ముంబై: కార్ల కొనుగోలు విషయంలో కస్టమర్లు భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా, ఎన్‌ఐక్యూ బేసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా క్రాష్ రేటింగ్‌లు, ఎయిర్ బ్యాగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారని తెలిపింది.
జనాదరణ పొందిన ఫీచర్లలో ఇంధన సామర్థ్యం మూడో స్థానంలో ఉంది. భారత్‌లో కార్లకు భద్రతా రేటింగ్ తప్పనిసరిగా ఉండాలని 10 మందిలో 9 మంది కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ‘అధిక రేటింగ్ మోడళ్లు కలిగిన తొలి 3 బ్రాండ్లలో స్కోడా ఒకటి. గ్లోబల్ ఎన్సీఏపీ పరీక్షలో స్లావియా, కుషాక్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భద్రత మాకు తొలి ప్రాధాన్యత’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోలాక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment