Viral: Man Pushing Woman Onto Railway Tracks At New York - Sakshi
Sakshi News home page

Crime: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!

Published Tue, Jun 7 2022 2:52 PM | Last Updated on Tue, Jun 7 2022 4:19 PM

Man Pushing Woman Onto Railway Tracks At NewYork Viral - Sakshi

న్యూయర్క్‌లో ఒక రైల్వేస్టేషన్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన తాలుకా వీడియోని న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్(ఎన్‌వైపీడీ) సోషల్‌ మీడియాలో విడుదల చేస్తూ... అతని ఆచూకి తెలిపిన వారికి సుమారు రూ. 2 లక్షల పైనే పారితోషకం ఇస్తామని ఒక బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది

అసలేం జరిగిందటే న్యూయార్క్‌లోని ఒక సబ్‌వే స్టేషన్‌లో ఒక వ్యక్తి 52 ఏళ్ల మహిళను అనుసరిస్తూ... ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్‌వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు. దీంతో ఆమె స్టేషన్‌ పేవ్‌మెంట్‌కి గుద్దుకుని సబ్‌వే ట్రాక్‌లపై పడిపోయింది. అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు వెంటనే స్పందించి బాధిత మహిళకు సాయం అందించారు. ఐతే ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాపం ఆ మహిల మాత్రం తీవ్ర గాయలపాలైంది. దీంతో నిందుతుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ నిందుతుడు మాత్రం పరారీలోనే ఉన్నాడు.

దీంతో న్యూయర్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బేస్‌బాల్‌ క్యాప్‌ తోపాటు తెల్ల చొక్కా ధరించిన ఉన్నాడని అతని ఆచూకి తెలియజేయమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఘటన తాలుకా వీడియోని పోస్ట్‌ చేయడమే కాకుండా సమాచారం అందిచాలనుకుంటే ఈ నెంబర్‌కి డయల్‌ చేయండి అంటూ ఒక ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ కూడా ఇచ్చింది.

(చదవండి: రియల్‌ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement