న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. ఈ నిబంధనను తప్పనిసరి చేసే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎయిట్ సీటర్ వాహనాల్లో తయారీ సంస్థలు తప్పనిసరిగా ఆరు ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేసే నిబంధనను 2022 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని భావించింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరాపరమైన సమస్యలు నెలకొన్న నేపథ్యంలో దానిని 2023 అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment