ఇక మోత మోగనున్న వాహన ప్రీమియం
ఇక మోత మోగనున్న వాహన ప్రీమియం
Published Mon, Mar 6 2017 3:34 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
న్యూఢిల్లీ : మిడ్ సైజ్డ్ కార్లకు, ఎస్యూవీలకు, మోటార్ సైకిళ్లకు, కమర్షియల్ వెహికిల్స్ కు ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు మోత మోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ వాహనాలపై 50 శాతం ప్రీమియం పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. అయితే చిన్న కార్లకున్న(1,000సీసీ వరకున్న) థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఐఆర్డీఏఐ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కార్లకు ప్రస్తుతమున్న రూ.2,055 ప్రీమియంనే కొనసాగించనుంది.
మిడ్ సైజ్డ్ కార్లు(1000-1500సీసీ), ఎస్యూవీలు, పెద్ద కార్లకు మాత్రమే 50 శాతం ప్రీమియంను పెంచాలని ఐఆర్డీఏఐ నిర్ణయించింది. 1000సీసీ వరకున్న కార్లకు రూ.3,355, పెద్ద వాటికి రూ.9,246 వరకు ప్రీమియం రేట్లను ఐఆర్డీఏఐ పెంచనుంది. అదేవిధంగా స్పోర్ట్స్ బైక్, సూపర్ బైక్స్ 350సీసీ కంటే ఎక్కువున్న వాటికి ప్రీమియం ప్రస్తుతమున్న రూ.796 నుంచి రూ.1,194కు పెరగనుంది. ఎంట్రీ లెవల్ బైక్స్(77-150 సీసీ) కూడా ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. 6హెచ్పీ వరకున్న ట్రాక్టర్స్ కు ఇక ప్రీమియం రూ.765. ఈ-రిక్షాల ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్లాన్ చేస్తోంది.
Advertisement
Advertisement