
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు పెరిగి 23,270కు చేరింది. సెన్సెక్స్(Sensex) 407 పాయింట్లు పుంజుకుని 76,423 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.87 శాతం ఎగబాకింది.
ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
అమెరికా ‘లిబరేషన్ డే’ అనిశ్చితి తారస్థాయికి చేరుకోవడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ స్టాక్‌లు దాదాపు 2 శాతం వరకు క్షీణించింది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు అమలు రోజు ఏప్రిల్ 2ను డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా లిబరేషన్ డే’గా అభివర్ణించారు. క్రూడాయిల్ ధరలు అయిదు వారాల గరిష్టానికి చేరుకోవడం, భారత ఈక్విటీ మార్కెట్ మార్చిలో భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావం చూపాయి.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)