న్యూఢిల్లీ: అత్యధిక రిస్క్‌లతోకూడిన డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేటపుడు అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా సూచించారు. స్టాక్ మార్కెట్లో తరచూ లావాదేవీలు నిర్వహించడం రిస్క్‌లతో కూడిన వ్యవహారమని హెచ్చరించారు. వీటికి చెక్ పెట్టడం ద్వారా నష్టాలను తప్పించుకోమంటూ సలహా ఇచ్చారు.
దేశ వృద్ధి పథంలో భాగస్వామిగా కట్టుబాటును ప్రదర్శిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవలసిందిగా సూచించారు. స్టాక్ మార్కెట్లో సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను అందిస్తుంటాయన్న విషయాన్ని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలియజేశారు. రిజిస్టరైన ఇంటర్మీడియరీలతోనే లావాదేవీలు చేపట్టమంటూ పేర్కొన్నారు. నియంత్రణ పరిధిలోలేని ప్రొడక్టులలో ఇన్వెస్ట్ చేయవద్దంటూ హెచ్చరించారు.
దీర్ఘకాలిక దృష్టి..
దీర్ఘకాలంలో సంపద సృష్టి యోచనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేపట్టవలసిందిగా ఇన్వెస్టర్లకు ఆశి‹Ùకుమార్ సలహా ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలు నిలకడైన ఇన్వెస్టర్లను సైతం నిస్పృహకు గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కొత్త ఇన్వెస్టర్లు లేదా అంతగా అవగాహనలేనివారు అప్రమత్తతతో వ్యవహరించడం కీలకమని వివరించారు. కాగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) పట్ల ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి ఆశ్చర్యంతోపాటు కలవరపాటుకు గురిచేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ గత నెలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌అండ్‌వో విభాగంలో 90 శాతంమంది ఇన్వెస్టర్లు సొమ్ము నష్టపోతున్నట్లు
వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment