
ఏ రకం విషం.. ఎలాంటి ప్రభావం!
న్యూడిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ది హత్యేనని, ఆమెపై విషప్రయోగం జరగడంతోనే మరణించారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. ఏయే రకాల విషపదార్థాలు మానవ శరీరం మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో.. వాటివల్ల ఏమవుతుందో కూడా వైద్య నివేదికలో వెల్లడించారు. అవేంటో ఒక్కసారి చూద్దాం...
థాలియం
దీన్ని శరీరంలోని ద్రావణాల నుంచి వేరుచేయడం కష్టం. సాధారణంగా ఇది సోడియం, పోటాషియం లక్షణాలను కలిగి ఉంటుంది.
పోలోనియం 210
ఇది అరుదైన, అత్యంత రేడియోధార్మిక పదార్థం. దీనిని గుర్తించడం చాలా కష్టం. దీనిని చాలాతక్కువ మోతాదులో పౌడర్ రూపంలో లేదా ఏదైనా ద్రవపదార్థంలో కలిపి ఇచ్చినా అది ప్రాణాంతకమే అవుతుంది.
నీరియం ఆలెండర్ (గన్నేరు)
ఇది ఓలెన్రిన్ గ్లైకోసైడ్లను కలిగి ఉంటుంది. దీనిని ఇమ్యునో అస్సే పద్ధతి ద్వారా గుర్తించవచ్చు.
పాము విషం
ఇది చాలా త్వరగా అంతర్థానమైపోతుంది కాబట్టి రసాయన పరీక్షల ద్వారా దీనిని గుర్తించడం సాధ్యంకాదు. విష ప్రయోగం జరగలేదని టాక్సికాలజిస్టులు చెబితే అది పాము విషం కాకుండా ఇతర విషాలు లేవని మాత్రమే అర్థం. ఈ విషం ఓ ప్రొటీన్ కావడం వల్ల శరీరంలోని కణజాలాల నుంచి దీన్ని వేరుచేయడం సాధ్యం కాదు.
ఫొటోలబైల్ పాయిజన్స్
1. ఎర్గాట్ ఆల్కాయిడ్స్, ఫెనోథియాజైన్స్, లైసర్ గైడ్లు.. ఇవి చాలా సున్నితమైనవి. వెలుతురులో అవి కుళ్లిపోతాయి, అప్పడు వాటిని గుర్తించడం సాధ్యంకాదు.
2. హెరాయిన్: ఇది నీటితో కలిస్తే మోనోఎసిటైల్ మార్ఫిన్, మార్ఫిన్గా మారిపోతుంది కాబట్టి గుర్తించడం చాలా కష్టం.