
న్యూఢిల్లీ: పోర్ట్‌ఫోలియోలకు హెడ్జింగ్‌గా డెరివేటివ్స్‌ను వినియోగించుకునేందుకు బీమా కంపెనీలను వీలు చిక్కింది. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఇందుకు తాజాగా అనుమతించింది. బీమా రంగ సంస్థల వినతులమేరకు ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా హెడ్జింగ్‌కు తెరతీసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
వెరసి ఆటుపోట్లను చవిచూస్తున్న క్యాపిటల్ మార్కెట్‌లో రిస్కులను తగ్గించుకునేందుకు వీలు కల్పించింది. ప్రస్తుత హెచ్చుతగ్గుల క్యాపిటల్ మార్కెట్లలో హెడ్జింగ్ చేపట్టడం ద్వారా ఈక్విటీ పోర్ట్‌ఫోలియోల రిసు్కలను తగ్గించుకునేందుకు బీమా కంపెనీలకు దారి ఏర్పడింది.
తద్వారా ఈక్విటీ పెట్టుబడులను సంరక్షించుకునేందుకు ఐఆర్‌డీఏ మద్దతిస్తోంది. బీమా కంపెనీలు ఫార్వార్డ్ రేట్ అగ్రిమెంట్స్, ఇంటరెస్ట్ రేట్ స్వాప్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఇంటరెస్ట్ ఫ్యూచర్స్ ద్వారా రుపీ ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ప్రస్తుత నిబంధనలు అనుమతిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment