వరుస లాభాలకు బ్రేక్‌.. | Stock Market updates On april 24 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: వరుస లాభాలకు బ్రేక్‌..

Published Thu, Apr 24 2025 3:39 PM | Last Updated on Thu, Apr 24 2025 3:39 PM

Stock Market updates On april 24

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 24,246 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 315 పాయింట్లు దిగజారి 79,801 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్‌ సూచీలు ఈరోజు నష్టాల్లోకి చేరుకున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జొమాటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే, టీసీఎస్‌ స్టాక్‌లు నష్టపోయాయి.

ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్‌ వెనక్కి

ఈ రోజు మార్కెట్ల ఒడిదొడుకులకుగల కారణాలను నిపుణులు విశ్లేషి​స్తున్నారు. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement