SUVS
-
మహీంద్రా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే..
దేశీ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా బార్న్ ఎలక్ట్రిక్ విభాగంలో మొదటి కార్లను పరిచయం చేసింది. వీటి చిత్రాలను గతేడాదే విడుదల చేసినప్పటికీ తాజాగా వీటిని జనం ముందుకు తీసుకువచ్చింది. సరికొత్త రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్న మహీంద్రా బీఈ.05(BE.05), బీఈ.05 రాల్-ఈ(BE.05 RALL E), ఎక్స్‌యూవీ.ఈ9 (XUV.e9)లను ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల తయారీలో ప్రముఖమైన మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది ఆగస్ట్‌లో రెండు ఈవీ మోడళ్లను పరిచయం చేసింది. స్కార్పియో-ఎన్, అప్‌గ్రేడెడ్ థార్, ఎస్యూవీ700, అప్‌గ్రేడెడ్ బొలెరో వాహనాలు విజయవంతం కావడంతో మంచి ఊపు మీద ఉంది. ఎక్స్‌యూవీ.ఈ9, బీఈ.05లను భవిష్యత్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో కీలకమైనవిగా కంపెనీ భావిస్తోంది. ఎక్స్‌యూవీ.ఈ9 సిరీస్‌లో రెండు వర్షన్లు ఉంటాయి. అలాగే మూడు ఎక్స్‌యూవీ బీఈ మోడళ్లలో బీఈ.05 ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్గ్లో ఫ్లాట్‌ఫాం ఈ కార్లకు ఫౌండేషన్‌గా వ్యవహరిస్తుంది. వీటి ఉత్పత్తి 2024 డిసెంబర్లో ప్రారంభమై 2025లో మార్కెట్లోకి వస్తాయని మహీంద్రా సంస్థ తెలిపింది. చదవండి: మారుతీ సుజుకీ టూర్–ఎస్.. అత్యధిక మైలేజీ ఇచ్చే సెడాన్ ఇదే.. From race to road to off-road. Meet BE-Rall.e. #ExploreBeyondBoundaries#ExploreTheImpossible #MahindraEVFashionFestival pic.twitter.com/iync6HOGZ5 — Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2023 Meet XUV.e9. #MahindraEVFashionFestival pic.twitter.com/xIMuhb1Jpe — Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2023 Welcome to a reimagined world. Say hello to BE.05 #BEV #MahindraEVFashionFestival #GrandHomecoming pic.twitter.com/xklpvl4xYh — Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2023 -
ఎలక్ట్రిక్ ఎస్యూవీ: కొత్త అధ్యాయానికి మహీంద్ర, టీజర్ అదిరింది
సాక్షి,ముంబై: ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో వేగంగా దూసుకొవస్తోంది. ఈ క్రమంలో దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త చరితను లిఖించేందుకు సిద్దపడుతోంది. దీనికి వరుస టీజర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో టీజర్‌ను మహీంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బోర్న్ ఎలక్ట్రిక్ విజన్ కింద ఐదు విభిన్న ఆల్ ఎలక్ట్రిక్ -ఎస్యూవీ కాన్సెప్ట్‌లను ఆవిష్కరింనుంది మహీంద్ర. వీటిని ఆగస్ట్ 15, ప్రపంచ ప్రీమియర్ వేడుకలో ఘనంగా పరిచయం చేయనుంది. ఈ ఎస్‌యూవీలకు సంబంధించిన ఇప్పటికే తన కార్ల డిజైన్లను హైలైట్ చేస్తూ కొన్ని టీజర్లు వదిలిన సంగతి తెలిసిందే. మహీంద్రా తాజా టీజర్లో ఇన్-కార్ కనెక్టివిటీ ఫీచర్లను సూచనప్రాయంగా వెల్లడించింది. డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మ్యూజిక్, యాంబియంట్ లైటింగ్ వాటిపై కూడా హింట్ ఇచ్చింది. ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో డిజిటల్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కామన్‌గా అందింస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే వీటి ఫీచర్లను పెద్దగా వెల్లడించకపోయినప్పటికీ మునుపటి టీజర్ల ప్రకారం కొత్త మోడళ్లలో కూపే, కాంపాక్ట్ SUVలు, మిడ్-సైజ్, ఫాస్ట్‌బ్యాక్‌గా ఉండనున్నాయి. అలాగే రానున్న అయిదేళ్లలో ఈ ఐదింటినీ రిలీజ్ చేయనుందని ఒక అంచనా. ఈ ప్యూర్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మాత్రమే కాదు, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌ని కూడా విడుదల చేయనుంది. టాటా నెక్సాన్ EV మ్యాక్స్, MG ZS EV వంటి నేటి తరం ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రడీ అవుతోంది. ఇప్పటీకే రోడ్లపై పరీక్షిస్తున్న ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2022 చివరలో లాంచ్ చేయనుంది. -
అమ్మకాల్లో దుమ్ము లేపిన హ్యుందాయ్
సాక్షి, ముంబై: భారత్‌లో తయారు చేసిన ఎస్‌యూవీలు పది లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు సోమవారం కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తెలిపింది. ఈ మొత్తం విక్రయాల్లో క్రెటా ఎస్యూవీ సింహభాగాన్ని ఆక్రమించినట్లు కంపెనీ పేర్కొంది. 2005లో విడుదలైన క్రెటా ఇప్పటి వరకు 5.9 లక్షల అమ్మకాలు దేశీయ మార్కెట్లోనూ, 2.2 లక్షల యూనిట్లు విదేశీ మార్కెట్లో అమ్ముడైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక 2019లో విడులైన వెన్యూ ఎస్యూవీ మొత్తం అమ్మకాలు 1.8 లక్షలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్యూవీ రంగంలో విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో ఈ ఘనతను సాధించామని కంపెనీ డెరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా భారత్‌లోనే ఎస్‌యూవీలను తయారీ చేస్తున్న సంగతి గార్గ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మోత మోగనున్న కార్ల ధరలు
న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లగ్జరీకార్లు, ఎస్‌యూవీలపై పన్ను భారాన్ని విధించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేవంలో నిర్ణయం జరిగింది. కొత్త జీఎస్టీ చట్టం కింద 15 శాతం నుంచి 25 శాతం వరకు మధ్యతరహా, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, వ్యాట్ లాంటి స్థానంలో జులై 1 నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి రావడంతో చాలా వివిధ కార్ల ఉత్పత్తి సంస్థలు తమ ఎస్యూవీ, తదితర లగ్జరీ కార్ల ధరలను రూ 1.1 లక్షలు, రూ .3 లక్షల మధ్య తగ్గింది. తాజా నిర్ణయంతో ఈ ఇది రివర్స్ కానుంది. ప్రస్తుతం అమలవుతున్న సెస్ 15నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల ధరలు మోత మోగనున్నాయి. మరోవైపు ఈ సెస్ పెంపు నేపథ్యంలో మారుతీ, టాటా మోటార్స్ షేర్లు 1 శాతం చొప్పున ఎగిశాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్ అమలు కానుంది. సెస్ పెంపు కారణంగా ఈ మేరకు పలు పెద్ద(విలాసవంత) కార్ల ధరలు పెరగనున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. అయితే సెప్టెంబర్ 9న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత దీనిపై నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం, అనంతరం పార్లమెంట్ అమోదం లభించాల్సి ఉంటుంది. -
రిలాక్స్: బడ్జెట్లోనే పెద్ద కార్ల ధరలు!
న్యూఢిల్లీ : పెద్ద కార్లకు రెక్కలు రాబోతున్నాయని, త్వరలోనే ఎస్యూవీ, లగ్జరీ కార్లపై ప్రభుత్వం సెస్‌ను మరింత పెంచనుందని గత రెండు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 15శాతంగా ఉన్న సెస్‌ను 25 శాతం మేర పెంచుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే మీ బడ్జెట్‌కు మించి కార్లపై పన్ను రేట్లను పెంచదని టాప్ అధికారి చెప్పారు. మిడ్‌సైజ్, పెద్ద కార్లపై, ఎస్‌యూవీలపై 50 శాతానికి మించి జీఎస్టీ పెంచరని, అంటే 25 శాతం కంటే తక్కువగానే సెస్‌ను ప్రభుత్వం విధిస్తుందని తెలిపారు. ఒక్కసారిగా సెస్ పెంచబోతున్నారంటూ వార్తలు రావడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జీఎస్టీ అమలు తర్వాత పన్ను రేట్లు తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించామని, గరిష్టంగా రూ.3 లక్షల వరకు ధరలు తగ్గించినట్టు కార్ల సంస్థలు చెప్పాయి. కానీ తాజాగా ఎక్కువ సెస్ విధింపుతో పన్ను రేట్లను పెంచుతుండటంతో, మళ్లీ కార్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటూ వాపోయాయి. అయితే జీఎస్టీ నష్టపరిహారాల చట్టంలో తీసుకురాబోతున్న సవరణలలో మొత్తం పన్ను రేట్లు 50 శాతం కంటే తక్కువగానే ఉంచేలా చేస్తారని టాప్ అధికారి చెప్పారు. సెస్ పెంపు కూడా ఒకేసారి ఉండదని ఆ అధికారి తెలిపారు. అంతేకాక ఆగస్టు 12తో ముగుస్తున్న ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దీనికి ఆమోదం లభించకపోతే, ప్రభుత్వం ఈ సెస్ పెంపుపై ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. జీఎస్టీకి ముందు మిడ్ సైజు సెడాన్లపై 47 శాతం, ఎస్‌యూవీలపై 55 శాతానికి పైగా పన్ను రేట్లు ఉన్నాయి. కానీ జీఎస్టీ రావడంతో ఈ పన్ను రేట్లు 43 శాతానికి తగ్గాయి. -
ఎస్యూవీ, లగ్జరీ కార్లపై సెస్ బాదుడు
న్యూఢిల్లీ : స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు(ఎస్‌యూవీలు), టాప్-ఎండ్ లగ్జరీ కార్లను కొనుక్కోవాలని యోచిస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి. మరికొంతకాలం ఆగితే ఈ కార్లపై సెస్ మోతెక్కనుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ వాహనాలపై సెస్‌ను మరింత పెంచాలని నిర్ణయిస్తోంది. ప్రస్తుతమున్న 15 శాతం సెస్‌ను 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఎస్‌యూవీలు, హై-ఎండ్ కార్లపై 28 శాతం జీఎస్టీ ఉంది. అన్ని సెస్‌లను కలుపుకుని మొత్తంగా 43 శాతం పన్నులను కార్ల తయారీసంస్థలు భరిస్తున్నాయి. కానీ చట్టాని సవరణ చేసి దీన్ని 53 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కస్టర్డ్ ఫౌడర్ , ఇడ్లి, దోష నుంచి విగ్రహాలు, ప్రార్థన పూసల వరకు స్థానికుడు ఎక్కువగా వాడే ఉత్పత్తుల రేట్లను తగ్గించడానికి, ఎస్యూవీ, లగ్జరీ కార్లపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చాలా ఉత్పత్తులకు తక్కువ లెవీలను విధిస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ముందజలో ఉంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ హైదరాబాద్‌లో సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో వీటిపై నిర్ణయాలు తీసుకోనుంది. సిగరెట్ల మాదిరిగానే హై-ఎండ్ కార్లపైనా కూడా సెస్‌ను పెంచాలని ప్రభుత్వం చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ మార్పులు వెంటనే చోటుచేసుకోవని, సెస్‌ను పెంచాలంటే శాసన సవరణలు అవసరం పడతాయని పేర్కొంటున్నాయి. కార్లపై విధించే ఎక్కువ లెవీతో, జీఎస్టీ అమలుతో భారీగా రెవెన్యూలు కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారాల ఫండ్ చెల్లించడానికి ఉపయోగించాలని ప్రభుత్వ వర్గాలు చూస్తున్నాయి. ప్రస్తుతం చిన్న కార్లపై 28 శాతం పన్ను, 1 శాతం సెస్ ఉంది. వాటిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవు. 350-500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న బైకులపై 3 శాతం సెస్‌ను విధిస్తున్నారు. కాగ, తదుపరి రివ్యూ మీటింగ్‌లో లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై కూడా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. -
ఇక మోత మోగనున్న వాహన ప్రీమియం
న్యూఢిల్లీ : మిడ్ సైజ్డ్ కార్లకు, ఎస్‌యూవీలకు, మోటార్ సైకిళ్లకు, కమర్షియల్ వెహికిల్స్ కు ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు మోత మోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ వాహనాలపై 50 శాతం ప్రీమియం పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. అయితే చిన్న కార్లకున్న(1,000సీసీ వరకున్న) థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఐఆర్డీఏఐ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కార్లకు ప్రస్తుతమున్న రూ.2,055 ప్రీమియంనే కొనసాగించనుంది. మిడ్ సైజ్డ్ కార్లు(1000-1500సీసీ), ఎస్‌యూవీలు, పెద్ద కార్లకు మాత్రమే 50 శాతం ప్రీమియంను పెంచాలని ఐఆర్డీఏఐ నిర్ణయించింది. 1000సీసీ వరకున్న కార్లకు రూ.3,355, పెద్ద వాటికి రూ.9,246 వరకు ప్రీమియం రేట్లను ఐఆర్డీఏఐ పెంచనుంది. అదేవిధంగా స్పోర్ట్స్ బైక్, సూపర్ బైక్స్ 350సీసీ కంటే ఎక్కువున్న వాటికి ప్రీమియం ప్రస్తుతమున్న రూ.796 నుంచి రూ.1,194కు పెరగనుంది. ఎంట్రీ లెవల్ బైక్స్(77-150 సీసీ) కూడా ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. 6హెచ్‌పీ వరకున్న ట్రాక్టర్స్ కు ఇక ప్రీమియం రూ.765. ఈ-రిక్షాల ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్లాన్ చేస్తోంది. -
ఎస్‌యూవీలతో నిస్సాన్ పరుగులు
ముంబై : భారత్ రోడ్లపై మరిన్ని ఎస్ యూవీలను పరుగులు పెట్టించాలని జపాన్ ప్రముఖ కార్ల తయారీదారి నిస్సాన్ భావిస్తోంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(ఎస్ యూవీ)లపై, క్రాస్ ఓవర్స్ పై ఎక్కువగా దృష్టి సారించి, వచ్చే నాలుగేళ్లలో 5శాతం మార్కెట్ షేరును చేజిక్కించుకోవాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అంచనాల తగ్గట్టూ తన మార్కెట్ షేరు లేకపోవడంతో, తన ఫర్ ఫార్మెన్స్ ను పెంచుకోవాలని నిర్ణయించింది. గత మంగళవారమే డాట్సన్ నుంచి క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ రెడీ-గో ను ప్రవేశపెట్టిన నిస్సాన్, వచ్చే మూడేళ్లలో మరో మూడు కొత్త కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అన్ని విభాగాల్లో తన హవా చాటాలని నిస్సాన్ చూస్తోందని కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టబోయే సరికొత్త ఎక్స్ ట్రయల్ ప్రీమియం ఎండ్ వాహనానికి రెడీ-గోను ఎంట్రీ లెవల్ గా నిస్సాన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో కొత్త కార్ డాట్సన్ గో క్రాస్, కోడ్ నేమ్డ్ ఈఎమ్2 ను 2019లో భారత రోడ్లపై పరుగు పెట్టించాలని నిస్సాన్ భావిస్తోంది. ఈ కారు ధరను ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మారుతీ సుజుకీ విటారా బ్రిజా ధరకు సమానంగా రూ.5 లక్షల నుంచి రూ. 10లక్షల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. మరో ఎస్ యూవీ వెహికిల్ పీబీ1డీను హ్యుందాయ్ క్రిటాకు సమానంగా రూ.8లక్షల నుంచి రూ.15లక్షల మధ్యలో భారత్ లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఎస్ యూవీ వెహికిల్స్ పై నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ ఎక్కువగా దృష్టిపెట్టనుందని భారత కార్యకలాపాల అధ్యక్షుడు గిలామ్ సికార్డ్ కూడా వెల్లడించారు. -
జోరుగా ఎస్‌యూవీల అమ్మకాలు!
న్యూఢిల్లీ : స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ కు భారత్ లో ఫుల్ క్రేజ్ పెరుగుతోంది. డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఈ వెహికిల్స్ ఎక్కువగా అమ్మకాల జోరు కొనసాగించాయి. మార్చి 31 నాటికి వీటి అమ్మకాలు 6.25 శాతం పెరిగి 5.86 లక్షలుగా నమోదయ్యాయి. డిసెంబర్-మార్చి కాలంలో 12.69 శాతం అమ్మకాలు జరిగాయని భారత ఆటోమొబైల్ తయారీ సొసైటీ తెలిపింది. ఈ వెహికిల్స్‌లో వాడే ఇంధన విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఈ కార్లు ఎక్కువగా అమ్మకాలు నమోదవ్వడం విశేషం. డిసెంబర్ నుంచి ఇంజన్ కెపాసిటీ 2000సీసీ కంటే ఎక్కువగా ఉన్న వాహనాలపై డిల్లీ- జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) లో నిషేధం కొనసాగుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో కార్ల కంపెనీలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. వాహనాల్లో వాడే ఇంధనం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని, కాలుష్యం పెరుగుందని పర్యావరణ వేత్తలు వాదిస్తున్నారు. తుది తీర్పు వచ్చే వరకూ ఈ నిషేధం ఇలానే కొనసాగుతుందని అపెక్స్ కోర్టు ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఈ నెల 30వ తేదీ ఈ నిషేధంపై తుది విచారణ చేపట్టనున్నారు. కాగా, యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాల పెరుగుదల కోర్టు కేసులో ఏ మాత్రం ప్రభావం చూపదని పర్యావరణ వేత్తలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కొత్త గా ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ యుటిలిటీ కార్ల మోడళ్లు ఎక్కువగా అమ్మకాలు నమోదు చేస్తున్నాయి.ఇంజన్ సామర్థ్యం 2000 సీసీ కంటే తక్కువతో మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్ టీయూవి300, నూవో స్పోర్ట్, విటారా బ్రీజ్ కార్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. దీంతో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. -
మహీంద్రా.. రెక్స్టన్ ఆర్ఎక్స్6
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారమిక్కడ భారత మార్కెట్లో సాంగ్యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్6 మోడల్‌ను ఆవిష్కరించింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఖరీదైన వాహనాన్ని రూపొందించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.20.11 లక్షలు. ముందువైపు, ఇరు పక్కల కూడా ఎయిర్‌బ్యాగ్స్‌ను ఉంచారు. మలుపుల్లో, అలాగే కొండ ప్రాంతాల్లో వాహనం జారకుండా స్థిరంగా ఉండేలా వ్యవస్థ ఉంది. ప్రీమియం లెదర్‌తో ఇంటీరియన్‌ను తీర్చిదిద్దారు. టిల్ట్, ఓపెన్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌ను అమర్చారు. నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇప్పటికే రెక్స్టన్ నుంచి ఆటో ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్7 (రూ.21.28 లక్షలు), మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఆర్ఎక్స్5 (రూ.19 లక్షలు) మోడళ్లున్నాయి. ఈ రెండు మోడళ్లలో లేని 17 రకాల ఫీచర్లను ఆర్ఎక్స్6లో పొందుపరిచారు. మరో ఆరు ఇంజిన్లపై.. సాంగ్యాంగ్తో కలిసి ఆరు ఇంజిన్ల తయారీలో నిమగ్నమైనట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సేల్స్ చీఫ్ అరుణ్ మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. వీటిని రెండు కంపెనీలూ వినియోగిస్తాయని, మూడేళ్లలో సిద్ధమవుతాయని చెప్పారు. హై ఎండ్, లగ్జరీ ఫీచర్లతో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్‌ను వినియోగదారులు కోరుతున్నందునే ఆర్ఎక్స్6ను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. హై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల పరిమాణం దేశంలో 2013-14లో 23,665 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 26,208 యూనిట్లు. ఈ విభాగంలో మహీంద్రా రెండో స్థానంలో ఉంది.