Derivatives
-
డెరివేటివ్స్అంటే దడే!
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(డెరివేటివ్స్) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ను పెంచారు. దీంతో సెక్యూరిటీల ఆప్షన్ విక్రయంపై ప్రస్తుతమున్న ఆప్షన్ ప్రీమియంలో 0.625 శాతం పన్ను 0.1 శాతానికి పెరగనుంది. ఇక సెక్యూరిటీల ఫ్యూచర్స్ విక్రయంపై సైతం 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుంచి పన్ను పెంపు అమల్లోకి రానుంది.నిజానికి ఎఫ్‌అండ్‌వో విభాగంలో ఇటీవల కొంతకాలంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సెబీ, ఆర్థిక శాఖ, స్టాక్ ఎక్సే్ఛంజీలతోపాటు ఆర్థిక సర్వే సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డెరివేటివ్స్ విభాగంలో రిటైలర్ల పారి్టసిపేషన్ భారీగా పెరిగిపోతుండటంతో జూదానికి దారితీస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సీతారామన్ ఎఫ్‌అండ్‌వో లావాదేవీలపై పన్నులను పెంచేందుకు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఇటీవలే ఎఫ్‌అండ్‌వో లావాదేవీలు పెరుగుతుండటంపై రిటైలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రిటైలర్లను డెరివేటివ్స్ అత్యధికంగా ఆకట్టుకుంటున్న కారణంగా విశ్లేషకులు సైతం రిస్కులను అర్ధం చేసుకోగలిగినవాళ్లు మాత్రమే లావాదేవీలను చేపట్టమంటూ అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు వీటిని చేపట్టకపోవడమే మేలని సూచిస్తున్నారు. టర్నోవర్ దూకుడు డెరివేటివ్స్ విభాగంలో నెలవారీ టర్నోవర్ 2024 మార్చికల్లా కొన్ని రెట్లు ఎగసి రూ. 8,740 లక్షల కోట్లను తాకింది. 2019 మార్చిలో కేవలం రూ. 217 లక్షల కోట్లుగా నమోదుకావడం గమనార్హం! ఇదే కాలంలో నగదు విభాగంలోనూ రోజువారీ సగటు టర్నోవర్ రూ. లక్ష కోట్లను తాకగా.. ఎఫ్‌అండ్‌వోలో రూ. 330 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్‌అండ్‌వో అంటే? ఒక షేరు లేదా కమోడిటీ విలువ ఆధారంగా కుదుర్చుకునే తాత్కాలిక కాంట్రాక్ట్‌ల లావాదేవీలను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌గా పేర్కొనవచ్చు. అత్యధిక శాతం ట్రేడర్లు రిసు్కల రక్షణ(హెడ్జింగ్)కు, ధరల కదలికలపై అంచనాలు, షేర్లు లేదా కమోడిటీల ధర వ్యత్యాసాల లబ్ధికి సైతం వీటిలో లావాదేవీలను చేపడుతుంటారు. వెరసి వీటిని స్వల్పకాలిక లాభార్జనకు స్పెక్యులేటివ్ టూల్‌గా వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్ ఆటుపోట్లు, లెవరేజ్.. తదితర రిస్క్‌ల కారణంగా అత్యధికస్థాయిలో నష్టాలు సైతం వాటిల్లుతుంటాయి.సెబీ ఇటీవలి నివేదిక ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లలో 89 శాతంమంది డెరివేటివ్స్‌లో నష్టపోతున్నారు. 2021–22 ఏడాదిలో వీరికి సగటున రూ. 1.1 లక్ష చొప్పున నష్టాలు నమోదయ్యాయి. కరోనా కాలంలో ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్ల సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. 2019లో ఈ సంఖ్య 7.1 లక్షలుకాగా.. 2021కల్లా 45.24 లక్షలకు జంప్‌చేసింది.5 రెట్లు అధికమైనా.. డెరివేటివ్స్‌లో ఎస్టీటీ 5 రెట్లు పెరగనున్నట్లు సిట్రస్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఈ విభాగంలో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో పన్ను పెంపు ఊహించిందేనని తెలియజేశారు.అయితే పన్ను పెంపు అమల్లోకిరానున్న 2024 అక్టోబర్ 1 నుంచి ఎక్సే్ఛంజీల టర్నోవర్ చార్జీలు తగ్గనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ డిజిటల్ బిజినెస్ హెడ్ ఆశిష్ నందా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆప్షన్స్‌పై రూ. 10,000 రౌండ్ ట్రిప్ ప్రీమియంపై ఎస్టీటీ రూ. 3.75 పెరుగుతుందనుకుంటే.. టర్నోవర్ చార్జీలు రూ. 3.5–4 స్థాయిలో తగ్గనున్నట్లు వివరించారు. దీంతో నికరంగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఎల్‌టీసీజీలో సవరణలుకేంద్రానికి రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయంబడ్జెట్లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్ కాలావధి ఆధారంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లను క్రమబదీ్ధకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్ ఫైనాన్షియల్ ఆస్తుల హోల్డింగ్‌తోపాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్ ఆస్తుల హోల్డింగ్స్ దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (ఎల్టీసీజీ) జాబితాలో చేరనున్నాయి.అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి(వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.అయితే ఇండెక్సేషన్ లబ్ధిని ఎత్తివేశారు. ఎల్టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచారు. కాగా... మూలధన లాభాలపై పన్ను(క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) రేట్ల సవరణ కారణంగా రూ. 15,000 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరే వీలున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అంచనా వేశారు. బైబ్యాక్ షేర్లపైనా పన్నుడివిడెండ్ తరహాలో విధింపు బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం డివిడెండ్ తరహాలో బైబ్యాక్ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అక్టోబర్ 1నుంచి అమల్లోకి రానున్న నిబంధనలతో ఇకపై బైబ్యాక్ షేర్లకు వాటాదారులపై పన్ను విధించనున్నారు.వెరసి కంపెనీలు చేపట్టే బైబ్యాక్‌లో భాగంగా షేర్లకు చెల్లించే సొమ్ముపై డివిడెండ్ తరహాలో వాటాదారులపైనే పన్ను భారం పడనుంది. ఇది ఇన్వెస్టర్లపై పన్ను భారాన్ని మరింత పెంచనుంది. మరోవైపు ఎస్టీటీతోపాటు.. స్వల్పకాలిక లాభాలపై పన్ను పెంపునకు తాజా బడ్జెట్ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ బైబ్యాక్ షేర్లకు కంపెనీలే పన్ను చెల్లిస్తున్నాయి.మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్..ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీమ్ ఇండియా కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ ద్వారా ఒక మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్ ఇది. సామాన్యుల ప్రయోజనాలపై బడ్జెట్ దృష్టి సారిస్తుంది. అనుభవజు్ఞడైన కెప్టెన్ నాయకత్వంలో దేశం నాడిని పెంపొందించే కచి్చత, వివరణాత్మక, పరిశోధించి రూపొందించిన బడ్జెట్. – హర్‡్ష గోయెంకా, చైర్మన్, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్. పెట్టుబడులను ఆకర్షిస్తుంది..ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి, స్థిర భవిష్యత్తును ప్రోత్సహించడానికి రూపొందించిన దార్శనికత, ఆచరణాత్మక బ్లూప్రింట్. ఇది వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. గణనీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరిస్తుంది. భారత్‌ను సాంకేతికతతో నడిచే, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్.సమగ్ర రోడ్‌మ్యాప్..ప్రజల–కేంద్రీకృత బడ్జెట్. ఇది ఆర్థిక స్థిరత్వంతో సమానమైన వృద్ధిని సమతుల్యం చేస్తుంది. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తూనే సుస్థిర, సమాన వృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. – సంజీవ్ పురి, ప్రెసిడెంట్, సీఐఐ. -
Economic Survey 2023-24: ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ ప్రమాదకరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుగా కమోడిటీల జాబితాను విస్తరించినప్పటికీ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందేటంతవరకూ బియ్యం, గోధుమలుసహా ఇతర తృణధాన్యాలలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రమాదకరమని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. సున్నిత(సెన్సిటివ్) కమోడిటీలను ఫ్యూచర్స్ మార్కెట్లనుంచి ప్రస్తుతానికి పక్కనపెట్టడమే మేలు. అగ్రికల్చర్ ఫ్యూచర్స్ మార్కెట్ ఆయిల్‌సీడ్స్, కాటన్, బాస్మతి బియ్యం, మసాలా దినుసుల వంటి నాన్సెన్సిటివ్ కమోడిటీలపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం డెరివేటివ్స్‌లోకి కమోడిటీలను 91 నుంచి 104కు పెంచింది. యాపిల్స్, జీడిపప్పు, వెల్లుల్లి, పాలపొడి, వైట్ బటర్ తదితరాలను జాబితాలో కొత్తగా చేర్చింది. కాగా.. చిన్న రైతులతోకూడిన రైతు ఉత్పత్తి సంస్థల(ఎఫ్‌పీవోలు)ను కమోడిటీ మార్కెట్లతో అనుసంధానించాలి. ప్రభుత్వం, సెబీ, కమోడిటీ ఎక్సే్ఛంజీలు ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలి. ఆర్థిక అక్షరాస్యత ద్వారా వీటి నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచాలి. వెరసి అగ్రిడెరివేటివ్స్ ద్వారా రైతులు లబ్ది పొందేందుకు వీలు కలి్పంచాలి.అవకతవకలకు చాన్స్ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగితే జూదాల(గ్యాంబ్లింగ్)కు వీలు ఏర్పడుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. డెరివేటివ్స్‌లో రిటైలర్ల ఆసక్తి పుంజుకోవడం ఆందోళనకర అంశం. అభివృద్ధి చెందుతున్న దేశంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు అవకాశంలేదు. కొన్ని సందర్భాలలో అసాధారణ లాభాలకు డెరివేటివ్స్ వీలు కలి్పస్తాయి. అయితే ఇది జూదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి, సెబీ చీఫ్, స్టాక్ ఎక్సే్ఛంజీలు సైతం రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. తక్కువ తలసరి ఆదాయంగల దేశాలలో ఎఫ్‌అండ్‌వో సమర్థనీయంకాదు. దిద్దుబాటుకు అవకాశమున్న మార్కెట్లలో రిటైలర్లకు ఎఫ్‌అండ్‌వో ద్వారా అధిక నష్టాలకు వీలుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు సైతం చేటు చేస్తుంది. 2019లో రూ. 217 లక్షల కోట్ల టర్నోవర్ 2024కల్లా రూ. 8,740 ట్రిలియన్లకు చేరడం ఎఫ్‌అండ్‌వో విభాగ భారీ వృద్ధిని అద్దం పడుతోంది. అయితే ఇదే కాలంలో ఈక్విటీ నగదు టర్నోవర్ సగటు సైతం రూ. లక్ష కోట్ల నుంచి రూ. 330 లక్షల కోట్లకు ఎగసింది. ఇది కూడా ఆందోళనకర అంశమే. కుటుంబ పొదుపులో 20 శాతం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులకు తరలివస్తోంది. ప్రత్యక్షంగా, మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది రూ. 14 లక్షల కోట్లు ఎగసింది. ఏయూఎం రూ. 53.4 లక్షల కోట్లను తాకింది. ఇక సెబీ నివేదిక ప్రకారం 89 శాతంమంది రిటైలర్లు 2022లో డెరివేటివ్స్ ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయారు.ఆరోగ్యంతోనే ఆశించిన ప్రయోజనాలు భారత్ అధిక జనాభా నుంచి ఆశించిన ఫలాలను పొందాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకుతోడు, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అధికంగా ప్రాసెస్ చేసిన, చక్కెరలు, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాల వినియోగంతో సమాజంలో స్థూలకాయం పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 56.4 శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహార అలవాట్లే కారణమన్న ఐసీఎంఆర్ తాజా అంచనాలను వెల్లడించింది. ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, స్థూలకాయం నివారణ కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణ ప్రాంతాల్లో 29.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.3 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ప్రస్తావించింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరింత అధికంగా ఉందంటూ.. ఢిల్లీలో 41.3 శాతం మహిళలు, 38 శాతం పురుషుల్లో ఈ సమస్య ఉన్నట్టు పేర్కొంది. మానసిక ఆరోగ్యంపై సమాజంలో తగినంత చర్చ జరగడం లేదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. వ్యక్తిగత, దేశాభివృద్ధిపై ఇది ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వైవిధ్యమైన, భిన్నమైన ఆహారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. ఈకామర్స్ వృద్ధికి అవరోధాలు డేటా ప్రైవసీ అంశాలు, ఆన్లైన్ మోసాలతో సవాళ్లు వ్యక్తిగత వివరాల గోప్యత సమస్యలు, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు దేశీయంగా ఈకామర్స్ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2030కల్లా దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఒక అంచనా. అయితే ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ వినియోగంలో వినియోగదారులు మోసపోకుండా తగిన విధంగా సన్నద్దం(ఎడ్యుకేట్) చేయవలసి ఉంది. ఇదేవిధంగా ఆన్లైన్ విక్రయాలకు సైతం కేటలాగింగ్ తదితర నైపుణ్యాలను పెంచవలసి ఉంది. వీటికితోడు వ్యక్తిగత వివరాల గోప్యత అంశాలు, ఆన్లైన్లో పెరుగుతున్న మోసాలు ఈకామర్స్ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. వెరసి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను రక్షణాత్మకంగా వినియోగించుకోవడంలో యూజర్లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా దేశీ ఈకామర్స్ వేగవంతంగా వృద్ధి చెందుతోంది. ఇందుకు మెరుగుపడుతున్న సాంకేతికతలు, ఆధునికతరం బిజినెస్ విధానాలు, డి/æటల్ ఇండియా వంటి ప్రభుత్వ చర్యలు, ఓఎన్డీసీ, ఎఫ్‌డీఐ విధానాల్లో సరళత, వినియోగదారుల రక్షణ చట్టాలు సహకరిస్తున్నాయి.124 బిలియన్ డాలర్లకు రెమిటెన్సులు... సేవా రంగం ఎగుమతుల తర్వాత భారతదేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రెమిటెన్సులు 2024లో 3.7 శాతం పురోగతితో 124 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని సర్వే పేర్కొంది. 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్ డాలర్లకు పురోగమిస్తాయని వివరించింది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు తమ సొంత దేశానికి నిధులు పంపడానికి సంబంధించిన రెమిటెన్సుల విషయంలో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. 2023లో 120 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు దేశాలనికి వచి్చనట్లు ప్రపంచబ్యాంక్ ఇటీవలి నివేదిక పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి కీలక దేశాలతో తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని అనుసంధానించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు వ్యయాలను తగ్గించి, చెల్లింపులను వేగవంతం చేయగలవని అంచనా వేసినట్లు సర్వే వివరించింది. ఆటో రంగంలో రూ. 67,690 కోట్ల పెట్టుబడులు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమలోకి ఇప్పటివరకు రూ. 67,690 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి రూ. 14,043 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగిందని వివరించింది. దరఖాస్తుదారులు 1.48 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వగా ఇప్పటివరకు 28,884 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. ఈ స్కీము కింద 85 దరఖాస్తుదార్లకు ఆమోదం లభించినట్లు సర్వే తెలిపింది. 2023–27 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆటో, ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం పీఎల్ఐ స్కీము కింద రూ. 25,938 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 49 లక్షల ప్యాసింజర్ వాహనాలు, 9.9 లక్షల త్రీ వీలర్లు, 2.14 కోట్ల ద్విచక్ర వాహనాలు, 10.7 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి నమోదైంది. అసమానతల నివారణలో పన్నులు కీలకంకృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత ఉపాధి కల్పన, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. కనుక రాబోయే రోజుల్లో సమాజంలోని అసమానతల పరిష్కారంలో పన్ను విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. అంతర్జాతీయంగానూ అసమానతలు పెరిగిపోతుండడం విధాన నిర్ణేతలకు కీలక ఆర్థిక సవాలుగా పరిణమిస్తున్నట్టు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతూ.. ఉపాధి కల్పన, సంఘటిత రంగంతో అసంఘటిత రంగం అనుసంధానం, మహిళా కారి్మక శక్తి పెంచడం కోసం చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. దేశంలో ఒక్క శాతం ప్రజలు 6–7 శాతం ఆదాయం పొందుతున్నట్టు, టాప్–10 శాతం వర్గం మొత్తం ఆదాయంలో ఒకటో వంతు వాటా కలిగి ఉన్నట్టు గుర్తు చేసింది. మరింత తగ్గనున్న వాణిజ్య లోటు .. రాబోయే రోజుల్లో వాణిజ్య లోటు మరింత తగ్గగలదని ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాలతో దేశీయంగా తయారీకి ఊతం లభించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయితే, కమోడిటీల ధరల్లో, ముఖ్యంగా చమురు, లోహాలు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటి ధరల్లో హెచ్చుతగ్గులనేవి వాణిజ్య సమతౌల్యత, ద్రవ్యోల్బణ స్థాయులపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. అలాగే, ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత ఎగుమతి అవకాశాలను ప్రభావితం చేయొచ్చని వివరించింది. భౌగోళిక రాజకీయ సవాళ్ల వల్ల ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడమనేది 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు తగ్గడానికి తోడ్పడిందని సర్వే వివరించింది. ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 2022–23లో 265 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24లో 240 బిలియన్ డాలర్లకు తగ్గింది. వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం దేశంలో వృద్ధ జనాభా పెరుగుతున్న తరుణంలో వారి సంరక్షణ అవసరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే తెలియజేసింది. వృద్ధుల సంరక్షణ మార్కెట్ ప్రస్తుతం దేశంలో రూ.58వేల కోట్లుగా ఉందంటూ.. మౌలిక వసతులు, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అంశంలో అంతరాలున్నట్టు గుర్తు చేసింది. 60–69 సంవత్సరాల వయసులోని వారి సామర్థ్యాలను దేశ ఉత్పాదకత పెంపునకు వినియోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. వృద్ధాప్య అనుకూల ఉద్యోగాలతో జీడీపీ 1.5 శాతం మేర పెంచుకోవచ్చన్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక సూచనలను ప్రస్తావించింది. 60 ఏళ్లపైబడిన వయసులోని వారికి తగిన ఉపాధి కలి్పంచడం ద్వారా వారిని సమాజంలో చురుగ్గా, ఆర్థికంగా మెరుగ్గా ఉండేలా చూడొచ్చని, ఇది వారి సంరక్షణ అవసరాలను తగ్గిస్తుందని ఆర్థిక సర్వే సూచించింది. 2022 నాటికి దేశ జనాభాలో 14.7 కోట్ల మంది వృద్ధులు ఉంటే, 2050 నాటికి 34.7 కోట్లకు పెరుగుతారని అంచనా. వాస్తవానికి అద్దంఎకానమీ వాస్తవ పరిస్థితికి సర్వే అద్దం పట్టింది. ఈ అంశాల ప్రాతిపదికన భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన ‘‘ఆచరణాత్మకమైన’’ మార్గాన్ని సర్వే నిర్దేశించింది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 7 శాతానికి మించి వృద్ధి భారత వృద్ధికి సంబంధించి సర్వే సానుకూలంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 7 శాతం వరకూ ఉంటుందని సర్వే అంచనావేసినా, 8 శాతంగా ఉండే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాను. – సంజీవ్ పురి, సీఐఐ ప్రెసిడెంట్సంక్షోభాన్ని దాటి స్థిరత్వం.. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి కోలుకున్న ఎకానమీ.. 2047 నాటికి ‘వికసిత భారత్’ ఆవిర్భావ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో ముందుకు కదులుతోంది. సర్వే ఈ అంశాన్ని అద్దం పడుతోంది. – సంజీవ్ అగర్వాల్, పీహెచ్డీ చాంబర్సంస్కరణలు బాటన ముందుకు.. ఎకానమీ అవుట్‌లుక్ పరిణతి చెందినట్లు గమనిస్తున్నాము. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును దేశం కొనసాగిస్తుంది. జీఎస్టీ, ఐబీసీ తర్వాత తదుపరి సంస్కరణల బాటన నడవాల్సిన అవసరం ఉంది. – అనిష్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సాహసోపేత డాక్యుమెంట్ సాహసోపేతమైనది. భారీ ఉపాధి కల్పనతోపాటు ఏఐ వంటి కొత్త సాంకేతికత సది్వనియోగం చేసుకుని 4వ ప్రపంచ పారిశ్రామిక విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పాన్ని సూచిస్తోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంఅపూర్వ ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగం, విద్యాసంస్థల మధ్య ఒక ఒప్పందాన్ని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. అలాగే వివిధ నిబంధనలను ప్రభుత్వం విడనాడాలి. – రానెన్ బెనర్జీ, పార్ట్నర్, పీడబ్లు్యసీ ఇండియా. సహకారం కీలకంమధ్య కాలంలో వృద్ధికి ప్రైవేట్ కార్పొరేట్ రంగం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని సర్వే పరోక్షంగా నొక్కి చెప్పింది. ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడం అనేది కేవలం ఆర్బీఐ, దాని ద్రవ్య విధాన కమిటీ ప్రత్యేకాధికారం కాదు. ముఖ్యంగా ఆహార ధరల నిర్వహణ రంగంలో కేంద్రం చురుకైన జోక్యం అవసరం. – అదితీ నాయర్, చీఫ్ ఎకనమిస్ట్, ఇక్రాఇన్ఫ్రా ఊతంఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ.. ఐపీ, మెషినరీలో ప్రైవేట్ పెట్టుబడి కూడా బలంగా ఉంది. గృహాలు, నిర్మాణాలలో పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. భౌతిక ఆస్తులలో పొదుపు చేయడానికి కుటుంబాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. – రుమ్కీ మజుందార్, ఎకనమిస్ట్, డెలాయిట్.చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. సవాళ్ల అధిగమనంఅంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించి ఉన్న అభివృద్ధి మార్గంలో ఆర్థిక వ్యవస్థకు ఉన్న కొన్ని కీలక సవాళ్ల గురించి సర్వే చర్చించింది. ఉద్యోగాలను పెంచడం, గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించడం ప్రభుత్వ రాడార్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. – రిశి షా, పార్ట్నర్, గ్రాంట్ థాంటన్. పెట్టుబడుల పురోగతిసర్వేలో అంచనా వేసిన 6.5–7 శాతం వృద్ధికి 35–36 శాతం నిజమైన పెట్టుబడి రేటు అవసరం. తదనుగుణంగా 33–34 శాతం నిజమైన పొదుపు రేటు ఉండాలి. ప్రస్తుత పొదుపు, పెట్టుబడి రేట్లను బట్టి ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తగిన విధానపర జోక్యాల ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధి ఈ స్థాయిలో కొనసాగాలి. – డి.కె.శ్రీవాస్తవ, చీఫ్ పాలసీ అడ్వైజర్, ఈవై ఇండియా. -
హైరిస్క్ డెరివేటివ్స్తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అత్యధిక రిస్క్లతోకూడిన డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేటపుడు అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా సూచించారు. స్టాక్ మార్కెట్లో తరచూ లావాదేవీలు నిర్వహించడం రిస్క్‌లతో కూడిన వ్యవహారమని హెచ్చరించారు. వీటికి చెక్ పెట్టడం ద్వారా నష్టాలను తప్పించుకోమంటూ సలహా ఇచ్చారు. దేశ వృద్ధి పథంలో భాగస్వామిగా కట్టుబాటును ప్రదర్శిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవలసిందిగా సూచించారు. స్టాక్ మార్కెట్లో సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను అందిస్తుంటాయన్న విషయాన్ని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలియజేశారు. రిజిస్టరైన ఇంటర్మీడియరీలతోనే లావాదేవీలు చేపట్టమంటూ పేర్కొన్నారు. నియంత్రణ పరిధిలోలేని ప్రొడక్టులలో ఇన్వెస్ట్ చేయవద్దంటూ హెచ్చరించారు. దీర్ఘకాలిక దృష్టి.. దీర్ఘకాలంలో సంపద సృష్టి యోచనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేపట్టవలసిందిగా ఇన్వెస్టర్లకు ఆశి‹Ùకుమార్ సలహా ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలు నిలకడైన ఇన్వెస్టర్లను సైతం నిస్పృహకు గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కొత్త ఇన్వెస్టర్లు లేదా అంతగా అవగాహనలేనివారు అప్రమత్తతతో వ్యవహరించడం కీలకమని వివరించారు. కాగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) పట్ల ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి ఆశ్చర్యంతోపాటు కలవరపాటుకు గురిచేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ గత నెలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌అండ్‌వో విభాగంలో 90 శాతంమంది ఇన్వెస్టర్లు సొమ్ము నష్టపోతున్నట్లు వెల్లడించారు. -
నష్టాలొస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్‌నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు. సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఐఆర్ఆర్ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్.. బ్రోకరేజీ సిస్టమ్‌లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్ఆర్ఏని డౌన్లోడ్ చేసుకునేందుకు ట్రేడర్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్స్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. రూపాయి రికార్డ్ కనిష్టం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్‌టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఆఖర్లో లాభాల స్వీకరణ
ముంబై: ఆఖర్లో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఆగస్టు నెలవారీ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు, దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి డేటాతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ట్రేడింగ్‌లో 406 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అయిదు పాయింట్ల లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ, రియలీ్ట, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్(జేఎఫ్ఎస్) షేరు వరుసగా మూడో రోజూ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇటీవల ఆర్ఐఎల్ ఏజీఎం సమావేశంలో జేఎఫ్ఎస్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాల్లోకి విస్తరిస్తుందని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన ఈ షేరు ర్యాలీకి దోహదపడుతున్నాయి. తాజాగా బుధవారం బీఎస్ఈలో 5% ఎగసి రూ.233 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాౖకైంది. ► గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. బీఎస్ఈలో 19% ఎగసి రూ.874 వద్ద స్థిరపడింది. యూఈఏకి చెందిన దుస్తుల తయారీ కంపెనీ అట్రాకోను 55 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.455 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ షేరు ర్యాలీకి కారణమవుతోంది. -
సెన్సెక్స్ డెరివేటివ్స్‌పై బీఎస్ఈ దృష్టి
కోల్‌కతా: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈ తిరిగి సెన్సెక్స్–30 డెరివేటివ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సభ్యుల నుంచి ఇందుకు అవసరమైన సూచనలు, వివరాలను సేకరిస్తున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి వెల్లడించారు. ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్‌లో భాగమైన 30 షేర్లలో ఆప్షన్స్, ఫ్యూచర్స్(డెరివేటివ్స్)ను 2000లో బీఎస్ఈ ప్రవేశపెట్టింది. అయితే ప్రత్యర్థి ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈలో భాగమైన నిఫ్టీ–50 డెరివేటివ్స్తో పోలిస్తే ఇన్వెస్టర్ల నుంచి తగిన ఆసక్తిని సాధించలేకపోయింది. దీంతో మరోసారి సెన్సెక్స్–30 డెరివేటివ్స్ ప్రొడక్టులను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు రామమూర్తి తెలియజేశారు. దీనిలో భాగంగా మార్కెట్ పార్టిసిపెంట్ల ద్వారా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసో చామ్ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా రామమూర్తి సెన్సెక్స్ దిగ్గజాలలో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ప్రవేశపెట్టడంపై వివరాలు వెల్లడించారు. వెరసి ఎఫ్‌అండ్‌వో విభాగం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలో మెరుగుపరచవలసిన అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. బీఎస్ఈలో అత్య ధికంగా ట్రేడయ్యే 30 బ్లూచిప్ కంపెనీలు సెన్సెక్స్‌లో భాగమయ్యే సంగతి తెలిసిందే. వీటిలో డెరివేటివ్స్‌ను పునఃప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ట్లు రామమూర్తి పేర్కొన్నారు. నిఫ్టీ–50తో పోలిస్తే సెన్సెక్స్–30 డెరివేటివ్స్ కొంత విభిన్నంగా ఉండనున్నట్లు సూ చించారు. ఒకే విధమైన రెండు విభిన్న ప్రొడక్టులు అందుబాటులో ఉన్నపుడు వివిధ ట్రేడింగ్ వ్యూ హాలు, ఇంటర్‌ప్లే ద్వారా మార్కెట్లు మరింత వృద్ధి చెందేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
కమోడిటీ డెరివేటివ్‌లలో ఎఫ్‌పీఐలకు సై
ముంబై: ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్(ఈటీసీడీ) విభాగంలో కార్యకలాపాలు చేపట్టేందుకు సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో మరింత లిక్విడిటీ, గాఢత పెరిగేందుకు వీలుంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డు బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్ల పాలనా సంబంధ నిబంధనల సవరణలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా కార్పొరేట్ బాండ్లు, రెపో లావాదేవీలకు సంబంధించిన లిమిటెడ్ పర్పస్ క్లయరింగ్ కార్పొరేషన్(ఎల్‌పీసీసీ)కు చెందిన ఎస్ఈసీసీ నియంత్రణల ప్రొవిజన్ల సవరణలకు సైతం ఓకే చెప్పింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)కి వార్షిక నివేదికను బోర్డు ఆమోదించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేయనుంది. వ్యవసాయేతర విభాగం అన్ని రకాల వ్యవసాయేతర కమోడిటీ డెరివేటివ్స్‌లోనూ ట్రేడింగ్ చేపట్టేందుకు ఎఫ్‌పీఐలను సెబీ బోర్డు అనుమతించింది. వీటితోపాటు కొన్ని ఎంపిక చేసిన ప్రామాణిక ఇండెక్సులలోనూ లావాదేవీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో నగదు ద్వారా సెటిల్ చేసుకునే కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌కు మాత్రమే ఎఫ్‌పీఐలకు వీలుంటుంది. ఈటీసీడీలో విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించడం ద్వారా మార్కెట్లలో గాఢతను పెంచడంతోపాటు మరింత లిక్విడిటీకి అవకాశముంటుందని బోర్డు సమావేశం అనంతరం సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో సరైన ధర నిర్ణయాని(ప్రైస్ డిస్కవరీ)కి సైతం వీలుంటుందని తెలియజేసింది. ఈ విభాగంలో ఇప్పటికే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్(ఏఐఎఫ్‌లు), పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) తదితర కేటగిరీ–3 పెట్టుబడిదారులకు అనుమతి ఉంది. అర్హతగల విదేశీ సంస్థ(ఈఎఫ్ఈ)లు మార్గంలో ప్రస్తుతం అమల్లో ఉన్న దేశీ ఫిజికల్ కమోడిటీల ట్రేడింగ్‌ను రద్దు చేయనుంది. అయితే ఈటీసీడీలలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా భారీ కొనుగోలు శక్తి కలిగిన ఎఫ్‌పీఐలను అనుమతించరు. తాజా నిర్ణయాల అమలు తేదీలను తదుపరి ప్రకటించనుంది. ప్రస్తుతం 10,000 ఎఫ్‌పీఐలు రిజిస్టరై ఉన్నప్పటికీ, పదో వంతు పార్టిసిపేట్ చేసినప్పటికీ మార్కెట్లు భారీగా విస్తరించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
మదుపర్లకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లో బేర్ స్వైరవిహారంతో గురువారం సూచీలు కుప్పకూలాయి. కొన్నిరోజులుగా బుల్ ఆధిపత్యంతో స్తబ్ధుగా ఉన్న బేర్ ఒక్కసారిగా అదును చూసి పంజా విసిరింది. అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూలతల సంకేతాలు అందాయి. దేశీయ కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. తాజాగా మోర్గాన్ స్టాన్లీ భారత మార్కెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ అంశాలు దేశీయ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్కెట్ మొదలు.., తుదిదాకా బేర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ నెలకొంది. ఫలితంగా స్టాక్ సూచీలు గత ఆరునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,159 పాయింట్ల నష్టంతో 60వేల దిగువున 59,985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,000 వేల స్థాయిని కోల్పోయి 354 పాయింట్ల పతనంతో 17,857 వద్ద నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదితో తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టం. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలోని మొత్తం షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముంగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,819 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.837 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో రూపాయి 11 పైసలు బలపడి 74.92 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు... ఆసియా మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ ఉదయం 62 పాయింట్ల లాభంతో 61,081 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 18,188 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల కౌంటర్లలో అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో సూచీలు మార్కెట్ ముగిసే వరకూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1365 పాయింట్లు నష్టపోయి 59,778 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు కోల్పోయి 17,799 ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఆరుశాతం నష్టపోయి రూ.225 వద్ద ముగిసింది. ► నష్టాల మార్కెట్లోనూ ఎల్అండ్టీ షేరు రాణించింది. 2% లాభంతో రూ.1814 వద్ద నిలిచింది. ► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటాన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,375 వద్ద స్థిరపడింది. పతనానికి ఐదు కారణాలు... ఎఫ్అండ్ఓ ముగింపు... అక్టోబర్ ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్యేర్ ఆఫ్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు.. ఇటీవల పలు కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల పెరుగదలతో ఆయా కంపెనీల లాభాలు పరిమితమయ్యాయి. చాలా కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూ పింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రస్ షేర్లు 5% నుంచి 2% నష్టపోయాయి. ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ.... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టడం ప్రస్తుత కరెక్షన్కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు రూ.13 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూలతలు... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక రికవరీ అందోళనలతో ఆసియా మార్కెట్లు 1.5%నష్టంతో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ద్రవ్యపాలసీ, యూఎస్ మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో యూరప్, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రేటింగ్ డౌన్‌గ్రేడ్... అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతుందనే కారణంతో నోమురా, యూఎస్బీ రేటింగ్ భారత స్టాక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. తాజాగా మోర్గాన్‌స్టాన్లీ మన మార్కెట్ రేటింగ్ ‘అధిక వెయిటేజీ’ నుంచి ‘సమాన వెయిటేజీ(ఈక్వల్ వెయిటేజీ)’ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల డౌన్‌గ్రేడ్ రేటింగ్ కేటాయింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ సూచీలు దాదాపు రెండుశాతం మేర కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.4.82 లక్షల కోట్లు నషపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘వ్యవస్థలో అధిక లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్ల రూపంలో కొత్త తరం(యువత) పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు 25% ర్యాలీ చేశాయి. ఇప్పటికే అధిక విలువలతో ట్రేడ్ అవుతున్న షేర్లలో ఎఫ్అండ్ఓ ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బుల్ సుదీర్ఘ ర్యాలీ నేపథ్యంలో 10–20 శాతం వరకూ కరెక్షన్కు అవకాశం ఉంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ పట్ల అప్రమత్తత అవసరం’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. -
Stock Market: కరెక్షన్ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది. అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. వరుస నాలుగు రోజుల పతనంతో గతవారం సెన్సెక్స్ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి. క్యూ2 ఫలితాల జాబితా... సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర కంపెనీలున్నాయి. ఈ వారంలో రెండు ఐపీఓలు... బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్స్ ఈ వారం పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ఫినోటెక్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది. ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్... గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్ 24)ఎఫ్‌పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్ మార్కెట్లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ షేర్ల పట్ల బేరిష్ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. 28 నుంచి నైకా ఐపీవో షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125 సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. -
ఒడిదుడుకులు ఉండొచ్చు..!
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ గురువారం(ఈ నెల 26న) ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగుస్తుండటం ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. దేశీయంగా ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలేవీ లేకపోవడంతో మన స్టాక్ సూచీలకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దిశానిర్దేశం చేస్తాయని అంటున్నారు. ఫెడ్ రిజర్వ్ ట్యాపరింగ్, డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రత అంశాలూ సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగురోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు రెండురోజులు లాభాల్ని ఆర్జించి, మరో రెండురోజులు నష్టాలను చవిచూశాయి. విస్తతృస్థాయి మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో వారం మొత్తంగా సెన్సెక్స్ 108 పాయింట్లు,నిఫ్టీ 78పాయింట్లను కోల్పోయాయి. మూడు లిస్టింగ్‌లు.., ప్రాథమిక, సెకండరీ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో మూడు లిస్టింగ్‌లతో పాటు నిధుల సమీకరణకు మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న విస్టాస్ షేర్లు నేడు (సోమవారం).., కెమ్‌ప్లాస్ట్ సన్మార్, అప్టాస్ షేర్లు మంగవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరతతో గ్రే మార్కెట్లో ఈ కంపెనీల షేర్ల ధరలు దిగివచ్చాయి. స్వల్ప ప్రీమియం ధరతో లిస్ట్‌కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఐపీఓకు అమి ఆర్గానిక్స్... ప్రత్యేక రసాయన, ఏపీఐ మానుఫ్యాక్చరర్ అమి ఆర్గానిక్స్ కంపెనీ ఇదే వారంలో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఓ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.300 కోట్ల తాజా విలువైన షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతి ద్వారా ప్రమోటర్లు 60లక్షల ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెట్టారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు... ఈ గురువారం(ఈ నెల 26న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. విదేశీ పెట్టుబడుల జోరు... మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్ట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో ఇప్పటిదాకా(ఆగస్ట్ 1–23 తేదీల మధ్య) రూ.7,245 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.5,001 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.2,244 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ అవుట్‌లుక్‌ను కేటాయిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వైస్ చైర్మన్ వీకే విజయకుమార్ తెలిపారు. -
ఒడిదుడుకుల ట్రేడింగ్.. నష్టాల ముగింపు
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు, ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందురోజు దేశీయ స్టాక్ సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 871 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 135 పాయింట్లు నష్టపోయి 52,444 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 254 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసే సరికి 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద నిలిచింది. చైనాలోని టెక్నాలజీ షేర్ల పతనం కొనసాగడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ మరింత తగ్గించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ ప్రకటన(బుధవారం రాత్రి), జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు (గురువారం)నకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఆగడం లేదు. ఈ ప్రతికూలతలతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 776 పాయింట్లు నష్టపోయి 52 వేల దిగువన 51,803 స్థాయిని తాకింది. నిఫ్టీ సైతం 233 పాయింట్లను నష్టపోయి 15,513 స్థాయికి దిగివచ్చింది. అయితే యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో సూచీలకు నష్టాల అడ్డుకట్ట పడింది. మిడ్‌సెషన్ నుంచి క్రమంగా కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీల నష్టాలు తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ నష్టాల ముగింపు తప్పలేదు. మార్కెట్ మూడురోజుల పతనంతో ఇన్వెస్టర్లు రూ.లక్ష కోట్ల సంపదను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.235.11 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇటీవల క్యూ1 ఫలితాలను ప్రకటించిన బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీల ఆస్తుల నాణ్యత క్షీణించడంతో ఆ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంరపర కొనసాగిస్తూ రూ.2275 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.921 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ రికవరీ అయ్యింది. డాలర్ మారకంలో తొమ్మిది పైసలు బలపడి 74.38 వద్ద ముగిసింది. రెండోరోజూ రాణించిన స్టీల్ షేర్లు... దేశీయ స్టీల్ రంగ షేర్లు రెండోరోజూ రాణించాయి. తమ దేశంలో నెలకొన్న స్టీల్ కొరత, ధరల నియంత్రణకు చైనా సిద్ధమైంది. స్టీల్ ఎగుమతులపై సుంకాలను 10–25% పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ టారిఫ్‌లు అమలయితే చైనా నుంచి స్టీల్ దిగుమతులు తగ్గి దేశీయ స్టీల్‌కు డిమాండ్ పెరగవచ్చనే అంచనాలతో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సెయిల్, మెయిల్, ఏపీఎల్ అపోలో, వేదాంత షేర్లు లాభపడ్డాయి. స్టీల్ షేర్లు రాణించడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లో ఎయిర్టెల్ షేరు ఎదురీదింది. కంపెనీ తన ప్రారంభ స్థాయి ప్రీపెయిడ్ ప్లాన్ ధరను 60% మేర పెంచడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో ఐదున్నర శాతం పెరిగి రూ.570 స్థాయిని తాకిన షేరు చివరికి ఐదుశాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది. ► రామ్‌కో సిమెంట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీకి ‘‘అండర్పర్ఫామ్’’ రేటింగ్‌ను కేటాయించాయి. ఫలితంగా కంపెనీ షేరు రెండుశాతం నష్టపోయి రూ.1,041 వద్ద ముగిసింది. ► ఇదే క్యూ1 కాలంలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించిన సెంచురీ టెక్స్టైల్స్ కంపెనీ షేరు ఇంట్రాడేలో 20% ర్యాలీ చేసి రూ.819 స్థాయికి తాకింది. చివరికి 17% లాభంతో రూ.796 వద్ద స్థిరపడింది. -
క్రాష్ మార్కెట్!
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో రెండోరోజూ ‘బేర్’ బాజా కొనసాగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో పాటు లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మార్చి డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ æఓ) కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. రూపాయి వరుసగా మూడో రోజూ 7 పైసలు క్షీణించడం కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 740 పాయింట్లు నష్టపోయి 48,440 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్ల పతనంతో 14,325 వద్ద స్థిరపడింది. మెటల్ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్ వరుస పతనంతో రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,611 పాయింట్లు, నిఫ్టీ 489 పాయింట్లను కోల్పోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు జరగడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రెండోరోజూ రూ.3,384 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,268 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 49 వేల దిగువకు సెన్సెక్స్... మునుపటి రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్ బలహీనంగా మొదలైంది. సెన్సెక్స్ 49,202 వద్ద, నిఫ్టీ 14,571 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ రంగ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 49 వేల స్థాయిని కోల్పోయింది. ఒక దశలో సెన్సెక్స్ 944 పాయింట్లును కోల్పోయి 48,236 వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు నష్టపోయి 14,264 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్ తర్వాత కొంత రికవరీ కన్పించినా చివరి గంట అమ్మకాలతో సూచీలు రెండోరోజూ భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ‘భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రేటు మళ్లీ పెరిగిపోతోంది. ఈ అంశం ఈక్విటీ మార్కెట్లలో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. డెరివేటివ్స్ ముగింపు తేది కావడం మరింత ప్రతికూలాంశంగా మారింది. సుదీర్ఘ ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్ దిద్దుబాటుకు గురై స్థిరీకరణ దిశగా సాగుతుంది. ఈ దశలో కోవిడ్ వ్యాప్తి భయాలు మార్కెట్ పతనానికి కారణమవుతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రెండు రోజుల్లో రూ.6.9 లక్షల కోట్లు ఆవిరి మార్కెట్ భారీ పతనంతో గురువారం ఇన్వెస్టర్లు రూ. 3.69 లక్షల కోట్లను కోల్పోయారు. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్లోనూ రూ.3.27 లక్షల కోట్ల సంపద ఆవిరవడంతో ఈ రెండు రోజుల్లో రూ.6.96 లక్షల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.200 లక్షల కోట్ల దిగువకు చేరుకొని రూ.198.78 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 3వ తేదీన బీఎస్ఈ ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. -
అస్థిరతలు కొనసాగొచ్చు..
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చు. ‘‘ఎఫ్‌అండ్‌వో గురువారం ముగియనుండడం వల్ల సమీప కాలంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో కుదిరే వ్యాపార, వాణిజ్య ఒప్పంద వార్తలు కూడా ప్రభావం చూపిస్తాయి’’ అని బీఎన్పీ పారిబాస్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ గౌరవ్‌దువా తెలిపారు. మెటల్స్, అంతర్జాతీయంగా కమోడిటీలు పేలవ ప్రదర్శన చూపించొచ్చన్నారు. దేశీయ ఇన్స్టిట్యూషన్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చైనాలో కోవిడ్–19 వైరస్ సంబంధిత పరిస్థితులు తిరిగి క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయని, మరిన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రారంభమవుతోందని, దీంతో సరఫరా పరంగా ఇబ్బందులు తగ్గిపోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ పేర్కొన్నారు. చైనా ఆర్థిక ఉద్దీపనలు ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో (ఏప్రిల్–జూన్) ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని మార్కెట్లు క్రమంగా అంచనాకు రావచ్చని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ తెలిపారు. ఎఫ్‌పీఐలు బుల్లిష్... భారత మార్కెట్ల పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (ఎఫ్‌పీఐలు) బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. బడ్జెట్ తర్వాత వీరు పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు నికరంగా రూ.23,102 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ.10,750 కోట్లు ఈక్విటీల్లో, రూ.12,352 కోట్లు డెట్ విభాగంలో పెట్టుబడులు పెట్టారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో నికర పెట్టుబడిదారులుగానే ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. అయితే సమీప భవిష్యత్తు పెట్టుబడు లపై కోవిడ్–19 ప్రభావం ఉండవచ్చని అంచనా. -
వాణిజ్య ఒప్పంద పరిణామాలు కీలకం
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అంశానికి సంబంధించిన పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, డెరివేటివ్స్‌కి సంబంధించి ముగియనున్న నవంబర్ సిరీస్ తదితర అంశాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. ‘ఈ వారం మార్కెట్లు మరీ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి లేదా ఆర్థిక విధానాలపరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాలు మొదలైన వాటి ఆధారంగా ఏవైనా కదలికలు ఉండొచ్చు‘ అని సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్‌నోట్ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చల పురోగతి .. ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుంది. ఇక, డాలర్‌తో రూపాయి మారకం తీరుతెన్నులు, చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విధానం తదితర అంశాలూ కీలకంగా ఉండనున్నాయి. గురువారంతో ముగిసే నవంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) కాంట్రాక్టులపై ఇవి ప్రభావం చూపవచ్చని అంచనా. క్యూ2 గణాంకాలపై దృష్టి.. ఈ వారమే విడుదలయ్యే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండో త్రైమాసిక గణాంకాలపై మార్కెట్ దృష్టి ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్ విభాగం) వినోద్ నాయర్ తెలిపారు. అటు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్టు గౌరంగ్ సోమయ్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత జీడీపీ గణాంకాలు వెలువడే అవకాశముంది. వినియోగం బలహీనపడటం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు మొదలైన వాటి కారణంగా ఆర్థిక వృద్ధి మరింతగా దిగజారే అవకాశం ఉందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండవ త్రైమా సికంలో జీడీపీ వృద్ధి రేటు 5 నుంచి 5.5% మధ్యే ఉంటుందన్నది మెజారిటీ విశ్లేషణ. -
కమోడిటీస్ డెరివేటివ్స్‌లోకి ఫండ్స్?
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లలో పెట్టుబడులను మరింతగా పెంచే దిశగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌ని (పీఎం) కూడా ఇన్వెస్ట్మెంట్కి అనుమతించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భావిస్తోంది. ఈ మేరకు చర్చాపత్రాన్ని రూపొందించిన సెబీ సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. ఈ నెలాఖర్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, కమోడిటీ డెరివేటివ్స్‌లో ఫండ్స్ పెట్టుబడులపై నియంత్రణపరమైన అంశాలను చర్చాపత్రంలో ప్రస్తావించినప్పటికీ.. వ్యవసాయ, వ్యవసాయేతర కమోడిటీల్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ని అనుమతిస్తారా లేదా అన్న దానిపై స్పష్టతనివ్వలేదు. ఇన్వెస్ట్మెంట్కి మరో కొత్త సాధనంలాగా కమోడిటీ డెరివేటివ్స్ ఉపయోగపడుతుందని, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు తోడ్పడుతుందని సెబీ పేర్కొంది. ‘కమోడిటీలను పోర్ట్‌ఫోలియోలో చేర్చడం వల్ల కొంత రిస్కు పెరుగుతుంది. కానీ రిస్కులతో పోలిస్తే మొత్తం పోర్ట్‌ఫోలియో మీద వచ్చే రాబడులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది. -
సాక్షి...‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్ ఇంట్రస్ట్ హెచ్చుతగ్గులు... కాల్, పుట్ రైటింగ్ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... రిలయన్స్ ఇండస్ట్రీస్: శుక్రవారం ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రెండు రోజుల నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత సోమవారం 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,559 వరకూ పెరిగిన తర్వాత మరుసటి రోజే రూ. 1,515 వరకూ పడిపోయింది. తిరిగి బుధవారం మార్కెట్ ముగింపు సమయంలో నాటకీయంగా కోలుకుని రూ. 1,532 వద్ద ముగిసింది. ఈ ఒడుదుడుకుల మధ్య ఆర్ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా 2.57 లక్షల షేర్లు యాడ్‌కావడంతో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 2.27 శాతం మేర పెరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ప్రీమియం రూ.5 నుంచి రూ. 6కు పెరిగింది. ఫ్యూచర్స్ ఓఐ, ప్రీమియంలు పెరగడం ట్రేడర్ల పాజిటివ్ దృక్ప«థాన్ని సూచిస్తున్నది. షేరు పెరిగినా, రూ. 1,540, 1,560 స్ట్రయిక్స్ వద్ద కాల్ కవరింగ్ స్వల్పంగానే జరిగింది. ఈ రెండు స్ట్రయిక్స్ వద్ద 9.5 లక్షల చొప్పున కాల్ బిల్డప్ వుంది. రూ. 1,500 స్ట్రయిక్ వద్ద తాజా పుట్ రైటింగ్ కూడా పెద్దగా జరగలేదు. కేవలం 30,000 షేర్లు యాడ్‌కావడంతో ఇక్కడ పుట్ బిల్డప్ 6.26 లక్షలకు చేరింది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఆప్షన్ రైటర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఈ బిల్డప్ వెల్లడిస్తున్నది. çఫలితాలు వెల్లడయ్యేలోపు మరోదఫా రూ. 1,540–1,560 శ్రేణివరకూ పెరిగే ప్రయత్నం చేయవచ్చని, నాటకీయంగా అమ్మకాలు జరిగితే రూ. 1,500 వద్ద మద్దతు పొందవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ సంకేతాలిస్తున్నది. ♦ మరి ఐడియా సెల్యులర్ డేటా ఏం చెబుతోంది? ♦ వేదాంత ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి? ఈ వివరాలు www.sakshibusiness.com-లో -
ఒడిదుడుకుల వారం..
♦ ఈ నెల 29న డెరివేటివ్స్ ముగింపు ♦ వచ్చే వారంలో ఆర్బీఐ పాలసీ ♦ వడ్డీరేట్ల ప్రభావిత షేర్లపై ఇన్వెస్టర్ల చూపు న్యూఢిల్లీ: డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. తక్షణ ప్రధాన సంఘటనలేవీ లేనందున అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెం బర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 29) ముగుస్తాయని, దీంతో మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఎఫ్ అండ్ ఓ సెప్టెంబర్ కాంట్రాక్టులు ముగియనున్నందున ఈ వారంలో సాధారణం కంటే అధికంగానే ఒడిదుడుకులుంటాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. వచ్చే వారంలో ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత రంగ షేర్లలో లావాదేవీల జోరు ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ పెట్టుబడుల జోరు ఈ వారంలో స్టాక్ మార్కెట్‌ను నిర్దేశిస్తాయని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ పేర్కొన్నారు. పతనానికి బ్రేక్! అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, వర్షపాత గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. వచ్చే వారంలో అల్జీరియాలో ఇంధన సమావేశం జరగనున్న నేపథ్యంలో చమురు ధరల్లో కూడా ఒడిదుడుకులుంటాయని వివరించారు. సరఫరాల జోరును నియంత్రించి ధరల పతనాన్ని నిరోధించే ప్రణాళికను ఈ ఇంధన సమావేశం రూపొందించగలదన్న అంచనాలు బాగా ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్య విధాన కమిటీ(మోనేటరీ పాలసీ కమిటీ-ఎంపీసీ)లో కొత్తగా ముగ్గురు సభ్యుల నియామకం కారణంగా వచ్చే నెల నాలుగున జరిగే ఆర్బీఐ పాలసీ ఎలా ఉండనున్నదోనని మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు. జీఎస్టీ సమావేశం, రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం, తదితర ఇటీవల పరిణామాలు మార్కెట్ పతనాన్ని కొంత మేర నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ ద్రవ్య విధానాలపై వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల అభిప్రాయాలపై ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. బ్యాంక్ షేర్లపై ఫోకస్ స్టాక్ సూచీల గమనాన్ని విదేశీ పెట్టుబడులు నిర్దేశిస్తాయని ట్రేడ్‌బుల్స్ సీఈఓ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. వచ్చే వారం ఆర్బీఐ పాలసీ ఉన్నందున బ్యాంక్ షేర్లు వెలుగులో ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ ఉంటుందని, ఫలితంగా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికాలో ఆగస్టు నెలకు సంబంధించి కొత్త ఇళ్ల గణాంకాలు సోమవారం(ఈ నెల 26న), వినియోగదారుల విశ్వాస గణాంకాలు మంగళవారం(ఈ నెల 27న), రెండో క్వార్టర్ అమెరికా జీడీపీ గణాంకాలు గురువారం(29న), ఇంగ్లండ్ క్యూ2 జీడీపీ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 30న) వెలువడతాయి. మరింత జోరుగా విదేశీ పెట్టుబడులు.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈనెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.5,643 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.3,905 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడులు రూ.9,549 కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ అమలు సంబంధిత చర్యలు వేగంగా జరుగుతుండడం, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం, వంటి సానుకూలాంశాలు దీనికి కారణాలు. కార్పొరేట్ బాండ్లలో విదేశీ ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ అనుమతించడంతో ఈ జోరు మరికొన్ని వారాలు కొనసాగవచ్చని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.46,493 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్ నుంచి రూ.3,442 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి వీరి నికర పెట్టుబడులు రూ.43,051 కోట్లుగా ఉన్నాయి. -
ఒడిదుడుకుల వారమే..!
డెరివేటివ్‌ల ముగింపు * పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రభావం * ట్రేడింగ్ నాలుగు రోజులే * బుధవారం గురునానక్ జయంతి సెలవు న్యూఢిల్లీ: డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల కారణంగా ఈ వారం ట్రేడింగ్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులంటున్నారు. గురునానక్ జయంతి కారణంగా బుధవారం సెలవు ఉండడం వల్ల నాలుగు రోజులే ట్రేడింగ్ ఉండే ఈ వారంలో అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కూడా తగినంత ప్రభావం చూపిస్తాయని వారంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లోనే వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేశాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. బిహార్ గెలుపుతో... ఈ నెల 26(గురువారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్షాలతో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోగలుగుతుందా అనే అంశం మీదనే అందరి దృష్టి ఉందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా చెప్పారు. బిహార్ ఎన్నికల్లో వచ్చిన విజయంతో ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగుతాయని, పలు అంశాల్లో ప్రభుత్వానికి అడ్డుపడతాయని, దీంతో జీఎస్టీతో సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి అవరోధాలు తప్పవని కొందరు నిపుణులంటున్నారు. దేశీయంగా ఎలాంటి ప్రధానమైన గణాంకాలు ఈ వారంలో వెలువడవు. ఫలితంగా అంతర్జాతీయ సంకేతాలే కొంత వరకు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేస్తాయి. ప్రతికూలంగానే మార్కెట్.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ ప్రతికూలంగానే చలించవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,930 పాయింట్ల దిగువన ఉన్నంత వరకూ పెరిగినప్పుడల్లా షార్ట్ చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు బ్యాలెన్స్ చేశాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. పార్లమెంట్లో సానుకూల చర్యలు లేనిపక్షంలో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. గతవారం మార్కెట్... నవంబర్ 20తో ముగిసిన గత వారంలో సెన్సెక్స్ 258 పాయింట్ల(1 శాతం) ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్ల (1.21 శాతం) చొప్పున లాభపడ్డాయి. అక్టోబర్ 9 తర్వాత గత వారంలోనే స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరిచింది. గత శుక్రవారం సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 25,868 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,857 పాయింట్ల వద్ద ముగిశాయి. 126 కోట్ల డాలర్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు)భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటివరకూ వంద కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ నెలలోనే పెంచే అవకాశాలుండడం దీనికి ప్రధాన కారణాలు. ఈ నెల 2 నుంచి 19వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.5,713 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.2,565 కోట్లు.. వెరశి రూ.8,278 కోట్లు(126 కోట్ల డాలర్లు) నికర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
నాలుగు నెలల కనిష్టానికి సెన్సెక్స్
⇒ డెరివేటివ్స్ ముగింపు రోజు జోరుగా లాభాల స్వీకరణ ⇒ 8,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ ⇒ 215 పాయింట్ల నష్టంతో 27,011కు సెన్సెక్స్ ⇒ 58 పాయింట్ల నష్టంతో 8,181కు నిఫ్టీ ముంబై: విదేశీ నిధులు తరలిపోతుండడం, కంపెనీల నాలుగో త్రైమాసిక ఆర్థికఫలితాలు సంతృప్తికరంగా లేకపోవడం, ఏప్రిల్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల చివరి రోజు కావడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఎఫ్ఎంసీజీ, వాహన రంగాల షేర్లలో భారీ అమ్మకాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 27,011 పాయింట్లకు క్షీణించింది. ఇది నాలుగు నెలల కనిష్టం. ఇక నిఫ్టీ 8,200 మార్క్ దిగువన ముగిసింది. 58 పాయింట్లు నష్టపోయి 8,181 పాయింట్లకు పతనమైంది. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారమూ నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరడం కూడా ప్రభావం చూపింది. ట్రేడింగ్ చివరలో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాలకు కొంత మేర కళ్లెం పడింది. ఈ వారంలో సెన్సెక్స్ 427పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. మార్చిలో స్టాక్ మార్కెట్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరాయి. అప్పటి నుంచి చూస్తే ఇవి ఇప్పుడు 10 శాతం మేర పతనమయ్యాయి. పన్ను ఆందోళన కారణంగా విదేశీ ఫండ్స్ షేర్ల అమ్మకాలను కొనసాగిస్తున్నాయని ట్రేడర్లు పేర్కొన్నారు. వర్షాలు సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు, కంపెనీల క్యూ4 ఫలితాలు నిరాశకు గురిచేయడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు తమ లాంగ్ టెర్మ్ హోల్డింగ్స్‌ను మే సిరీస్‌కు రోల్ఓవర్ చేయడానికి బదులు విక్రయించారని వారంటున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు కారణంగా లాభాల స్వీకరణ జరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి ప్రతికూల వార్తలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయని జియోజిత్ బీఎన్పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. లోహ, ఎఫ్ఎంసీజీ, వాహన, ఐటీ, టెక్నాలజీ రంగ సూచీలు నష్టపోగా, రియల్టీ, రిఫైనరీ, బ్యాంకింగ్ సూచీలు మాత్రం లాభపడ్డాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ 2.7 శాతం, టాటా స్టీల్ 2.3 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2 శాతం, కోల్ ఇండియా 2.2 శాతం, టాటా మోటార్స్ 2.2 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2 శాతం, హీరో మోటొకార్ప్ 1.8 శాతం, ఐటీసీ 1.8 శాతం, గెయిల్ ఇండియా 1.6 శాతం చొప్పున తగ్గాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే, యాక్సిస్ బ్యాంక్ 2.7 శాతం, భెల్ 2.1 శాతం, వేదాంత 1.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.3 శాతం, సిప్లా 1.2 శాతం చొప్పున పెరిగాయి. 1,401 షేర్లు నష్టాల్లో, 1,292 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,746 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.25,559 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.6,27,005 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,158 కోట్లు నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,461 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. నేడు మార్కెట్ సెలవు మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. ఫారెక్స్, బులియన్, ఆయిల్స్ అండ్ ఆయిల్‌సీడ్స్ సహా అన్ని కమోడిటీ మార్కెట్లకు సెలవు. -
మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!
డెరివేటివ్స్ ముగింపు నేపథ్యం ⇒కీలకంకానున్న విదేశీ అంశాలు ⇒ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే ⇒మార్కెట్ నడకపై నిపుణుల అంచనాలు ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల(డెరివేటివ్స్) ముగింపు నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల గడువు బుధవారమే(24న) ముగియనుంది. వెరసి ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇక మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సైతం రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఈ రెండు రోజుల్లోనూ కీలక బిల్లుల ఆమోదంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు, రష్యాలో జరిగే పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలవని వివరించారు. బీమా బిల్లుపై దృష్టి పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజులే గడువున్న కారణంగా బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పెంపు వంటి బిల్లుల ఆమోదం కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు బిల్లులు ఆమోదంపొందే అంశంపై దృష్టిపెడతారని తెలిపారు. ఇటీవల కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సైతం 13 నెలల కనిష్టాన్ని తాకింది. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు ఈ వారం భారీ ఒడిదుడుకులను చవిచూస్తాయని పలువురు నిపుణులు చెప్పారు. ప్రపంచ పరిణామాలు జపాన్ మాంద్య పరిస్థితులు, చైనా, యూరప్ దేశాల ఆర్థిక మందగమనం వంటి విదేశీ పరిణామాలు మార్కెట్ల నడకను నిర్దేశిస్తాయని జియోజిత్ బీఎన్పీ పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ స్థాయిలో కనిపిస్తున్న రిస్క్ పరిస్థితులు, ప్రత్యేకంగా ఆయిల్ ఉత్పాదక దేశాలు(ఒపెక్) ఎదుర్కొంటున్న సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపుతున్నట్లు వివరించారు. ఇక దేశీయంగా చూస్తే వస్తు, సేవల పన్ను చట్టాన్ని(జీఎస్టీ) పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆశ్చర్యకర పరిణామమని వ్యాఖ్యానించారు. మొత్తంగా పన్నుల విధానాన్ని సంస్కరించే జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గడిచిన శుక్రవారం(19న) లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ నెలలో రూ. 14,000 కోట్ల పెట్టుబడులు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ(డిసెంబర్1-19) రూ. 14,239 కోట్లు(2.3 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో ఈక్విటీలకు రూ. 3,430 కోట్లు(57 కోట్ల డాలర్లు), రూ.10,808 కోట్ల(1.75 బిలియన్ డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి మొదలు డిసెంబర్19 వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడులు రూ. 2.6 లక్షల కోట్లను(42.6 బిలియన్ డాలర్లు) తాకాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలు ఈక్విటీలలో పెట్టుబడులకు ప్రోత్సాహానిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.