నిఫ్టీ జూన్ సీరిస్ ఆరంభంలో ఫ్యూచర్స్‌కు, స్పాట్ ధరకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. సీరిస్ తొలిరోజు దాదాపు 98 పాయింట్ల తేడాతో స్పాట్‌ప్రైస్, ఫ్యూచర్ ప్రైస్ క్లోజయ్యాయి. ఎఫ్‌ఐఐలు ఇండెక్స్ ఫ్యూచర్లను లిక్విడేట్ చేయడం, కొత్తగా ఇండెక్స్‌ల్లో షార్ట్స్ పెరగడమే ఇంత డిస్కౌంట్‌కు కారణమని డెరివేటివ్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఇంత వ్యత్యాసాన్ని అప్రమత్తతకు సంకేతంగా భావించాలని చెబుతుండగా, కొందరు మాత్రం ఇది షార్ట్స్ కొట్టినవాళ్లు బుక్‌అయ్యే సంకేతమని, మరో దఫా షార్ట్ కవరింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
నిఫ్టీ శక్రవారం స్పాట్ క్లోజింగ్ ధర 9580.30 పాయింట్లు. ప్రస్తుతం ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో దాదాపు 13448 నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. నికర లెక్కలో ట్రేడర్లు కొత్తగా 6283 కాంట్రాక్టులు తీసుకున్నారు. ఎఫ్‌ఐఐలు నికరంగా 10295 కాంట్రాక్టులను లిక్విడేట్ చేశారు. శుక్రవారం ఇంట్రాడేలో ఫ్యూచర్, స్పాట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఒకదశలో 14.95 పాయింట్లకు తగ్గి చివరకు 98 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. సోమవారం సూచీల్లో పతనం వస్తుందా? లేక మరో షార్ట్‌కవరింగ్ ర్యాలీ ఉంటుందా? అనేదాన్ని బట్టి తదుపరి కదలికలు అంచనా వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment