సునందో హత్య కేసులో మహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష! | US woman faces 25 years in prison for killing Indian man | Sakshi
Sakshi News home page

సునందో హత్య కేసులో మహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష!

Published Tue, Mar 17 2015 9:03 AM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

సునందో హత్య కేసులో మహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష! - Sakshi

సునందో హత్య కేసులో మహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష!

న్యూయార్క్: యూఎస్లో భారతీయుడి సునందో సేన్ హత్య కేసులో ఆ దేశ మహిళ ఎరికా మెనెండెజ్కు క్వీన్స్ కోర్టు శిక్షను ఖరారు చేయనుందని సమాచారం. ఈ కేసులో నిందితురాలికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఈ కేసులో తుది తీర్పుని ఏప్రిల్ 29న వెలువరించనుంది. 2012, డిసెంబర్ 27న న్యూయార్క్ సబ్ వేలో సునందో సేన్ రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎరికా మెనెండెజ్ వెనక నుంచి వచ్చి సబ్ వేలో ప్రవేశిస్తున్న రైలు కిందకు తొసివేసింది.

ఈ ఘటనలో సునందో సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో ఎరికా మెనెండెజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ ఎరికా మెనెండెజ్ పోలీసులకు వెల్లడించింది. సెప్టెంబర్ 11, 2001 టెర్రరిస్టు దాడులు అనంతరం తాను హిందూ, ముస్లింలపైనా ద్వేషం పెంచుకున్నానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

నిందితురాలు ఎరికా మెనెండెజ్ క్వీన్స్ లో నివశిస్తుండగా 46 సంవత్సరాల సునందో సేన్ కూడా క్వీన్స్ లోనే ఒక చిన్న అపార్ట్ మెంట్లో  నివసిస్తున్నాడు. కొద్ది కాలం కిందట అమెరికాకు వలస వచ్చిన సునందో కొలంబియా  యూనివర్సిటీ వద్ద సొంతగా ఒక ప్రింటింగ్ అండ్ కాపియింగ్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడు అవివాహితుడు. సునందో హత్య జరిగే నాటికే భారత్లో నివసిస్తున్న అతడి తల్లిదండ్రులు చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement