ఆప్షన్స్‌పై 0.062 శాతం నుంచి 0.1 శాతానికి పన్ను పెంపు
ఫ్యూచర్స్‌పై 0.012 శాతం నుంచి 0.02 శాతానికి పెంపుదల
2024 అక్టోబర్ 1 నుంచి కొత్త ఎస్‌టీటీ రేట్లు అమలు
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(డెరివేటివ్స్) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ)ను పెంచారు. దీంతో సెక్యూరిటీల ఆప్షన్ విక్రయంపై ప్రస్తుతమున్న ఆప్షన్ ప్రీమియంలో 0.625 శాతం పన్ను 0.1 శాతానికి పెరగనుంది. ఇక సెక్యూరిటీల ఫ్యూచర్స్ విక్రయంపై సైతం 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుంచి పన్ను పెంపు అమల్లోకి రానుంది.
నిజానికి ఎఫ్‌అండ్‌వో విభాగంలో ఇటీవల కొంతకాలంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సెబీ, ఆర్థిక శాఖ, స్టాక్ ఎక్సే్ఛంజీలతోపాటు ఆర్థిక సర్వే సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డెరివేటివ్స్ విభాగంలో రిటైలర్ల పారి్టసిపేషన్ భారీగా పెరిగిపోతుండటంతో జూదానికి దారితీస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సీతారామన్ ఎఫ్‌అండ్‌వో లావాదేవీలపై పన్నులను పెంచేందుకు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఇటీవలే ఎఫ్‌అండ్‌వో లావాదేవీలు పెరుగుతుండటంపై రిటైలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రిటైలర్లను డెరివేటివ్స్ అత్యధికంగా ఆకట్టుకుంటున్న కారణంగా విశ్లేషకులు సైతం రిస్కులను అర్ధం చేసుకోగలిగినవాళ్లు మాత్రమే లావాదేవీలను చేపట్టమంటూ అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు వీటిని చేపట్టకపోవడమే మేలని సూచిస్తున్నారు.
టర్నోవర్ దూకుడు
డెరివేటివ్స్ విభాగంలో నెలవారీ టర్నోవర్ 2024 మార్చికల్లా కొన్ని రెట్లు ఎగసి రూ. 8,740 లక్షల కోట్లను తాకింది. 2019 మార్చిలో కేవలం రూ. 217 లక్షల కోట్లుగా నమోదుకావడం గమనార్హం! ఇదే కాలంలో నగదు విభాగంలోనూ రోజువారీ సగటు టర్నోవర్ రూ. లక్ష కోట్లను తాకగా.. ఎఫ్‌అండ్‌వోలో రూ. 330 లక్షల కోట్లకు చేరింది.
ఎఫ్‌అండ్‌వో అంటే?
ఒక షేరు లేదా కమోడిటీ విలువ ఆధారంగా కుదుర్చుకునే తాత్కాలిక కాంట్రాక్ట్‌ల లావాదేవీలను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌గా పేర్కొనవచ్చు. అత్యధిక శాతం ట్రేడర్లు రిసు్కల రక్షణ(హెడ్జింగ్)కు, ధరల కదలికలపై అంచనాలు, షేర్లు లేదా కమోడిటీల ధర వ్యత్యాసాల లబ్ధికి సైతం వీటిలో లావాదేవీలను చేపడుతుంటారు. వెరసి వీటిని స్వల్పకాలిక లాభార్జనకు స్పెక్యులేటివ్ టూల్‌గా వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్ ఆటుపోట్లు, లెవరేజ్.. తదితర రిస్క్‌ల కారణంగా అత్యధికస్థాయిలో నష్టాలు సైతం వాటిల్లుతుంటాయి.
సెబీ ఇటీవలి నివేదిక ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లలో 89 శాతంమంది డెరివేటివ్స్‌లో నష్టపోతున్నారు. 2021–22 ఏడాదిలో వీరికి సగటున రూ. 1.1 లక్ష చొప్పున నష్టాలు నమోదయ్యాయి. కరోనా కాలంలో ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్ల సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. 2019లో ఈ సంఖ్య 7.1 లక్షలుకాగా.. 2021కల్లా 45.24 లక్షలకు జంప్‌చేసింది.
5 రెట్లు అధికమైనా..
డెరివేటివ్స్‌లో ఎస్‌టీటీ 5 రెట్లు పెరగనున్నట్లు సిట్రస్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఈ విభాగంలో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో పన్ను పెంపు ఊహించిందేనని తెలియజేశారు.
అయితే పన్ను పెంపు అమల్లోకిరానున్న 2024 అక్టోబర్ 1 నుంచి ఎక్సే్ఛంజీల టర్నోవర్ చార్జీలు తగ్గనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ డిజిటల్ బిజినెస్ హెడ్ ఆశిష్ నందా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆప్షన్స్‌పై రూ. 10,000 రౌండ్ ట్రిప్ ప్రీమియంపై ఎస్‌టీటీ రూ. 3.75 పెరుగుతుందనుకుంటే.. టర్నోవర్ చార్జీలు రూ. 3.5–4 స్థాయిలో తగ్గనున్నట్లు వివరించారు. దీంతో నికరంగా ప్రభావం ఉండకపోవచ్చని
అభిప్రాయపడ్డారు.
ఎల్‌టీసీజీలో సవరణలు
కేంద్రానికి రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయం
బడ్జెట్‌లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్ కాలావధి ఆధారంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లను క్రమబదీ్ధకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్ ఫైనాన్షియల్ ఆస్తుల హోల్డింగ్‌తోపాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్ ఆస్తుల హోల్డింగ్స్ దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (ఎల్‌టీసీజీ) జాబితాలో చేరనున్నాయి.
అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి(వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.
అయితే ఇండెక్సేషన్ లబ్ధిని ఎత్తివేశారు. ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచారు. కాగా... మూలధన లాభాలపై పన్ను(క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) రేట్ల సవరణ కారణంగా రూ. 15,000 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరే వీలున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అంచనా వేశారు.
బైబ్యాక్ షేర్లపైనా పన్ను
డివిడెండ్ తరహాలో విధింపు
బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం డివిడెండ్ తరహాలో బైబ్యాక్ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అక్టోబర్ 1నుంచి అమల్లోకి రానున్న నిబంధనలతో ఇకపై బైబ్యాక్ షేర్లకు వాటాదారులపై పన్ను విధించనున్నారు.
వెరసి కంపెనీలు చేపట్టే బైబ్యాక్‌లో భాగంగా షేర్లకు చెల్లించే సొమ్ముపై డివిడెండ్ తరహాలో వాటాదారులపైనే పన్ను భారం పడనుంది. ఇది ఇన్వెస్టర్లపై పన్ను భారాన్ని మరింత పెంచనుంది. మరోవైపు ఎస్‌టీటీతోపాటు.. స్వల్పకాలిక లాభాలపై పన్ను పెంపునకు తాజా బడ్జెట్ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ బైబ్యాక్ షేర్లకు కంపెనీలే పన్ను చెల్లిస్తున్నాయి.
మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్..
ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీమ్ ఇండియా కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ ద్వారా ఒక మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్ ఇది. సామాన్యుల ప్రయోజనాలపై బడ్జెట్ దృష్టి సారిస్తుంది. అనుభవజు్ఞడైన కెప్టెన్ నాయకత్వంలో దేశం నాడిని పెంపొందించే కచి్చత, వివరణాత్మక, పరిశోధించి రూపొందించిన బడ్జెట్. – హర్‡్ష గోయెంకా, చైర్మన్, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్.
పెట్టుబడులను ఆకర్షిస్తుంది..
ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి, స్థిర భవిష్యత్తును ప్రోత్సహించడానికి రూపొందించిన దార్శనికత, ఆచరణాత్మక బ్లూప్రింట్. ఇది వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. గణనీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరిస్తుంది. భారత్‌ను సాంకేతికతతో నడిచే, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్.
సమగ్ర రోడ్‌మ్యాప్..
ప్రజల–కేంద్రీకృత బడ్జెట్. ఇది ఆర్థిక స్థిరత్వంతో సమానమైన వృద్ధిని సమతుల్యం చేస్తుంది. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తూనే సుస్థిర, సమాన వృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను
ఆవిష్కరించింది. – సంజీవ్ పురి, ప్రెసిడెంట్, సీఐఐ.
Comments
Please login to add a commentAdd a comment