మాజీ చెస్ గ్రాండ్‌మాస్టర్(Chess Grandmaster) విశ్వనాథన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. 16వ ఏటనే జాతీయ ఛాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987లో ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ నేపథ్యంలోనే ఆయన గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. ఎంతటి విజేతకైనా అప్పడప్పడూ ఓటమి పలకరిస్తుంటుంది. తడబాటులు తప్పవు. అలాంటప్పుడూ ఒక్కసారిగా ఎదురయ్యే నైరాశ్యం నుంచి బయటపడేందుకు తన భార్య ఇచ్చిన పనిష్మెంట్ తనకు ఉపకరిస్తుందని అంటున్నారు ఆనంద్. అది తనకు పెద్ద 'గేమ్ ఛేంజర్' అని చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందామా..!
విశ్వనాథన్ ఆనంద్(Vishwanathan Anand) అర్జెంటీనాలో ఒక టోర్నమెంట్ (Tournament)లో ఆడుతున్నాడు. ఆ టోర్నమెంట్ గెలిచాడు కానీ ప్రారంభంలో రెండు పరాజయాలను ఎదుర్కొనక తప్పలేదు. అయితే అక్కడ ఆనంద్ చేసినవి చాలా సిల్లీ తప్పులట. దీంతో అతడి భార్య అరుణకు ఆయన మీద పిచ్చకోపం వచ్చి..ఈ రాత్రికి డిన్నర్ కావాలంటే.. ముందు చకచకా 50 పుష్‌అప్‌లు(Pushups) చేయండని ఆదేశించిందట.
అసలే ఓటమితో భారంగా ఉన్న ఆనంద్ చేసేదేమిలేక మారు మాట్లాడకుండా పుష్‌అప్‌లు చేసి తర్వాత డిన్నర్ కానిచ్చారట. ఆ తర్వాత బాడీ అలసిపోవడంతో మంచి నిద్ర పట్టేసిందట. మరుసటి రోజు ఆ ఓటమి తనని శారీరకంగా గానీ మానసికంగా(Mental) డిస్ట్రబ్ చేయలేదట.
దీంతో రిఫ్రెష్‌గా కొత్త ఎత్తులతో గేమ్ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపించాడట. అందుకే ఆయన శారీరక శిక్షణ అనేది చాలా పెద్ద గేమ్ ఛేంజర్ అని నమ్మకంగా చెబుతున్నారు. నిజానికి అందరూ చదరంగం ఒక మానసిక గేమ్ అని భావిస్తారు కానీ అది తెలియకుండానే ఫిజికల్ గేమ్‌గా మారుతుందని తన భార్య తరచు చెబుతుంటుందని అన్నారు. ఇక్కడ రికార్డులు బ్రేక్‌చేసే క్రీడాకారుడికి తప్పనిసరిగా శారీక బలం తోపాటు, మానసిక దృఢత్వం ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి ఆటల్లో ఓటమి తెలియని ఒత్తిడికి గురయ్యేలా చేసి అలసట తెప్పిస్తుందట. చెప్పాలంటే ఇక నావల్ల కాదనేలా కుంగిపోతారట. అలాంటప్పుడు శారీరక శిక్షణ వారిని ఉత్సాహవంతుడిగా మార్చి విజయాన్ని కైవసం చేసుకునేలా ప్రేరేపిస్తుందని వెల్లడించారు నిపుణులు. ఆ పనే ఇక్కడ ఆనంద్ భార్య అరుణా చేశారు. ఇక్కడ ఆతడి భార్య తన ఆర్థిక లావదేవీలు చూసే మేనేజర్‌గానే కాకుండా వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉండేలా చేసే శిక్షకురాలిగా సూచనలిచ్చింది.
ఫిట్‌నెస్, ఆరోగ్యం అనేవి మానసిక క్షేమంతో ముగిపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ అరుణ చెప్పిన పుష్ అప్‌లు ఏకగ్రాతతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మెదడు సహజ స్థితి పెంచేలా ఎండార్ఫిన్‌లను విడుదల చేసి ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుందని తెలిపారు. తద్వారా ఆయా వ్యక్తుల్లోని ఆత్మవిశ్వాసం పుంజుకుని, మనసును లక్ష్యంపై స్థిరంగా ఉండేలా చేస్తుందట.
ప్రయోజనాలు..
ఇది ఆటగాళ్లకే ఇంత ప్రయోజనాలందిస్తే..రోజువారీ టెన్షన్‌లు, ఆందోళనలతో నలిగిపోయే సామాన్యులకు కూడా ఇంకెన్ని ప్రయోజనాలను ఇవ్వగలదో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోర్ కండరాలను బలోపేతం చేయడమే గాక మొత్తం శరీరం, మనసును బలోపేతం చేసే వ్యాయామం ఇది. అయితే దీనిని సరైన విధంగా చేయాలి. ఇప్పుడే కొత్తగా మొదలుపెడుతున్నవారు.. వ్యాయామ నిపుణుల సలహాలు సంప్రదింపులతో చేయడం మంచిది.
(చదవండి: ముంచుకొస్తున్న హెచ్‌ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!)
Comments
Please login to add a commentAdd a comment