ఫిడే వరల్డ్ కప్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు ముప్పు తిప్పలు పెట్టిన భారత గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల ప్రజ్ఞానంద్ తల్లి దండ్రులకు తీపి కబురు అందించారు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర. సాధారణంగా క్రీడల్లొ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన స్పెషల్ ఎడిషన్ కార్లను ఇవ్వడం ఆయనకు అలవాటు. తాజాగా ప్రజ్ఞానంద విషయంలో మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఒక యూజర్ సలహాకు స్పందిస్తూ చాలా మంది, ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని కోరుతున్నారు. కానీ బుర్రలో మరో ఆలోచన ఉంది అంటూ ట్వీట్ చేశారు.
అంతేకాదు పనిలో పనిగా తల్లిదండ్రులు ఒక చక్కటి సలహా కూడా ఇచ్చాడు. వీడియో గేమ్‌లకు బదులుగా మేథస్సును పెంచే తమ పిల్లలకు చెస్ ఆటను నేర్పించాలనే సలహా ఇచ్చారు.ఈ నేపథ్యంలో తమ కుమారుడిని చిన్నప్నటినుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి, ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా, ప్రోత్సాహకంగా ప్రజ్ఞానంద పేరేంట్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. (రిలయన్స్ ఏజీఎం: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా)
అలా వారి ప్రోత్సాహంతో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి రమేష్‌బాబు గౌరవించనున్నారు. ఈ దంపతులకు మహీంద్ర XUV4OO EVని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి పరి శీలించాల్సిందిగా కంపెనీకి చెందిన రాజేష్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో తక్షణమే స్పందించిన రాజేష్ త్వరలోనే ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400 ప్రత్యేక ఎడిషన్ అందించనున్నట్టు వెల్లడించారు. దీంతో నెటిజన్లు అమేజింగ్ సార్ అంటూ ఆనంద్ మహీంద్రను ప్రశంసించారు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని, ఫైనల్‌లో పోరాడిన ఓడి ప్రజ్ఞానందను అభినందించారు. కాగా తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చిన్న వయసు నుంచి చెస్‌లో రాణిస్తూ చెస్ సంచలనంగా మారి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. (గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? )
Congratulations @rpragchess for your spectacular achievement.Thanks @anandmahindra for the idea of recognising PARENTS of @rpragchess Shrimati Nagalakshmi & Shri Rameshbabu.The All Electric SUV XUV400 would be perfect-our team will connect for a special edition and delivery
— Rajesh Jejurikar (@rajesh664) August 28, 2023
Comments
Please login to add a commentAdd a comment