f&o series
-
ఆఖర్లో లాభాల స్వీకరణ
ముంబై: ఆఖర్లో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఆగస్టు నెలవారీ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు, దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి డేటాతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ట్రేడింగ్‌లో 406 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అయిదు పాయింట్ల లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ, రియలీ్ట, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్(జేఎఫ్ఎస్) షేరు వరుసగా మూడో రోజూ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇటీవల ఆర్ఐఎల్ ఏజీఎం సమావేశంలో జేఎఫ్ఎస్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాల్లోకి విస్తరిస్తుందని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన ఈ షేరు ర్యాలీకి దోహదపడుతున్నాయి. తాజాగా బుధవారం బీఎస్ఈలో 5% ఎగసి రూ.233 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాౖకైంది. ► గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. బీఎస్ఈలో 19% ఎగసి రూ.874 వద్ద స్థిరపడింది. యూఈఏకి చెందిన దుస్తుల తయారీ కంపెనీ అట్రాకోను 55 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.455 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ షేరు ర్యాలీకి కారణమవుతోంది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్.. నష్టాల ముగింపు
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు, ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందురోజు దేశీయ స్టాక్ సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 871 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 135 పాయింట్లు నష్టపోయి 52,444 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 254 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసే సరికి 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద నిలిచింది. చైనాలోని టెక్నాలజీ షేర్ల పతనం కొనసాగడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ మరింత తగ్గించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ ప్రకటన(బుధవారం రాత్రి), జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు (గురువారం)నకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఆగడం లేదు. ఈ ప్రతికూలతలతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 776 పాయింట్లు నష్టపోయి 52 వేల దిగువన 51,803 స్థాయిని తాకింది. నిఫ్టీ సైతం 233 పాయింట్లను నష్టపోయి 15,513 స్థాయికి దిగివచ్చింది. అయితే యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో సూచీలకు నష్టాల అడ్డుకట్ట పడింది. మిడ్‌సెషన్ నుంచి క్రమంగా కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీల నష్టాలు తగ్గుతూ వచ్చాయి. అయినప్పటికీ నష్టాల ముగింపు తప్పలేదు. మార్కెట్ మూడురోజుల పతనంతో ఇన్వెస్టర్లు రూ.లక్ష కోట్ల సంపదను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.235.11 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇటీవల క్యూ1 ఫలితాలను ప్రకటించిన బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీల ఆస్తుల నాణ్యత క్షీణించడంతో ఆ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంరపర కొనసాగిస్తూ రూ.2275 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.921 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ రికవరీ అయ్యింది. డాలర్ మారకంలో తొమ్మిది పైసలు బలపడి 74.38 వద్ద ముగిసింది. రెండోరోజూ రాణించిన స్టీల్ షేర్లు... దేశీయ స్టీల్ రంగ షేర్లు రెండోరోజూ రాణించాయి. తమ దేశంలో నెలకొన్న స్టీల్ కొరత, ధరల నియంత్రణకు చైనా సిద్ధమైంది. స్టీల్ ఎగుమతులపై సుంకాలను 10–25% పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ టారిఫ్‌లు అమలయితే చైనా నుంచి స్టీల్ దిగుమతులు తగ్గి దేశీయ స్టీల్‌కు డిమాండ్ పెరగవచ్చనే అంచనాలతో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సెయిల్, మెయిల్, ఏపీఎల్ అపోలో, వేదాంత షేర్లు లాభపడ్డాయి. స్టీల్ షేర్లు రాణించడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లో ఎయిర్టెల్ షేరు ఎదురీదింది. కంపెనీ తన ప్రారంభ స్థాయి ప్రీపెయిడ్ ప్లాన్ ధరను 60% మేర పెంచడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో ఐదున్నర శాతం పెరిగి రూ.570 స్థాయిని తాకిన షేరు చివరికి ఐదుశాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది. ► రామ్‌కో సిమెంట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీకి ‘‘అండర్పర్ఫామ్’’ రేటింగ్‌ను కేటాయించాయి. ఫలితంగా కంపెనీ షేరు రెండుశాతం నష్టపోయి రూ.1,041 వద్ద ముగిసింది. ► ఇదే క్యూ1 కాలంలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించిన సెంచురీ టెక్స్టైల్స్ కంపెనీ షేరు ఇంట్రాడేలో 20% ర్యాలీ చేసి రూ.819 స్థాయికి తాకింది. చివరికి 17% లాభంతో రూ.796 వద్ద స్థిరపడింది. -
బేర్ గుప్పిట్లోకి... మార్కెట్
ముంబై: బడ్జెట్ భయాలతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం బేర్ గుప్పిట్లో విలవిల్లాడింది. అలాగే జనవరి ఎఫ్ అండ్æఓ డెరివేటివ్స్ గడువు ముగింపు నేపథ్యంలో అప్రమత్తత మార్కెట్‌ను మరింత భయపెట్టింది. ఫలితంగా సెన్సెక్స్ 48 వేల స్థాయిని కోల్పోయి 938 పాయింట్ల నష్టంతో 47,410 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు కోల్పోయి 14వేల దిగువన 13,967 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగో నష్టాల ముగింపు. మార్కెట్ మొదలైన మరుక్షణం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ కొనసాగే కొద్దే విక్రయాల ఒత్తిళ్లు పెరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,007 పాయింట్లు, నిఫ్టీ 310 పాయింట్లను కోల్పోయాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టపోయాయి. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.1,688 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నాలుగురోజుల్లో నెల లాభాలు ఆవిరి... మార్కెట్ నాలుగు రోజుల పతనంతో సూచీలు ఈ జనవరిలో ఆర్జించిన లాభాలన్నీ ఆవిరైపోయాయి. మొత్తం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,382 పాయింట్లు, నిఫ్టీ 678 పాయింట్లను కోల్పోయాయి. ఇదే నెలలో సూచీలు అందుకున్న జీవితకాల గరిష్టస్థాయిల నుంచి ఐదుశాతం పతనాన్ని చవిచూసినట్లైంది. నష్టాలకు నాలుగు కారణాలు... వెంటాడిన బడ్జెట్ భయాలు... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేవారం మొదటిరోజు(ఫిబ్రవరి 1న)నే 2021–22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో అధిక పన్ను విధింపునకు ఆస్కారం ఉందనే అంచనాలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. బడ్జెట్ తర్వాత కొనుగోళ్ల కోసం కొంత లిక్విడిటీ చేతుల్లో ఉంటే మంచిదనే ఆలోచనలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు కొందరు నిపుణులు తెలిపారు. గత పదేళ్ల కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే బడ్జెట్ ఈక్విటీ మార్కెట్‌ను మెప్పించిందనే విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. బేరిష్‌గా మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి ... భారత ఈక్విటీ మార్కెట్ల విదేశీ ఇన్వెస్టర్లు అనూహ్యంగా బేరిష్ వైఖరిని ప్రదర్శించడం మార్కెట్ సెంటిమెంట్ బలహీనపరిచింది. గత మూడురోజుల నుంచి ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపుతూ మొత్తం రూ.3,089 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు పేర్కొన్నాయి. దేశీయ కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడ్ రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్యపరపతి సమావేశాలు లాంటి ప్రధాన ఈవెంట్ల నేపథ్యంలో ఎఫ్ఐఐలు ‘‘వేచిచూసే ధోరణి’’ని ప్రదర్శిస్తున్నారని నిపుణులు తెలిపారు. నిరాశపరచిన క్యూ3 ఫలితాలు కొద్దిరోజులుగా కార్పొరేట్ కంపెనీలు వెల్లడిస్తున్న మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. అధిక మొత్తంలో మొండిబకాయిలను ప్రకటిస్తూ బ్యాంకింగ్ కంపెనీలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆరి ్థక వ్యవస్థ పనితీరుకు అద్దంపట్టే బ్యాంకింగ్ రంగం బలహీనంగా ఉందనే సంకేతాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ప్రపంచ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు బలహీన అంతర్జాతీయ సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంకు ద్రవ్యపాలసీ విధాన నిర్ణయం కోసం ఎదురుచూపులతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ చుట్టూ నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీలతో పాటు యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కాగా అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. రూ. 2.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం... ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.6 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.189 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఇక నాలుగురోజుల పతనంతో ఇన్వెస్టర్లు మొత్తం రూ.8 లక్షల కోట్లను కోల్పోయినట్లైంది. మరిన్ని సంగతులు బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, అపోలో హాస్పిటల్, సైయెంట్, రూట్ మొబైల్స్, యూపీఎల్ షేర్లు తాజాగా ఏడాది గరిష్టాన్ని తాకాయి. రియలన్స్ షేరు 2.50 శాతం క్షీణించి రూ.1900ల దిగువున రూ.1895 వద్ద స్థిరపడింది. అమెజాన్‌తో ఫ్యూచర్స్ గ్రూప్ కొనుగోలు వివాదంతో పాటు బలహీన క్యూ3 ఆర్థిక గణాంకాలన నమోదు షేరు పతనానికి కారణవుతోంది. మొత్తం మూడు రోజుల్లో 10 శాతం నష్టపోయింది. ఎఫ్అండ్ఓ ముగింపు గడువు ముగింపు నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఎక్స్ఐ ఇండెక్స్ ఐదు శాతం పెరిగి 24.39 వద్ద స్థిరపడింది. -
మార్కెట్.. బౌన్స్‌బ్యాక్!
ముంబై: స్టాక్ మార్కెట్ నవంబర్ సిరీస్‌ను లాభాలతో ముగించింది. ఎఫ్అండ్ఓ ముగింపు నేపథ్యంలో ట్రేడింగ్ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైనప్పటికీ.., మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 44,260 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్ల ఆర్జించి 12,987 వద్ద నిలిచింది. మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్‌కు తగ్గట్లు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. పండుగ సీజన్లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పనితీరును కనబరిచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 780 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ.2,027 కోట్ల షేర్లను కొనగా, దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ.3,400 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నవంబర్ సిరీస్‌లో సెన్సెక్స్ 4510 పాయింట్లను, నిఫ్టీ 1316 పాయింట్లు ఎగిశాయి. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్.... లాభాల స్వీకరణతో బుధవారం నష్టాలను చవిచూసిన మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా మొదలైంది. ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు రోజు కావడంతో ఆరంభంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో ఉదయం సెషన్లో సూచీలు లాభ – నష్టాల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్ షేర్లలో కొనుగోళ్లు మొదలవడంతో లాభాల బాట పట్టాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో మరింత దూసుకెళ్లాయి. -
లాభాలతో ఆగస్ట్ సిరీస్ షురూ?
నేడు (31న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 44 పాయింట్లు బలపడి 11,129 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,085 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చివరి రోజు జులై ఫ్యూచర్స్ 11,101 వద్ద స్థిరపడగా.. నేటి నుంచి ఆగస్ట్ నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభంకానుంది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ క్యూ2లో 33 శాతం వెనకడుగు వేయడంతో గురువారం డోజోన్స్, ఎస్అండ్పీ 0.9-0.4 శాతం మధ్య బలహీనపడగా.. నాస్డాక్ 0.45 శాతం పుంజుకుంది. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు 2.7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి ఆటుపోట్లకు లోనుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. నష్టాల ముగింపు జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ చివరి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. వెరసి గురువారం సెన్సెక్స్ 335 పాయింట్లు పతనమై 37,736వద్ద ముగిసింది. 38,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు కోల్పోయి 11,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,300- 11,085 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,025 పాయింట్ల వద్ద, తదుపరి 10,947 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,240 పాయింట్ల వద్ద, ఆపై 11,377 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,400 పాయింట్ల వద్ద, తదుపరి 21,154 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,073 పాయింట్ల వద్ద, తదుపరి 22,500 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. డీఐఐల అమ్మకాలు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 387 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 353 కోట్లు, డీఐఐలు రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఇక మార్కెట్లపై ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగం ప్రభావం చూపనుంది. గురువారం(25న) జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను జులై సిరీస్‌కు రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు కంపెనీల క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు, చైనాతో సరిహద్దు వివాదాలు, కరోనా కేసుల సంఖ్య వంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు పటిష్ట లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ నికరంగా 951 పాయింట్లు(2.8 శాతం) జంప్‌చేసి 34,732 వద్ద నిలవగా.. నిఫ్టీ 272 పాయింట్లు(2.7 శాతం) ఎగసి 10,244 వద్ద స్థిరపడింది. వెరసి గత మూడు వారాలలో నమోదైన గరిష్టం వద్ద మార్కెట్లు నిలిచినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కదలికలు ఇలా.. వారాంతాన ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 రోజుల చలన సగటుకు ఎగువన 10,200 వద్ద ముగిసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. గురువారం 10,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించడంతో జోరందుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా సమీప కాలంలోనే ఇటీవల గరిష్టం 10,338ను నిఫ్టీ తాకే వీలున్నట్లు షేర్‌ఖాన్ టెక్నికల్ విశ్లేషకులు గౌవర్ రత్నపార్ఖి అంచనా వేశారు. ఈ బాటలో జనవరి-మార్చి పతనానికి 61.8 శాతం రీట్రేస్మెంట్ స్థాయి అయిన 10,550వైపు సాగవచ్చని భావిస్తున్నారు. వచ్చే వారం నిఫ్టీకి 10,155-10,135 శ్రేణిలో తొలి సపోర్ట్ లభించవచ్చని పేర్కొన్నారు. చార్ట్‌వ్యూఇండియా నిపుణులు మజర్ మొహమ్మద్ సైతం 10,328ను నిఫ్టీ అధిగమించవచ్చని ఊహిస్తున్నారు. నిఫ్టీకి గత వారం చివర్లో జోష్‌వచ్చిందని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోడీ పేర్కొన్నారు. అయితే గత రెండు వారాల్లో 10,100-10,150 స్థాయిలో నిఫ్టీకి కీలక అవరోధాలు ఎదురైనట్లు తెలియజేశారు. దిగువ స్థాయిలో 9,550 వద్ద నిఫ్టీకి కీలక మద్దతు లభించే వీలున్నట్లు అంచనా వేశారు. జాబితా ఇదీ వచ్చే వారం పలు కంపెనీలు గతేడాది(2019-20) క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ప్రధాన కంపెనీలలో నేడు పవర్‌గ్రిడ్ పనితీరు వెల్లడించనుండగా.. ఏషియన్ పెయింట్స్(23న), గెయిల్ ఇండియా(24న), కోల్ ఇండియా, ఐటీసీ(26న) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు సైతం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించగలవని విశ్లేషకులు వివరించారు. -
డిస్కౌంట్లో నిఫ్టీ ఫ్యూచర్స్.. దేనికి సంకేతం?
నిఫ్టీ జూన్ సీరిస్ ఆరంభంలో ఫ్యూచర్స్‌కు, స్పాట్ ధరకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. సీరిస్ తొలిరోజు దాదాపు 98 పాయింట్ల తేడాతో స్పాట్ప్రైస్, ఫ్యూచర్ ప్రైస్ క్లోజయ్యాయి. ఎఫ్ఐఐలు ఇండెక్స్ ఫ్యూచర్లను లిక్విడేట్ చేయడం, కొత్తగా ఇండెక్స్‌ల్లో షార్ట్స్ పెరగడమే ఇంత డిస్కౌంట్‌కు కారణమని డెరివేటివ్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఇంత వ్యత్యాసాన్ని అప్రమత్తతకు సంకేతంగా భావించాలని చెబుతుండగా, కొందరు మాత్రం ఇది షార్ట్స్ కొట్టినవాళ్లు బుక్అయ్యే సంకేతమని, మరో దఫా షార్ట్ కవరింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ శక్రవారం స్పాట్ క్లోజింగ్ ధర 9580.30 పాయింట్లు. ప్రస్తుతం ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో దాదాపు 13448 నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. నికర లెక్కలో ట్రేడర్లు కొత్తగా 6283 కాంట్రాక్టులు తీసుకున్నారు. ఎఫ్ఐఐలు నికరంగా 10295 కాంట్రాక్టులను లిక్విడేట్ చేశారు. శుక్రవారం ఇంట్రాడేలో ఫ్యూచర్, స్పాట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఒకదశలో 14.95 పాయింట్లకు తగ్గి చివరకు 98 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. సోమవారం సూచీల్లో పతనం వస్తుందా? లేక మరో షార్ట్‌కవరింగ్ ర్యాలీ ఉంటుందా? అనేదాన్ని బట్టి తదుపరి కదలికలు అంచనా వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
రూ.7- 8 మధ్యన వొడాఐడియా ర్యాలీకి బ్రేక్?!
కంపెనీలో గూగుల్ వాటాలు కొనేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు వొడాఫోన్ ఐడియా షేరులో ఉత్సాహం నింపాయి. దీంతో శుక్రవారం ఒక్కరోజులో షేరు దాదాపు 30 శాతం దూసుకుపోయింది. మధ్యాహ్న సమయానికి రూ. రూ.7.35 వద్ద(దాదాపు 27 శాతం అప్) కదలాడుతోంది. ఈ నేపథ్యంలో షేరులో మరింత అప్‌మూవ్ ఉంటుందా? కన్సాలిడేషన్ జరుగుతుందా? అనే విషయమై సామాన్య మదుపరి ఆసక్తిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు ఆప్షన్స్‌పై ఎఫ్అండ్ఓ నిపుణులు విశ్లేషణ జరిపారు. ఆప్షన్ డేటా ప్రకారం ఈ షేరు స్వల్పకాలానికి రూ. 6-8 మధ్య కదలాడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. షేరు ఆప్షన్ డేటా విశ్లేషణ ఇలా ఉంది.... ఐడియా ఆప్షన్స్ పరిశీలిస్తే అత్యధికంగా రూ. 10, 7, 6, 8 స్ట్రైక్‌ప్రైస్‌ల వద్ద కాల్స్ ఉన్నాయని, రూ. 6, 5, 7 వద్ద పుట్స్ ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం రూ. 10, 8 స్ట్రైక్‌ప్రైస్ వద్ద ఎక్కువగా కాల్‌రైటింగ్ జరగగా, రూ. 6, 7 వద్ద ఎక్కువగా పుట్ రైటింగ్ జరిగింది. కాల్ రైటింగ్ జరిగే ధరలు తక్షణ నిరోధాలుగా, పుట్ రైటింగ్ జరిగే ధరలు తక్షణ మద్దతులుగా నిలుస్తుంటాయి. ఈ ప్రకారం చూస్తే వొడాఐడియా షేరుకు తక్షణం రూ. 8 వద్ద నిరోధం, రూ. 6. వద్ద మద్దతు కనిపిస్తున్నాయి. అందువల్ల స్వల్పకాలానికి షేరు రూ. 7 వద్దనే అటు ఇటు కదలాడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని నిపుణుల అంచనా. రూ. 8 వద్దకు వచ్చినప్పుడు అమ్మకాలు, రూ. 6కు వస్తే కొనుగోళ్లు జరగవచ్చు. ఒకవేళ అనూహ్యంగా షేరు రూ. 7పైన స్థిరపడి క్రమంగా రూ. 8 దాటగలిగితే క్రమంగా రూ. 10కి చేరే అవకాశాలున్నాయి. అలాగే దిగువన రూ. 5 వద్ద మరో గట్టి మద్దతుంది. షేరు పీసీఆర్ నిష్పత్తి ప్రస్తుతం దాదాపు 0.5గా ఉంది. ఇది కూడా ఒక రకంగా ర్యాలీని పరిమితం చేసే సంకేతంగా భావించవచ్చు. -
వచ్చే వారం ఆటుపోట్లు తప్పకపోవచ్చు!
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం(25న) మార్కెట్లకు సెలవుకాడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. మే నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారం(28న) ముగియనుంది. దీంతో వచ్చే వారం మొదట్లో ట్రేడర్లు పొజిషన్లను జూన్ నెలకు రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీలో 8800 వద్ద స్ట్రైక్స్‌తో గరిష్ట పుట్ బేస్ 9,000 వద్ద ఉన్నట్లు ఆప్షన్స్ డేటా సూచిస్తోంది. వెరసి నిఫ్టీకి ఈ స్థాయిల వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ లోయర్ టాప్, లోయర్ బాటమ్లను తాకుతుండటంతో అంతర్గతంగా మార్కెట్లు బలహీనంగా ఉన్నట్లు చెబుతున్నారు. రోజువారీ చార్టుల ప్రకారం శుక్రవారం నిఫ్టీలో డోజీ పేటర్న్ ఏర్పడిందని.. ఇది అటు బుల్స్, ఇటు బేర్స్‌కు ఎలాంటి పట్టునూ ఇవ్వకపోవడాన్ని సూచిస్తున్నట్లు వివరించారు. 8600-9600 గత వారం నిఫ్టీ 9,100 దిగువనే ముగిసింది. వరుసగా మూడో వారం ఆటుపోట్ల మధ్య నష్టాలతో నిలిచింది. చార్టుల ప్రకారం గత వారం నిఫ్టీ కదలికలు హ్యామర్ తరహా కేండిల్‌ను సూచిస్తున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నమోదైన గరిష్టం నుంచి 61.8 శాతం రీట్రేస్మెంట్(8055-9890) స్థాయి 8756 వద్ద నిఫ్టీకి మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో నిఫ్టీ 8,600- 9,600 పాయింట్ల పరిధిలో కదిలే వీలున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ప్యాకేజీలు, లిక్విడిటీ చర్యలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నట్లు తెలియజేశారు. నిఫ్టీకి 8,800 వద్ద కీలక మద్దతు లభించవచ్చని, ఇదే విధంగా 9,300 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ టెక్నికల్ హెడ్ ధర్మేష్ షా పేర్కొన్నారు. కాగా.. వచ్చే వారం దిగ్గజ కంపెనీలు హెచ్డీఎఫ్సీ, లుపిన్, సన్ ఫార్మా, డీమార్ట్ తదితరాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. -
మార్కెట్లో లాభాల పౌర్ణమి
మార్కెట్ అప్డేట్ 4 రోజుల నష్టాల గ్రహణానికి చెక్ - 338 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ - 25,369 వద్ద ముగిసిన ఇండెక్స్ - తొలగిన చమురు ధరల భయాలు ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లలో 4రోజులుగా నెలకొన్న నష్టాల గ్రహణం వీడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు చల్లబడటంతోపాటు, ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు సందర్భంగా జరిగిన షార్ట్ కవరింగ్‌తో ప్రధాన సూచీలు రివ్వున ఎగశాయి. గత 2వారాల్లో లేని విధంగా సెన్సెక్స్ 338 పాయింట్లు జంప్‌చేసి 25,369 వద్ద ముగిసింది. లాభాలతో మొదలైన సెన్సెక్స్ మిడ్ సెషన్లో గరిష్టంగా 25,415కు చేరింది. నిఫ్టీ కూడా 7,593 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 87 పాయింట్ల లాభంతో 7,580 వద్ద ముగి సింది. కాగా, చైనా తయారీ రంగం ఈ ఏడాదిలో తొలిసారి (జూన్ నెలకు) వృద్ధి బాట పట్టడంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. అన్ని రంగాలూ..: బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా, రియల్టీ, ఆయిల్, బ్యాంకింగ్ 3-1.5% మధ్య బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.6% చొప్పున పెరిగాయి. ట్రేడైన షేర్లలో 2,041 లాభపడితే, 985 నష్టపోయాయి. ఆయిల్ షేర్ల జోష్..: ముడిచమురు ధరలుతగ్గడంతోపాటు, దేశీయంగా డీజిల్ ధరల బాటలోనే కిరోసిన్, ఎల్పీజీ ధరలనూ నెలవారీ స్వల్ప మొత్తంలో పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో చమురు షేర్లు హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బీపీసీఎల్, గెయిల్, ఐవోసీ 7-5% మధ్య దూసుకెళ్లగా, ఆర్ఐఎల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ 2-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు..: ఎఫ్ఐఐలు రూ. 285 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ సంస్థలు రూ. 216 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మూడు కాంట్రాక్టుల్లో రూ. 3.32 లక్షల కోట్ల టర్నోవర్ - బీఎస్ఈలో అసాధారణ ట్రేడింగ్ - టర్నోవర్‌లో ఎక్స్ఛేంజీల కొత్త రికార్డు మంగళవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈలో అసహజ స్థాయిలో టర్నోవర్ నమోదైంది. దాంతో డెరివేటివ్ విభాగంలో తొలిసారి ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ)ని బీఎస్ఈ(బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ) ఓవర్టేక్ చేసింది. జూన్ నెల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌లకు సంబంధించి బీఎస్ఈలో రూ. 3.36 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. ఇది ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యధికంకాగా, ఎన్ఎస్ఈలో దాదాపు రూ. 3.30 లక్షల కోట్లు జరిగింది. వెరసి మొత్తం టర్నోవర్ మార్కెట్ చరిత్రలోనే కొత్త రికార్డుగా రూ. 6.67 లక్షల కోట్లను తాకింది. ఈ వ్యవహారంపై సెబీ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఏం జరిగింది? డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ప్రతీ నెలా చివరి గురువారం ముగుస్తుంది. ఎప్పుడూ డెరివేటివ్ టర్నోవర్‌లో నిఫ్టీదే అగ్రస్థానం. 80% టర్నోవర్ ఎన్ఎస్ఈలోనే జరుగుతుంటుంది. అయితే మంగళవారం బీఎస్ఈలో 91.6 లక్షల కాంట్రాక్ట్‌లు ట్రేడ్‌కాగా, ఒక్క ఇండెక్స్ ఆప్షన్ విభాగంలోని 3 పుట్ కాంట్రాక్ట్‌ల ద్వారానే రూ. 3.32 లక్షల కోట్ల టర్నోవర్ నమోదయ్యింది. వీటిలో సెన్సెక్స్ 24,400 పాయింట్ల విలువగల ఒక కాంట్రాక్ట్ ద్వారా రూ. 2.06 లక్షల కోట్లు, 24,600 పాయింట్ల పుట్లో రూ. 1.07 లక్షల కోట్లు, 24,200 పాయింట్ల వద్ద మరో కాంట్రాక్ట్ ద్వారా రూ. 19,000 కోట్లు చొప్పున టర్నోవర్ నమోదైంది. జూన్ డెరివేటివ్స్‌లో భాగంగా బీఎస్ఈలో సోమవారం వరకూ సగటున రూ. 37,000-1.5లక్షల కోట్లమధ్యటర్నోవర్ జరుగుతూ వచ్చింది.