Subway
-
ముంబైలో భారీ వర్షం.. అంథేరీ సబ్వే బంద్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ రహదారులలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయింది. ఫలితంగా అధికారులు ఈ సబ్వేను మూసివేశారు.ముంబైలో నేటి (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపైకి నీరు ప్రవేశించింది. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు విలేపార్లేలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రానున్న రోజుల్లో ముంబయిలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ వర్షాలు కరుస్తున్న దృష్ట్యా పలు పాఠశాలలు, కళాశాలను మూసివేశారు. Watch: Heavy rain in Mumbai has led to intense morning showers and four feet of water accumulation in the Andheri subway. The subway has been closed to traffic since 6: 30 AM. pic.twitter.com/jHcocRmTZY— IANS (@ians_india) July 20, 2024 -
‘నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు’?
దేశంలో పెరిగిపోతున్న టమోటా ధరలు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్‌చెయిన్ సంస్థల్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. టమోటా ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో మెక్‌డోనాల్డ్, సబ్వే తర్వాత ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ ఆహార పదార్థాల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా పేరుతో బర్గర్ కింగ్ ఫాస్ట్‌ఫుడ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా 400 స్టోర్లు ఉన్నాయి. అయితే, ఈ వారం దేశ ఆహార ద్రవ్యోల్బణం జనవరి 2020 నుండి అత్యధిక స్థాయికి చేరుకోవడంతో తమ ఆహార పదార్ధాల నుంచి టమోటాలను ఉపయోగించమని తెలిపింది. గత కొంత కాలంగా యూఎస్‌లోని ఫుడ్ లవర్స్‌కు ఉచిత చీజ్ ముక్కలను ఇవ్వడాన్ని బర్గర్ కింగ్ రద్దు చేసింది. కస్టర్లు అర్ధం చేసుకోవాలి ఇటీవల నా బర్గర్లలో టమోటాలు ఎందుకు లేవు? అంటూ కస్టమర్లు బర్గర్కింగ్ను ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిపై ఇటీవల ఆ సంస్థ స్పందించింది. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారింది. అందుకే ఆహార పదార్ధాలలో టమోటాల వినియోగించడం లేదు. కస్టమర్లు అర్ధం చేసుకోవాలి. ఆహార పదార్థాల్లో నాణ్యత, ప్రమాణాల్లో రాజీ పడం.. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాం’ అని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు అదే సమయంలో ప్రత్యర్థి డొమినోస్ తగ్గిపోతున్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు పిజ్జా ధరల్ని తగ్గించి అమ్ముతుంది. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత చవకైన పిజ్జాలు లభిస్తున్నాయని సమాచారం. చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి! -
తాత్కాలికంగా బంద్.. కస్టమర్లు మన్నించాలి.. మెక్‌డొనాల్డ్, సబ్వే షాకింగ్ నిర్ణయం!
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వారాలుగా ఎక్కడ విన్నా, ఏ వార్త చూసిన టమోట పేరే వినపడుతోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డ్ ధరలు పలకడంతో ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. దీని ధరలు దడపుట్టిస్తుండడంతో సామాన్య ప్రజలు వంటలో టమోటాకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. తాజాగా ఇంటర్నెషనల్ సంస్థలైన సబ్వే, మెక్‌డొనాల్డ్ కూడా టమోట దెబ్బను తట్టుకోలేక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారత్‌లో పలు సబ్వే అవుట్లెట్లు తమ సలాడ్స్, శాండ్‌విచ్‌ల్లో టమాటలను జోడించడం నిలిపివేశాయి. నాణ్యతా పరమైన అంశాలతో పాటు అధిక ధరల కారణంగా సబ్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పలు కారణాల వల్ల కిచెన్‌లోకి కావాల్సిన ప్రధానమైన వస్తువుల ధరలు 400 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా టమోట ధరలు కన్నీళ్లను తెప్పిస్తోంది. మరో వైపు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కొన్ని మార్కెట్లలో రికార్డు స్థాయికి దారితీసింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోని ఒక సబ్వే అవుట్లెట్ ఓ బోర్డులో ఇలా రాసుంది. " కస్టమర్లు మన్నించాలి. తాత్కాలికంగా టమోటాలు అందుబాటులో లేదని తెలిపింది. వీలైనంత త్వరగా టమోట సరఫరాలను పునరుద్ధరించడానికి తాము చురుకుగా పని చేస్తున్నామని అవుట్లెట్ కస్టమర్లకు హామీ ఇచ్చింది. భారతదేశంలోని సబ్వే అవుట్లెట్లలో దాదాపు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమైన అవుట్లెట్ల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా మరికొన్ని సబ్వే అవుట్‌లెట్స్‌లో టమాటాలను సర్వ్ చేయడం కొనసాగుతోంది. సబ్వే, మెక్‌డొనాల్డ్స్ బాటలోనే డామినోస్, కేఎఫ్‌సీ టమాటాల వాడకం తగ్గించాయి. చదవండి: ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి! -
లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్
చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త యాడ్ ఇంటర్నెట్లోసందడి చేస్తోంది. విశ్వనాథన్ ఆనంద్ నటించిన అమెరికా ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సబ్వే కొత్త యాడ్ వైరల్ నెటిజన్లు మనసు దోచుకుంది. సబ్వేలో ఆన్లైన్ ఆర్డర్ల గందరగోళానికి చెక్ చెబుతున్నట్టుగా ఉన్న ఆర్డరింగ్ మేడ్ సూపర్ సింపుల్ అంటున్న ఈ యాడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. (రిలయన్స్ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్) సబ్వే అవుట్‌లెట్‌లో గ్రాండ్‌మాస్టర్ ఆర్డర్ చేయడం, దానికి సంబంధించిన రొట్టె రకం, ఫిల్లింగ్‌లో ఉపయోగించాల్సిన కూరగాయలు సాస్‌లు మసాలా దినుసులపై సిబ్బంది ప్రశ్నలతో ఆనంద్కి చెమటలు పట్టేస్తాయి. చెస్‌లో పావులను అలవోకగా కదిపి అనేక విజయాలను సాధించిన ఆనంద్ ఆలోచనలో పడిపోతాడు. ఒక జీనియస్ కూడా సబ్ ఆర్డర్ చేయడం కష్టమే అన్న ట్యాగ్‌లైన్‌తో 30 సెకన్ల వీడియో లక్షల కొద్దీ వ్యూస్‌ను, రీట్వీట్లను సాధించింది. చక్కటి స్క్రిప్ట్‌తో, ఆనంద్ నటనతో భలే ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని సమయాల్లో మా పరిస్థితి కూడా అంతే అంటూ హిల్లేరియస్ కమెంట్స్ చేశారు. గత ఆరేడు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్నాము. ఎందుకంటే ఆ సమయంలో మెనూని మార్చాము. అలాగే దేశవ్యాప్తంగా చాలా స్టోర్లను కూడా తెరుస్తున్నాం. ఇది మెట్రో నగరాల్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరిస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ దుకాణాన్ని తెరుస్తాం. లేదా కొనుగోలు చేస్తున్నామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయూర్ హోలా వివరించారు. ఏమైనా తినాలి అనిపించ గానే..ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని ఆస్వాదించడం చాలా సాధారణంగా మారిపోయింది ఇపుడు. అయితే సబ్వేలో ఫుడ్ ఆర్డర్ చేయడం అంటే అదో గందరగోళం అనే ఫిర్యాదులు చాలా ఉన్నాయి. ఈ విషయాన్నే మెన్షన్ చేస్తూనే సబ్వే శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేయడం ఇపుడు చాలా సులువును అని తాజా యాడ్ లో పేర్కొంది. Admin paneer sub khaane gaya tha 😅 pic.twitter.com/4BqLUX3LdU — Viswanathan Anand (@vishy64theking) July 10, 2023 -
దారుణం: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!
న్యూయర్క్‌లో ఒక రైల్వేస్టేషన్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన తాలుకా వీడియోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) సోషల్ మీడియాలో విడుదల చేస్తూ... అతని ఆచూకి తెలిపిన వారికి సుమారు రూ. 2 లక్షల పైనే పారితోషకం ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది అసలేం జరిగిందటే న్యూయార్క్‌లోని ఒక సబ్వే స్టేషన్లో ఒక వ్యక్తి 52 ఏళ్ల మహిళను అనుసరిస్తూ... ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు. దీంతో ఆమె స్టేషన్ పేవ్‌మెంట్‌కి గుద్దుకుని సబ్వే ట్రాక్‌లపై పడిపోయింది. అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు వెంటనే స్పందించి బాధిత మహిళకు సాయం అందించారు. ఐతే ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాపం ఆ మహిల మాత్రం తీవ్ర గాయలపాలైంది. దీంతో నిందుతుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ నిందుతుడు మాత్రం పరారీలోనే ఉన్నాడు. దీంతో న్యూయర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బేస్‌బాల్ క్యాప్ తోపాటు తెల్ల చొక్కా ధరించిన ఉన్నాడని అతని ఆచూకి తెలియజేయమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఆఘటన తాలుకా వీడియోని పోస్ట్ చేయడమే కాకుండా సమాచారం అందిచాలనుకుంటే ఈ నెంబర్‌కి డయల్ చేయండి అంటూ ఒక ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. 🚨WANTED-ASSAULT: 6/5/22 approx. 4:40 PM, Westchester & Jackson Ave train station @NYPD40PCT Bronx. The suspect pushed a 52-year-old female victim on the tracks. Any info call us at 800-577-TIPS or anonymously post a tip on our website https://t.co/TRPPY5zHV2 Reward up to $3,500 pic.twitter.com/M8kflD010M — NYPD Crime Stoppers (@NYPDTips) June 7, 2022 (చదవండి: రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!) -
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం!
Brooklyn Subway Attack Details: అమెరికాలో న్యూయార్క్ నగరం కాల్పులతో ఉలిక్కి పడింది. బ్రూక్లిన్ సబ్ వే స్టేసన్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురి ప్రయాణికులపై ముసుగులో వచ్చిన ఆంగతకుడు విచ్చగల విడిగా కాల్పులు జరిపాడు. అంతకు ముందు స్మోకింగ్ గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ దాడిలో 13 మంది గాయపడినట్లు సమాచారం. ఎవరైనా చనిపోయారా? అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. అయితే.. రైల్వే స్టేషన్లో భారీ పేలుడు కూడా సంభవించినట్లు కథనాలు వస్తున్నాయి. ఘటనలో ఆరుగురు మరణించారని, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కథనాలను అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. అలాగే పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పలేదు. కానీ, న్యూయార్క్‌లో హైఅలర్ట్ మాత్రం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. బ్రూక్లిన్ ఫోర్త్ ఎవెన్యూ 36వ స్ట్రీట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్వే నుంచి భారీగా పొగలు వస్తుండడం, సహాయక చర్యల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రదాడేనా? కాదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్వై 1 న్యూస్ మాత్రం.. అనుమానితుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ముసుగులో గ్యాస్ మాస్క్‌తో దాడికి పాల్పడినట్లు కథనం ప్రచురించింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో రక్తపు మడుగులో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. In regard to the multiple people shot at the 36th Street subway station in Brooklyn, there are NO active explosive devices at this time. Any witnesses are asked to call @NYPDTips at #800577TIPS. Please stay clear of the area. More provided information when available. pic.twitter.com/8UoiCAXemB — NYPD NEWS (@NYPDnews) April 12, 2022 Very dramatic video from the incident as the subway arrived at 36th St Sunset Park in Brooklyn. #brooklyn #shooting #nyc pic.twitter.com/5cOdeYPIb1 — Kristoffer Kumm (@Kristofferkumm) April 12, 2022 🚨 Breaking 🚨 #Brooklyn subway shooting pic.twitter.com/0J2kcy0rXP — Malcom Boyce (@MeetMalcom) April 12, 2022 -
భారీ వర్షాలతో చైనా గజగజ.. వెయ్యేళ్లలో ఇదే తొలిసారి
చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు మంచెత్తాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత 1000 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. హెనాన్ ప్రావిన్స్‌లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో వీధులతో బాటు సబ్వే టన్నేల్లోకి నీరు చేరింది.అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. నీటిపై తేలియాడుతున్న కార్లు అధిక వర్షాల కారణంగా సెంట్రల్ చైనీస్ సిటీ జెంగ్ జూ లోని సబ్ వేలో వెళ్తున్న ఓ రైలు బోగీలో నడుములోతు నీరు చేరిండంతో 12 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అనేకమంది రైల్లో చిక్కుకుపోయారు. రైల్లో కూడా ఇంతటి వరదనీరు చేరడం ఎన్నడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేశంలో అనేక చోట్ల కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బ తిన్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ఉండాల్సిన కారులు నీటిపై పడవల్లా తేలియాడుతున్నాయి. మరో కొన్నిరోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. The videos shared on Chinese social media about the floodings in Henan following the heavy rain really show the severity of the situation. These are some of them. pic.twitter.com/zZMKxvAGAX — Manya Koetse (@manyapan) July 20, 2021 Heavy rain in #Zhengzhou, China. #floods pic.twitter.com/4Qv6R8FNZm — Sandeep Panwar (@tweet_sandeep) July 20, 2021 Heavy rain in #Zhengzhou, China. #floods pic.twitter.com/4Qv6R8FNZm — Sandeep Panwar (@tweet_sandeep) July 20, 2021 -
బ్రెడ్డులో పిసరంత షుగర్.. కోర్టు వద్దంది
డబ్లిన్: మనిషికి ఎల్లవేళలా రుచికరమైన ఆహారమే ప్రీతికరమైంది. తర్వాతే మిగతా పనీ పాట. ‘ఏం చేసినా దీని కోసమే కదా గురూ’ అని టైమ్‌కి క్యారేజ్‌ను ఓపెన్ చేసే పని సంస్కృతి బహుశా ఒక్క ఇండియాదే కాకపోవచ్చు. క్యారేజ్‌లు లేనివాళ్లకు నడిచి వెళ్తే ‘సబ్ వే’లు, నడవడం చేతకాకపోతే స్విగ్గీలు ఎలాగూ ఉంటాయి. ఏమైనా ప్రపంచ ప్రజలకు వేళకు తిండిపై ధ్యాస పెరిగి, ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతోంది! పౌరులపై పౌరులకు శ్రద్ధ తగ్గినప్పుడు ఆ శ్రద్ధ బాధ్యతను కూడా ప్రభుత్వాలే కదా తిండి మానేసైనా తీసుకోవలసింది. మన దేశంలోనే చూడండి.. తినే వాటి విషయంలో ముఖ్యమైనవేమీ మనం పట్టించుకోము కదా.. ప్రభుత్వం పట్టించుకుంది. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ లేకుండా చిన్న స్వీట్ ముక్కను కూడా అమ్మడానికి లేదని ఈ ఫస్ట్ నుంచి చట్టాన్ని తెచ్చింది. అలా ప్రజల ఆరోగ్య భద్రతను తన మీద కొంత ఉంచుకుని, మిగతా కొంత అమ్మేవాళ్ల మీద పెట్టింది. పౌరుల షుగర్ విషయంలో ఐర్లాండ్ ప్రభుత్వం మనకన్నా మరికాస్త శ్రద్ధగా ఉంది. అమెరికన్ తినుబండారాల గొలుసు కంపెనీ ‘సబ్ వే’ విక్రయిస్తున్న బ్రెడ్డులో పిసరంత షుగర్ ఎక్కువైందని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కోర్టు తక్కిన కేసులన్నీ పక్కకు నెట్టేసి సబ్ వే బ్రెడ్డు కేసును విచారించింది. పిసరంతే కదా అని తినేవాళ్లు అనుకోవచ్చు. సుప్రీంకోర్టుకు ఆ పిసరంత టూ మచ్ అనిపించింది. ‘చక్కెర పాళ్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది ముఖ్య ఆహారం (స్టేపుల్ ఫుడ్) అవదు. ముఖ్య ఆహారం కాదు కనుక దీనికి జీరో పర్సెంట్ వ్యాట్ వర్తించదు’ అని తీర్పు ఇచ్చింది. దీనర్థం ఏమిటి? ఆ బ్రెడ్డు తినకపోయినా ఆత్మారాముడు ఏమీ హర్ట్ అవడు, తిని షుగర్ తెచ్చుకుని తిప్పలు పడకండి అని చెప్పడం. చెబితే పౌరులు వినడం లేదు కాబట్టి.. షుగర్ తగ్గించకపోతే వ్యాట్ పడుతుంది జాగ్రత్త అని ‘సబ్ వే’ ను కోర్టు వారి ద్వారా లైన్లో పెట్టించింది ఐర్లాండ్ ప్రభుత్వం. -
ఆల్ప్స్ పర్వతాల కింద 57 కి.మీ. రైల్వే సొరంగం
అత్యంత పొడవైనదిగా రికార్డు ఎర్ట్స్‌ఫెల్డ్ (స్విట్జర్లాండ్): ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గాన్ని స్విట్జర్లాండ్‌లోని ఎర్ట్స్‌ఫెల్డ్‌లో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మార్గాన్ని ఆల్ప్స్ పర్వాతాల కింద నిర్మించారు. యూరప్ దేశాల మధ్య రవాణానుఇది మరింత సులభతరం చే స్తుంది. ‘గొత్థార్డ్ బేస్ టన్నెల్’గా పిలిచే దీని పొడవు 57 కి.మీ. కాగా, కొన్నిచోట్ల ఉపరితలానికి 2.3 కి.మీ దిగువన ఉంటుంది. ఈ మార్గంలో నడిచిన తొలి రైలులో ప్రయాణించిన వారిలో స్విస్ అధ్యక్షుడు స్నీడర్-అమ్మన్‌తోపాటు జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్, ఇటలీ ప్రధాని రెంజి కూడా ఉన్నారు. దీన్ని నిర్మించడానికి 17 ఏళ్లు పట్టింది. రూ.8,100 కోట్లు ఖర్చు చేశారు.ఇది డిసెంబరులో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్, ఇటలీలోని మిలాన్ మధ్య ప్రయాణ కాలం గంట తగ్గుతుంది. రైలు ఇందులో ప్రయాణించడానికి 20 నిమిషాలు పడుతుంది. ప్రస్తుతం జపాన్‌లోని సీకన్ సొరంగమార్గం (53.9 కి.మీ) పేరు మీదున్న రికార్డును గొత్థార్డ్ బేస్ టన్నెల్ బద్దలుకొట్టింది. -
‘ఆల్ప్స్’ అడుగున రైలు మార్గం
జెనీవా: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గానికి సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత ఆల్ప్స్ పర్వతాల కింద నిర్మిస్తున్న ‘గోథార్డ్ బేస్ టన్నెల్’ సొరంగ మార్గం దాదాపు పూర్తయింది. ఈ రైలు మార్గం పొడవు 57.4 కిలోమీటర్లు. యురీ దగ్గర్లోని ఎస్ట్ఫీల్డ్ నుంచి టిసినో సమీపంలోని బోడియో ప్రాంతానికి రైలు మార్గాన్ని నిర్మించారు. రెండు లేన్ల ఈ మార్గానికి రూ.82,000 కోట్లు ఖర్చయింది. సొరంగ తవ్వకాల్లో భాగంగా 2.8కోట్ల టన్నుల శిలలను తొలగించారు. కొత్త మార్గంలో జ్యూరిక్-మిలాన్ మధ్య రాకపోకలకు గంట సమయం తగ్గనుంది. పెద్దమొత్తంలో సరకు రవాణాకు ఈ మార్గం దోహదపడనుంది. 1947లోనే ఈ మార్గాన్ని నిర్మించాలని స్విస్ ఇంజనీర్ కార్ల్ ఎడ్వర్డ్ గ్రూనర్ ప్రణాళికలు రచించినప్పటికీ 1999 సంవత్సరంలోగానీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగలేదు. జూన్ 1న ప్రారంభవేడుక జరగనుంది. సర్వీసులు డిసెంబర్లో మొదలుకానున్నాయి. -
రైల్వే సేవలకు అంతరాయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో సబ్వే ఏర్పాట్ల కారణంగా రెండు రోజుల పాటు రైల్వే సర్వీసులకు అంతరాయం కలగనుంది. నల్లగొండ జిల్లా పరిధిలోని రామన్నపేట, వలి గొండ, నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లకు సంబంధించిన లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద పరిమిత ఎత్తులో సబ్‌వేలు ఏర్పాటు చే స్తున్న కారణంగా ఈనెల 7, 8 తేదీల్లో ఆయా స్టేషన్ల గుండా వెళ్లే రైలు సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.శ్రీరాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రెండు రోజు ల్లో రాత్రి 7:45 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:45 నిమిషాల వరకు రైలు సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా ఈ సబ్‌వేల ఏర్పాటు పనుల కారణంగా నాలుగు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాచిగూడ-మిర్యాలగూడ-పిడుగురాళ్ల డెమూ ప్యాసింజర్ రైలు ఈనెల 7వ తేదీన, పిడుగురాళ్ల-మిర్యాలగూడ-కాచిగూడ ప్యాసిం జర్ రైలును ఈ నెల 8వ తేదీన రద్దు చేస్తున్నట్టు వెల్లడిం చారు. అదేవిధంగా ఈనెల 7న కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ-రేపల్లె డెల్టా ప్యాసింజర్‌ను నల్లగొండ, నడికుడి రూటు నుంచి కాకుండా ఖాజీపేట, విజయవాడల మీదుగా గుంటూరు స్టేషన్‌కు మళ్లించి నట్టు తెలిపారు. అదే రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను నల్లగొండ, నడికుడి, గుంటూరు మీదుగా కాకుండా ఖాజీపేట, ఖమ్మంల మీదుగా విజయవాడకు మళ్లించినట్టు తెలిపారు.