![Subway aims to make ordering easier gets Viswanathan Anand for Hotsellers - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/12/Viswanathan%20Anand.jpg.webp?itok=MdyvmUAE)
చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త యాడ్ ఇంటర్నెట్‌లోసందడి చేస్తోంది. విశ్వనాథన్ ఆనంద్ నటించిన అమెరికా ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సబ్‌వే కొత్త యాడ్ వైరల్ నెటిజన్లు మనసు దోచుకుంది. సబ్‌వేలో ఆన్‌లైన్ ఆర్డర్ల గందరగోళానికి చెక్ చెబుతున్నట్టుగా ఉన్న ఆర్డరింగ్ మేడ్ సూపర్ సింపుల్ అంటున్న ఈ యాడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. (రిలయన్స్ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్)
సబ్‌వే అవుట్‌లెట్‌లో గ్రాండ్‌మాస్టర్ ఆర్డర్ చేయడం, దానికి సంబంధించిన రొట్టె రకం, ఫిల్లింగ్‌లో ఉపయోగించాల్సిన కూరగాయలు సాస్‌లు మసాలా దినుసులపై సిబ్బంది ప్రశ్నలతో ఆనంద్‌కి చెమటలు పట్టేస్తాయి. చెస్‌లో పావులను అలవోకగా కదిపి అనేక విజయాలను సాధించిన ఆనంద్ ఆలోచనలో పడిపోతాడు. ఒక జీనియస్ కూడా సబ్ ఆర్డర్ చేయడం కష్టమే అన్న ట్యాగ్‌లైన్‌తో 30 సెకన్ల వీడియో లక్షల కొద్దీ వ్యూస్‌ను, రీట్వీట్లను సాధించింది. చక్కటి స్క్రిప్ట్‌తో, ఆనంద్ నటనతో భలే ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని సమయాల్లో మా పరిస్థితి కూడా అంతే అంటూ హిల్లేరియస్ కమెంట్స్ చేశారు.
గత ఆరేడు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్నాము. ఎందుకంటే ఆ సమయంలో మెనూని మార్చాము. అలాగే దేశవ్యాప్తంగా చాలా స్టోర్లను కూడా తెరుస్తున్నాం. ఇది మెట్రో నగరాల్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరిస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ దుకాణాన్ని తెరుస్తాం. లేదా కొనుగోలు చేస్తున్నామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయూర్ హోలా వివరించారు.
ఏమైనా తినాలి అనిపించ గానే..ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని ఆస్వాదించడం చాలా సాధారణంగా మారిపోయింది ఇపుడు. అయితే సబ్‌వేలో ఫుడ్ ఆర్డర్ చేయడం అంటే అదో గందరగోళం అనే ఫిర్యాదులు చాలా ఉన్నాయి. ఈ విషయాన్నే మెన్షన్ చేస్తూనే సబ్‌వే శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేయడం ఇపుడు చాలా సులువును అని తాజా యాడ్ లో పేర్కొంది.
Admin paneer sub khaane gaya tha 😅 pic.twitter.com/4BqLUX3LdU
— Viswanathan Anand (@vishy64theking) July 10, 2023
Comments
Please login to add a commentAdd a comment