
ముంబై: ఆఖర్లో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఆగస్టు నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్ ముగింపు, దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి డేటాతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ట్రేడింగ్‌లో 406 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అయిదు పాయింట్ల లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ, రియలీ్ట, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్(జేఎఫ్‌ఎస్) షేరు వరుసగా మూడో రోజూ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇటీవల ఆర్‌ఐఎల్ ఏజీఎం సమావేశంలో జేఎఫ్‌ఎస్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాల్లోకి విస్తరిస్తుందని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన ఈ షేరు ర్యాలీకి దోహదపడుతున్నాయి. తాజాగా బుధవారం బీఎస్‌ఈలో 5% ఎగసి రూ.233 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాౖకైంది.
► గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. బీఎస్‌ఈలో 19% ఎగసి రూ.874 వద్ద స్థిరపడింది. యూఈఏకి చెందిన దుస్తుల తయారీ కంపెనీ అట్రాకోను 55 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.455 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ షేరు ర్యాలీకి కారణమవుతోంది.