
తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్స్, మంచి డిజైన్ కలిగిన కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు.. భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి సెలెరియో
ప్రారంభంలో సెలెరియో కారులో మారుతి సుజుకి కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లను మాత్రమే అందించింది. ఆ తరువాత కాలంలో ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించడం మొదలు పెట్టింది. అయితే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కారు ధర.. స్టాండర్డ్ వేరియంట్ ధర కంటే కొంత ఎక్కువ. ఈ కారు ధరలు రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షల మధ్య ఉన్నాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో కూడా కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉందులో ఉన్నాయి. ఈ కారు ధరలు రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.38 లక్షలు. ఇది 1.2 లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్
మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. రూ. 6.12 లక్షల నుంచి రూ. 11.72 లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉన్న ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు.. 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటివి కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్
2023లో అత్యధిక అమ్మకాలు పొందిన హ్యుందాయ్ ఎక్స్‌టర్.. ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ మొదలైనవి పొందుతుంది. దీని ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.48 లక్షల మధ్య ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్
ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ సీట్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన మారుతి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల మధ్య ఉంది. ఇది పెట్రోల్, CNG రూపంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
సిట్రోయెన్ సీ3
ఫ్రెచ్ వాహన తయారీ సంస్థ అయిన.. సిట్రోయెన్ తన సీ3 కారులో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తోంది. రూ. 6.16 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, డే - నైట్ ఐఆర్వీఎమ్ వంటి వాటిని పొందుతుంది. తక్కువ ధరలో.. మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో సిట్రోయెన్ సీ3 ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment