airbags
-
కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లపై హ్యుందాయ్ ప్రకటన
న్యూఢిల్లీ: ఇకపై తమ అన్ని కార్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉంటాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ముందుగా 3 మోడల్స్‌తో దీన్ని ప్రారంభించనున్నామని, తర్వాత మిగతా మోడల్స్కూ వర్తింపచేస్తామని సంస్థ ఎండీ ఉన్సూ కిమ్ తెలిపారు. వాహన భద్రతా ప్రమాణాలపరమైన దేశీ క్రాష్ టెస్టులకు సంబంధించి ఇటీవల ప్రవేశపెట్టిన భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రామ్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కూడా నిర్ణయించుకున్నట్లు వివరించారు. టెస్టుల ఆధారంగా వాహనానికి 0–5 వరకు స్టార్ రేటింగ్స్ లభిస్తాయి. కొనుగోలుదారులు ఈ రేటింగ్ ప్రాతిపదికన వివిధ కార్లలో భద్రతా ప్రమాణాలను పోల్చి చూసుకుని తగు నిర్ణయం తీసుకోవచ్చు. తమ మధ్య స్థాయి సెడాన్ కారు వెర్నాకు గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ లభించినట్లు సంస్థ తెలిపింది. -
కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి కాదు: గడ్కరీ
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. ఈ నిబంధనను తప్పనిసరి చేసే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎయిట్ సీటర్ వాహనాల్లో తయారీ సంస్థలు తప్పనిసరిగా ఆరు ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేసే నిబంధనను 2022 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని భావించింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరాపరమైన సమస్యలు నెలకొన్న నేపథ్యంలో దానిని 2023 అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌బ్యాగ్స్ తయారీ రంగం అప్పటికల్లా రూ.7000కోట్లకు చేరుతుంది
వాహనాల్లో కీలక భద్రత ఫీచర్ అయిన ఎయిర్‌బ్యాగ్స్ తయారీ రంగం దేశీయంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 7,000 కోట్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది రూ. 2,500 కోట్లుగా ఉంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. భద్రతా ప్రమాణాలను నియంత్రణ సంస్థ నిబంధనలను కఠినతరం చేస్తుండటం, వాహనాల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్స్ సంఖ్యను పెంచుతుండటం తదితర అంశాలు ఈ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి కారుకు సగటున మూడు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటున్నాయి. 2023 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ సంఖ్య ఆరుకు చేరనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రూ. 2,400–2,500 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 25–30 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 6,000–7,000 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. పెరగనున్న కార్ల తయారీ వ్యయాలు.. 2019 జూలైలో ప్రతీ కారుకు ఒక ఎయిర్‌బ్యాగ్ (డ్రైవర్ కోసం)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2022 జనవరి 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు (3.5 టన్నుల కన్నా తక్కువ బరువుండి, ఎనిమిది మంది వరకూ ప్రయాణించగలిగే వాహనాలు) ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లను నిర్దేశించింది. 2023 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు రెండు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కానుంది. దీంతో కార్లలో తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసేందుకు, అదనంగా సెన్సార్లు ఏర్పాటు చేసేందుకు తయారీ కంపెనీలకు వ్యయాల భారం కూడా పెరగనుంది. అటు ఎయిర్ బ్యాగ్స్ తయారీ సంస్థలు కూడా డిమాండ్‌కి తగ్గట్లు సరఫరా చేసేందుకు వచ్చే ఏడాది కాలంలో ఉత్పత్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సి రానుంది. ‘‘పలు కంపెనీలు గత 6–8 నెలల నుంచి సామర్థ్యాలను పెంచుకునే ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇందుకోసం వచ్చే 12–18 నెలల్లో కంపెనీలు సుమారు రూ. 1,000 – రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి’’ అని ఇక్రా తెలిపింది. దిగుమతులపై ఆధారం.. ఎయిర్‌బ్యాగ్ మొత్తం తయారీ వ్యయంలో ఇన్‌ఫ్లేటర్ ఖర్చే దాదాపు 50 శాతంగా ఉంటుండగా, మిగతా భాగం కుషన్ మొదలైన వాటిది ఉంటోంది. వీటికి సంబంధించి దేశీయంగా సాంకేతిక సామర్థ్యాలు, తగినంత స్థాయిలో అమ్మకాలు లేకపోతుండటంతో పరిశ్రమ ప్రస్తుతం తమకు అవసరమైన పరికరాల్లో దాదాపు 60–70 శాతాన్ని విదేశాల్లోని మాతృ సంస్థలు, జాయింట్ వెంచర్ పార్ట్నర్లు మొదలైన వాటి నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వీటి తయారీ సామర్థ్యాలను పెంచుకోకపోతే మరింత ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి రానుందని ఇక్రా పేర్కొంది. -
ఎయిర్బాగ్స్ సమస్య: కియా కార్ల భారీ రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల కంపెనీ కియా తన పాపులర్ మోడల్ కియా కేరెన్స్ కార్లను భారీగా రీకాల్ చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా దాదాపు 44,174 ఎంపీవీ యూనిట్లు రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను పరిశీలించనుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్న కియా కేరెన్స్ కార్ల స్వచ్ఛంద రీకాల్‌లో అవసరమైతే సాఫ్ట్వేర్ అప్డేట్తో ఎయిర్‌బ్యాగ్ సమస్యను కంపెనీ పరిష్కరించ నుంది. ఇందులో భాగంగా ప్రభావితమైన కారు యజమానులను నేరుగా సంప్రదిస్తుంది. లేదంటే సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కియా కేరెన్స్ యజమానులు తమ కారును సమీపంలోని కియా డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా కియా ఇండియా వెబ్సైట్, యాప్ లేదా వారి కాల్ సెంటర్లో గానీ సంప్రదించవచ్చు. (Akasa Air ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!) కాగా గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కియా కేరెన్స్ 3-స్టార్ ర్యాంక్ సాధించింది.1.5 పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మూడు వేరియంట్లలో ఇది లభ్యం. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 8-స్పీకర్లు, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే 5 ట్రిమ్‌లలో ఇది లభ్యం. అన్నింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, 10 హై-సేఫ్టీ ప్యాకేజీలు కూడా అందింస్తున్న సంగతి తెలిసిందే. (జావా అదిరిపోయే కొత్త బైక్ చూశారా? ధర కూడా అంతే అదుర్స్) -
కారులో 6 ఎయిర్ బ్యాగ్ నిబంధన పై కేంద్రం కీలక నిర్ణయం
-
ఆ నిర్ణయంతో చిన్న కార్లకు కష్టకాలమే!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి ఉండాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై దేశీయ వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పందించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. ఇప్పటికే తగ్గుతున్న చిన్న కార్ల మార్కెట్‌పై ప్రతిపాదిత నిబంధన తీవ్ర ప్రభావం చూపిస్తుందని సంస్థ చైర్మన్ ఆర్.సి.భార్గవ వెల్లడించారు. వాహన రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘మూడేళ్లుగా చిన్న కార్ల విభాగం అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలను దెబ్బతీస్తుంది. ధరలు దూసుకెళ్తుండడంతో మెట్రోయేతర ప్రాంతాల్లో విక్రయాలు తగ్గాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి అయితే ధర రూ.20–25 వేల దాకా అధికం అవుతుంది. చిన్న కారు కొనుగోలుదార్లకు ఇది భారమే’ అని భార్గవ వివరించారు. -
కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే : గడ్కరీ
న్యూఢిల్లీ: కారులో కనిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండటాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఎనిమిది మంది ప్రయాణించగలిగే కారులో తయారీదారులు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంచాలని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. 2019 జూలై 1 నుంచే డ్రైవర్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేశామని, ఇక 2022 జనవరి 1 నుంచే డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో ఉన్నవారికి ఎయిర్‌బ్యాగ్ ఉండాలన్న నిబంధన అమల్లో ఉందన్నారు. వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల దృష్ట్యా ఇప్పుడు అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్స్‌ను తప్పనిసరి చేశామని గడ్కరీ తెలిపారు. చదవండి: Bipin Rawat Chopper Crash: ప్రతికూల వాతావరణమే కారణం -
కార్లలో ఒకటి కాదు, మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాల్సిందే : కేంద్రం
దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కార్ల తయారీ సంస్థలు కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లను అమర్చాలని కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. కేంద్ర రవాణా శాఖ సర్వే ప్రకారం.. మనదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి రోజు 400మంది మరణిస్తుండగా.. ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాద బాధితుల్లో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల) సీఈఓల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్స్టాల్ చేయాలని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ తయారీదారులకు సూచించారు. ఒక ఎయిర్ బ్యాగ్ ఉన్న పాత కార్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లను అమర్చేందుకు ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి డిసెంబర్ 31, 2021 వరకు గడువు ఇచ్చారు. ఏడాది లోపు అన్నీ మోడల్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం(abs) ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. -
ఇక ఆ వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ: అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ఫ్రంట్ ప్యాసింజర్ కు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న ఈ ఉత్తర్వులను కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “వాహనం ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా పేర్కొంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఈ నిబంధనలు తీసుకురావడం జరిగినట్లు" కేంద్రం పేర్కొంది. 2021 ఏప్రిల్ 1న నుంచి కొనుగోలు చేసే ప్రతి కొత్త వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటికే కొన్న వాహనాలకు ఆ వాహనదారులు ఆగస్టు 31లోపు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో డిసెంబర్ 29, 2020న ఈ నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రతి వాహనంలోనూ ముందు సీట్ల కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త వాహనాలకు ఏప్రిల్ 1, పాత వాహనాలకు జూన్ 1లోపు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 నుంచే నిబంధన ఉండగా.. ప్రస్తుతం డ్రైవర్ పక్క సీటుకు కూడా దీన్ని కొనసాగించారు. ఈ నిబంధన అన్ని ఎం1 కేటగిరి వాహనాలకు వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల కంటే తక్కువ సైజున్న ప్యాసెంజర్ వెహికిల్స్ అన్నీ ఈ కేటగిరిలోకి చేరతాయి. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోని రోడ్ ప్రమాద బాధితుల్లో 10 శాతం మంది భారతదేశం నుంచి ఉన్నారు. డ్రైవర్ పక్క సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్ ఉండటం వల్ల ప్రమాదం వల్ల కలిగే తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు. దీనివల్ల డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు అదనపు రక్షణ లభిస్తుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నాలుగు చక్రాల వాహన ధరలు రూ.5,000 నుంచి 8,000 పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్ వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆస్కారం ఎక్కువ కాబట్టి ఇది అంత పెద్ద ధర కాకపోవచ్చు. చదవండి: ఆరు నెలలు నీటి అడుగున ఐఫోన్ 11, అయినా కూడా.. రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
సీటు బెల్టు ప్రాణదాతే!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనానికి హెల్మెట్.. తేలికపాటి వాహనానికి సీటుబెల్టు.. నిబంధనల ప్రకారం కచ్చితం. ఎయిర్‌బ్యాగ్స్‌తో సంబంధం లేకుండా సీటుబెల్టు పెట్టుకోవాల్సిందే. ఇది అనేక సందర్భాల్లో ప్రాణదాతగా మారింది. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్టు వాడని కారణంగానే మృత్యు వాతపడుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రాణాలు కాపాడిన సీటుబెల్టు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్టు పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర్రావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు కన్నుమూశారు. సీటుబెల్టు పెట్టుకోవడంతో వెంకటేశ్వర్రావు ప్రాణాలతో బయటపడ్డారు. సీటుబెల్టు, ఎయిర్ బ్యాగ్స్‌కు లింక్.. అన్ని హైఎండ్ కార్లలో సీటు బెల్టుకు, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. బెల్టు పెట్టుకోకుంటే ఎయిర్‌బ్యాగ్స్ యాక్టివ్ కావు. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. డ్రైవింగ్సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీటుబెల్టు పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుంది. వాహనం బయల్దేరిన తర్వాత డ్రైవర్, పక్క వ్యక్తి సీటుబెల్టు పెట్టుకోకపోతే గుర్తు చేసేందుకు బీప్ శబ్దం కూడా వచ్చేలా తాజా వాహనాలకు ఏర్పాట్లు చేశారు. -
సీటు బెల్ట్ ప్రాణదాతే!
కార్లలో దీని వినియోగం తప్పనిసరి అనేక ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడిన వైనం సిటీబ్యూరో: ద్విచక్ర వాహనానికి హెల్మెట్... తేలికపాటి వాహనానికి సీటుబెల్ట్... నిబంధనల ప్రకారం ఇవి కచ్చి తం. కేవలం అనేక హైఎండ్ కార్లలో సీటుబెల్ట్కు–ఎయిర్బ్యాగ్కు ఉన్న లింకు కారణంగానే కాదు... ఎయిర్‌బ్యాగ్స్ లేని వాహనాల్లోనూ సీట్‌బెల్ట్ వాడటం తప్పనిసరి. ఇది అనేక సందర్బాల్లో ప్రాణదాతగా మారింది. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయాణిస్తున్న కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ... వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా... హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా... అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చు న్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. కాబట్టి సీట్‌బెల్ట్ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు. ...వారి ప్రాణాలు కాపాడిన ‘బెల్ట్’... మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపు ప్రభావంతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చింది. భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. ఈ కారణంగానే ఆరవ్ రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. అతడి శరీరంలో మరెక్కడా ఫ్యాక్చర్స్ సైతం ఏర్పడలేదు. 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణిì , డ్రైవర్ స్వామిదాసు అక్కడికక్కడే కన్నుమూశారు. సీటుబెల్ట్ పెట్టుకున్న నేపథ్యంలోనే వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. -
29లక్షల టయోటా కార్లు రీకాల్
టోక్యో: టయోటా మోటార్ కార్పొరేషన్ భారీ మొత్తంలో కార్లను రీకాల్ చేస్తోంది. చైనా, జపాన్ ఓషియానియా, ఇతర ప్రాంతాలలో మొత్తం 29 లక్షల వాహనాలను రీకాల్ చేయనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్స్ లోని లోపాల కారణంతో తమ కోరోల్లా యాక్సియో సెడాన్, ఆర్ఏవీ4 ఎస్యూవీ క్రాస్ ఓవర్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోనున్నట్టు తెలిపింది. ఎయిర్ బ్యాగ్స్ లోని లోపంతో అంతకముందు కూడా భారీ మొత్తంలో కార్ల రీకాల్ ను టయోటా చేపట్టింది. ఫుజి హెవీ ఇండస్ట్రీస్, మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్, ట్రక్ తయారీదారి హినో మోటార్స్ కూడా 2,40,000వేల వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించాయి. జపాన్ ఎయిర్ బ్యాగ్ ల సంస్థ టకటా లోపాల కారణంగా ఆటో ఇండస్ట్రీస్ లో భారీ ప్రమాదాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ ప్రమాదాలు ఎక్కువగా వాటిల్లుతున్నాయి. టకటా బ్యాగుల లోపంతో ఎన్నడూ లేనంతగా ఆటో ఇండస్ట్రీలో రీకాల్ ప్రాసెస్ నడుస్తోంది. ఓషియానియా, మధ్య ప్రాశ్చ, ఇతర చిన్న మార్కెట్లలో అమ్మిన 1.16 మిలియన్ వెహికిల్స్ కు టయోటా ఇప్పటికే రీకాల్ నోటీసు పంపింది. అంతేకాక, జపాన్ లో 7,50,000 వాహనాలను రీకాల్ చేసింది. టయోటాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న నార్త్ అమెరికా ఈ తాజా రీకాల్ నుంచి తప్పించుకుంది. ఓ వైపు నుంచి రీకాల్స్ కు సంబంధించిన ఖర్చులను భరించడానికి తమకు ఎవరైనా సాయం చేయాలంటూ టకాటా కోరుతోంది. -
సీటు బెల్టే శ్రీరామ రక్ష
♦ కారు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేది అదే.. ♦ తేలికపాటి వాహనాల ప్రతి మూడు ప్రమాదాల్లో ♦ రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడంతోనే.. ♦ పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకుతాజా ఉదాహరణ ♦ లాల్‌జాన్ బాషా, శోభానాగిరెడ్డిల మృతికీ ♦ సీటు బెల్ట్ ధరించకపోవడమే కారణం సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం తమ విలువైన ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరిస్తే కలిగే లాభం, ధరించకపోతే కలిగే నష్టాలకు సోమవారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వాహన ప్రమాదమే ఉదాహరణ. గంటకు 120 కి.మీ పైగా వేగంతో వెళ్తున్న ఆ వాహనం రెయిలింగ్‌ను (క్రాష్ బారియర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ ధరించిన పిన్నమనేని సురక్షితంగా బయటపడగా, సీటు బెల్ట్ ధరించని ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే మృతి చెందారు. - సాక్షి, హైదరాబాద్ ఆ రెండు ఘటనల్లోనూ.. టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ఇద్దరూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారు ప్రమాదాల్లో మృతి చెందారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న లాల్‌జాన్ బాషా ఇన్నోవా వాహనం 150 కి.మీ వేగంతో వెళ్తూ జాతీయ రహదారి 65పై నార్కెట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ ధరించకపోవడంతో బాషా ఎగిరి బయటపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2014 ఏప్రిల్ 24న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వరికుప్పను తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. శోభా సైతం సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆరవ్రెడ్డిని కాపాడింది సీటు బెల్టే. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్, సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనా స్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్ట్ ధరించడంతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపుతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. అయితే భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. అందుకే ఆరవ్రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. కేవలం సీటు బెల్ట్ ధరించడం వలనే అతనికి మరెక్కడా గాయాలు కాలేదు. సీటు బెల్ట్ ఎలా కాపాడుతుంది.? కారులో ప్రయాణిస్తున్న వారు అందులో కూర్చున్నప్పటికీ ఆ వాహన వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వేగంగా వెళ్తున్న వాహనం దేనినైనా ఢీకొట్టినా లేదా హఠాత్తుగా వేగం కోల్పోయినా అందులోని ప్రయాణికులు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడతారు. లాల్‌జాన్ బాషా విషయంలో కారులో ఉండగానే ఆయన కుడి కాలుకి డివైడర్ రాడ్ గుచ్చుకుంది. పల్టీల ప్రభావంతో ఆయన బయటపడేప్పుడు కాలు తెగిపోయింది కూడా. ఇలా పడటం ఫలితంగానే తల, ముఖం తదితర చోట్ల తీవ్రగాయాలై మృతి చెందారు. సీటు బెల్ట్ ధరిస్తే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడతారు. సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు.. కార్ల లాంటి వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ చోదకులు, ప్రయాణికులకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. దేశంలో ఉన్న కార్లలో 70 శాతం లోఎండ్ మోడల్స్ కావడంతో ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు, అందులోని వారు కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. కొన్ని కంపెనీలకు చెందిన హైఎండ్ కార్లలో సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ కాదు. ఫలితంగా ప్రమాదం జరిగినా బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏదేమైనా సీటు బెల్ట్ నిత్యం వాడటం మంచిది. - ఫెరోజ్, ఆటో కన్సల్టెంట్ -
ఎయిర్‌బ్యాగ్ పనిచేసేదిలా...
హౌ ఇట్ వర్క్స్ వాహన ప్రమాదాల్లో మనల్ని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాల్లో సీటు బెల్టులు పెట్టుకోవడం ఒకటైతే.... వాహనంలో ఎయిర్‌బ్యాగులు ఉండేలా చూసుకోవడం రెండోది. సీట్బెల్టుల మాటెలా ఉన్నా... ఎయిర్‌బ్యాగ్‌ల వెనుక ఉన్న టెక్నాలజీ ఆసక్తికరమైంది. ఈ వ్యవస్థలో బ్యాగుతోపాటు ఓ యాక్సెలరోమీటర్, ఓ సర్క్యూట్, హీటింగ్ ఎలిమెంట్, సూక్ష్మస్థాయి తక్కువ మోతాదులో పేలుడు పదార్థం ఉంటాయి. మీ వాహనం వేగం ఎంత త్వరగా మారుతోందో యాక్సెలరోమీటర్ గమనిస్తూంటుంది. నిర్దిష్ట వేగాన్ని దాటినప్పుడు... లేదా ఇంకో వాహనాన్ని లేదా మరే ఇతర వస్తువును ఢీకొన్నా ఈ పరికరం సర్క్యూట్‌ను ఆన్ చేస్తుంది. ఆ వెంటనే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంట్ ప్రసారమవుతుంది. ఇళ్లల్లో నీళ్లు వేడి చేసుకునేందుకు వాడే హీటర్ తెలుసుగా... హీటింగ్ ఎలిమెంట్ దాదాపు ఇలాంటిదే. కాకపోతే ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. ఆ వేడికి పేలుడు పదార్థం (సోడియం అజైడ్) పేలిపోయి ఉత్పత్తి చేసే నైట్రోజన్ గ్యాస్‌తో బ్యాగ్ నిండిపోతుంది. ఇంకో విషయం... నైట్రోజన్ గ్యాస్‌తో నిండిన ఈ బ్యాగ్‌లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా విచ్చుకున్న తరువాత నెమ్మదిగా దాంట్లోని గాలిని విడుదల చేసేందుకు ఇవి పనికొస్తాయి. ఈ రెండు చర్యల ఫలితంగా వాహనం ఢీ కొనడంతో మన శరీరంపై పడ్డ ఒత్తిడి తోపాటు గాయాల తీవ్రత కూడా తగ్గిపోతుందన్నమాట! ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? సెకనులో నాలుగో వంతు మాత్రమే!