AshishKumar Chauhan
-
హైరిస్క్ డెరివేటివ్స్తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అత్యధిక రిస్క్లతోకూడిన డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేటపుడు అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా సూచించారు. స్టాక్ మార్కెట్లో తరచూ లావాదేవీలు నిర్వహించడం రిస్క్‌లతో కూడిన వ్యవహారమని హెచ్చరించారు. వీటికి చెక్ పెట్టడం ద్వారా నష్టాలను తప్పించుకోమంటూ సలహా ఇచ్చారు. దేశ వృద్ధి పథంలో భాగస్వామిగా కట్టుబాటును ప్రదర్శిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవలసిందిగా సూచించారు. స్టాక్ మార్కెట్లో సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను అందిస్తుంటాయన్న విషయాన్ని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలియజేశారు. రిజిస్టరైన ఇంటర్మీడియరీలతోనే లావాదేవీలు చేపట్టమంటూ పేర్కొన్నారు. నియంత్రణ పరిధిలోలేని ప్రొడక్టులలో ఇన్వెస్ట్ చేయవద్దంటూ హెచ్చరించారు. దీర్ఘకాలిక దృష్టి.. దీర్ఘకాలంలో సంపద సృష్టి యోచనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేపట్టవలసిందిగా ఇన్వెస్టర్లకు ఆశి‹Ùకుమార్ సలహా ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలు నిలకడైన ఇన్వెస్టర్లను సైతం నిస్పృహకు గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కొత్త ఇన్వెస్టర్లు లేదా అంతగా అవగాహనలేనివారు అప్రమత్తతతో వ్యవహరించడం కీలకమని వివరించారు. కాగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) పట్ల ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి ఆశ్చర్యంతోపాటు కలవరపాటుకు గురిచేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ గత నెలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌అండ్‌వో విభాగంలో 90 శాతంమంది ఇన్వెస్టర్లు సొమ్ము నష్టపోతున్నట్లు వెల్లడించారు. -
6 నెలల్లోగా బీఎస్ఈ పబ్లిక్ ఇష్యూ
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చే ఆరు నెలల్లోగా స్టాక్ మార్కెట్లో నమోదు కానుంది. వాటాల ఉపసంహరణకు సంబంధించి అనుమతి కోరుతూ ఇప్పటికే సెబీకి దాఖలు చేశామని, అనుమతులు రాగానే పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు బీఎస్ఈ మేనేజింగ్ డెరైక్టర్ అండ్ సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్యూ పరిమాణం చెప్పలేమని, అది రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు ఉండొచ్చన్నారు. సెబీ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ఇష్యూపై స్పష్టత వస్తుందన్నారు. బీఎస్ఈలో 7,000 మందికిపైగా వాటాదారులు ఉన్నారు. అందులో 40 శాతం బ్రోకింగ్ కమ్యూనిటీకి సంబంధించినవాళ్లు ఉండగా, మరో 30 శాతం విదేశీ సంస్థలు ఉన్నాయి. షేర్లను వేలం వేయడం ద్వారా (ఆఫర్ ఫర్ సేల్) వాటాలను విక్రయించాలని బీఎస్ఈ నిర్ణయించింది. ఇందుకోసం గత జనవరిలో సెబీకి దరఖాస్తు చేసింది.