
అందగాడైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అంతరంగపు వికృతరూపం త్వరలో ప్రత్యక్షమవబోతోందా! ఆయన భార్య సునందా పుష్కర్ హఠాన్మరణానికి సంబంధించి అతడిని వేలెత్తి చూపించే సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు వాదనల సమయంలో మళ్లొకసారి కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న పర్యవసానమే సునంద మరణం అనే అనుమానం బలపడుతోంది. తోపులాట కారణంగా సునంద శరీరంపై మొత్తం పదిహేను చోట్ల బలమైన గాయాలు అయినట్లు పోలీసులు గతంలోనే చార్జిషీటు దాఖలు చేశారు. పాకిస్తానీ మహిళా జర్నలిస్టుకు భర్త పంపిన ప్రణయ సందేశాలను చూశాక సునంద కోపం తట్టుకోలేకపోయారని, ఆ గొడవలో శశి థరూర్‌తో జరిగిన పెనుగులాటలో ఆమె గాయపడి, మరణించారని పోలీసులు గట్టిగా విశ్వసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment