
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా తయారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఎక్స్‌ఈవీ–9ఈ, బీఈ–6 సరికొత్త రికార్డు సృష్టించాయి. తొలి రోజు 30,179 యూనిట్ల బుకింగ్స్‌తో ఈవీ రైడ్‌కు సిద్ధం అయ్యాయి. ఎక్స్‌షోరూం ధర వద్ద వీటి విలువ రూ.8,472 కోట్లు. బుకింగ్స్‌లో ఎక్స్‌ఈవీ–9ఈ వాటా 56 శాతం నమోదైంది. ఈ రెండు మోడళ్లలో కలిపి అధిక సామర్థ్యం ఉన్న వేరియంట్స్‌కు వినియోగదార్లు మొగ్గుచూపారు. 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచిన ప్యాక్–3ని 73 శాతం కస్టమర్లు ఎంచుకున్నారు.
ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ బుకింగ్స్ నిదర్శనంగా నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 99,068 యూనిట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో మహీంద్రా కొత్త ఈవీల రికార్డు స్థాయి బుకింగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎక్స్‌ఈవీ–9ఈ, బీఈ–6 డెలివరీలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మోడళ్లూ 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్స్‌తో తయారయ్యాయి. ఒకసారి చార్జ్ చేస్తే వేరియంట్‌ను బట్టి 535–682 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment