజయ్ దేవన్, సునందను పరీక్షించిన వైద్యుడిని పోలీసులు ప్రశ్నించారు. సునంద చనిపోయిన రోజు ఆమె గదిలో అల్ప్రాక్స్ టాబ్లెట్లు లభించడంతో లోధీ కాలనీలో కెమిస్ట్‌లను కూడా పోలీసులు విచారించారు. అల్ప్రాక్స్ వల్ల విషప్రభావంతో ఆమె చనిపోయినట్టు వైద్య నివేదికలో తేలింది. సునందకు మందులు ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ కొన్నారు వంటి విషయాలను పోలీసులు ప్రశ్నించారు. గతంలో వారిచ్చిన వాంగ్మూలాలతో పోల్చిచూసినట్టు సమాచారం. -
విష ప్రభావంతోనే సునంద మృతి
ఎయిమ్స్ వైద్య బృందం నివేదిక ♦ ఇదే విషయాన్ని వెల్లడించిన ఎఫ్‌బీఐ ♦ కడుపులో ‘అల్ప్రాక్స్’ తాలూకు అవశేషాలు ♦ శరీరంపై సూది మార్కు: ఢిల్లీ కమిషనర్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ విషం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇదే విషయాన్ని పేర్కొనడం గమనార్హం. ఆమె శరీరంలో మోతాదుకు మించిన ‘అల్ప్రాక్స్’ అనే మత్తు పదార్థం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న విషయాన్ని మాత్రం వారు త్రోసిపుచ్చలేదు. ఎఫ్‌బీఐ మాత్రం ఆమె శరీరంలో ‘లిడోసియినే’ అనే రసాయన పదార్థం ఉన్నట్లు పేర్కొందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద శరీరంపై సూది మార్కు ఉందని, కాబట్టి ‘ఇంజక్షన్’ కోణంలోనూ సిట్ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఎఫ్‌బీఐ అభిప్రాయపడింది. అలాగే ఆమె శరీరంలో ఖాలీగా ఉన్న 27 అల్ప్రాక్స్ టాబ్లెట్లు ఉన్నాయని, క్లోమం, కిడ్నీల్లో, రక్తంలో ఈ మత్తు పదార్థం తాలుకూ పదార్థాలు ఉన్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఆమె శరీరంపై పంటి గాట్లతో సహ పలు చోట్ల గాయాలున్నట్లు ఎఫ్‌బీఐ నివేదించింది. కాగా మెడికల్ బోర్డు రిపోర్టుపై స్పందించేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ నిరాకరించారు. త్వరలో దర్యాప్తు పూర్తి చేసి వివరాలను కోర్టుకు నివేదిస్తామని, అప్పుడే మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. 2014, జనవరి 17న సునంద పుష్కర్ ఓ స్టార్ హోటల్ మృతి చెందిన విషయం విదితమే. దీనిపై కమిషనర్ బస్సీ గతంలో స్పందిస్తూ.. సునందది అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దర్యాప్తుపై ఎయిమ్స్ ఆందోళన... సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు దర్యాపుపై ఎయిమ్స్ బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు ఎఫ్‌బీఐకి అందజేసిన ‘షాంపిల్స్’లో చాలా వరకు దెబ్బతిని ఉన్నాయని, తక్కువ మోతాదులో ఉన్నాయని పేర్కొంది. ఎఫ్‌బీఐకి శాంపిల్స్ పంపడంలో ఢిల్లీ పోలీసులు ఆలస్యం చేశారని దీంతో అవి కొంత పాడయ్యాయని ఎయిమ్స్ అభిప్రాయపడింది. -
‘ప్రమాద రసాయనం’ వల్లే సునంద మృతి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు అమెరికా ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) నివేదికతో కొత్త మలుపు తిరిగింది. ఆమె మృతికి విషమే కారణమని తేల్చిన ఎయిమ్స్ నివేదికను బలపరిచిన ఎఫ్‌బీఐ.. సునంద శరీరంలో ఉన్న ప్రమాదకర రసాయనమే ఆమె మరణానికి కారణమై ఉండొచ్చని చెప్పింది. రేడియోధార్మిక పదార్థాలే సునంద మృతికి కారణమని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. శరీరంలో పొలోనియం-210, థాలియం, నెరియం, హెరాయిన్ లాంటి అవశేషాలను గుర్తించే ల్యాబ్‌లు భారత్‌లో లేవని ఎయిమ్స్ నివేదించడంతో పోలీసులు గత ఏడాది ఆమె నమూనాలను ఎఫ్‌బీఐ ల్యాబ్‌కు పంపారు. ఎఫ్‌బీఐ తమకు నివేదిక ఇచ్చినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ శనివారం చెప్పారు. సునందది సహజ మరణం కాదని, అలాగే ఆమె శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రేడియో ధార్మిక పదార్థాల్లేవని ఎఫ్‌బీఐ తేల్చిందన్నారు. అయితే ప్రమాదకర రసాయనం ఆమె మరణానికి కారణమై ఉంటుందని చెప్పిందన్నారు. ఇంజెక్షన్ ద్వారా దీన్ని శరీరంలోకి పంపి ఉండొచ్చేమోనని ఎయిమ్స్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం అధిపతి సుధీర్ గుప్తా పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ రిపోర్ట్‌ను విశ్లేషించి ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. -
సునంద పుష్కర్ హత్య కేసులో మరో కోణం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునంద పుష్కర్ హత్య కేసు దర్యాప్తు మరింత పురోగతి సాధించింది. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే ‘అల్ప్రాక్స్’ ట్యాబ్లెట్లను అతిగా తీసుకోవడం వల్ల ఆమె శరీరం విషతుల్యమైందని, అది ఆమె మరణానికి దారితీసిందని స్థానిక ఎయిమ్స్ అధికారులు తాజా నివేదికలో వెల్లడించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద పుష్కర్ ఎందుకు మోతాదుకు మించి ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నారు? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారన్న విషయం ఇప్పటికీ సందేహాస్పదమేనని, ఈ విషయంలో మరొకసారి సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్‌ను విచారించాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎయిమ్స్ నుంచి తాజా నివేదిక అందిన విషయాన్ని ఢిల్లీ పోలీసు కమిషనర్ భీమ్సేన్ బస్సీ శుక్రవారం నాడు ట్విట్టర్లో ధ్రువీకరించారు. ఇప్పటివరకున్న సాక్ష్యాధారాల ప్రకారం సునందది అసహజ మరణమేనని తాను కచ్చితంగా చెప్పగలనంటూ ఆయన శనివారం ఉదయం కూడా ట్వీట్ చేశారు. ఎయిమ్స్ నుంచి అందిన తాజా నివేదిక 11 పేజీలు ఉందని, దానికి అనుబంధ నివేదిక 32 పేజీలు ఉందని బస్సీ తెలిపారు. అందులో కొన్ని నిర్ధారణలు ఉన్నాయని, వాటిని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 2014, జనవరి 17న సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు గతేడాది జనవరిలో దాన్ని హత్య కేసుగా మార్చారు. -
పోలీస్ బాస్ నిజాలను దాస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ భార్య (53) సునంద పుష్కర్ మృతి వ్యవహారాన్ని బీజేపీ అస్త్రంగా మలుచుకుంటోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. సునంద పుష్కర్ అనుమానాస్పద మరణంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ వాస్తవాలను మీడియాకు వెల్లడి చేయలేదని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. నిజాలను ప్రపంచానికి చెప్పకుండా దాచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. సునంద కేసులో వాస్తవాలు వెల్లడిచేయడంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ స్వామి ప్రశ్నించారు. ప్రమాదకరమైన కెమికల్ అవశేషాలు సునంద విసేరాలో లభ్యమయ్యాయన్న ఎఫ్‌బీఐ రిపోర్టు సమర్పించిందన్నారు. భయంకరమైన విషపదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం వల్ల ఆమె మరణం సంభవించి ఉంటుందన్న ఆ రిపోర్టును ఎందుకు మీడియాకు బహిర్గతం చేయడంలేదంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన సునంద మరణం సహజమైంది కాదని ఢిల్లీ బాస్ బీఎస్ బస్సీ శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించడంతో సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్ ఇరకాటంలో పడ్డారు. కాగా 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎన్నో మలుపులు తిరిగిన సునంద మృతిపై పోలీసులు పలుమార్లు సునంద భర్త శశిథరూర్ తో సహా.. పలువురిని విచారించిన విషయం తెలిసిందే. -
వీడిన మిస్టరీ
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన సునంద పుష్కర్ (53) అనుమానాస్పద మరణంపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. సునందాది సహజ మరణం కాదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. విషప్రయోగం వల్లే సునంద మరణం సంభవించినట్టుగా ఎయిమ్స్ సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చిందన్నారు. దీంతో సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్ ఇరకాటంలో పడ్డారు. అయితే ఆమెది మరణం సహజం కాదని నిశ్చయంగా చెప్పగలనని ఢిల్లీ పోలీస్ చీఫ్ బిఎస్ బాసీ వ్యాఖ్యానించారు. రేడియోధార్మిక విషపదార్థం ఉండే అవకాశాలను తోసి పుచ్చిన ఆయన తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ బస్సీ వెల్లడించారు. కేసు విచారణ, ఎయిమ్స్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ వివరాలను పోలీస్ కమిషనర్ మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఆమె భర్తను శశిథరూర్ ను మరో మారు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై శశ్ థరూర్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో 53 ఏళ్ల పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎన్నో మలుపులు తిరిగిన సునంద మృతిపై పోలీసులు పలుమార్లు సునంద భర్త శశిథరూర్ తో సహా.. పలువురిని విచారించారు. -
వీడిన మిస్టరీ
-
వీడనున్న సునంద మర్డర్ మిస్టరీ
-
వీడనున్న సునంద మర్డర్ మిస్టరీ
దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన సునంద పుష్కర్ మర్డర్ మిస్టరీ మరి కాసేపట్లో వీడనుంది. ట్విస్ట్ ల మీద ట్విస్టులతో థ్రిల్లర్ సినిమాను తలపించిన.. సునంద మృతి కేసు.. సుదీర్ఘ విచారణ అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ వెల్లడించనున్నారు. కేసు విచారణ, ఎయిమ్స్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ వివరాలను పోలీస్ కమిషనర్ బస్సీ వివరిస్తారు. సునంద మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్ ను మరో మారు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో 52 ఏళ్ల పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎన్నో మలుపులు తిరిగిన సునంద మృతిపై పోలీసులు పలుమార్లు సునంద భర్త శశిథరూర్ తో సహా.. పలువురిని విచారించారు. -
సునంద పుష్కర్ కేసులో మరో ట్విస్ట్
-
సునంద పుష్కర్ కేసులో మరో ట్విస్ట్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసులో కీలక పురోగతి సాధించింది. ఢిల్లీ పోలీసులు ఎదురు చూస్తున్న ఎఫ్ బీ ఐ ఫోరెన్సిక్ రిపోర్టు ఎట్టకేలకు వారి చేతికి అందింది. అయితే.. ఢిల్లీ పోలీసులు భావించినట్లు సునంద మరణానికి రేడియో ధార్మిక పదార్థం కారణం కాదని ఎఫ్ బీ ఐ రిపోర్టు స్పష్టం చేసింది. సునంద పుష్కర్ మృతికి కారణాలు తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల సాయం కోరిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు వివరాలు ఎఫ్ బీఐ సీల్డ్ కవర్ లో ఢిల్లీ పోలీసులకు అందింది. సునందా పుష్కర్‌ను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు 'పొలోనియం' అని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. ఇదే విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో కూడా ఉంది. అయితే సునంద మృతికి పొలోనియం కారణం కాదని ఎఫ్ బీ ఐ రిపోర్టు స్పష్టంచేసింది. సునంద మరణానికి కారమైన విషపదార్థం పేరును రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ రిపోర్టుపై ఢిల్లీ పోలీసులు నోరు మెదపడం లేదు. కాగా.. ఎఫ్ బీ ఐ రిపోర్టును గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బాసీ ఓ ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ "త్వరలోనే కేసుకు సంబంధించిన కొన్ని నిజాలు తెలుస్తాయి' అని తెలిపారు. ఈ రిపోర్టుతో కేసుకు సంబంధించిన అనేక చిక్కుముడులు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సునంద మృతి కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఆరుగురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. సునంద భర్త కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ తో సహా ఆరుగురు నిందితులకు పాలి గ్రాఫీ పరీక్షలు సైతం నిర్వహించారు. గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని లీలా హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌తో ట్విట్టర్లో తీవ్ర మాటల యుద్దం జరిగిన ఒక్క రోజు లోపే సునంద మృతి చెందడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఎఫ్ బీ ఐ తాజా రిపోర్టుతో కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
సునంద కేసులో ఆరుగురికి సత్యశోధన పరీక్షలు
న్యూఢిల్లీ: సునందపుష్కర్ హత్య కేసుకు సంబంధించి.. ముగ్గురు ప్రధాన సాక్షులతో సహా ఆరుగురు వ్యక్తులకు సత్య శోధన పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి తెలిపారు. సునంద భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇంటి పనిమనిషి నారాయణ్‌సింగ్, డ్రైవర్ బజరంగి, కుటుంబ స్నేహితుడు సంజయ్దేవన్లతో పాటు.. ఎస్.కె.శర్మ, వికాస్ అహ్లావత్, సునీల్ టక్రులకు ఈ పరీక్షలు నిర్వహించారు. -
సునంద కేసులో మరో కొత్త మలుపు
సునందా పుష్కర్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అటాప్సీ నివేదిక విషయంలో తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించలేనని, తాను వివక్షకు గురవుతున్నానని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అధినేత డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా ఆరోపించారు. దాంతో.. ఆయనను మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఎయిమ్స్ కోరింది. ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం కొత్త అధినేతగా డాక్టర్ డీఎన్ భరద్వాజను నియమించేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు ఈ కేసు విచారణను జూలై 23కు వాయిదా వేసింది. గుప్తాను ఆ స్థానం నుంచి మార్చాలంటే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో మార్చి 25న చెప్పిన నేపథ్యంలో ఎయిమ్స్.. ఇప్పుడు కోర్టుకు వెళ్లింది. -
సునందా పుష్కర్ కేసులో లై-డిటెక్టర్ పరీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు అనుమానితులకు సత్యశోధన(లై-డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు సిటీ కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. పోలీసులు శశిథరూర్ ఇంటి సహాయకులైన నారాయణ్‌సింగ్, డ్రైవర్ బజ్రంగిలతోపాటు స్నేహితుడు సంజయ్‌లకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు విన్నవించారు. దర్యాప్తులో భాగంగా ఆ ముగ్గురినీ విచారించామని, కానీ కొన్ని కీలక వాస్తవాలను వారు చెప్పలేదని అన్నారు. ముఖ్యంగా సునంద శరీరంపై ఉన్న గాయాలకు సంబంధించినఅంశాలను వారు వెల్లడించట్లేదని విన్నవించారు. అందువల్ల వారికి లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు. -
వారికి పాలిగ్రాప్ పరీక్షలు చేయొచ్చు
న్యూఢిల్లీ: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు శశిథరూర్ ఇంటి సహాయకులపై నిజనిర్దారణ పరీక్షకు(పాలిగ్రాప్ టెస్ట్) ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఈ మేరకు అనుమతి పొందింది. అయితే, ఇది ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. శశిథరూర్ భార్య అయిన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు దారితీయడంతో కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. వారి దర్యాప్తులో భాగంగా థరూర్ సేవకులైన నరేన్ సింగ్, డ్రైవర్ బజ్ రంగీ, స్నేహితుడు సంజయ్ దెవాన్పై పాలిగ్రాప్ పరీక్షలు చేయాలని నిర్వహించింది. వారు ఏవో నిజాలు దాస్తున్నారని, ఈ పరీక్ష ద్వారా అవి తెలిసి కేసులోని పలు అనుమానాలకు పరిష్కారం చూపినట్లవుతుందని సిట్ భావించింది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. -
సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలకమైన ముగ్గురు సాక్షులకు పోలీసులు సత్యశోధన(పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. థరూర్ ఇంటి పనిమనిషి నరేన్సింగ్, డైవర్ బజ్రంగి, కుటుంబ మిత్రుడు సంజయ్ దివాన్లపై ఈ పరీక్షలు చేపట్టేందుకు అనుమతించాలంటూ పోలీసులు శుక్రవారం ఢిల్లీలోని స్థానిక కోర్టును కోరారు. పోలీసుల అభ్యర్థనపై స్థానిక కోర్టు వచ్చే బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించనుంది. -
'వందశాతం కోపరేట్ చేస్తా'
తిరువనంతపురం: తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో జరుగుతున్న దర్యాప్తు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ శశిథరూర్ అన్నారు. మూడు కీలక సాక్ష్యాల కోసం ఢిల్లీ పోలీసులు డిటెక్టర్ పరీక్ష చేసేందుకు అనుమతి తీసుకున్న విషయం పై ఆయనను ప్రశ్నించగా.. 'దర్యాప్తు విషయంలో ఇప్పుడే తాను స్పందిచబోనని చెప్పారు. వారి విధులను వారిని నిర్వర్తించనివ్వండి.. నేను వారిని డిస్ట్రబ్ చేయాలనుకోవడం లేదు. వారికి వందశాతం సహకరిస్తాను' అని ఆయన అన్నారు. తాను కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, అయితే దర్యాప్తు పూర్తయ్యాకే వాటిని చెప్తానని తెలిపారు. -
సునంద కేసులో ముగ్గురికి 'లైడిటెక్టర్' పరీక్షలు
-
సునంద కేసులో ఆ ముగ్గురికి 'లై డిటెక్టర్' పరీక్షలు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తీసుకోనుంది. హత్య జరిగిన రోజు.. అంతకు ముందు చోటుచేసుకున్న పరిణామాలను శోధిస్తోన్న ఢిల్లీ పోలీసులు.. ముగ్గురు సాక్షులకు లై డిటెక్టర్ (సత్యశోధన) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు. శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ దావన్‌లు దర్యాప్తునకు సహకరించడంలేదని, జవాబులు తెలినప్పటికీ కీలకమైన ప్రశ్నలు కొన్నింటికి సమాధానాలు దాటవేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. సదరు సాక్షులు ముగ్గురు మే 20న కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజే వారిని పోలీసు కస్టడీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. -
సునందో హత్య కేసులో మహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష!
న్యూయార్క్: యూఎస్‌లో భారతీయుడి సునందో సేన్ హత్య కేసులో ఆ దేశ మహిళ ఎరికా మెనెండెజ్కు క్వీన్స్ కోర్టు శిక్షను ఖరారు చేయనుందని సమాచారం. ఈ కేసులో నిందితురాలికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఈ కేసులో తుది తీర్పుని ఏప్రిల్ 29న వెలువరించనుంది. 2012, డిసెంబర్ 27న న్యూయార్క్ సబ్ వేలో సునందో సేన్ రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎరికా మెనెండెజ్ వెనక నుంచి వచ్చి సబ్ వేలో ప్రవేశిస్తున్న రైలు కిందకు తొసివేసింది. ఈ ఘటనలో సునందో సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో ఎరికా మెనెండెజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ ఎరికా మెనెండెజ్ పోలీసులకు వెల్లడించింది. సెప్టెంబర్ 11, 2001 టెర్రరిస్టు దాడులు అనంతరం తాను హిందూ, ముస్లింలపైనా ద్వేషం పెంచుకున్నానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నిందితురాలు ఎరికా మెనెండెజ్ క్వీన్స్ లో నివశిస్తుండగా 46 సంవత్సరాల సునందో సేన్ కూడా క్వీన్స్ లోనే ఒక చిన్న అపార్ట్ మెంట్లో నివసిస్తున్నాడు. కొద్ది కాలం కిందట అమెరికాకు వలస వచ్చిన సునందో కొలంబియా యూనివర్సిటీ వద్ద సొంతగా ఒక ప్రింటింగ్ అండ్ కాపియింగ్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడు అవివాహితుడు. సునందో హత్య జరిగే నాటికే భారత్‌లో నివసిస్తున్న అతడి తల్లిదండ్రులు చనిపోయారు. -
పాకిస్థాన్ జర్నలిస్టును విచారించనున్నఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ను గురువారం విచారించనున్నామని ఢిల్లీ పోలీస్ కమీషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. సునంద గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని ఒక హెటెల్లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. చనిపోవడానికి ముందు ఆమె విలేకరుల సమావేశం పెట్టాలనుకున్నారన్న సమాచారంతో ఇప్పటికే కొంతమంది జర్నలిస్టులను విచారించారు ఢిల్లీ పోలీసులు . ఈ కేసులో పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్ కీలక వ్యక్తిగా భావిస్తున్నఢిల్లీ పోలీసులు అవసరమైతే ఆమెనూ ప్రశ్నిస్తామని గతంలోనే ప్రకటించారు. దీనిపై తరార్ స్పందిస్తూ విచారణకు తాను సిద్ధమని, కానీ, తాను భారత్ రానని, పోలీసులే లాహోర్ రావాలన్నారు. సునందతో ట్విట్టర్ లో ఘర్షణ పడి పెద్ద తప్పు చేశానన్నారు. కాగా తన భర్త శశిథరూర్‌కు , మెహర్ తరార్‌తో సంబంధం ఉందంటూ తరార్ తో ట్విట్టర్ లో సునంద ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తరార్ ను విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు. -
మీడియాపై విరుచుకుపడిన శశిథరూర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డారు. సునంద పుష్కర్ అనుమానాస్పద కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసు విచారణ చేపట్టిన సిట్... సునంద భర్త శశిథరూర్‌ను కూడా విచారిస్తోంది. అయితే స్పెషల్ ఇన్విస్టిగేషన్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ న్యూఢిల్లీ పోలీసులు శశిథరూర్‌ను హెచ్చరించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో శశిథరూర్ మీడియాపై విరుచుకుపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కట్టుకథలు ప్రసారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. తాను విచారణకు సహకరించడం లేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం అబద్ధాలను, అసత్యాలను ప్రసారం చేసే మీడియా కాకుండా, నీతిగా, నిజాయితీగా వ్యవహరించే జర్నలిజం మన దేశానికి చాలా అవసరం అంటూ ట్వీట్ చేశారు. మీడియా చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని శశిథరూర్ కొట్టిపారేశారు. ముఖ్యంగా కేరళ చానళ్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిజాలను ప్రతిబింబించని మీడియా అని అర్థం వచ్చేలా ప్లకార్డును తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు మీడియాకి చెప్పే ముందు తనను వివరణ అడిగి వుంటే బావుండేదని శశిథరూర్ ట్విట్ చేశారు. సునంద కేసులో సిట్ ఇప్పటికే ఆయనను రెండుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్ళకూడదన్న నిబంధన ప్రకారం సిట్ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకున్న శశిథరూర్ తన సొంత నియోజవర్గం తిరువనంతపురం పర్యటనలో ఉన్నారు. -
థరూర్‌ను ప్రశ్నించిన సిట్
-
థరూర్‌ను ప్రశ్నించిన సిట్
సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారణ సునంద కుమారుడు శివ్‌మీనన్ చెప్పిన అంశాలపై ఆరా న్యూఢిల్లీ: సునంద హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం గురువారం మరోసారి ప్రశ్నించింది. ఐపీఎల్ కోచి వ్యవహారంతో సునంద హత్య కేసుకు ముడిపడి ఉన్న సమాచారంపై పోలీసులు ఆరా తీశారు. థరూర్‌ను ఈ కేసులో ఇంతకుముందే జనవరి 19న సిట్ బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం దక్షిణ ఢిల్లీలోని ఏఏటీఎస్ కార్యాలయంలో రెండు దఫాలుగా ఐదు గంటల పాటు శశిథరూర్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణ రాత్రి వరకు కొనసాగింది. ఈ సమయంలో థరూర్ సహాయకులు బజ్రంగి, నారాయణ్ సింగ్, స్నేహితుడు సంజయ్దివాన్ను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. థరూర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐపీఎల్ కోచి ఫ్రాంచైజీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై, రూ. 70 కోట్లను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అంతే సొమ్మును ఐపీఎల్ కోచిలో 19 శాతం వాటాగా సునందకు చెల్లింపులు జరగడంపైనా వివరాలు సేకరించినట్లు సమాచారం. -
శశిథరూర్‌పై సిట్ బృందం ప్రశ్నల వర్షం
సునందాపుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఢిల్లీ పోలీసులు ఏకంగా నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ జట్టు భాగస్వామ్యంపైనే ప్రధానంగా ఈ ప్రశ్నలవర్షం కురిపించినట్లు తెలుస్తోంది. థరూర్‌తోపాటు వాళ్ల ఇంటి పనిమనిషి నారాయణ్ సింగ్, డ్రైవర్ బజరంగ్ తదితరులను సిట్ బృందం గురువారం పిలిపించింది. 2014 జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ తానున్న హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు ఏర్పాటుచేసిన సిట్ బృందం హత్యకేసును ఈ సంవత్సరం జనవరి 1న నమోదుచేసింది. ఈ కేసులో గురువారం ఉదయం 11.30కు థరూర్‌ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అది ఏకబిగిన నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. తొలుత థరూర్ సరోజిని నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, అక్కడినుంచి ఆయన్ను వసంత విహార్ స్టేషన్‌కు తరలించి, అక్కడే ప్రశ్నించారు. అదనపు డీసీపీ పీఎస్ కుష్వాహా నేతృత్వంలోని సిట్ బృందమే ఆయన్ను ప్రశ్నించింది. ఇప్పటివరకు ఈ కేసులో సిట్ బృందం 15 మందిని ప్రశ్నించింది. సునంద కుమారుడు శివ్ మీనన్‌ను కూడా ఫిబ్రవరి 5న 8 గంటల పాటు ప్రశ్నించారు. -
సునంద కేసులో నేడు థరూర్ విచారణ
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఆమె భర్త శశిథరూర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ గురువారం మరోసారి ప్రశ్నించనుంది. సునంద తనయుడు శివ్మీనన్ను సిట్ బృందం ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు విచారించిన సాక్షుల వాంగ్మూలాలను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని అంశాలకు సంబంధించి వివరణ కోసం శశిథరూర్‌ను విచారించనున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న పోలీస్ బృందం ఇప్పటివరకు దాదాపు 15 మందిని ప్రశ్నించింది. శశిథరూర్ వ్యక్తిగత సిబ్బందితోపాటు ఆయన స్నేహితులను కూడా విచారించారు. మరోవైపు సునందకేసు విచారణలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇందులో ప్రచారం కోసం తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోందని కాబట్టి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమంది. అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్‌జైన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో ఐదుగురు అత్యంత సీనియర్ అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ కేసు దర్యాప్తు చేస్తోందని కోర్టుకు తెలిపారు. -
శశిథరూర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో.. ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను పోలీసులు గురువారం విచారించనున్నారు. బుధవారం శశిథరూర్ ఇంట్లో పనిమనిషి నారాయణ్‌ను పోలీసులు ప్రశ్నించారు. గత వారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆమె కుమారుడు శివ్ మీనన్‌ను రెండుగంటలకు పైగా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సునంద భర్త శశిథరూర్, ఆయన సిబ్బందిని మరోసారి ప్రశ్నించనున్నామని కూడా అప్పుడే తెలియజేశారు. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు. -
సునంద హత్య కేసులో శశిథరూర్ కు మళ్లీ సమన్లు?
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు పంపే అవకాశముంది. ఈ కేసులో థరూర్ ను త్వరలోనే ప్రశ్నించవ్చని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద హత్య కేసులో ఆయనను ఇదివరకే ఓసారి పోలీసులు విచారించారు. సునంద కుమారుడు శివ్ మీనన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు. -
సునంద పై వర్మ సినిమా ?
ముంబై : సంచలనాలకు మారుపేరు అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. తాజగా ఆయన కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ పై సినిమా తీయాలనుకుంటున్నారట. అయితే సునంద మృతిపై కేసు పూర్తి అయిన తరువాతనే సినిమా కథ తయారు చేస్తానని స్వయంగా వర్మ చెప్పినట్టు సమాచారం. సునంద జీవితానికి సంబంధించి అన్ని విషయాలు అధ్యయనం చేశాకే సినిమాను తెరకెక్కిస్తారట. కాగా రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ముంబయిలో 26/11 దాడులపై సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత కేరళలో ఫేమస్ మర్డర్ కేసుపై మరో సినిమా తీయనున్నట్లు సినీ వర్గాల టాక్. -
సునంద కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం ఆమె కుమారుడు శివ్ మీనన్‌ను ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మీనన్ దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. మీనన్‌ను రెండుగంటలకుపైగా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును సునంద భర్త శశిథరూర్, ఆయన సిబ్బందిని మరోసారి ప్రశ్నించనున్నారు. -
సునంద తనయుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ప్రమేయంపై ఆమె తనయుడు శివ్ మీనన్‌ను పోలీసులు గురువారం ప్రశ్నిస్తున్నారు. విదేశాల నుంచి ఢిల్లీ చేరుకున్న మీనన్ ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. సునంద మరణంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు సునంద మృతి కేసులో 15మందిని విచారించారు. కాంగ్రెస్ ఎంపీ, ఆమె భర్త శశి థరూర్, ఆయన సిబ్బంది, సన్నిహితులు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్, సీనియర్ జర్నలిస్టు నళిని సింగ్‌లతో పాటు పలువురిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే శివ్ మీనన్‌కు సమన్లు జారీ చేశారు. -
సునంద కేసులో అమర్‌సింగ్‌కు సిట్ పిలుపు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించనుంది. ఈ మేరకు ఆయనను పిలిపించింది. విచారణకు హాజరు కావాల్సిందిగా అమర్ సింగ్‌తో పాటు సునంద కుమారుడికి కూడా కబురు పంపింది. సునంద హత్య కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ఆమె సన్నిహితులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో సునంద కొడుకు, అమర్ సింగ్‌లను ప్రశ్నించనున్నారు. ఐపీఎల్ వివాదంలో సునంద పేరు తెరపైకి వచ్చినపుడు అమర్ సింగ్ ఆమెను సమర్థించారు. అంతేగాక సునంద తనకు మంచి స్నేహితురాలని అప్పట్లో ఆయన చెప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అమర్ సింగ్‌ను విచారించనుంది. సునంద హత్య కేసులో భర్త శశి థరూర్‌తో పాటు ఆమె సన్నిహితురాలు నళినీ సింగ్‌లను ఇటీవల విచారించారు. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. -
నళిని సింగ్ ను ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సతీమణి సునందా పుష్కర్ మృతి కేసులో సీనియర్ జర్నలిస్ట్ నళిని సింగ్ ను పోలీసులు ప్రశ్నించారు. డిప్యూటీ కమిషనర్ ప్రేమ్ నాథ్ లోని పోలీసుల బృందం సరోజినినగర్ పోలీసు స్టేషన్ లో ఆమెను ప్రశ్నించింది. దాదాపు 80 నిమిషాల పాటు తనను పోలీసులు ప్రశ్నించారని నళిని సింగ్ తెలిపారు. పోలీసులను కలవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. సునంద పుష్కర్ మరణానికి ముందు ఆమెతో తాను మాట్లాడిన విషయాల గురించి పోలీసులు ఆరా తీశారని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సంబంధించిన అంశాలపై అడిగారని వెల్లడించారు. శశి థరూర్ వివాహేతర సంబంధాల గురించి ఆయన భార్య సునంద్ పుష్కర్ తీవ్రంగా కలత చెందేవారని వెల్లడించి నళిని సింగ్ అప్పట్లో సంచలనం సృష్టించారు. -
సునంద కేసులో జర్నలిస్టుల విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు మిస్టరీని ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు కొందరు జర్నలిస్టులను ప్రశ్నించారు. ఆమె మరణించడానికి ముందుగా కొంతమంది విలేకరులతో మాట్లాడారన్న సమాచారంతో పోలీసులు వారిని విచారించారు. ఐపీఎల్ వివాదం గురించి గానీ, తన భర్త శశిథరూర్‌కు పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో సంబంధం గురించి గానీ, లేదా ఇతర ముఖ్యమైన విషయాల గురించి విలేకరులకు చెప్పారేమో తెలుసుకునేందుకు సిట్ బృందం గురువారం ముగ్గురు విలేకరులను ప్రశ్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద గత ఏడాది జనవరి 17న మరణించడానికి ముందుగా తాను ఉంటున్న హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించాలని అనుకున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సిట్ రెండు మూడు రోజుల్లో మరికొంతమంది విలేకరులను ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌ను కూడా విచారిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సునంద మరణించడానికి రెండువారాల ముందు శశిథరూర్‌తో కలసి గోవాలో ఉన్నప్పుడు పిడికిలి నిండా మాత్రలు మింగి స్పృహతప్పిపోయారని చెప్పిన తేజ్ సరాఫ్ (77) అనే వ్యక్తితోనూ మాట్లాడతామని బస్సీ పేర్కొన్నారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సునంద వస్తువులు
అహ్మదాబాద్: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ హత్య కేసును ఢిల్లీ పోలీసులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు. సునంద వాడిన ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని గుజరాత్‌లోని గాంధీనగర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్‌కు పంపారు. ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలోని డాటా కేసు విచారణకు ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. సునంద హత్య కేసులో ఢిల్లీ పోలీసులు థరూర్‌తో పాటు పలువురు వ్యక్తులను విచారించారు. గతేడాది జనవరిలో ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. -
‘సునంద మృతికి ఐపీఎల్ కారణమా?’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తులో భాగంగా.. 2010 నాటి ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నీ వివాదంపైనా దృష్టి పెడతామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.. సునంద మృతికి, ఆ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతామని పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ మంగళవారం వెల్లడించారు. సునంద మృతికి బాధ్యుడెవరనే విషయంపై దర్యాప్తు అనంతరం అన్ని విషయాలను క్రోడీకరించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. 2010లో ఐపీఎల్ కొచ్చి యజమానులు సునందకు ఉచితంగా 19% వాటాకు సమానమైన రూ. 70 కోట్లు ఇవ్వడంపై వివాదం తలెత్తింది. అప్పటికీ శశి థరూర్‌తో ఆమె వివాహం కాలేదు. ఐపీఎల్ కొచ్చి ఫ్రాంచైజీలో శశి థరూర్ బినామీగా ఆమె వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అప్పుడు వచ్చాయి. కాగా, శశి థరూర్‌ను సోమవారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి దాటేవరకు.. నాలుగు గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. థరూర్ పూర్తిగా సహకరించారని బస్సీ తెలిపారు. థరూర్‌ను మరోసారి ప్రశ్నించే అవకాశాలను బస్సీ తోసిపుచ్చలేదు. -
'థరూర్ ను మరోసారి ప్రశ్నిస్తాం'
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను మరోసారి ప్రశ్నించే అవకాశముందని ఢిల్లీ పోలీస్ చీఫ్ బీఎస్ బాసీ తెలిపారు. అవసరమైతే మరోసారి ఆయన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పలువురి విచారించామని, ఇంకా కొందరిని ప్రశ్నిస్తున్నామని అన్నారు. సోమవారం రాత్రి థరూర్ ను మూడున్నర గంటల పాటు ప్రశ్నించామని, అవసరమైతే రెండవసారి పశ్నించేందుకు ఆయనను పిలుస్తామని వెల్లడించారు. థరూర్ ఏం సమాధానం చెప్పారనేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. -
కొన్నిసార్లు చిరునవ్వు, మరికొన్నిసార్లు మౌనం
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ తమ విచారణకు సహకరించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త శశి థరూర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి ప్రశ్నించిన విషయం తెలిసిందే. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. సునంద మృతి చెందిన రోజు ఏం జరిగింది, ఐపీఎల్ వ్యాపార లావాదేవీల ఆరా తీసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే ఈ కేసు విచారణలో మరికొంతమందిని ప్రశ్నించాల్సి ఉందన్నారు. కాగా ఈ సందర్భంగా శశిథరూర్ పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు కొన్నిసార్లు చిరునవ్వుతో సమాధానం ఇవ్వగా, మరికొన్ని మౌనాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. అదనపు డీసీపీ పీఎస్ కుష్వా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం థరూర్‌ను ప్రశ్నించింది. పోలీసులు ప్రశ్నించడం ఆయన్ని ప్రశ్నించటం ఇదే తొలిసారి. కాగా సునంద మరణించిన జనవరి 17న ఏం జరిగింది? అంతకు ముందు జనవరి 15న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత థరూర్‌ను వదిలేసి సునంద ఒంటరిగా హోటల్ గది ఎందుకు తీసుకున్నారు? సునంద ఆరోగ్య పరిస్థితి ఏంటి? పాకిస్తానీ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో థరూర్ సంబంధాలేంటి?' తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. -
శశి థరూర్‌ను తొలిసారిగా ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి ప్రశ్నించారు. గత జనవరిలో సునంద మృతి చెందిన విషయం తెలిసిందే. ఏడాది తరువాత ఢిల్లీ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విష ప్రయోగంతో సునంద చనిపోయినట్లు ఎయిమ్స్ ఇచ్చిన వైద్య నివేదిక ఆధారంగా మూడు వారాల క్రితం ఢిల్లీ పోలీసులు హత్యాకేసుగా నమోదు చేశారు. గత సంవత్సరం జనవరి 17న ఢిల్లీలోని ప్రఖ్యాత లీలా హోటల్ గదిలో సునంద మృతదేహం కనిపించింది. ఆ తరువాత శశి థరూర్‌ను పోలీసులు ప్రశ్నించడం ఇదే ప్రథమం. థరూర్‌ను అదనపు డీసీపీ పీఎస్ కుష్వా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. సోమవారం రాత్రి 8 గంటలకు దక్షిణ ఢిల్లీలోని సిట్ కార్యాలయానికి థరూర్ వెళ్లారు. అంతకుముందు ఆయన తన న్యాయవాదులతో సమావేశమయ్యారు. 'సునంద మరణించిన జనవరి 17న ఏం జరిగింది? అంతకు ముందు జనవరి 15న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత థరూర్‌ను వదిలేసి సునంద ఒంటరిగా హోటల్ గది ఎందుకు తీసుకున్నారు? సునంద ఆరోగ్య పరిస్థితి ఏంటి? పాకిస్తానీ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో థరూర్ సంబంధాలేంటి?' తదితర అంశాలపై థరూర్‌ను ప్రశ్నించి ఉండవచ్చునని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు సిట్ అధికారులు థరూర్ పనిమనిషి నారాయణ్ సింగ్, స్నేహితుడు సంజయ్ దేవన్, హోటల్ డాక్టర్, హోటల్ సిబ్బందిని విచారించారు. వారు చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చనిపోవడానికి ముందు సునంద మాట్లాడారని భావిస్తున్న ఒక మహిళా జర్నలిస్టును కూడా సిట్ త్వరలో ప్రశ్నించనుంది. -
శశి థరూర్ పై విచారణకు రంగం సిద్ధం!
-
శశి థరూర్ పై విచారణకు రంగం సిద్ధం!
ఢిల్లీ: భార్య సునందా పుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు ఢిల్లీ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు అందజేశారు. సునందా హత్య కేసుకు సంబంధించి ఈనెల మొదట్లో శశి థరూర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శశి థరూర్ ను మరో 48 గంటల్లో విచారిస్తామని నగర కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. శశి థరూర్ మూడో భార్య అయిన సునంద పుషర్క్ది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో.. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ముందుగా భర్త శశి థరూర్ ను మరో రెండు రోజుల్లో విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో సునందా మృతి చెందిన విషయం తెలిసిందే. -
మోదీ తీరుతో ముగ్ధుడినయ్యా: శశి థరూర్
కోల్‌కతా: తన భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోదీ తనను అభినందించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అప్పటి వరకూ తమ మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని మరచిపోయి ఆయన తనను అభినందించడం తనను ముగ్ధ్దుడ్ని చేసిందని థరూర్ పేర్కొన్నారు. శుక్రవారం కోల్‌కతాలో అపీజే కోల్‌కతా లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా తాను రచించిన ‘ఇండియా శాస్త్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు ముందు సిమ్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ తన భార్య సునందను ఉద్దేశించి రూ. 50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అంటూ విమర్శలు చేశారని, దీనిపై తమ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగిందని, ఆ సమయంలో మోదీ తనను అభినందిస్తారని అసలు తాను భావించలేదని చెప్పారు. అయితే సునంద హత్య కేసుకు సంబంధించి ప్రశ్నలకు థరూర్ సమాధానం ఇవ్వలేదు. ఈ కేసులో మీడియా వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారహితమన్నారు. కాగా, పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మోదీని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. మరింత మందిని ప్రశ్నిస్తాం... సునంద హత్య కేసులో రెండు రోజుల్లో మరింత మందిని ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు వేగంగా సాగుతోందని, సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కేసు విచారణలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. విచారణలో తాము జోక్యం చేసుకోవడం లేదన్నారు. -
ఎయిమ్స్ వైద్యుడికి థరూర్ ఈ-మెయిల్స్!
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ మృతి కేసులో ఎయిమ్స్ మెడికల్ బోర్డు చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తాను సిట్ అధికారులు ప్రశ్నించారు. సునంద మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన బృందానికి గుప్తా నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. గుప్తా సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సునంద పుష్కర్ మరణాన్ని హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ పీఎస్ కుష్వా, ఇన్స్పెక్టర్ రాజేందర్ సింగ్ బృందం గురువారం గుప్తాను పలు విషయాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శశిథరూర్ తనకు కొన్ని ఈ-మెయిల్ సందేశాలు పంపినట్లు గుప్తా పోలీసులు విచారణలో తెలిపారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న శశిథరూర్ ...గుప్తాపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు శశిథరూర్ పంపిన సందేశాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కాగా గుప్తాకు శశిథరూర్ ఎందుకు ఈ-మెయిల్స్ పంపాల్సి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. శశిథరూర్‌ను త్వరలోనే ఈకేసు విషయంపై ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. sunanda pushkar, shashi tharoor, sunanda murder, sudhir gupta, సునందా పుష్కర్, శశి థరూర్, సునంద హత్య, సుధీర్ గుప్తా -
శశిథరూర్ ఆరోపణల్లో వాస్తవం లేదు
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చట్టం తన పని చేసుకుపోవాలని, ఈ కేసు విషయంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ఆయన గురువారమిక్కడ అన్నారు. విచారణ నిష్పక్షపాతంగానే సాగుతోందన్నారు. కేసు తనవైపు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సునంద భర్త, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కాగా సునంత పుష్కర్ హత్య జరిగిన సమయంలో అంటే 2014 జనవరి 17న కాంగ్రెస్ నేత శశి థరూర్ కదలికలు, ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు అన్న అంశాలను ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. థరూర్ చేసిన ఫోన్- కాల్స్ రికార్డును పోలీసులు సేకరించారు. ఆ అంశాలు, డాక్టర్ ను ఎవరు పిలిపించారు. ఎవరి ప్రోద్బలంతో పిలిపించారు. అనే అన్నివిషయాలు సేకరిస్తున్నారు. -
''సునంద కేసులో రాజకీయ ఒత్తిళ్లు లేవు''
-
సునంద కేసులో నలుగురు కీలకం
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో హస్తమున్న నలుగురు కీలక వ్యక్తులను పోలీసులు బుధవారం విచారించారు. పోలీసు అధికారులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించటంతో దర్యాప్తు బృందంమే సమాచారం అందించింది. ఇందులో భాగంగానే శశిథరూర్ వ్యక్తిగత సిబ్బంది, మరో ఇద్దరు బిజినెస్మేన్లను కూడా విచారించారు. శశిథరూర్ కుటుంబ సన్నిహితులు అయిన దేవన్‌ను బుధవారం విచారించినట్టు సమాచారం. అతడిని గత ఏడాదిలో రెండుసార్లు ప్రశ్నించారు. సునంద మృతి చెందినపుడు గత జనవరిలో, తరువాత నవంబర్‌లో కూడా విచారించినట్టు సమాచారం. -
సునందను థరూర్ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు!
సునందా పుష్కర్ స్పృహలేకుండా పడి ఉన్నా.. ఆమె పలకకపోయినా ఆమె భర్త శశి థరూర్ మాత్రం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదట! ఈ విషయాన్ని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, కేప్ వెర్డెలో గౌరవ కాన్సల్ జనరల్ సంజయ్ దేవన్ చెప్పారు. ఆయనను సిట్ బృందం ప్రశ్నించనుంది. శశి థరూర్ తనకు 2006 నుంచి తెలుసన్న ఆయన.. సునంద మరణించిన జనవరి 17 విషయం గురించి వివరించారు. ఆరోజు సాయంత్రం 5 గంటలకు థరూర్ ఇంటి పనిమనిషి నారాయణ్ సింగ్ తనకు ఫోన్ చేసి, సునంద హోటల్లోనే ఉన్నారని.. కలవాలంటే హోటల్‌కు రావచ్చని చెప్పాడన్నారు. అయితే, ఆమె ఏమీ తినట్లేదని, అందువల్ల ఆమెను ఏదైనా తినేలా నచ్చజెప్పాలని కూడా కోరాడన్నారు. రాత్రి 8 గంటల సమయంలో శశిథరూర్ వచ్చి, డాక్టర్‌ను కలవాలని చెప్పారని, ఆరోజు రాత్రి 9 గంటలకు ఆయన టీవీలో కనిపించాల్సి ఉందని సంజయ్ దేవన్ అన్నారు. అయితే రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సునందను లేపేందుకు ప్రయత్నించిన థరూర్.. గట్టిగా అరిచారని, దాంతో ఏదో జరిగిందని అర్థమైందని చెప్పారు. తాము లోపలకు వెళ్లి చూడగా, థరూర్ హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి డాక్టర్‌ను పంపాలని కోరారన్నారు. ఈలోపు గంగారాం ఆస్పత్రి నుంచి డాక్టర్ రజత్ మోహన్ వచ్చారని, ఆయన ఈసీజీ తీసి.. సునంద అప్పటికే మరణించినట్లు నిర్ధారించారని సంజయ్ దేవన్ తెలిపారు. ఆ విషయాన్ని థరూర్ తన సెక్రటరీ అభినవ్‌కు చెప్పారని, కొద్దిసేపటికే పోలీసులు వచ్చారని వివరించారు. -
సునంద హత్యకేసు:'నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి'
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అంతర అవయవాల నమూనాలను పరీక్షల నిమిత్తం ఏ దేశం పంపాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రెండు రోజుల్లో నిర్ణయిస్తుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సునందది అసహజ మరణమని ఎయిమ్స్ ఆస్పత్రి ఇచ్చిన నివేదిక ఆధారంగా జనవరి 1న ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యకేసుగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్ఐఆర్)ను నమోదు చేసేందుకు సునంద అంతర అవయవాల నమూనాలను ల్యాబ్‌లో పరీక్షల నిమిత్తం అమెరికా లేదా ఇంగ్లండ్‌కు పంపుతామని జనవరి 6న బస్సీ చెప్పారు. అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేమన్నారు. శశి థరూర్‌ను ఎప్పుడు విచారించాలో సిట్ నిర్ణయిస్తుందని బస్సీ స్పష్టంచేశారు. ఈ కేసు విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటో త్వర లోనే తెలుస్తాయని ఆయన అన్నారు. -
సునందను చంపిందెవరో థరూర్‌కు తెలుసు!
బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మరో బాంబు పేల్చారు. సునందా పుష్కర్‌ను చంపిందెవరో ఆమె భర్త, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్‌కు తెలుసని.. ఆయన నోరు విప్పాలని అన్నారు. సునందా పుష్కర్‌ను శశిథరూర్ చంపారని తాను ఏనాడూ చెప్పలేదని స్వామి గుర్తు చేశారు. ఐపీఎల్ సహా అనేక విషయాలను థరూర్ మరుగుపరుస్తున్నారని ఆరోపించారు. థరూర్‌ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తే మొత్తం విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని సుబ్రమణ్యం స్వామి చెప్పారు. -
థరూర్‌ను త్వరలోనే ప్రశ్నిస్తాం
సునందా పుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను త్వరలోనే ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. థరూర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, తమ సిట్ బృందం ఈ కేసు దర్యాప్తు సంగతి చూస్తోందని ఆయన అన్నారు. వాళ్లకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు త్వరలోనే థరూర్‌ను విచారణకు పిలుస్తారని చెప్పారు. కేరళలో కొంతకాలం పాటు ఆయుర్వేద చికిత్స పొందిన శశి థరూర్.. ఆదివారమే తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్ మధ్య గొడవకు కారణమని చెబుతున్న పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్‌ను కూడా అవసరమైతే ప్రశ్నిస్తామని కమిషనర్ బస్సి చెప్పారు. -
దుబాయ్‌లో థరూర్, తరార్.. ఏమిటీ తకరార్?
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వివాహేతర సంబంధాల గురించి ఆయన భార్య సునంద్ పుష్కర్ తీవ్రంగా కలత చెందేవారని ప్రముఖ జర్నలిస్టు నళినీ సింగ్ చెప్పారు. సునంద మరణించేముందు... శశి థరూర్, పాకిస్థాన్ జర్నలిస్టు మెహ్ర్ తరార్‌ల మధ్య సంబంధాల గురించి ఆందోళన చెందారని నళిని తెలిపారు. 2013 జూన్‌లో థరూర్, తరార్ కలసి దుబాయ్‌లో మూడు రాత్రులు ఉన్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సునంద చెప్పారని నళిని వెల్లడించారు. శశి థరూర్ విడాకులు ఇస్తారని సునంద భయపడ్డారని నళిని చెప్పారు. గతేడాది జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద మరణించారు. సునంద స్నేహితురాలైన నళిని మూడు రోజుల తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. సునంద చనిపోవడానికి ముందు రోజు తనకు ఫోన్ చేసిందని.. థరూర్, తరార్ పరస్పరం రొమాంటిక్ మెసేజ్‌లు పెట్టడం సునంద గుర్తించారని నళిని చెప్పారు. ఐపీఎల్లో థరూర్ అక్రమాల గురించి కూడా సునంద తనకు చెప్పినట్టు తెలిపారు. సునంద బ్లాక్‌బెర్రి మొబైల్ ఫోన్ నుంచి బీబీఎం మెసేజ్‌లను థరూర్ తొలగించారని, వాటిని మళ్లీ పొందేందుకు సాయం చేయాల్సిందిగా తనను కోరిందని వెల్లడించారు. శశి థరూర్‌కు అంతకుముందు మరో మహిళతో కూడా సంబంధం ఉన్నట్టు సునంద తెలిపారని నళిని చెప్పారు. శశి థరూర్ వివాహేతర సంబంధాలు, ఐపీఎల్ అక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడం.. ఈ నేపథ్యంలో సునంద హత్యకు గురికావడం అనేక సందేహాలకు తావిస్తోంది. వాస్తవం ఏమిటన్నది పోలీసుల విచారణలో వెల్లడికావాల్సివుంది. ఆదివారం శశి థరూర్ కేరళ నుంచి ఢిల్లీ వచ్చారు. సునంద హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను ఎప్పుడు విచారిస్తారన్న విషయం తెలియరాలేదు. కాగా నళిని ఆరోపణలను తరార్ ఖండించారు. సునంద హత్య కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. -
సునంద పుష్కర్ మృతి కేసులో కొత్తకోణం!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసుకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె మరణానికి ఐపీఎల్(ఇండియన్ ప్రిమీయర్ లీగ్) మాఫియా కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌లో గొడవ, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో థరూర్‌కు చెంప దెబ్బ వెనకాల మరో మహిళ ప్రస్తావన ఐపీఎల్ కోణాన్ని తెర ముందుకు తెచ్చాయి. చివరగా ఫోన్లో మీ చాప్టర్ క్లోజ్ అంటూ సునంద థరూర్‌కు ఇచ్చిన వార్నింగ్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. సునంద ఆకస్మిక మరణం వెనకాల ఐపీఎల్ మాఫియా హస్తం వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సునంద మృతికి ముందు సునీల్ సాహెబ్ అనే వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు వారింట్లో పనివాడు నారాయణ్ చెప్పడంతో పోలీసుల విచారణ అటువైపు మళ్లింది. ఫ్యామిలీ ఫ్రెండ్, సునంద వ్యాపార మిత్రుడు సునీల్ త్రక్రు ఇంటరాగేషన్‌లో ఐపీఎల్ కోణం వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ఇంటరాగేషన్‌లో మరో మహిళ కేటీ ప్రస్తావన వచ్చింది. కేటీ గురించి దుబాయ్‌లో సునంద, థరూర్ ఇద్దరు గొడవ పడ్డారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తరువాత థరూర్‌తో కలిసి లోఢి ఎస్టేట్‌లోని తమ ఇంటికి వెళ్లేందుకు సునంద ఇష్ట పడలేదు. కోపంతో థరూర్‌ను చెంప దెబ్బ కూడా కొట్టింది. సునీల్ త్రక్రుని పిలిచి అతని కారులో హోటల్ లీలాకు సునంద వెళ్లింది. కాసేపటికి థరూర్ ఫోన్‌తో కొన్ని ట్వీట్లు చేయడంతో పాటు కొన్నింటిని కాపీ చేసింది. సునీల్ ఫోన్‌తో పాటు జాకడ్ అనే మరో వ్యక్తి ఫోన్ నుండి కూడా సునంద ట్వీట్లు చేసింది. ఆ తర్వాత థరూర్‌కు ఫోన్ చేసి 'మీడియాకు అంతా చెప్పేశాను, మీ చాప్టర్ క్లోజ్' అంటూ చెప్పినట్లు పనివాడు నారాయణ్ పోలీసులకు తెలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఐపీఎల్ మాఫియా కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు మొదలైంది. -
శశిథరూర్‌ను ఇప్పుడు ప్రశ్నించం
ముందు మిగతా వారందరినీ విచారిస్తాం: పోలీసులు న్యూఢిల్లీ: సునందపుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ప్రస్తుతానికి ప్రశ్నించబోమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. తొలుత.. ఈ కేసుకు సంబంధించిన ఇతర వ్యక్తులందరనీ విచారించటంతో పాటు, లభ్యమైన సాక్ష్యాధారాలను పరిశీలిస్తామని చెప్పారు. సునంద అనుమానాస్పద మరణానికి ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంటుతో సంబంధం ఉండొచ్చన్న వార్తా కథనాలను ప్రస్తావించగా.. తమకు ఇంతవరకూ అటువంటి కోణమేదీ తారసిల్లలేదని పోలీసులు బదులిచ్చారు. కొత్తగా చెప్పటానికేం లేదు: థరూర్ సునందపుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు తీరుపై శుక్రవారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన శశిథరూర్.. ఈ విషయంలో తాను కొత్తగా చెప్పేదేమీ లేదని శనివారం వ్యాఖ్యానించారు. ఆయన కొచ్చి పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈ కేసు విషయాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. -
'ఉదయం 4 గంటల వరకు కొట్టుకున్నారు'
కేంద్ర మాజీమంత్రి శశి థరూర్.. ఆయన దివంగత భార్య సునందా పుష్కర్ మధ్య గొడవలు జరిగేవని అందరికీ తెలుసు. వాటి కారణంగానే ఆమె మరణించారని కూడా తెలుసు. అయితే.. వాళ్లు ఆ ముందురోజు రాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొట్టుకున్నారని వాళ్ల ఇంట్లో పనిమనిషిగా చేసే నారాయణ్ సింగ్ చెప్పాడు. కేటీ అనే మహిళ పేరు ఆ గొడవలో తరచు వినిపించిందని కూడా అతడు తెలిపాడు. సునందాపుష్కర్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన రోజున.. థరూర్ దంపతులు ఇంట్లో కాకుండా, ప్రభుత్వం కేటాయించే అధికార నివాసంలో కాకుండా.. లీలాప్యాలెస్ అనే హోటల్లో వాళ్లు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు శశి థరూర్ వెళ్లిన తర్వాత అదే రోజు.. అంటే జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పొలోనియం 210 లాంటి విషపదార్థం కారణంగా ఆమె హత్యకు గురయ్యారని ఎయిమ్స్ వైద్యులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపైనే థరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది. -
సునంద.. శశిథరూర్.. మధ్య ఓ మహిళ!
కేంద్ర మాజీమంత్రి శశి థరూర్.. ఆయన భార్య సునందా పుష్కర్ మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? వాళ్లిద్దరి మధ్య మూడో మహిళ ఎవరైనా ఉన్నారా? ఈ వాదనలు క్రమంగా బలపడుతున్నాయి. కేటీ అనే ఓ మహిళ కారణంగానే దంపతులిద్దరూ గొడవ పడ్డారని థరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ విచారణ సందర్భంగా పోలీసులకు వెల్లడించాడని సమాచారం. అయితే.. కేటీ ఎవరో, ఏమిటోనన్న విషయం మాత్రం ఇంతవరకు ఇంకా తెలియడంలేదు. కేటీ గురించి దుబాయ్‌లో సునంద, థరూర్ లిద్దరు గొడవపడ్డారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాక థరూర్‌తో కలిసి లోదీ ఎస్టేట్‌లోని తమ ఇంటికి వెళ్లేందుకు సునంద ఇష్టపడలేదు. కోపంతో థరూర్‌ను చెంపదెబ్బ కూడా కొట్టింది. అసిస్టెంట్ సునీల్ తక్రుని పిలిచి అతని కారులో హోటల్ లీలా ప్యాలెస్‌కు సునంద వెళ్లింది. కాసేపటికి థరూర్ కొన్ని ట్వీట్లు చేయడంతో వాటిని కాపీచేసింది. సునీల్ ఫోన్‌తో పాటు జాకడ్ అనే మరో వ్యక్తి ఫోన్ నుంచి కూడా సునంద ట్వీట్లు చేసింది. ఆ తర్వాత థరూర్‌కు ఫోన్ చేసి 'మీడియాకు అంతా చెప్పేశాను, మీ చాప్టర్ క్లోజ్' అంటూ చెప్పినట్టు పనివాడు నారాయణ్ పోలీసులకు తెలిపాడట. సునంద మరణించిన అతి తక్కువ కాలానికే లీలా ప్యాలెస్ హోటల్ నుంచి వెళ్లిపోయిన ఓ ఉద్యోగిని.. అక్కడ ఇప్పటికీ పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను కూడా సునంద హత్యకేసులో విచారించనున్నారు. వాళ్లతో పాటు సంజయ్ దేవన్ అనే కుటుంబ స్నేహితుడు ఒకరిని కూడా పోలీసులు విచారిస్తారు. జనవరి 17వ తేదీ సాయంత్రం సునంద ఎంతకీ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో వెంటనే డాక్టర్లను పిలవాల్సిందిగా హోటల్ మేనేజర్‌కు చెప్పింది ఆయనే. మరోవైపు.. ఐపీఎల్ మాఫియానే సునంద మృతికి కారణమని కూడా అంటున్నారు. సునంద మృతికి ముందు సునీల్ సాహెబ్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు వారింట్లో పనివాడు నారాయణ్ చెప్పడంతో అటువైపు పోలీసుల విచారణ మళ్లింది. -
సునంద హత్య కేసులో స్నేహితుడి విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సునందా పుష్కర్ హత్య కేసులో పోలీసులు ఆమె స్నేహితుడు, వ్యాపరవేత్త సునీల్ ట్రక్రును విచారించారు. సునంద హత్య జరగడానికి ముందు సునీల్ ఆమెను విమానాశ్రయం నుంచి దక్షిణ ఢిల్లీలోని హోటల్ వద్ద దింపారు. అదే హోటల్లో గతేడాది జనవరి 17న సునంద మరణించారు. సునంద హత్య కేసుకు సంబంధించి శుక్రవారం సునీల్‌ను విచారించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద కేసులో పనిమనిషి నారాయణను సిట్ విచారించింది. నారాయణ్ ...సిట్ విచారణలో చెప్పిన వివరాల మేరకు సునీల్‌ను విచారించారు. ఈ కేసులో సునంద భర్త శశి థరూర్‌తో పాటు మరో 11 మందిని విచారించినున్నట్టు పో్లీసులు చెప్పారు. -
సునంద కేసు విచారణపై అనుమానాలు
తన భార్య సునందా పుష్కర్ మృతిపై విచారణ జరిగిన తీరుమీద తనకు చాలా అనుమానాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. అసలు ఏ ఆధారాలతో పోలీసులు ఈ రకమైన నిర్ధారణకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. సునందా పుష్కర్ది హత్యేనని, సహజ మరణం కాదని ఎయిమ్స్ నిపుణులు వెల్లడించిన పోస్టుమార్టం నివేదిక వెలుగులోకి వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసు దర్యాప్తు దాదాపు ఏడాదిగా సాగుతోందని, ఇన్నాళ్లుగా తన మీద చాలా రకాల ఒత్తిళ్లు పనిచేశాయని ఆయన అన్నారు. బయటకు వచ్చి వ్యాఖ్యానించాలని తనను చాలామంది రెచ్చగొట్టినా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు తాను వచ్చి ఏదో మాట్లాడితే అది పోలీసుల దర్యాప్తును దెబ్బతీస్తుందన్న ఉద్దేశంతోనే, వారిమీద గౌరవం వల్లే ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నానన్నారు. అలాగే.. కొన్ని టీవీ ఛానళ్లు టీఆర్పీల కోసం ఈ వ్యవహారం మీద బహిరంగ చర్చలు పెట్టాయని ఆయన మీడియామీద మండిపడ్డారు. సునంద మృతితో ఆమె కుటుంబం గానీ, భర్తగా తాను గానీ చాలా బాధపడ్డామని, తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని శశి థరూర్ అన్నారు. ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో ఇప్పుడు ఈ విషయం గురించి బయటకు వచ్చి మాట్లాడక తప్పలేదన్నారు. విచారణలో పోలీసుల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదనే తాను భావించినట్లు ఆయన తెలిపారు. తన భార్య మరణించిన కొన్ని రోజులకే.. తాను స్వయంగా కేంద్ర హోం మంత్రికి లేఖ రాసి, విచారణను వేగవంతం చేయాలని కోరానన్నారు. తాను పోలీసులకు ఎప్పుడూ ఈ కేసులో సహకరిస్తూనే ఉన్నానని, మీడియా కూడా ఈ విషయంలో సంయమనం పాటించాలని తెలిపారు. కొంతైనా మానవత్వం అన్నది ఉండాలని సూచించారు. -
సునంద హత్యకేసులో తెరపైకి సునీల్ సాహెబ్!
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో 'సునీల్' అనే పేరు తెరపైకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పనిమనిషి నారాయణ్ పలు కొత్త విషయాలను వెల్లడించినట్లు సమాచారం. శశిథరూర్ ప్రవర్తనపై సునంద అసంతృప్తిగా ఉందని, వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో చాలాసార్లు ఘర్షణ జరిగినట్లు పనిమనిషి చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె తన సమస్యలను స్నేహితులతో చెప్పేదని నారాయణ్ సిట్ అధికారులకు వివరించాడు. కాగా సునంద చనిపోవటానికి రెండు రోజుల ముందు సునీల్ అనే వ్యక్తి కలిసినట్లు తెలుస్తోంది. హోటల్ లీలా ప్యాలెస్‌లో సునంద గదిలో 'సునీల్ సాహెబ్' ఉన్నట్లు నారాయణ్ ...సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే సునీల్ సాహెబ్ ఎవరు, ఎక్కడ ఉంటారనేదానిపై అతను సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం. దాంతో సునీల్‌ను విచారిస్తే కానీ అసలు విషయం వెలుగులోకి వస్తుందని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సునీల్‌ను కూడా సిట్ విచారించనుంది. అయితే అతని కోసం గాలింపును ముమ్మరం చేసింది. సునంద ట్విట్టర్ అకౌంట్‌తో పాలు ఆమె ఆన్లైన్ వ్యవహారాలను సునీల్ సాహెబ్ చూసేవాడని తెలుస్తోంది. మరోవైపు సిట్ తన విచారణలో భాగంగా సునంద మరణానికి 48 గంటల ముందు ఆమెను ఎవరెవరు కలిశారు? ఆమె శరీరంపై గాయాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఔషధాలు తీసుకునేవారా? హోటల్ గదిలో లభించిన రెండు ఆల్ప్రాక్స్ మాత్రలు, శరీరంపై సూది గుచ్చిన గాయం గురించి విచారణ చేశారు. ఈ-మెయిళ్లు, ట్వీటర్, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారా ఎవరెవరితో టచ్‌లో ఉండేవారన్నదీ అడిగారు. సునంద కేసులో తన పనిమనిషిని హింసించారంటూ థరూర్ ఫిర్యాదు చేసిన మరునాడే నారాయణను సిట్ విచారించడం గమనార్హం. ఇప్పటికే అతనిని పోలీసులు రెండుసార్లు విచారించారు. మరోవైపు థరూర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు సునంద మృతిచెందిన ఫైవ్‌స్టార్ హోటల్ ఉద్యోగులనూ సిట్ ప్రశ్నించనుంది. -
థరూర్ పనిమనిషిని విచారించిన సిట్
కేరళ ఆస్పత్రిలో థరూర్ న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఇంటి పనిమనిషి నారాయణ సింగ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గురువారం విచారించింది. సునంద మరణానికి 48 గంటల ముందు ఆమెను ఎవరెవరు కలిశారు? ఆమె శరీరంపై గాయాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను సిట్ అడిగింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఔషధాలు తీసుకునేవారా? హోటల్ గదిలో లభించిన రెండు ఆల్ప్రాక్స్ మాత్రలు, శరీరంపై సూది గుచ్చిన గాయం గురించి ప్రశ్నించారు. ఈ-మెయిళ్లు, ట్వీటర్, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారా ఎవరెవరితో టచ్‌లో ఉండేవారన్నదీ అడిగారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న నారాయణ సిట్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చారు. అతడిని పోలీసులు ఇంతకుముందే రెండుసార్లు విచారించారు. సునంద కేసులో తన పనిమనిషిని హింసించారంటూ థరూర్ ఫిర్యాదు చేసిన మరునాడే నారాయణను సిట్ విచారించడం గమనార్హం. థరూర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు సునంద మృతిచెందిన ఫైవ్‌స్టార్ హోటల్ ఉద్యోగులనూ సిట్ ప్రశ్నించనుంది. కాగా, సునంద మృతిపై హత్యకేసు నమోదు నేపథ్యంలో థరూర్ మీడియాకు దూరంగా గడుపుతున్నారు. కేరళలోని గురువాయూర్‌లో ఓ ఆయుర్వేదిక్ రిసార్టులో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. -
'శశిథరూర్ విచారణకు హాజరు కండి'
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీలైనంత త్వరగా విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. శశిథరూర్‌తో సహా ఆయన బంధువులను పోలీసులు నోటీసులు పంపించారు. సునంద పుష్కర్ కేసు దర్యాప్తునకు నలుగురితో కూడిన బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. కాగా శశిథరూర్ ప్రస్తుతం అనారోగ్యంతో కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేరళకు పయనం అయ్యారు. అలాగే సునంద పుష్కర్‌కు చికిత్స చేసిన వైద్యులను సిట్ అధికారులు విచారించనున్నారు. కాగా తన భార్య సునందా పుష్కర్ హత్యకేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని శశి థరూర్ ఆరోపించారు. సునందది హత్య అన్న విషయం ఇంకా వెలుగులోకి రాకముందే.. అంటే నవంబర్ 12వ తేదీనే ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సికి ఆయన ఓ లేఖ రాశారు. ఢిల్లీ పోలీసులు తరచు తన ఇంట్లో పనిచేసే మనిషి నారాయణ్ సింగ్‌ను శారీరకంగా హింసించి, భయపెట్టి, ఈ హత్య తామిద్దరం కలిసి చేసినట్లుగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అక్రమమని థరూర్ అన్నారు. ఈ లేఖపై బస్సీ మాట్లాడుతూ శశి థరూర్ ఆరోపణలపై విచారణ జరుపుతామని తెలిపారు. -
మిసెస్ సునంద డైరీ
-
డెత్ మిస్టరీ
-
మా పనిమనిషిని హింసించారు!
-
మా పనిమనిషిని హింసించారు!
నేరం ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెట్టారు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు గత నవంబర్‌లో శశథరూర్ లేఖ సునంద పుష్కర్ హత్య కేసు దర్యాప్తు ప్రారంభించిన సిట్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతికి సంబంధించి కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. సునంద హత్య కేసు విచారణ సందర్భంగా తన ఇంటి పనిమనిషి నారాయణ్ సింగ్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ థరూర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి గత సంవత్సరం నవంబర్ 12న రాసిన లేఖ ఒకటి బుధవారం మీడియాకు లభించింది. విచారణ సమయంలో పోలీసు అధికారుల్లో ఒకరు నారాయణ్ సింగ్‌ను శారీరకంగా హింసించి, భయపెట్టి సునంద పుష్కర్‌ను తన యజమాని(శశిథరూర్), తాను కలిసి హత్య చేసినట్లు ఒప్పుకోవాలంటూ బలవంతపెట్టారని ఆ లేఖలో థరూర్ ఆరోపించారు. ‘నవంబర్ 7న నలుగురు పోలీసు అధికారులు 16 గంటల పాటు, ఆ మర్నాడు 14 గంటల పాటు మా పనిమనిషి నారాయణ్ సింగ్‌ను విచారించారు. ఆ సమయంలో ఆ అధికారుల్లో ఒకరు నేరాన్ని ఒప్పుకోవాలంటూ పదేపదే నారాయణ్‌ను శారీరకంగా దారుణంగా హింసించారు’ అని ఆ లేఖలో థరూర్ పేర్కొన్నారు. కాగా, సునందది హత్యేనని నమ్మేందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని బుధవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. సునందకేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసి, పని ప్రారంభించిందని వెల్లడించారు. థరూర్‌ను ప్రశ్నించే అవకాశాలను బస్సీ కాదనలేదు. మృతి చెందిన సంవత్సరం తరువాత హత్య కేసు నమోదు చేయడంపై స్పందిస్తూ.. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం అందించిన తుది నివేదిక ఆధారంగా ఇప్పుడు హత్య కేసు నమోదు చేశామని, తదుపరి పరీక్షలకు ఆమె శాంపిల్స్‌ను విదేశాలకు పంపేందుకు కేసునమోదు అవసరమన్నారు. తన పనిమనిషిని హింసించారన్న థరూర్ ఆరోపణలపై వివరణ ఇస్తూ.. వాటిని పరిశీలిస్తామన్నారు. కాగా, సునంద విష ప్రభావంతో మరణించారని మాత్రమే తమ ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నామని, అది హత్య అయ్యే అవకాశం గురించి సమాచారం ఇవ్వలేదని ఎయిమ్స్ మెడికల్ బోర్డు చీఫ్ సుధీర్ గుప్తా పేర్కొన్నారు. థరూర్‌ను, ఆయన బంధువులను సిట్ విచారించే అవకాశముందని సమాచారం. సునంద చనిపోవడానికి 3రోజుల ముందుచికిత్స పొందిన తిరువనంతపురం ఆస్పత్రిలోనూ విచారణ జరిపి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతున్నారని, వారికి తాము ఆదేశాలివ్వలేదని కేంద్రం తెలిపింది. -
హత్యకేసులో నన్ను ఇరికించే కుట్ర: థరూర్
తన భార్య సునందా పుష్కర్ హత్యకేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. సునందది హత్య అన్న విషయం ఇంకా వెలుగులోకి రాకముందే.. అంటే నవంబర్ 12వ తేదీనే ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సికి ఆయన ఓ లేఖ రాశారు. ఢిల్లీ పోలీసులు తరచు తన ఇంట్లో పనిచేసే మనిషి నారాయణ్ సింగ్‌ను శారీరకంగా హింసించి, భయపెట్టి, ఈ హత్య తామిద్దరం కలిసి చేసినట్లుగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అక్రమమని థరూర్ అన్నారు. కేసు విచారణలో తాను, తన సిబ్బంది ఎప్పుడూ పోలీసులకు సహకరిస్తూనే ఉన్నామని చెప్పారు. నవంబర్ 7, 8 తేదీల్లో నారాయణ్ సింగ్‌ను మొత్తం 30 గంటల పాటు విచారించారని, ఆ సందర్భంగా ఓ అధికారి అతడిని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. నిర్దోషిని శారీరకంగా హింసించి ఎలాగోలా హత్యారోపణలు నిరూపించాలన్నదే వారి ఉద్దేశంలా కనపడుతోందని థరూర్ అన్నారు. సదరు పోలీసు అధికారిపై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 51 ఏళ్ల సునందా పుష్కర్ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో గత సంవత్సరం జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మరణించడం, దాన్ని హత్య అని ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదిక నిర్ధారించడంతో కేసును కూడా హత్యకేసుగా మార్చడం తెలిసిందే. -
ఏ రకం విషం.. ఎలాంటి ప్రభావం!
న్యూడిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ది హత్యేనని, ఆమెపై విషప్రయోగం జరగడంతోనే మరణించారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. ఏయే రకాల విషపదార్థాలు మానవ శరీరం మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో.. వాటివల్ల ఏమవుతుందో కూడా వైద్య నివేదికలో వెల్లడించారు. అవేంటో ఒక్కసారి చూద్దాం... థాలియం దీన్ని శరీరంలోని ద్రావణాల నుంచి వేరుచేయడం కష్టం. సాధారణంగా ఇది సోడియం, పోటాషియం లక్షణాలను కలిగి ఉంటుంది. పోలోనియం 210 ఇది అరుదైన, అత్యంత రేడియోధార్మిక పదార్థం. దీనిని గుర్తించడం చాలా కష్టం. దీనిని చాలాతక్కువ మోతాదులో పౌడర్ రూపంలో లేదా ఏదైనా ద్రవపదార్థంలో కలిపి ఇచ్చినా అది ప్రాణాంతకమే అవుతుంది. నీరియం ఆలెండర్ (గన్నేరు) ఇది ఓలెన్రిన్ గ్లైకోసైడ్లను కలిగి ఉంటుంది. దీనిని ఇమ్యునో అస్సే పద్ధతి ద్వారా గుర్తించవచ్చు. పాము విషం ఇది చాలా త్వరగా అంతర్థానమైపోతుంది కాబట్టి రసాయన పరీక్షల ద్వారా దీనిని గుర్తించడం సాధ్యంకాదు. విష ప్రయోగం జరగలేదని టాక్సికాలజిస్టులు చెబితే అది పాము విషం కాకుండా ఇతర విషాలు లేవని మాత్రమే అర్థం. ఈ విషం ఓ ప్రొటీన్ కావడం వల్ల శరీరంలోని కణజాలాల నుంచి దీన్ని వేరుచేయడం సాధ్యం కాదు. ఫొటోలబైల్ పాయిజన్స్ 1. ఎర్గాట్ ఆల్కాయిడ్స్, ఫెనోథియాజైన్స్, లైసర్ గైడ్లు.. ఇవి చాలా సున్నితమైనవి. వెలుతురులో అవి కుళ్లిపోతాయి, అప్పడు వాటిని గుర్తించడం సాధ్యంకాదు. 2. హెరాయిన్: ఇది నీటితో కలిస్తే మోనోఎసిటైల్ మార్ఫిన్, మార్ఫిన్‌గా మారిపోతుంది కాబట్టి గుర్తించడం చాలా కష్టం. -
'శశి థరూర్‌ను కూడా విచారించవచ్చు'
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్యకేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్‌ను విచారించే అవకాశం ఉందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కాగా సునంద హత్యకేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ బుధవారం నుంచే రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని బస్సీ బుధవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. థరూర్‌ను కూడా ప్రశ్నిస్తారా? అని మీడియా ప్రశ్నించగా..అవసరమైతే తప్పదు... ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నిస్తామని తెలిపారు. కాగా ఈ కేసును మొదటి నుంచీ దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సునంద పుషర్క్ది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో.. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు. -
షాక్ తిన్నాను: శశి థరూర్
న్యూఢిల్లీ/తిరువనంతపురం: తన భార్య సునందది హత్య అంటూ ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేయడంపై దిగ్భ్రాంతికి గురయ్యానని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఈ నిర్ధారణకు వచ్చారనే సమాచారం కావాలని దర్యాప్తు అధికారులను కోరారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికల కాపీలను ఇవ్పటివరకు తనకు ఇవ్వలేదని, ఇప్పుడైనా వాటిని తక్షణమే తనకందించాలని పోలీసులను అభ్యర్థించారు. ‘నా భార్య సునంద మృతిపై నాకెలాంటి అనుమానాలు లేవు. అయినా, ఎలాంటి ముసుగులు లేని నికార్సైన నిజం వెల్లడయ్యేలా సమగ్ర దర్యాప్తు జరగాలి. అందుకు కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను’ అని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై ఇంకా ఎవరేమన్నారంటే.. దోషులను త్వరగా శిక్షించాలి ‘సునంద మృతిపై హత్య కేసు నమోదు చేయడంతో గందరగోళానికి తెరపడింది. దర్యాప్తు త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడాలి’ - బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు హత్యో, ఆత్మహత్యో ఇంకా తేలలేదు ‘చనిపోయిన ఏడాది తర్వాత హత్యకేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. హత్యో లేక ఆత్మహత్యో ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు ప్రక్రియలో ఇది ప్రారంభం మాత్రమే. ముగింపు కాదు. దీన్ని సంచలనాత్మకం చేయాల్సిన అవసరం లేదు’ - కాంగ్రెస్ పతినిధి అభిషేక్ సింఘ్వీ థరూర్ రాజీనామా చేయాలి: కేరళ ప్రతిపక్షం సునందది హత్యేనని పోలీసులు తేల్చిన నేపథ్యంలో తన లోక్‌సభ సభ్యత్వానికి శశిథరూర్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం, బీజేపీలు డిమాండ్ చేశాయి. థరూర్‌ను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశించాలి. 2014 ఎన్నికల్లో ఆయనను పోటీలో నిలిపినందుకు ఆ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని సీపీఎం సీనియర్ నేత, కేరళ ప్రతిపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు. బీజేపీ కేరళ రాష్ట్ర శాఖ కూడా థరూర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. -
పిసరంత పొలోనియం.. ప్రాణాలు తీస్తుంది
సాక్షి, హైదరాబాద్: అత్యంత అరుదైన రేడియోధార్మిక మూలకమిది. భూమి లోపలి పొరల్లో అతికొద్ది మోతాదుల్లో సహజసిద్ధంగా ఏర్పడే ఈ పదార్థాన్ని 1898లో మేరీ, పియరీ క్యూరీ దంపతులు కనుగొన్నారు. అణు రియాక్టర్లలోనూ దీన్ని కృత్రిమంగా తయారు చేయవచ్చు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ(ప్లాస్టిక్ కాగితాన్ని నలిపినప్పుడు దాని ఉపరితలంపై ఏర్పడే విద్యుత్తు లాంటిది)ని తొలగించే పరికరాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. దుష్ర్పభావం ఇలా... పొలోనియం-210 అతిచిన్న మోతా దుల్లో కూడా అత్యంత ప్రమాదకరం. గ్రాము కంటే తక్కువ మోతాదుతోనూ మనిషి ప్రాణాలు తీయవచ్చు. ఇది ఒకసారి రక్తంలోకి చేరితే దాని ప్రభావాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. అందులోని ఆల్ఫా కణాలు కాలేయంతోపాటు కిడ్నీ, ఎముక మజ్జలపై దాడి చేసి పనిచేయకుండా చేస్తాయి. ఫలితంగా కొద్ది రోజుల్లో లేదంటే వారాల్లోపు మరణం సంభవిస్తుంది. రేడియోధార్మిక కణాలు శరీరంలోకి చేరినప్పుడు అవి చర్మం ద్వారా బయటకొచ్చే అవకాశముంది. కానీ పొలోనియం-210లోని ఆల్ఫా కణాలు పెద్దవిగా ఉండటం వల్ల లోపలే ఉండిపోతాయి. గాజు పరికరాల్లో ఉంచితే రేడియోధార్మిక డిటెక్టర్లు కూడా గుర్తుపట్టలేవు. శరీరంలోకి చేరిన విషంలో 50 నుంచి 90 శాతం మలమూత్రాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మిగిలిన కొద్ది మోతాదులో సగం ముందుగా రక్తంలోకి ఆ తర్వాత ప్లీహం, మూత్రపిండాలు, కాలేయాల్లోకి చేరుతుంది. పది శాతం పొలోనియం ఎముక మజ్జలో పేరుకుపోతుంది. రక్తంలోకి చేరిన పొలోనియం శరీరం మొత్తం ప్రయాణిస్తూ ఎర్రరక్త కణాలను చంపేయడం మొదలుపెడుతుంది. రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. ఆయా అవయవాలు విఫలం కావడంతోపాటు వికారం, తలనొప్పి, విరేచనాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రభావం కేన్సర్ చివరి దశను పోలి ఉంటుంది. దీనితో ఎవరైనా మరణించారా? 2006లో రష్యా గూఢచారి అలెగ్జాండర్ లెథ్వింకో మరణంతో పొలోనియం విష ప్రయోగంపై విసృ్తత చర్చ మొదలైంది. అంతకుముందు 1956లో ఇరేన్ జోలియట్ క్యూరీ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త (1935 నోబెల్ అవార్డు గ్రహీత) కూడా ఈ విష ప్రభావంతో మరణించినట్లు ఆధారాలున్నాయి. నాలుగేళ్ల క్రితం పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ మరణానికి కూడా ఇదే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. -
విషప్రయోగంతోనే సునందా పుష్కర్ మరణం
* తాజాగా హత్య కేసు నమోదు * విషప్రయోగంతో మరణం * విషాన్ని ఇంజెక్ట్ చేశారని అనుమానం * ఆ విషం రేడియోధార్మిక పొలోనియం 210? * నిర్ధారణ కోసం విదేశాలకు శాంపిల్స్ * తాజాగా హత్య కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. అది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో.. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు. న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. అది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు. సునంద మృతిచెంది సంవత్సరం గడచిన తరువాత ఈ కేసు నమోదు కావడం విశేషం. ఆమె హత్యకు గురైందని, ఈ కేసుపై దర్యాప్తు జరుపుతామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ మంగళవారం స్పష్టం చేశారు. థరూర్‌ను కూడా ప్రశ్నిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నిస్తామన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302(హత్య) సహా పలు సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ‘ఆమెకు ఎవరైనా బలవంతంగా విషాన్ని ఇచ్చారా? లేక ఆమే స్వయంగా విషాన్ని తీసుకున్నారా? అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుపుతాం’ అన్నారు. ‘ఆ విషం ఏమిటి? ఎంత మొత్తంలో తీసుకున్నారన్నది నిర్ధారణ కాలేదు. కానీ విషాన్ని ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేసి ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు’ అని చెప్పారు. ఆ విషం ఏమిటనేది తెలుసుకోవడానికి ఆమె అవయవ భాగాలను విదేశాలకు పంపి పరీక్ష చేయించాల్సి ఉందన్నారు. కాగా, ఈ కేసును మొదటి నుంచీ దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అది పొలోనియం 210? సునంద మృతికి కారణమైన విష పదార్థం భారతీయ ప్రయోగ శాలల్లో గుర్తించలేని రేడియోధార్మిక ఐసోటోప్ అయ్యే అవకాశమున్న దృష్ట్యా ఆమె శరీర అంతర్భాగాలను అమెరికాలోని ఎఫ్‌బీఐ ప్రయోగశాలకు కానీ, బ్రిటన్‌కు కానీ పంపించనున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు, అది పొలోనియం 210 అనే అత్యంత విషపూరిత రేడియోధార్మిక ఐసోటోప్ అని పోలీసులు అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ఆ విషపదార్థం.. థాలియం, పొలోనియం 210, నెరియం ఒలియాండర్, పాము విషం, హెరాయిన్లలో ఒకటై ఉండొచ్చని ఎయిమ్స్ ఫారెన్సిక్ విభాగం అందించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపాయి. అల్ప్రాక్స్ ఓవర్డోస్తో కాదు..! సునంద మరణంపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం డిసెంబర్ 29న ఢిల్లీ పోలీసులకు మరో నివేదికను సమర్పించింది. సునంద విషప్రభావంతో మరణించారని, డిప్రెషన్‌ను తట్టుకోవడం కోసం వాడే అల్ప్రాక్స్ మాత్రల ఓవర్‌డోస్ వల్ల కాదని అందులో పేర్కొన్నారు. కాగా, సునందది ఆత్మహత్య కాదని, విషమిచ్చి హత్య చేశారని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. కాగా, సునంద మరణం కేసుపై ఢిల్లీ పోలీసులు ఇటీవలే మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మరణించిన హోటల్ గదిని తనఖీ చేయడంతో పాటు హోటల్ సిబ్బందిని, శశిథ రూర్ వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించారు. సునంద వాడిన మూడు మొబైల్ ఫోన్లను, లాప్‌టాప్‌ను పరిశీలిస్తున్నారు. ఆమె మరణం తరువాత ఈ పరికరాల నుంచి ఏదైనా సమాచారాన్ని తొలగించారా అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. ఇంజెక్షన్ గుర్తులు.. పంటిగాట్లు! సునంద మరణం తరువాత ఫోరెన్సిక్ వైద్యులు విడుదల చేసిన మొదటి నివేదికలో ఆమె డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల చనిపోయారని, ఆమె శరీరంపై 12 గాయాల గుర్తులున్నాయని పేర్కొన్నారు. అనంతర అటాప్సీ నివేదికలో మరణానికి కారణం విషమేనని, గాయాల గుర్తులు 15 అని, వాటిలో ఒకటి ఇంజెక్షన్ ఇచ్చిన గుర్తు, మరొకటి పన్నుగాటుగా వెల్లడించారు. అనంతరం సునందది సహజమరణమని నివేదిక ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి సుధీర్ కుమార్ గుప్తా ఆరోపించారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. పాక్ జర్నలిస్ట్‌తో సాన్నిహిత్యంపై గొడవ గత ఏడాది జనవరి 17న తాము బసచేసిన లీలాప్యాలెస్ హోటల్, రూమ్ నంబర్ 345లో సునంద(52) మరణించి ఉండడాన్ని చూసిన శశిథరూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందు, శశిథరూర్‌కు, సునందకు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయని, వారు తరచూ గొడవపడుతున్నారని వార్తలు వచ్చా యి. దాంతో సునందా మృతి అనుమానాస్పదం గా మారింది. అలాగే, మరణించడానికి రెండు రోజుల ముందు ఆమె మెహర్ తరార్ అనే పాకిస్తానీ పాత్రికేయురాలితో ట్వీటర్లో గొడవ పడ్డా రు. ఆ జర్నలిస్ట్ శశిథరూర్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు అప్పుడు సునంద ఆరోపిం చారు. అయితే, సునంద మరణానికి ఒకరోజు ముందే తామిద్దరి మధ్య విభేదాలేం లేవ ని, సంతోషంగా ఉన్నామని థరూర్, సునందలు సంయు క్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
సునంద హంతకులెవరు?
సంపాదకీయం ఏడాది కాలంగా సంచలనం కలిగిస్తున్న సునందా పుష్కర్ మృతి కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సునందపై విషప్రయోగం జరిపి ఎవరో ఆమెను హతమార్చారని ఢిల్లీ పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఆమెను అత్యంత ప్రమాదకరమైన ప్లుటోనియం- 210 అనే రేడియోథార్మిక పదార్థాన్ని వినియోగించి హతమార్చి ఉండొచ్చని ఫోరెన్సిక్ నివేదిక అభిప్రాయపడ్డాక పోలీసులు దీన్ని హత్య కేసుగా మార్చారు. సునంద ఎవరో సాధారణ గృహిణి అయితే బహుశా ఆమె మరణం చుట్టూ ఇన్ని రకాల కథనాలు అల్లుకునేవి కాదు. ఆమె ఆనాటి కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి గనుకా, మరణానికి ముందు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గనుకా ఈ అనుమానాస్పద మృతి కేసు ఎన్నో మలుపులు తిరిగింది. సునంద హోదా, పలుకుబడి ఆమెను కాపాడలేకపోయాయి సరిగదా...కనీసం మరణించాకైనా అందుకు గల కారణాలేమిటో చకచకా ఆరా తీయడానికి అక్కరకు రాలేకపోయాయి. చానెళ్లు, సామాజిక నెట్‌వర్క్‌ల ప్రాచుర్యం తర్వాత మన దేశంలో బాగా వాడుక లోకొచ్చిన పదం ‘సెలబ్రిటీ’. ఏ వ్యక్తిపైన అయినా ఇలాంటి ముద్ర పడ్డాక అది ఏకకాలంలో వారికి వరమూ, శాపమూ కూడా. ఆ ముద్రపడిన వ్యక్తి మహిళ అయితే ఎక్కువ సందర్భాల్లో అది శాపమే అవుతుంది. సునందా పుష్కర్ 2010కి ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. జమ్మూకు చెందిన ఒక సైనికాధికారి కుమార్తెగా... దుబాయ్‌లో ఒక స్పా నిర్వాహకురాలిగా... అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి చెందిన సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నంతకాలమూ సునంద గురించి ఎవరికీ పట్టలేదు. కానీ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలో వచ్చిన పెను వివాదంలో ఆనాటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్‌తోపాటు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాక, అప్పటికి వారిద్దరూ స్నేహితులు మాత్రమే అయినందువల్లా అది ఎన్నెన్నో మలుపులు తీసుకుంది. శశిథరూర్‌తో పెళ్లయిన తర్వాత కూడా ఆమె తరచు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. శశి భార్యగానే కాక వ్యక్తిగతంగా కూడా ఆమెకు సెలబ్రిటీ స్థాయి వచ్చింది. వీటన్నిటికీ తోడు ఆమె చనిపోవడానికి రెండు రోజులముందు రేపిన దుమారం సామాన్యమైనది కాదు. శశి థరూర్‌కు పాకిస్థాన్‌కు చెందిన మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉన్నదంటూ ట్విటర్లో సునంద ఆరోపించారు. తమ వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని కూడా అన్నారు. మెహర్ తరార్ ఐఎస్ఐ ఏజెంటని కూడా అభియోగం మోపారు. దీన్నుంచి బయటపడటం కోసం తన ట్విటర్ ఖాతాను ఎవరో తెరచి ఇలాంటి వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారని శశిథరూర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా సునంద వదల్లేదు. ఆయన ఖాతాను ఎవరూ హ్యాక్ చేయలేదని, తానే ఆ వ్యాఖ్యలను పోస్టు చేశానని బదులిచ్చారు. ఇదంతా అయ్యాక ఇద్దరిమధ్యా రాజీ కుదిరింది. తమ వైవాహిక జీవి తం సంతోషంగా ఉన్నదంటూ దంపతులిద్దరూ సంయుక్త ప్రకటన విడుదలచేశారు. అక్కడితో ఈ మొత్తం వివాదం పరిసమాప్తమైంది. అందరూ అలాగే అనుకున్నారు. బహుశా సునంద కూడా అలాగే అనుకుని ఉంటారు. దేశ రాజధానీ నగరంలోని ఏడు నక్షత్రాల హోటల్లో బసచేసి ఉన్నప్పుడు తాను అత్యంత సురక్షితమైన ప్రాంతంలో ఉన్నానని భావించి ఉంటారు. కానీ కొన్ని గంటల్లోనే ఆమె విగతజీవిగా మారారు. చనిపోయిన సమయానికి హోటల్ గదిలో ఆమె ఒక్కరే ఉన్నారు. సునందది హత్యే అయితే ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఎవరు ప్రయత్నించి ఉంటారు? ఆ అవసరం ఎవరికుంటుంది? చనిపోయిన వ్యక్తి ప్రముఖురాలే గాక, కేంద్ర మంత్రి సతీమణి కూడా అయినందువల్ల ఢిల్లీ పోలీసులు చురుగ్గా దర్యాప్తు సాగించి వాస్తవాలను వెల్లడించి ఉంటే వేరుగా ఉండేది. ఇలాంటి ముఖ్యమైన కేసుల విషయంలోనైనా వారు కర్తవ్యనిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది. పోలీసుల సంగతి అలా ఉంచి...శవపరీక్ష జరిపి ఏం జరిగి ఉంటుందో చెప్పాల్సిన వైద్యులు కూడా ఆ పని సక్రమంగా నిర్వహించలేదు. మితిమీరిన వ్యాధి నిరోధక ఔషధాలు తీసుకోవడంవల్లే సునంద మరణించారని తొలుత నివేదిక వచ్చినా...అదంతా ఒత్తిళ్లతో రూపొందిన నివేదిక అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ చీఫ్ సుధీర్‌గుప్తా ఆరోపించడంతో వ్యవహారం మొదటికొచ్చింది. ఇన్నాళ్ల సమయం గడిచాక ఇప్పుడు తాజా నివేదిక సునందపై విషప్రయోగం జరిగిందన్న నిర్ధారణకొచ్చింది. అంతేకాదు...ఆమె శరీరంపై 15 గాయాలున్నాయని వెల్లడించింది. సీసీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రత ఉన్న పెద్ద హోటల్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి జరిగుంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఎటుపోయినట్టు? ఆ సాక్ష్యాలను పోలీసులు సేకరించారా? సేకరించి ఉంటే వాటిగురించి ఇంతవరకూ ఎందుకు మాట్లాడటంలేదు? ఏదైనా వ్యవహారం చుట్టూ గోప్యత పాటిస్తే అది మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. అప్పటికే ఎన్నో కుంభకోణాల్లో అది చిక్కుకుని ఉండటం, మరణానికి ముందు సునంద చేసిన ఆరోపణల స్వభావం ఈ కేసులో ఎన్నో ఊహాగానాలకు దారితీశాయి. వీటికి తోడు ఆమె మరణానికి పొలోనియం-210 కారణం కావొచ్చని అంటున్నందువల్ల ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ పదార్థాన్ని ఉపయోగించి హతమార్చిన ఉదంతాలు ప్రపంచంలో ఇప్పటికి రెండు సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. 2004లో పాలస్థీనా అధినేత యాసిర్ అరాఫత్, 2006లో కేజీబీ మాజీ ఏజెంటు లుత్వినెంకో ఇలాంటి విషప్ర యోగం వల్లనే మరణించారు. ఈ స్థాయిలో సునందను హతమార్చడానికొచ్చిన హంతకులు ఎవరో, వారి చర్య వెనకున్న కారణాలేమిటో తేల్చాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీసులపై ఉన్నది. ఈ కేసులో ఇప్పటికే అంతులేని జాప్యం జరిగింది. కనీసం ఇకనుంచి అయినా చురుగ్గా కదిలి హంతకుల ఆచూకీని కనుక్కుంటే సునందా పుష్కర్‌కు వారు న్యాయం చేసినవారవుతారు. -
సునందది హత్యేనని మాకు తెలుసు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ది హత్యేనని తాము మొదట్నుంచి చెబుతున్నామని ఆమె సమీప బంధువులు అన్నారు. సునందా పుష్కర్ హత్యకు గురైనట్టు ఢిల్లీ పోలీసులు నిర్ధారించిన తర్వాత ఆమె సమీప బంధువు అశోక్ కుమార్ స్పందించారు. సునందను హత్య చేశారని తమ కుటుంబం మొదట్నుంచి భావిస్తున్నట్టు అశోక్ కుమార్ చెప్పారు. అయితే పోలీసులే ఆలస్యంగా నిర్ధారించారని అన్నారు. శశి థరూర్ మంత్రిగా ఉన్న సమయంలో.. ఢిల్లీలోని ఓ హోటల్లో 2014 జనవరి 17న సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి కారణం ఏంటన్నది అప్పట్లో పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. -
సునందను చంపిన విషం.. పొలోనియం!
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్‌ను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు 'పొలోనియం'. ఈ విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఉంది. పొలోనియం అనేది అత్యంత విషపూరితమైన రేడియోధార్మిక పదార్థం. దీన్ని క్యూరీ దంపతులు 1898లో కనిపెట్టారు. గతంలో ఎవరికైనా విషపూరిత ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించేవారు. ఇంతకుముందు పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫత్‌ను, కేజీబీ ఏజెంటు ఒకరిని చంపడానికి కూడా ఇదే పదార్థాన్ని ఉపయోగించారు. ఒకసారి దీన్ని ఇంజెక్ట్ చేస్తే కనుక్కోవడం చాలా కష్టం. పౌడర్ రూపంలో కూడా దీన్ని ఉపయోగించేందుకు అవకాశం ఉంది. సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు శాంపిళ్లను పరీక్ష కోసం విదేశాలకు కూడా పంపారు. అక్కడే ఈ పొలోనియం వాడిన విషయం తెలిసింది. -
నా భార్య ఆస్తులేవీ తీసుకోలేదు: శశి థరూర్
తన దివంగత భార్య సునందా పుష్కర్ ఆస్తులు వేటినీ తాను తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కేరళ హైకోర్టుకు తెలిపారు. దివంగత భార్య వల్ల వచ్చిన ఆస్తులను వెల్లడించనందుకు లోక్‌సభకు ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌కు సమాధానంగా ఆయనీ వివరాలు చెప్పారు. అసలు తన భార్య కెనడా పౌరురాలని, అందువల్ల హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తులను తాను పొందే అవకాశమే లేదని శశి థరూర్ అన్నారు. సురేష్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త శశి థరూర్ మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. అసలు ఇంతవరకు సునందా పుష్కర్ స్థిర, చరాస్తులు ఏవేంటన్నవి ఇంతవరకు అంచనా వేయలేదని, అలాగే ఆమె వారసత్వ హక్కులు ఎవరికి వెళ్తాయన్నది కూడా ఇంతవరకు నిర్ధారించలేదని శశి థరూర్ కేరళ హైకోర్టుకు చెప్పారు. ఆమె జీవించి ఉండకపోవడం వల్ల మాత్రమే ఆమె ఆస్తి వివరాలను ఎక్కడా తాను అఫిడవిట్లో చెప్పలేదు తప్ప.. తనకు ఎలాంటి దురాలోచన లేదని ఆయన అన్నారు. ఆమె భారత పౌరురాలు కాకపోవడం, హిందూ వారసత్వ చట్టం కూడా ఆమెకు వర్తించకపోవడం వంటి విషయాలు గుర్తించాలని థరూర్ అన్నారు. కెనడా పౌరురాలైన ఆమె.. వ్యాపార రీత్యా యూఏఈకి వెళ్లిపోయారని తెలిపారు. -
'రిపోర్టు మార్చమని ఒత్తిడి తెచ్చారు'
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పోస్టుమార్టం నివేదిక మార్చాలని ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తాపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. సునంద మృతిని సహజ మరణంగా పేర్కొనాలని ఉన్నతస్థాయిలో తనపై ఒత్తడి తెచ్చారని విజిలెన్స్ కమిషన్ అధిపతికి గుప్తా లేఖ రాసినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. తాను లొంగకపోవడంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయారు. తన స్థానంలో వేరొకరిని ఫోరెన్సిక్ విభాగం అధిపతిగా నియమించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు 'క్యాట్' కూడా లేఖ రాశారు. విషం కారణంగానే సునంద మరణించినట్టు గుప్తా తన నివేదికలో పేర్కొన్నారు. ఆమెది హత్యేనని నిర్ధారణయింది. -
విషప్రయోగం వల్లే సునంద మరణం
విషప్రయోగం వల్లనే కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మరణించారని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సి తెలిపారు. సునంద మృతిపై ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నుంచి పోస్టుమార్టం నివేదిక డిసెంబర్ 29వ తేదీన తమకు అందినట్లు ఆయన చెప్పారు. మరణం 'అసహజం' అని, 'విషప్రయోగం' వల్లే సంభవించిందని అందులో వైద్యులు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఆమె మృతి కేసును హత్య కేసుగా పోలీసులు మార్చారు. కాగా.. సునందా పుష్కర్ది సహజ మరణం లేదా ఆత్మహత్య కాదని, ఆమె హత్యకు గురయ్యారని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఎప్పటినుంచో వాదిస్తున్నారు. ఇప్పుడు ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదికతో ఆయన వాదనకు మరింత బలం చేకూరింది. సునంద విషయం తీసుకోవడం గానీ, ఎవరైనా ఇంజెక్ట్ చేయడం గానీ చేసి ఉంటారని పోలీసు కమిషనర్ బస్సి చెప్పారు. -
సునందా పుష్కర్ది హత్యే!
కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. థరూర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన న్యూఢిల్లీలో కేబినెట్ సమావేశంలో పాల్గొన్నప్పుడు.. ఢిల్లీలోని ఓ హోటల్లో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి కారణం ఏంటన్నది అప్పట్లో పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద మరణించారు. అప్పట్లో అది పెద్ద సంచలనం రేకెత్తించింది. అతిగా నిద్రమాత్రలు మింగడం వల్లే మరణించారని అప్పట్లో అన్నారు గానీ.. ఆమెకు ఎవరైనా బలవంతంగా ఆ మాత్రలు ఇచ్చారా, లేక ఆమే తీసుకున్నారా అనే విషయం తెలియలేదు. తాజాగా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మాత్రం సునందది హత్యేనని నిర్ధారించారు. దాంతో ఈ కేసులో శశి థరూర్ సహా పలువురిని ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు. -
సునంద కేసులో పోలీసులను కలసిన కొడుకు
-
సునంద కేసులో పోలీసులను కలసిన కొడుకు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద్ పుష్కర్ మృతి కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని సునంద కొడుకు శివ మీనన్ పోలీసులను కోరారు. ఢిల్లీ పోలీసులను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సునందకు ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పిరికితనం లేదని బంధువులు చెబుతున్నారు. అయితే శశి థరూర్ హత్య చేసి ఉంటారని వారు ఆరోపించలేదు. సునంద మృతికి గల కారణాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సునందాపుష్కర్ జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెలిసిందే. గురువారం లీకైన పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణానికి విషప్రభావమే కారణమని ఉంది. కాగా సునందాపుష్కర్ ఎందుకు మరణించారనే విషయం ఫోరెన్సిక్ నివేదికలో ఏమీ తేలలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసలు ఆ నివేదికలో ఏమీ తేలనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ఈ కేసును మళ్లీ విచారించాలని రాజకీయ డిమాండ్లు కూడా వచ్చాయి. -
సునంద ఎలా మరణించారో తెలియలేదు: పోలీసులు
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందాపుష్కర్ ఎందుకు మరణించారనే విషయం ఫోరెన్సిక్ నివేదికలో ఏమీ తేలలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసలు ఆ నివేదికలో ఏమీ తేలనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. గురువారం లీకైన పోస్టుమార్టం నివేదికలో మాత్రం... ఆమె మరణానికి విషప్రభావమే కారణమని ఉంది. తమకు పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే ఏదైనా విషయాన్ని నిర్ధారించగలమని కమిషనర్ అన్నారు. ఆధారాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్) ఢిల్లీ పోలీసులకు తన నివేదిక ఇచ్చిన పది రోజుల తర్వాత అది లీకవడంతో ఇప్పుడు పోలీసులు దాని గురించి స్పందించారు. సునందాపుష్కర్ జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెలిసిందే. -
'సునంద మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి'
కొల్లం(కేరళ): కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం కేరళ శాఖ డిమాండ్ చేసింది. విషం సేవించడం కారణంగానే ఆమె మృతి చెందారని ఫోర్సెనిక్ పరీక్షలో తేలిన నేపథ్యంలో సీపీఎం ఈ డిమాండ్ చేసింది. సునంద పుష్కర్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని కేరళ సీపీఎం కార్యదర్శి పినరయి విజయన్ అన్నారు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు వెలికి తీయాల్సిన అవసరముందన్నారు. జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
సునంద పుష్కర్ మృతికి విషమే కారణం
-
సునంద, థరూర్ ల సీక్రెట్స్ బయటపెట్టిన నళిని!
న్యూఢిల్లీ: శశి థరూర్, సునంద పుష్కర్ ల సంబంధాల గురించి ప్రముఖ జర్నలిస్ట్ నళిని సింగ్ కీలక సమాచారాన్ని వెల్లడించింది. సునంద పుష్కర్ మరణానికి ముందు ఆమెతో మాట్లాడిన వారిలో నళిని సింగ్ ఒకరు. తన భర్త శశి థరూర్ పాకిస్థాని జర్నలిస్ట్ మెహర్ తరార్ ను పెళ్లాడాలనుకుంటున్నారని సునంద తెలిపిందని నళిని సింగ్ చెప్పింది. తరార్, థరూర్ ల మధ్య రొమాంటిక్ మెసేజ్ లు ఒకరికొకరు పంచుకుంటున్నారని, అందులో ఒక మెసేజ్ లో తనకు శశి థరూర్ విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉందని, థరూర్ లేకుండా బతకలేనని తరార్ మరో మెసేజ్ లో తెలిపిందని సునంద తనతో చెప్పిందని నళిని సింగ్ కీలక సమాచారాన్ని తాజాగా బయటపెట్టింది. అంతేకాకుండా తరార్ తో పెళ్లికి థరూర్ కుటుంబం కూడా ప్రోత్సహిస్తోందని సునంద ఆవేదన వ్యక్తం చేసినట్టు నళిని వెల్లడించింది. సునంద మరణానికి ముందు లీలా హోటల్ లో ఉదయం 4 గంటల నుంచి ఇద్దరూ విపరీతంగా గొడవ పడ్డారని.. వారిద్దరూ గొడవ పడిన విషయాన్ని హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారని నళిని సింగ్ తెలిపింది. -
తీరని అనుమానాలు.. తేలని వివాదాలు...
మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక ఔషధాలను తీసుకోవడం వల్లనే సునంద మరణించారని ఎయిమ్స్ పోస్టుమార్టమ్ నివేదిక పేర్కొంది. అందుకే ఇపుడు సుధీర్‌గుప్తా ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. ఏదో ఒకటి చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలనుకుంటారు కొందరు... సంచలనం సృష్టించైనా అనునిత్యం వార్తల్లో ఉం డాలనుకుంటారు మరికొందరు... అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా వీటిలో రెండోకోవకు చెందినవానిగా కనిపిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతిపై ఆయన రేకెత్తించిన తాజా వివాదం ఇందుకు నిదర్శనం. సునందది సహజమరణమే నంటూ నివేదిక ఇవ్వాలని తమపై ఒత్తిడి జరిగిందని, పోస్టు మార్టమ్ నివేదికలో మార్పు కోసం తమను ఒత్తిడి చేశారని సుధీర్ చెప్పడం మీడియాలో సంచలనం సృష్టించింది. పోస్టుమార్టమ్ నిర్వహించిన డాక్టర్ల బృందానికి డాక్టర్ సుధీర్ గుప్తానే నేతృత్వం వహించారు. నివేదిక ఆయనే ఇచ్చారు. అంటే ఆమెది సహజమరణం కాకపోయినా సహ జమరణంగా వారు నివేదిక ఇచ్చారా? అసలు సుధీర్‌గుప్తా మాటలకు ఇపుడు ఏం విలువ ఉంటుంది? ఇంతకాలం ఆయన ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు ఆయన వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలున్నాయని ఈ ఆరోపణ చేస్తున్నారు? అసలు నివేదికను మార్చాల్సిందిగా సుధీర్‌పై ఒత్తిడి తీసుకువచ్చినవారెవరు? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమా ధానాల్లేవు. సుధీర్‌గుప్తా చేస్తున్న ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. సుధీర్ వ్యవహా రశైలి సరైంది కాదని, సంచలనాలకు ఆయన ప్రాధాన్యమి స్తుంటారని, అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని ఎయిమ్స్ వర్గాలంటున్నాయి. అయితే సునంద ఉదంతం వివాదాలకతీతమేమీ కాదు నిజానికి ఆమె మరణంపై అప్ప ట్లోనే అనేక అనుమానాలొచ్చాయి. వాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది కూడా. అప్పట్లో కాంగ్రెస్ అధికా రంలో ఉండడం వల్ల దర్యాప్తుపై అధికారపక్ష ప్రభావం ఉండి ఉంటుందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక ఔషధాలను తీసుకోవడం వల్లనే సునంద మరణించారని ఎయిమ్స్ పోస్టుమార్టమ్ నివేదిక పేర్కొంది. అందుకే ఇపుడు సుధీర్‌గుప్తా ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. అయితే అసలు ఈ సుధీర్‌గుప్తా ఎవరు... ఆయన వ్యవహారశైలి ఎలాంటిది అనేదానిపై ఆసక్తి కలగడం సహజమే. ఎయిమ్స్‌లో కీలకమైన స్థానంలో ఉన్న సుధీర్‌గుప్తా తన వార్షిక నివేదికలలో కూడా ఇలాంటి సంచలనాలకే ప్రాధాన్యమిస్తుంటారట. 1996లో సీనియర్ డిమాన్స్ట్రే టర్గా ఉన్న గుప్తా ఆనాటి ఎయిమ్స్ డెరైక్టర్‌పై ఆరోపణల వర్షం కురిపిస్తూ రాసిన లేఖలు అప్పట్లో పెను సంచలనం. సుధీర్‌ది సమతుల్యత లేని వ్యక్తిత్వమని 2010లో అప్పటి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టీడీ డోగ్రా లేఖరాశారు. అంతేకాదు సుధీర్ అలవోకగా అబద్ధాలాడేస్తారని, నమ్మ దగిన వ్యక్తి కాదని, గొడవలు పెట్టుకునే మనస్తత్వమని, అస్సలు క్రమశిక్షణ లేనివాడని ఆ లేఖలో డోగ్రా ఘాటు విమర్శలు చేశారు. మెడికల్ రిజిస్టర్ నుంచి గుప్తా పేరును తొలగించాలంటూ 2004లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివాదం ఐదేళ్ల పాటు కొనసాగింది. అందుకే సుధీర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు ఎయిమ్స్ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక సునంద మరణంపై రేకెత్తిన తాజా వివాదాగ్నిలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా తోచినంత ఆజ్యం పోస్తున్నారు. ఆమెది సహజమరణం కాదని, ఆమెను రష్యా విషంతో హత్య చేశారని స్వామి పేర్కొంటున్నారు. అందుకు సంబంధించి తన వద్ద గట్టి సాక్ష్యాధారాలున్నాయని కూడా ఆయన అంటున్నారు. ఆధారాలుంటే ఆయన తక్షణం ఈ కేసు విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు అందజేయడం సబబు కదా! అసలు ఆధారాలున్నపుడు ఆయన ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నట్లు? అసలు సుధీర్ గుప్తా వివాదం రేకెత్తించే వరకు ఎందుకు ఆగినట్లు? నెహ్రూ గాంధీ కుటుంబంపై అనేక ఏళ్లుగా అటు న్యాయస్థానాల్లోనూ, ఇటు రాజకీయం గానూ పోరాడుతున్న స్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే సునంద మరణం వెనుక ఐపీఎల్ రహస్య ఒప్పందాల గుట్టుమట్లు న్నాయని, సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా ఉన్నాడని స్వామి గతంలో పలుమార్లు ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా సునందా పుష్కర్ మరణంలో లోకానికి తెలియని చీకటి కోణాలనేకం ఉన్నాయనే చర్చ ఇప్పటిది కాదు. అందుకే ఈ వ్యవహారంలో ఇప్పటికైనా నిష్పాక్షిక విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. సంచలనం కోసం, వ్యక్తిగత మైలేజీ కోసం పాకులాడకుండా సుధీర్‌గుప్తా, సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు ఈ కేసు దర్యాప్తు సవ్యంగా సాగేందుకు సహకరిస్తే మంచిది. -పోతుకూరు శ్రీనివాసరావు -
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: సుధీర్ గుప్తా
సునంద కేసుపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్తా న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య, సునందా పుష్కర్ మృతిపై పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుచేయాలంటూ తనపై ఒత్తిడి జరిగిందన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి సుధీర్ గుప్తా గురువారం మరోసారి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఎయిమ్స్ ప్రతినిధులు ఖండించిన మరుసటి రోజు పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పోస్ట్‌మార్టమ్‌పై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ‘నేను చెప్పిన మాటలకు కట్టుబడే ఉన్నా. నాపై ఏ ఒత్తిడీ లేదని వారికెలా తెలుసు? అలా వివరణ ఇవ్వడానికి వారెవరు? అలా చెప్పడానికి హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమిటి?‘ అంటూ సుధీర్ గుప్తా ప్రశ్నలు సంధించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంవద్ద మీడియా సమావేశంలో కూడా సుధీర్ గుప్తా ఇదే స్పందన వ్యక్తం చేశారు. సునందా మృతిపైనేకాక ఇతర కేసుల్లోనూ వైద్యసూత్రాలకు అనుగుణంగానే పోస్ట్‌మార్టమ్ నివేదికలను ఖరారు చేశానని, జీవితంలో ఎప్పుడూ ఒత్తిళ్లకూ లొంగలేదని గుప్తా అన్నారు. గతంలో తానిచ్చిన నివేదికలన్నీ సాధికారమైనవేనన్నారు. సుధీర్ గుప్తా రూపొందించిన పోస్ట్‌మార్టమ్ నివేదికలో సునంద రెండు చేతులమీద 12కు పైగా గాయాలున్నట్టు పేర్కొన్నారు. ఆమె మెడపై బలంగా నొక్కినట్టు ఒరిపిడి జరిగినట్టు తెలుస్తోందని వివరించారు. ఎడమ అరచేతిపై లోతైన పంటి గాయం కూడా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. వీటికి సంబంధించిన నమూనాలను భద్రపరిచినట్టు కూడా తెలుస్తోంది. ఈ నివేదిక వ్యవహారం వివాదాస్పదం అవుతుందనే తనపై ఒత్తిడి వచ్చినట్టు గుప్తా ఆరోపించారు. -
సునందా 'పోస్ట్ మార్టమ్' వ్యాఖ్యలపై కట్టుబడే ఉన్నా
న్యూఢిల్లీ: మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికకు సంబంధించి తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నట్లు అఖిల వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా స్పష్టం చేశారు. బుధవారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు నివేదించినట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజునే ఎయిమ్స్ ఆయన ఆరోపణలను ఖండించడంతో సుధీర్ గుప్తా పెదవి విప్పారు. 'నేను ముందు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా.అసలు నా మీద ఒత్తిడి తీసుకురాలేదని వారు ఎలా తెలుపుతారు? ఆ విషయం ఎయిమ్స్ బృందానికి ఎలా తెలుస్తుంది. ఒకవేళ ఎటువంటి తప్పు జరగపోతే వారు ఎందుకు ఆగమేఘాల మీద మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు?' అంటూ సుధీర్ గుప్తా ప్రశ్నించారు. సుధీర్ గుప్తా సంచలన ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు అమిత్ గుప్తా, నీరజా భాట్లా బుధవారం నిర్ద్వంద్వంగా ఖండించిన సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం సుధీర్ గుప్తాపై బయటనుంచి ఒత్తిడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వారు వెల్లడించారు. -
సునంద మృతిపై మళ్లీ వివాదం
పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకు ఒత్తిడి వచ్చిందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ ఆరోపణ * ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవన్న ఎయిమ్స్ ప్రతినిధులు * తాజా ఆరోపణలపై తక్షణ నివేదికకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆదేశం * అవసరమైతే, సుధీర్ గుప్తా, శశిథరూర్‌లను ప్రశ్నిస్తామన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతి మళ్లీ వివాదాస్పదంగా మారింది. ఆమెది సహజ మరణమేనంటూ నివేదిక ఇవ్వాలని తమపై ఒత్తిడి జరిగిందని, పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం ఒత్తిడి చేశారని అఖిల వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణ సంచలనం రేపింది. సునంద మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన ముగ్గురు సభ్యుల బృందానికి నేతృత్వం వహించిన సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణపై తక్షణ నివేదికకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించారు. అయితే, సుధీర్ గుప్తా ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు అమిత్ గుప్తా, నీరజా భాట్లా బుధవారం నిర్ద్వంద్వంగా ఖండించారు. పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం సుధీర్ గుప్తాపై బయటనుంచి ఒత్తిడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వారు స్పష్టంచేశారు. సర్వీస్‌కు సంబంధించిన అంశంగా సుధీర్ గుప్తా తన ఆరోపణను అఫిడవిట్ రూపంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు నివేదించినట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజునే ఎయిమ్స్ ఆయన ఆరోపణలను ఖండించింది. మరో వైపు, మంత్రి హర్షవర్ధన్‌కు కూడా సుధీర్ గుప్తా లేఖ రాశారు. ఫోరెన్సిక్ విభాగం అధిపతి పదవినుంచి తనను తప్పించేందుకు కుట్ర జరిగిందని, సునంద మృతిపై, అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిటో తానియా అనుమానాస్పద మృతిపై తానిచ్చిన పోస్ట్‌మార్టమ్ నివేదికలకు ముడిపెడుతూ కుట్రపన్నారని గుప్తా ఆరోపించారు. పోస్ట్ మార్టమ్ విషయంలో వృత్తిపరమైన నిబద్ధతతో, నైతిక బాధ్యతతో తాను వ్యవహరించిన తీరు.. స్వార్థశక్తులకు రుచించలేదని గుప్తా తన లేఖలో ఆరోపించారు. కాగా, తన ఆరోపణలపై బుధవారం మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయమై తాను మీడియాతో మాట్లాడబోనని స్పష్టంచేశారు. కాగా,..డాక్టర్ గుప్తా ఆరోపణలగురించి తెలియదని, తనవరకూ వచ్చినపుడు ఆయన ఆరోపణలను కూడా పరిశీలిస్తానని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. ఈ కేసులో అవసరమైతే, సుధీర్ గుప్తాను, థరూర్‌ను పోలీసులు ప్రశ్నిస్తారని, డాక్టర్ గుప్తా క్యాట్‌లో దాఖలుచేసినట్టు చెబుతున్న అఫిడవిట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని బస్సీ చెప్పారు.ఇక సునంద అనుమానాస్పద మృతిపై ఒకవైపు పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆమె మృతికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై కచ్చితమైన నిర్ధార ణకు రావాలంటూ శశి థరూర్ కూడా కోరారు. థరూర్ భార్య సునంద గత జనవరిలో, ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్త థరూర్‌కు, పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌కు మధ్య సంబంధాలపై సోషల్ వెబ్సైట్ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసిన సునంద ,..ఆ మరుసటిరోజునే మరణించ డంతో ఆమె మృతిపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే, మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక మందులు తీసుకోవడంవల్లనే ఆమె మరణించినట్టు జనవరి 20న ఎయిమ్స్ తన పోస్ట్‌మార్టమ్ నివేదికలో పేర్కొంది. అయితే, ఇంతకాలం మౌనంగా ఉండి, ఇప్పుడు సుధీర్ ఆరోపణలు చేయటం చర్చనీయాంశమైంది. సునంద కేసుపై రాజ్‌నాథ్ కు వివరణ.. సునందా పుష్కర్ మృతిపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణల నేపథ్యంలో, ఆమె మృతిపై దర్యాప్తుగురించి, ఢిల్లీపోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్టు తెలిసింది. దర్యాప్తులో ఇప్పటివరకూ బయటపడ్డ అంశాలను, దర్యాప్తు త్వరగా ముగించేందుకు తీసుకున్న చర్యలను కూడా బస్సీ మంత్రికి వివరించినట్టు భావిస్తున్నారు. -
విషాదంలోని మరో కోణం దాచబడిందా?
-
సునంద మరణంపై విచారణను వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మరణంపై విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కోరారు. సునంద మృతికి గల కారణాలను కనుగొని కచ్చితమైన నివేదికను తయారు చేయాలని శశిథరూర్ పేర్కొన్నారు. సునంద మరణాన్ని సహజ మరణంగా చెప్పాలంటూ తనపై ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో శశిథరూర్ పైవిధంగా స్పందించారు. సునందా పుష్కర్ పోస్టుమార్టం వివాదం కావడంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. సునందా పుష్కర్ గత జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. -
సునంద పుష్కర్ మృతికి ముందు, తర్వాత ఆసక్తికర అంశాలు!
అంతా సద్దుమణిగిందనుకుంటున్న మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మరణంపై మరోసారి దుమారం రేపుతోంది. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు ఎయిమ్స్ పోర్సెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేయడంతో సునంద పుష్కర్ మృతి చుట్టు తాజాగా వివాదం ముసురుకుంది. సునంద, ఆమె మృతి వెనుక కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. అక్టోబర్ 2009లో ఓ పార్టీలో సునంద, థరూర్ లు కలుసుకున్నారు. థరూర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత 2010లో సునంద, థరూర్ లు పెళ్లి చేసుకున్నారు. గతంలో థరూర్ తిలోత్తమ ముఖర్జీని పెళ్లి చేసుకోగా, సునంద సంజయ్ రైనా అనే కాశ్మీరీని పెళ్లి చేసుకున్నారు. అయితే థరూర్, సునందలు తొలి వివాహానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత ఐక్యరాజ్యసమితిలో సేవలందిస్తుండగా సహ ఉద్యోగి క్రిస్టా జైల్స్ ను వివాహం చేసుకున్నారు. 2010లో ఐపీఎల్ లో కోచి జట్టును సునంద కొనుగోలు చేయడం వెనుక 70 కోట్ల అవినీతి జరిగిందనే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సునంద పుష్కర్ 2014 జనవరి 17 తేదిన ఢిల్లీలోని హోటల్ లీలాలోని నంబర్ 345 గదిలో మరణించింది. సునంద పుష్కర్ మధ్యాహ్నం 3.30 గంటలకు చివరిసారిగా కనిపించింది. సునంద మరణించినట్టు రాత్రి 9 గంటల ప్రాంతంలో శశి థరూర్, ఇద్దరు హోటల్ సిబ్బంది గుర్తించారు. సునంద మృతదేహంపై 12 గాయాలున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఆ గాయాలు ప్రాణాంతకం కాదని చెప్పడం అనేక సందేహాలు రేకెత్తాయి. సునందపై దాడి జరిగిందా అనే అనుమానాలు తలెత్తాయి. సునంద మరణించడానికి ముందు రోజు పాకిస్థానీ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో గొడవ జరిగినట్టు తెలిసింది. శశి థరూర్, మెహర్ తరార్ ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందనే విధంగా సునంద ట్విటర్ లో సందేశాల్ని పోస్ట్ చేశారు. సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదు. హత్యే అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. సునంద మరణం తర్వాత థరూర్ తీరుపై సుబ్రమణ్య స్వామి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రష్యాలో తయారైన విషం కారణంగానే సునంద మరణించిందని స్వామి అన్నారు. సునంద మరణంపై మూడవ అభిప్రాయాన్ని సేకరించాలని ఢిల్లీ పోలీసులు సూచించడం అనేక సందేహాలకు తెరతీసాయి. ఏయిమ్స్, సీఎఫ్ఎస్ఎల్ నివేదికల మధ్య పొంతన లేకపోవడంతో మరో నివేదిక అవసరమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆమెది సహజ మరణం కాదని ఫోరెన్సిక్ నిపుణులు పలు విధాలు అనుమానాలు వ్యక్తం చేశారు. సునంద మృతిపై అనేక సందేహాలున్నాయనే ఆరోపణలు వచ్చినప్పటికి.. యూపీఏ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ కేసును మరుగునపడేసేందుకు అనేక ఒత్తిడులు వచ్చాయని విమర్శలు చెలరేగాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే కొన్ని వాస్తవాలు వెలుగు చూడలేకపోయాయని వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఎయిమ్స్ వైద్యుడు సుధీర్ గుప్తా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కు ఓ నివేదికను అందిచేస్తూ తమపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని మీడియాతో చెప్పడం వివాదంగా మారింది. సునంద మృతిపై మరుగున పడిన వాస్తవాలు ఈసారైనా వెలుగులోకి వస్తాయా అనే ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజులాగితే తెలుస్తుందేమో!Follow @sakshinews -
సునందాది సహజ మరణం కాదా?
-
సునంద మృతిని 'సహజం'గా చెప్పాలన్నారు!!
సునందా పుష్కర్ మృతిని 'సహజం'గా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. సాక్షాత్తు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధినేతపైనే ఈ మేరకు ఒత్తిళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణుల బృందానికి ఆయన నేతృత్వం వహించారు. నాటి కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య అయిన సునందా పుష్కర్ ఈ సంవత్సరం జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. రాత్రి 8 గంటలకు ఏఐసీసీ సమావేశం నుంచి తిరిగొచ్చిన తర్వాత శశిథరూర్ ఆమె మృతదేహాన్ని చూశారు. అయితే.. ఆమె మరణాన్ని సహజ మరణంగా చెప్పాలంటూ తనపై ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డ్రగ్ పాయిజనింగ్ వల్లనే ఆమె మరణించారని, అది ఆత్మహత్య అయినా కావచ్చు, లేదా కావాలనే ఆమెకు ఆ మందు ఇచ్చి ఉండొచ్చని తాను ఇచ్చిన నివేదికకే కట్టుబడి ఉండటంతో ఇప్పుడు తనను టార్గెట్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాగా, సునందా పుష్కర్ పోస్టుమార్టం వివాదం పెద్దది కావడంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. -
ప్రస్తుతానికి నో ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన కేసులో ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు లేవని నగర పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సోమవారం ప్రకటించారు. అయితే ఈ కేసులో నేర శిక్షాస్మృతి ప్రకారం విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదుకు అవసరమైన సాక్ష్యాధారాలేవీ తమకు లభించలేదని తెలిపారు. ఇప్పటి వరకు పలువురు సాక్షులను ప్రశ్నించామని, ప్రాసంగిక సాక్ష్యాలను పరిశీలించినా ఏమీ వెల్లడికాలేదని ఆయన వివరించారు. పెళ్లయిన ఏడేళ్లలోపు వివాహిత మరణిస్తే నిబంధనల ప్రకారం సంబంధిత సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ న్యాయ విచారణ నిర్వహించారని తెలిపారు. సునంద మృతికి విషప్రయోగం కారణమని, హఠాత్తుగా మరణం సంభవించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించడంతో ఆత్మహత్య కోణంలో దర్యాప్తు నిర్వహించాల్సిందిగా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఢిల్లీ పోలీసులను ఆదేశించడం తెలిసిందే. ‘సునంద మరణం వెనుక ఏదైనా కుట్ర ఉన్నట్టు తేలితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సాధారణ విచారణ కొనసాగుతుంది. ఆమె ఏ రకం విషం తీసుకుందో ఫోరెన్సిక్ నివేదిక తెలియజేస్తుందని భావించాం. అయితే సదరు నివేదిక ఇలాంటి విషయాలను వెల్లడించలేదు. సునంద విషం తీసుకోలేదని, మందులే విషపూరితంగా మారి మరణానికి దారి తీశాయని తెలిపింది. అందులోని వివరాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కుదరదు అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నివేదికలపై మరింత సమాచారం సేకరించడానికి పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ డాక్టర్ల బృందాన్ని సంప్రదిస్తామని పేర్కొన్నారు. భర్త శశి థరూర్‌కు పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉందని ట్విటర్లో ఆరోపించిన సునంద, మరునాడే మరణించింది. దక్షిణ ఢిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్లో జనవరి 17న ఈ ఘటన జరిగింది. సునంద మరణం వెనుక కుట్ర ఉన్నట్టు భావించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారని సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ పోలీసులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. -
శశి థరూర్‌ను వదలని సునంద భూతం!!
కేంద్ర మంత్రి శశి థరూర్‌ను ఆయన భార్య సునందా పుష్కర్ భూతం వదులుతున్నట్లు లేదు. ఆమె మరణం విషయంలో వామపక్షాల నాయకులు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ శశి థరూర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారికి తన ఫిర్యాదు అందజేశారు. థరూర్ తిరువనంతపురం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ టీవీ కార్యక్రమంలో తనను 'పుష్కర్ హంతకుడు' అంటూ సీపీఐ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సంబోధించారని ఆయన ఆరోపించారు. జనవరి 17న సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లోమరణించిన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, అవి తన ప్రతిష్ఠకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల కోడ్‌ను కూడా ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. దాదాపు ప్రతి టీవీ చానల్లోనూ సీపీఎం సభ్యుడు ఎం.విజయకుమార్ కూడా తన ప్రతిష్ఠను మంటగలిపారని థరూర్ చెప్పారు. 'మహిళలపై హింస' అనే అంశంలో తనకు డాక్టరేట్ ఉన్నట్లు ఆయన చెప్పారన్నారు. ఇక బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు తన బొమ్మకు చెప్పుల దండలు వేసి, దాన్ని మహిళలతో కొట్టించారని వాపోయారు. ఇవన్నీ తన వ్యక్తిత్వాన్ని హననం చేయడమేనంటూ భోరుమన్నారు. అందువల్ల వీళ్లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
థరూర్, పాక్ జర్నలిస్ట్ వ్యవహారంపై రచ్చరచ్చ!
పాకిస్థాన్ జర్నలిస్ట్ తో కేంద్రమంత్రి శశి థరూర్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేరళ అసెంబ్లీ దద్దరిల్లింది. పాక్ జర్నలిస్ట్ శశి థరూర్ రిలేషన్స్ మీ దృష్టికి వచ్చాయా అని అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి రమేశ్ చెన్నితల సమాధానమిస్తూ.. శశిథరూర్ పై వచ్చిన ఆరోపణలన్ని మీడియా వార్తలే అని అన్నారు. సునంద పుష్కర్ మరణంపై శశి థరూర్ ను విచారించాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఏమైనా అనుమానస్పదంగా అనిపిస్తే.. కేంద్ర ఏజెన్సీలకు నివేదిస్తామని రమేశ్ చెన్నితల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించిన శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అస్థికలు శుక్రవారం త్రివేణి సంగమమ్ లో కలుపనున్నారు. -
సునంద మృతి మిస్టరీ వీడేదెప్పుడో!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేసేం దుకు ఢిల్లీ పోలీసుశాఖకు చెందిన రెండు విభాగాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసును విచారించేందుకు నిరాకరించిన నేర విభాగం (క్రైంబ్రాంచ్) తిరిగి దక్షిణ జిల్లా పోలీసులకే బదిలీ చేసింది. అయితే వారు ఈ కేసుపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నెల 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో 52 ఏళ్ల పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రి అధికారిక నివాసాన్ని ఆధునీకరిస్తుండటంతో భర్త, కేంద్ర మంత్రి శశి థరూర్‌తో కలిసి సునంద హోటల్లోనే ఉంటున్నారు. ఈ కేసును మొదటగా చేపట్టిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) విచారించి సదరు నివేదికను దక్షిణ ఢిల్లీ పోలీసులకు వారం రోజుల్లోనే సమర్పించారు.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పుష్కర్ విషం సేవించిందని, ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరముందని ఎస్డీఎం పోలీసులకు సూచించారు. అయితే ఈ కేసు విచారణను ప్రారంభించిన దక్షిణ జిల్లా పోలీసులు మరుసటి రోజే నేర విభాగానికి అప్పగించారు. అయితే ఈ కేసును తాము దర్యాప్తు చేయాల్సిన అవసరమేమీ కనబడటం లేదని నేర విభాగ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ విభాగంలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉందని, అనేక కేసులు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇదిలావుండగా ఈ కేసు గురించి దక్షిణ జిల్లా పోలీసులు ఏమీ మాట్లాడం లేదు. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని కారణంతో పుష్కర్ ఆత్మహత్య చేసుకుందని వదంతులు వినవస్తున్నాయి. ఆమె చనిపోయే ముందు సదరు జర్నలిస్ట్‌తో థరూర్‌కు ఉన్న సంబంధం గురించి సామాజిక అనుసంధాన వేదికలో ఆమె ట్వీట్ చేయడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. 2010లో పుష్కర్, థరూర్‌లు పెళ్లి చేసుకున్నారు. -
సునంద కేసు తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు క్రైమ్‌బ్రాంచి నుంచి తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు బదిలీ అయింది. దర్యాప్తులో అంతరాయం ఉండకుండా ఉండేందుకు ఈ కేసును తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసినట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే, దక్షిణ ఢిల్లీ పోలీసులు నమోదు చేసుకున్న ఈ కేసును తొలుత క్రైమ్‌బ్రాంచ్‌కు ఎందుకు అప్పగించారన్న ప్రశ్నకు వారి నుంచి సమాధానం కరువైంది. -
శశిథరూర్‌కు సునంద సోదరుడు మద్దతు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఆమె కుటుంబం నుంచి గట్టి మద్దతు లభించింది. థరూర్ సునందకు హాని చేస్తారని ఊహించలేమని పుష్కర్ సోదరుడు రాజేశ్ పేర్కొన్నారు. ఈయన భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేస్తున్నారు. తమ కుటుంబాన్ని వ్యథకు గురిచేస్తున్న వదంతులకు ఇకనైనా ముగింపు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సునంద ఎంతో దృఢమైన వ్యక్తిత్వమున్న మనిషని, ఆమె తనను తాను గాయపరుచుకుంటార ని అనుకోవడం కూడా అసంబద్ధం, నమ్మలేని విషయమని చెప్పారు. వారి దాంపత్య జీవితం యూవత్తూ తాను వెన్నంటి ఉన్నానని, వారు పరస్పరం పిచ్చి ప్రేమలో ఉన్నట్టు తాను చెప్పగలనని కల్నల్ రాజేశ్ పేర్కొన్నారు. విభేదాలేమైనా ఉంటే క్షణికమేనని, ప్రతి కుటుంబంలో అవి సాధారణమేనని చెప్పారు. వదంతులకు తెరదించేందుకు కేసును వేగంగా దర్యాప్తు చేయూలని ఆయన కోరారు. అంతకుముందు సునంద కుమారుడు శివ్‌మీనన్ కూడా తన తల్లి మృతి వెనుక కుట్ర ఉందనడాన్ని తాను విశ్వసించబోనంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఇదో విషాద సందేశం
‘మూడో పెళ్లి చేసుకుంది. ఇంకేమవుతుంది?’ అన్నాడు ఓ పురుషుడు. మహిళ కాబట్టి మూడో పెళ్లి చేసుకుంటే, ఆమె గుణపాఠం నేర్చుకోవలసిందే. నిజానికి, సునందదే కాదు, ఆమె భర్త శశిథరూర్‌ది కూడా మూడో వివాహమే. కానీ ఆ అంశం ప్రస్తావనకు రాదు. వార్తలలోని వ్యక్తులను, ప్రత్యేకించి మహిళల జీవితాల ను భూతద్దాలలో చూపించి ఏవిధంగా అవమానపరుస్తారో చెప్పే మరో ఉదాహరణ సునందా పుష్క ర్ విషాదాంతం. చదువు, దానితోపాటు ఆర్థికశక్తి ఉన్నాయి. వాటితో వచ్చే ఆత్మవిశ్వాసమూ ఉంది. ఢిల్లీ, దుబాయ్ ఎలిట్ తరగతిలో గుర్తింపు ఉంది. అయినా ఆమె జీవితం విషాదాంతమైంది. ఈ వార్త ప్రసారం అవుతున్న సమయంలోనే ఓ వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, అంతకు మించి పురుషుడు, ‘సానుభూతి ఎందుకు? మూడో పెళ్లి చేసుకుంది. ఇంకేమవుతుంది?’ అన్నాడు. మహిళ కాబట్టి మూడో పెళ్లి చేసుకుంటే, ఆమె గుణపాఠం నేర్చుకోవలసిందే. నిజానికి, సునందదే కాదు, ఆమె భర్త శశి థరూర్ది కూడా మూడో వివాహమే. కానీ ఆ అంశం ప్రస్తావనకు రాదు. మొదటి రెండు పెళ్లిళ్లు విఫలం కావడానికి సునంద బాధ్యత ఎంతో, ఆ భర్తల బాధ్య త కూడా అంతే. శశిథరూర్ తన మీద బహిరంగంగా ప్రేమను ఒలకబోసిన తరువాత కూడా అనేక పర్యాయాలు వేరే మహిళలతో వ్యవహారాలు నడిపాడనీ, పాకిస్థానీ జర్నలిస్టు మొదటి మహిళేమీ కాదనీ సునంద బాధ. ఇది కూడా ఎవరికీ పట్టినట్టు లేదు. ‘మగాడన్నాక ఇలాంటివి సహజం’ అని నీతులు బోధించే స్త్రీమూర్తులకి దేశంలో లోటు లేదు. కానీ మగయినా, ఆడయినా జీవిత భాగస్వాములు వేరే వారితో నడిపే సంబంధాలు రెండోవారి ఆత్మగౌరవాన్నీ, విశ్వాసాన్నీ దెబ్బతీస్తాయి. మూడో పెళ్లయినా, ఇది కాకపోతే మరో పెళ్లి అనుకునే నిత్య పెళ్లికొడుకు ఎన్నికలు అయిపోగానే విడాకులు ఇస్తానని బెదిరించడం, ఆమెలో మూడో పెళ్లినయినా నిలుపుకోలేకపోతున్నానన్న ఆందోళన కనిపిస్తాయి. దీనితో ఇద్దరి మధ్య ఘర్షణలో హింస. సునంద శరీరంపై కమిలిన గుర్తులు గృహహింసకు అత్యాధునిక నాగరీకుడు శశిథరూర్ కూడా అతీతుడు కాదనే చెబుతున్నాయి. ఇప్ప టి వరకు వచ్చిన వార్తలను బట్టి సునంద అధిక మోతాదులో ఓ ఔషధం తీసుకోవడం వల్ల మరణించిందని భావించాలి. ఇది హత్యా, ఆత్మహత్యా అన్నది అసలు ప్రశ్న కాదు. శశిథరూర్ ఆమెను భౌతికంగా చంపి ఉండకపోవచ్చు కూడా. అయినా ఆమె మరణానికి అతడే ప్రధాన బాధ్యుడు. ఆ ఇద్దరి పెళ్లి సమయంలో ఓ కుంభకోణంపై చర్చ జరిగింది. క్విడ్‌ప్రోకోకు సంబంధించిన ఆరోపణలవి. మం త్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే చర్య తీసుకోవచ్చు. స్త్రీని దేవతగా పేర్కొ నే బీజేపీ కూడా సునంద మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. సునంద మోజులో పడి శశిథరూర్ అలా చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. అప్పటికే సునంద లాభసాటి రంగాలలో పెట్టుబడి పెట్టే సామర్థ్యం కలిగినదన్న సంగతిని ఆ పార్టీ విస్మరించింది. తన సంపాదన కోసమే శశిథరూర్ సునందను అడ్డం పెట్టుకున్నాడేమోనని ఎవరూ అనలేదు. ఆ వ్యవహారం నుంచి సునంద తరువాత వెనక్కి తగ్గింది. శశిథరూర్ రాజకీయ జీవితాన్ని రక్షించడానికే అలా చేశానని తరువాత చెప్పింది. సునంద ఏ తప్పు చేయని ముత్యమన్న వాదన ముఖ్యం కాదు. ఒకే తప్పుకి రెండు రకాల ప్రమాణాలెందుకు? నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి, లేదా తప్పును సరిదిద్దుకోవడానికి మగాడికి ఉన్న అవకాశం స్త్రీకీ ఉండాలి కదా! అసలే ఎన్నికల వేళ. సునంద ఉదంతం ద్వారా ఎలా లాభపడాలో ఆలోచిస్తూనే ప్రతిపక్షం మొసలి కన్నీళ్లు కారుస్తోంది. చర్చ లేకుండా ఎంత తొందరగా ఈ ఉదంతానికి ఎలా స్వస్తి పలకగలమో యోచిస్తోంది అధికారపక్షం. ఆరోపణలూ, ప్రత్యారోపణలూ మధ్య ఈ మరణం నాటకాన్ని రక్తి కట్టించి, ఎలా రేటింగ్స్ పెంచుకోవచ్చోనని మీడియా ఆత్రుత పడుతోంది. నష్టపోయిన జీవితం గురించి గానీ, కనీస మర్యాదలు ఉల్లంఘించడం గురించి కానీ ఎవరికీ పట్టింపు లేనే లేదు. శశిథరూర్ కావచ్చు, స్నూపింగ్ కేసులో నరేంద్రమోడీ కావచ్చు. అధికారంలో ఉన్నవారు దుర్వినియోగానికి పాల్పడితే ఆ తప్పులని వెలికితీసి ఉతికి ఆరేయాల్సిందే. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చవలసిందే. ఇది ప్రజాప్రయోజనం. కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, వారి వ్యక్తిగత అంశాలను చర్చకు పెట్టడం, వారి జీవిత భాగస్వాముల ప్రైవేటు జీవితాన్ని రచ్చ చేయడం, వారి సన్నిహితులు కాబట్టి బురద చల్లడం సమర్థనీయం కాదు. ఏ చర్చయినా ప్రజాప్ర యోజనం గీటురాయిగా జరగాలి. స్త్రీలు, అం దునా స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన స్త్రీల పట్ల సమాజం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. నాగరీకులుగా చలామణి అవుతున్న మగాళ్లలో మధ్యయుగ భావాలు ఒక వాస్తవమే. సాధికారత సాధించినట్టు కనిపించినా ఏదో ఒక దశలో ఒత్తిళ్లకూ దాడులకూ కుంగిపోవ డం మహిళల్లో ఇప్పటికీ కనిపిస్తున్నదే. వీట న్నిటి కలయికే సునంద మరణం. ప్రసిద్ధుల అర్థాంగులు వ్యక్తిత్వం లేకుండా వార్తల్లోకి రాకుండా మగాళ్ల నీడలుగా బతికితేనే క్షేమమ న్న సంకేతాన్ని సునంద మరోసారి పంపింది. -
శశి థరూర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
న్యూఢిల్లీ: అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సునందా పుష్కర్ కేసులో ఆమె భర్త, కేంద్ర మంత్రి శశి థరూర్‌తో పాటు ఆమె బంధువులను పోలీసులు విచారించే అవకాశం ఉంది. మంగళవారం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సునంద మృతిని హత్య లేదా ఆత్మహత్య కోణంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో, వారు కేంద్ర మంత్రిని విచారణలో పాల్గొనాల్సిందిగా కోరడానికి సిద్ధమవుతున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం కేంద్ర మంత్రితో పాటు మరో 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. కాగా, తన తల్లి ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదని సునంద కుమారుడు శివ్ మీనన్ చెప్పారు. మీడియా వార్తలతో ఒత్తిడికి లోనవడం, తప్పు డు విధంగా వివిధ మందులను కలిపి వాడడం సునంద మృతి చెందారని తెలిపారు. అప్పుడప్పుడు గొడవపడినా శశి థరూర్, తన తల్లిని ప్రేమగానే చూసుకునేవారని చెప్పారు. -
మీడియా ఒత్తిడే ఆత్మహత్యకు కారణమైంది: శివ్ మీనన్
మీడియా ఒత్తిడి, వ్యక్తిగత టెన్షన్లు, వివిధ రకాల వైద్య చికిత్సలు తన తల్లి సునంద పుష్కర్ ఆత్మహత్యకు దారి తీశాయని ఆమె తనయుడు శివ్ మీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన తల్లి మరణంపై వస్తున్న రకరకాల ఊహాగానాలను శివ్ మీనన్ కొట్టిపడేశారు. తన తల్లి, శశి థరూర్ ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. అయితే సందర్భానుసారంగా తలెత్తే విబేధాలు జీవితంలో సర్వసాధారణమే అని ఆయన అన్నారు. తన తల్లికి భౌతికంగా హాని తలపెట్టేలాంటి వ్యక్తి శశి థారూర్ కాదన్నారు. తన తల్లి మరణంపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలేనని శివ్ అన్నారు. తన తల్లి శరీరంపై ఉన్న గాయాలు ఆమె మరణానికి కారణం కాదని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తన నివేదిక వెల్లడించిన విషయాన్ని ఆయన మీడియా దృష్టికి తీసుకువచ్చారు. -
నా తల్లి పిరికిది కాదు: సునంద కుమారుడు
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం తన తల్లికి లేదని సునంద పుష్కర్ తనయుడు శివ మీనన్ అన్నారు. శారీరకంగా తన తల్లిని హింసించేంత దేహ దారుఢ్యం శశి థరూర్‌కు లేదని పేర్కొన్నారు. 'అందరికి తెలియని విషయం ఏమిటంటే నా తల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. సునందను హింసించేంత శారీరక బలం థరూర్ లేదని నమ్ముతున్నాను. నా తల్లి మరణానికి ఆయనే కారణమన్నది ఊహ మాత్రమే' అని మీనన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. థరూర్, సునంద అన్యోన్యంగా ఉండేవారని తెలిపారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని అధిగమించారని వెల్లడించారు. తన తల్లి మరణాన్ని అసాధారణమైందిగా చూడాలన్నారు. 21 ఏళ్ల శివ.. సుజీత్ మీనన్, సునంద తనయుడు. ఢిల్లీకి చెందిన సుజీత్‌ను సునంద రెండో పెళ్లి చేసుకున్నారు. -
హత్యా..? ఆత్మహత్యా..?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది ఆత్మహత్యా లేదా హత్యా అన్న కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అలోక్ శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. మోతాదుకు మించి మందులు తీసుకోవడం వల్ల అవి విషపూరితమై సునంద మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన శవ పరీక్షలో తేలిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె రెండు చేతులపై 12కు పైగా గాయాలున్నాయని, ఎడమ చెంపపై కమిలిన గాయం ఉందని పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. అయితే ఈ గాయాల వల్ల చనిపోయే అవకాశం లేదని వివరించారు. చేతులపై గాయాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎస్డీఎం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా హత్యకు గురైందా అన్న కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు. ‘‘ఆమె మరణానికి మూడు కారణాలు ఉండొచ్చు. ఒకటి హత్య.. రెండు ఆత్మహత్య.. మూడోది ప్రమాదవశాత్తూ చనిపోవడం. ఇందులో మరణానికి కచ్చితంగా ఏది కారణమైందో దర్యాప్తు చేయాలి’’ అని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'
-
'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'
సునంద పుష్కర్ మరణం హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ ఆదేశించారు. అయితే విష పూరిత పదార్ధాలు తీసుకోవడమే ఆమె మరణానికి దారి తీసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సునంద మృతిపై ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని నివేదికలో శర్మ తెలిపారు. అతిగా డ్రగ్స్ తీసుకోవడంతో ఆమె మరణం సంభవించిందని.. ఇలాంటి కేసులో విష ప్రయోగం జరిగిందని చెప్పవచ్చు అని ఎయిమ్స్ వైద్యులు శవపరీక్షలో అనంతరం వెల్లడించారు. అంతేకాకుండా సునంద చేతులపై డజన్ పైగా గాయాలు, బుగ్గపై ఓ గాయం కూడా ఉందని వైద్యులు నివేదికలో తెలిపారు. తన మరణానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోలేదని, ఆమె కడుపులో ఎలాంటి ఆహార పదార్ధాల నమూనాలు లభించలేదని తెలిపారు. ఆమె మరణించిన హోటల్ గదిలో మానసిక రుగ్మత నుంచి ఉపశమనం పొంతే కొన్నిమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. కేంద్రమంత్రి శశి థరూర్ తో సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో ట్విటర్ లో గొడవ పడిన మరుసటి రోజే ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే. -
మోతాదుకు మించిన మందులే కారణం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మరణానికి మోతాదుకు మించిన మందులే కారణమని శవపరీక్షలో తేలింది. మందులు మోతాదుకు మించినందున అంటే... మందులు విషపూరితం కావడం వల్ల ఆమె మరణించినట్లు శవపరీక్ష నివేదికలో పేర్కొన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అలోక్ శర్మకు ఎయిమ్స్ వైద్యులు సోమవారం సాయంత్రం శవపరీక్ష నివేదికను సమర్పించారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ గదిలో శుక్రవారం సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. - ఈ సంఘటనపై విచారణ చేస్తున్న ఎస్డీఎం అలోక్ శర్మ, శవపరీక్ష నివేదికలోని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. - మంత్రి థరూర్, సునంద సోదరుడు సహా పలువురి వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలతో పాటు శవపరీక్ష నివేదికను పరిశీలించనున్నట్లు చెప్పారు. - ఆ తర్వాతే ఒక నిర్ధారణకు వస్తానని, దర్యాప్తు కొనసాగించాలా వద్దా అనే దానిపై పోలీసులకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. - కాగా, ఎస్డీఎం నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలపై ఒక నిర్ణయానికి రాగలమని పోలీసులు తెలిపారు. - సునందా పుష్కర్ మృతదేహానికి తొలుత డాక్టర్ సుధీర్ కే గుప్తా నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం శనివారం ప్రాథమిక శవపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. - సునంద మరణించిన హోటల్ గదిలో యాంటీ డిప్రెసంట్ ఔషధమైన ఆల్‌ప్రోజాలం మాత్రల ఖాళీ స్ట్రిప్‌లు రెండు పోలీసులకు లభించాయి. - వాటి ఆధారంగా ఆమె కనీసం 27 ట్యాబ్లెట్లు మింగి ఉండవచ్చని, దానివల్లే మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. -
సునంద పుష్కర్ మృతిపై ఎయిమ్స్ వైద్యుల నివేదిక
ఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ వైద్యులు మేజిస్ట్రేటుకు అందజేశారు. మోతాదుకు మించిన తీసుకున్న మందుల వల్లే సునంద మృతి చెందారని ఎయిమ్స్ (ఏఐఐఎంఎస్)వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. సునంద శరీరంపై 12 గాయాలున్నాయని, అయితే అవి ప్రాణాంతకమైనవి కావని వైద్యులు తెలిపారు. సునంద పుష్కర్ ఈ నెల 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో శశి థరూర్ సునందను పెళ్లి చేసుకున్నారు. సునంద మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. వైద్యుల నివేదికతో ఆమె మోతాదుకు మించి మందు తీసుకున్నందువల్ల చనిపోయినట్లు నిర్ధారణ అయింది. -
సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్
-
సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్
ఇస్లామాబాద్: సునంద పుష్కర్ మృతి నేపథ్యంలో వార్తల్లో వ్యక్తిగా మారి న పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్.. తనకు, శశి థరూర్ దంపతుల మధ్య విభేదాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. వారిద్దరి మధ్య విభేదాలున్నట్లు ఏప్రిల్ నుంచే పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ కుట్రలో తనను పావును చేశారని ఆరోపించారు. శనివారం రాత్రి ఓ టీవీ విలేకరితో ఆమె మాట్లాడుతూ.. ‘నేను థరూర్‌ను కలిసింది రెండేసార్లు.. ఒకటి ఏప్రిల్ నెలలో భారత్‌లో, మరోసారి గతేడాది జూన్‌లో దుబాయ్‌లో ఉండగా. ఆ సమయంలో అక్కడ ఈయనే కాదు చాలా మంది ఉన్నారు. అయితే తర్వాత థరూర్ గురించి నేను ఓ ఆర్టికల్ రాశాను. ఇందులో ఆయన్ను ప్రశంసించడం ఆయన భార్యకు నచ్చలేదనుకుంటా. దీంతో నాతో మాట్లాడొద్దని సునం ద.. శశిని హెచ్చరించారు. ఆయనతో నా సంభాషణ కూడా సాధారణ అంశాలపైనే సాగేది.. అవి నేను అందరితో మాట్లాడేవే’’ అని తెలిపారు. -
తరార్‌తో సంబంధమేంటి?
పాక్ జర్నలిస్టు గురించి శశి థరూర్‌ను ప్రశ్నించిన మేజిస్ట్రేట్ భార్య మృతికి ముందు పరిస్థితులపై ఆరా దర్యాప్తును వేగవంతం చేయాలంటూ షిండేకు శశి లేఖ నన్ను కుట్రలో పావును చేశారు: తరార్ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. మృతికి కారణాలు తెలుసుకునేందుకు ఒకవైపు పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఢిల్లీలోని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదివారం 8 మందిని ప్రశ్నిం చారు. వీరిలో సునంద భర్త శశి థరూర్, సోదరుడు రాజేశ్, జర్నలిస్టు నళిని సింగ్ కూడా ఉన్నారు. మీ భార్య మృతికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చు? మరణానికి ముందు రోజుల్లో ఆమెకు, మీకు ఏమైనా గొడవలు జరిగాయా? లాంటి ప్రశ్నలతోపాటు.. పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో మీకేంటి సంబంధం? అని మేజిస్ట్రేట్.. శశి థరూర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. థరూర్‌కు, మెహర్ తరార్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని ట్విట్టర్లో ట్వీట్ చేసిన రెండు రోజుల తర్వాత సునంద మరణించిన సంగతి తెలిసిందే. మరణానికి ముందు కొద్ది రోజుల్లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ థరూర్ తన లిఖితపూర్వక వాంగ్మూలంలో మేజిస్ట్రేట్‌కు వివరించినట్లు తెలిసింది. వాంగ్మూలం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడ్డానికి నిరాకరించారు. మరణానికి ముందు ఎవరితో మాట్లాడారు? సునంద మరణించిన హోటల్ గది వద్ద సీసీటీవీ వీడియోను పరిశీలించిన పోలీసులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఆమె మరణించడానికి ముందు థరూర్‌తో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరణానికి ముందు ఆమె ఎవరితో మాట్లాడారు? ఎవరికి ఎస్ఎంఎస్లు పంపారు లాంటివి ఆరా తీస్తున్నారు. సునంద మృతదేహానికి శవపరీక్ష చేసిన వైద్యులు సోమవారం మేజిస్ట్రేట్‌కు నివేదికిచ్చే అవకాశముంది. దర్యాప్తును వేగవంతం చేయాలని షిండే లేఖ తన భార్య మరణంపై మీడియాలో వస్తున్న కథనాలపై శశిథరూర్.. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఆదివారం లేఖ రాశారు. ‘నా భార్య మరణించిన విషాదంలో నేనుంటే.. ఆ మరణంపై రకరకాల ఊహాగానాలతో మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలు నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరణానికి అసలు కారణమేంటో ముందు తెలియాలి. దీనిపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన లేఖలో కోరారు. ఔషధం.. అధికమొత్తంలో తీసుకున్నారా! అనుమానాస్పదంగా మరణించిన సునంద పుష్కర్ మృతదేహంలో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లూ లభించలేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అయితే మానసిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఉపయోగపడే ఆల్ప్రాజోలం ఆనవాళ్లు లేకపోలేదని వివరించాయి. -
మెజిస్ట్రేట్ ఎదుట శశిథరూర్, నళినీ సింగ్ వాంగ్మూలం
ఢిల్లీ(ఐఏఎన్ఎస్): తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మంత్రి శశిథరూర్ ఈరోజు సాయంత్రం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సిఆర్పిసి 164 సెక్షన్ ప్రకారం వసంత విహార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ శశిథరూర్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కాపషెరా ప్రాంతంలోని అలోక్ శర్మ కార్యాలయానికి ఈ సాయంత్రం శశిథరూర్ వెళ్లి దాదాపు 50 నిమిషాలు అక్కడే ఉన్నారు. టివి జర్నలిస్ట్ నళినీ సింగ్ వాగ్మూలాన్ని కూడా మేజిస్ట్రేట్ నమోదు చేసుకున్నారు. సునంద పుష్కర్ సెల్ ఫోన్ రికార్డుల ప్రకారం ఆమె చివరిసారిగా నళినీ సింగ్‌కు కాల్ చేశారు. అనంతరం నళినీ సింగ్ ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ సునంద చనిపోవడానికి ముందు తనతో ఏం మట్లాడారో మేజిస్ట్రేట్‌కు చెప్పానని తెలిపారు. ఆయన నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు విచారణలో తాను పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పినట్లు తెలిపారు. సునంద పుష్కర్ ఈ నెల 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో శశి థరూర్ సునందను పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. సునంద మృతిపై అనేక అనుమానాలు కూడా తలెత్తాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది స్పష్టంగా తెలియలేదు. ఆమె మరణానికి కారణాలు తెలియకుండా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో తన భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు చేయాలని శశిథరూర్ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు. దర్యాప్తు పూర్తిచేసి సునంద మృతిపై నిజాలు వెలికితీయాలని ఆయన ఆ లేఖలో కోరారు. -
హొం మంత్రి షిండేకు శశిథరూర్ లేఖ
-
హొం మంత్రి షిండేకు శశిథరూర్ లేఖ
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి శశిథరూర్ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు. దర్యాప్తు పూర్తిచేసి సునంద మృతిపై నిజాలు వెలికితీయాలని ఆయన ఆ లేఖలో కోరారు. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) ఈ నెల 17న ఢిల్లీలోని లీలా హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. 2010లో శశి థరూర్ సునందను వివాహం చేసుకున్నారు. వారి మధ్య విభేదాలు తలెత్తినట్టు ఇటీవల ప్రచారం జరిగింది. సునంద మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది స్పష్టంగా తెలియలేదు. ఆమె మరణానికి కారణాలు తెలియకుండా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో శశిథరూర్ హొం మంత్రికి లేఖ రాశారు. -
'సునంద పుష్కర్ కుట్రకు బలైంది'
కేంద్ర మంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ కుట్రకు బలైంది అని పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ అన్నారు. శశి థరూర్, సునందల వివాహం వివాదస్పదంగా మారటానికి, తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె తెలిపారు. సునంద పుష్కర్ ఆత్మహత్య అనుమానస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సునందను భారత్ లో ఒకసారి, దుబాయ్ లో మరోసారి మాత్రమే కలుసుకున్నానని తరార్ వెల్లడించింది. మరో మహిళను తన ఎదుట శశి థరూర్ పొగడ్తలతో ముంచెత్తడం సునందకు ఇష్టం ఉండదని తెలిపింది. దాంతో తనను పొగడవద్దని శశికి సూచించానని తరార్ వెల్లడించారు. ట్విటర్ లో తనను శశి ఫాలోఅవుడం ప్రారంభించాకా.. సునంద తన అకౌంట్ ను ఫాలోఅవడం మానివేసిందని తరార్ అన్నారు. తనతో ఈ-మెయిల్ లో, ఫోన్ లో శశి మాట్లాడటం సునందకు అసలు ఇష్టం ఉండేది కాదన్నారు. తాను వాళ్లను కలువడానికి ముందే వారి మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని.. వారి జీవితంతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సునంద, శశి విడిపోతున్నారంటూ గత కొద్దికాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిపింది. ఆ వెలుగుతున్న కొవ్వొత్తుల ఫోటోను ప్రోఫైల్ గా మార్చి సునందకు తరార్ నివాళలర్పించారు. -
శశిథరూర్‌కు గుండెదడ
ఎయిమ్స్‌లో వైద్యపరీక్షల తర్వాత డిశ్చార్జ్ కేంద్రమంత్రి శశిథరూర్.. తన భార్య సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన కొన్ని గంటలకు శనివారం తెల్లవారుజామున గుండెదడ, ఛాతీనొప్పితో బాధపడుతూ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. హ–{దోగ నిపుణుల బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించి కొన్ని గంటలపాటు పరిశీలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని నిర్ధారించి మధ్యాహ్నానికి డిశ్చార్జ్ చేశారు. శశిథరూర్ (57) తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో.. అసౌకర్యం, గుండెదడతో ఆస్పత్రిలో చేరినట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి నీరజాబాట్లా మీడియాకు తెలిపారు. ‘‘ఆయనకు డయాబెటిస్ (సుగర్), అధిక రక్తపోటు ఉన్నట్లు ఇటీవల గుర్తించటం జరిగింది. ఆయనను వైద్య పరిశీలనలో ఉంచి.. కార్డియాలజిస్ట్‌ల బృందం పరీక్షించింది. ఈసీజీ, ఇతర పరీక్షలు నిర్వహించగా.. అంతా సవ్యంగానే ఉంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని ఆమె వివరించారు. శనివారం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ఆ తర్వాత వెల్లడించాయి. రేపు థరూర్ వాంగ్మూలం నమోదు న్యూఢిల్లీ: సునంద అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేపట్టిన సబ్‌డివిజినల్ మెజిస్ట్రేట్ అలోక్శర్మ.. సునంద కుమారుడు శివ్‌మీనన్‌తో పాటు, ఆమె సోదరుడి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు శనివారం రాత్రి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అలాగే.. శశిథరూర్ నివాసంలో పనిచేసే ఇద్దరు పనిమనుషుల వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు చెప్పారు. సునంద భర్త శశిథరూర్, కుటుంబ సభ్యులు ఆదివారం హరిద్వార్‌కు వెళుతున్నట్లు సమాచారం ఇచ్చారని.. కాబట్టి ఆయన వాంగ్మూలాన్ని సోమవారం నమోదు చేస్తామని అలోక్శర్మ తెలిపారు. ఎవరైనా మహిళ వివాహమైన ఏడేళ్ల లోపు మరణించిన పక్షంలో.. ఆమె మరణానికి ఏదైనా కుట్ర కారణమా అనేది దర్యాప్తు చేయాలన్న నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 176 కింద తాను దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. హోటల్ లాబీలో భార్యాభర్తల వాగ్వాదం: పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. వీరు చెప్పిన విషయాలను శశిథరూర్ సిబ్బంది చెప్పిన అంశాలకు సరిపోతున్నాయా లేదా అనే కోణంలో విశ్లేషిస్తున్నారు. థరూర్, సునందలు గురువారం హోటల్ సూట్లో దిగేముందు వేర్వేరుగా రెండు గదులు రిజర్వు చేసుకున్నారని.. కానీ తర్వాత ఒకే సూట్లోకి మారారని వినిపిస్తోంది. భార్యాభర్తలిద్దరి మధ్య హోటల్ లాబీలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సునంద మరణించిన హోటల్ సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరీక్షించారు. సునంద ఫోన్‌కాల్స్ వివరాల్ని, కొద్ది రోజులుగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఏదైనా వ్యాధికి చికిత్సలో భాగంగా తీసుకునే మందుల మోతా దు ఎక్కువవటం మరణానికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.