న్యూఢిల్లీ: భార్య మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌కు చుక్కెదురైంది. తమ కూతురు సునంద పుష్కర్ చాలా ధ్రుడమైన మనిషి అని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ముందు ఇదే విషయం చెప్పారు. దీంతో శశిథరూర్ ఇరకాటంలో పడ్డట్టు అయ్యింది. తమ కుమార్తె సునంద హత్యకు గురయ్యిందని కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌కు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది.
ఢిల్లీ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరిగింది. హత్య చేశారని ఎలాంటి ఆధారాలు లేవని శశి తరఫు న్యాయవాది వికాస్ పావా కోర్టుకు విన్నవించారు. స్పెషల్ జడ్జి గీతాంజలి గోయెల్ ఇరు వైపు వాదనలు విన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా పడింది. అంతకుముందు దీనిపై వాదోపవాదనలు జరిగాయి. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కుటుంబసభ్యుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలు ఏ ఆధారంగా చెబుతున్నారని శశి తరఫు న్యాయవాది పావా ప్రశ్నించారు. కనీసం అదనపు కట్నం, వేధింపులపై ఒక్క ఆధారం కూడా లేదని పావా స్పష్టం చేశారు. ఓ విలాసవంతమైన హోటల్ 2014, జనవరి 17వ తేదీన సునంద పుష్కర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసులో శశి థరూర్‌పై కొన్ని కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment