No need
-
కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి కాదు: గడ్కరీ
న్యూఢిల్లీ: ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. ఈ నిబంధనను తప్పనిసరి చేసే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎయిట్ సీటర్ వాహనాల్లో తయారీ సంస్థలు తప్పనిసరిగా ఆరు ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేసే నిబంధనను 2022 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని భావించింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరాపరమైన సమస్యలు నెలకొన్న నేపథ్యంలో దానిని 2023 అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
సౌదీ వీసా.. భారతీయులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు వీసా కోసం ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాల్సిన అవసరం లేదు. భారతీయులకు పీసీసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియా- రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా.. అంటూ ఓ ట్వీట్ చేసింది. శాంతియుతంగా జీవిస్తున్న రెండు మిలియన్లకు పైగా భారతీయ పౌరుల సహకారాన్ని రాయబార కార్యాలయం అభినందిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. pic.twitter.com/AxD2hje83s — القنصلية السعودية في مومباي (@KSAconsulateBOM) November 17, 2022 వాస్తవానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాని అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే.. ప్రధాని మోదీ జీ20 సదస్సు టూర్ నేపథ్యంలో అది రద్దు అయ్యింది. -
ఆడపిల్ల వద్దంట..!
వారసుడి కోసం ఆ దంపతులు ఆడశిశువును వద్దకున్నారు.. మగ బిడ్డే ముద్దు.. ఆడబిడ్డ వద్దంటూ పేగుబంధాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.శిశువును అప్పగించేందుకు శిశుగృహకు చేరుకున్నారు. కానీ ఆ శిశువు పుట్టి మూడు నెలలు మాత్రమే కావడం, ఆరు నెలల పాటు తల్లి పాలనే పట్టించాలని అధికారుల కౌన్సిలింగ్‌తో వెనక్కు తగ్గారు. ఈ ఘటన తిరుమలగిరి మండలంలో మంగళవారం వెలుగుచూసింది. తిరుమలగిరి(నాగార్జునసాగర్) : మండలంలోని నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధి జాల్ తండాకు చెందిన జటావత్ అంజి, లక్ష్మి వ్యవసాయంతో పాటు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి మొదటి కాన్పులో ఆడ శిశువు జన్మించింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లనే పుట్టడంతో తాము ఆ శిశువును సాకలేమంటూ ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తీసుకెళ్లారు. చిన్నారికి 3 నెలలు మాత్రమే ఉన్నాయని, కనీసం ఆరు నెలల వరకైన తల్లి పాలను పట్టించాలని అధికారులు సూచించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉన్నతాధికారుల సూచన మేరకు సీడీపీవో గంధం పద్మావతి మంగళవారం గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించారు. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి చదువు, పెండ్లి వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆడపిల్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని సౌకర్యాలతో ప్రసవాలు చేస్తారన్నారు. దీంతో పాటు కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12వేలు అందిస్తుందని తెలిపారు. గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో ప్రతి గిరిజన బాలికకు రూ.లక్ష డిపాజిట్ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యాయోజన పథకం, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పేద విద్యార్థులకు చదువులు, సన్నబియ్యంతో పాటు, నాణ్యతతో కూడిన మెనూ అందిస్తుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు. మారని గిరిజన సంప్రదాయం అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా గిరిజనుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లయిన దంపతులు మగబిడ్డకు జన్మనివ్వాల్సిందే నట... ఆ దంపతుల సంతానంలో మగపిల్లాడు పుట్టకుండా, ఆడపిల్లలే పుట్టినట్లయితే ఆ తల్లిని గొడ్రాలిగా భావించి హీనంగా చూడడం, శుభకార్యాలకు దూరంగా ఉంచడంతో పాటు, వారసుడి కోసం అత్తామామలు భర్తకు మరో యువతితో వివాహంం జరిపించటానికి వెనుకాడని పరిస్థితి.. తొమ్మిదినెలలు మోసిన తన బిడ్డను శిశుగృహకు అప్పగించటానికి ఆ తల్లులకు బాధగా ఉన్నా మగబిడ్డ కోసం తప్పడం లేదంటూ వాపోతున్నారు. -
టెకీ ఉద్యోగ సంఘాలపై ఇన్ఫీ బాలకృష్ణన్
ఉద్యోగుల తొలగింపుతో ఆందోళనలో ఉన్న టెకీలు ఉద్యమ బాట పట్టడంపై ఐటీ పరిశ్రమ సీనియర్ స్పందించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకుంటున్నపుడు ఐటీ కంపెనీల్లో యూనియన్ల అవసరం లేదని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ తేల్చి చెప్పారు. అలాగే ఐటీ లో భారీ ఉద్యోగాల కోత అని వస్తున్న నివేదికలు కేవలం అతిశయోక్తి మాత్రమేనని కొట్టి పారేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన చెల్లింపుల విషయంలో తాము చాలా నైతికంగా వ్యవహరిస్తున్నామనీ ఇన్ఫీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిటిఐకి చెప్పారు. పనిపరిస్థితులు, జీత భత్యాలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో అసలు ఉద్యోగ సంఘాల అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు, వారి హక్కుల పట్ల అస్తవ్యస్తంగా, అనైతికంగా వ్యవహరించే కంపెనీలకు తప్ప ఐటీ కంపెనీలకు ఉద్యోగ సంఘాలు అవసరం లేదని చెప్పారు. ఐటీలో సంక్షోభంలో ఉన్నపుడు యూనియన్లు పుట్టుకొస్తాయని, కానీ తర్వాత ఉనికిలోఉండవని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా తీసివేతలు రెండంకెల్లోనే న్నాయన్నారు. కాబట్టి, ఐటీ పరిశ్రమలో యూనియన్ అవసరం లేదనీ , ఒకవేళ యూనియన్ ఉన్నా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారని భావించడం లేదన్నారు. మిగిలిన వాటిల్లా ఐటి సాంప్రదాయ పరిశ్రమ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పని అవకాశాలు కల్పిస్తూ భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిభ ఆధారంగా తొలగింపులు తప్ప, భారీ ఉద్యోగాల నష్టం అనేది అతిశయోక్తి తప్ప మరోకటి కాదని బాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 150 బిలియన్ డాలర్లతో ఐటీ సర్వీసుల పరిశ్రమ ఒకే స్థాయిలో వృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోందనీ వచ్చే ఏడాది రెండింతలు పెరగవచ్చంటూ ఆయన కొత్త ఆశలురేకెత్తించారు. అంతేకాదు ఐటీలో అవకాశాలు చాలా పెద్దవిగా ఉన్నాయన్నారు. భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకటిన్నర నుండి రెండు శాతం వద్ద పెరుగుతోందని బాలకృష్ణన్ తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ తరలింపు అవసరంలేదు
-ఉమ్మడి ఫైళ్లు తెలంగాణాతో సమన్వయంతో స్కానింగ్ చేయండి -న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలు డిజిటలైజేషన్ -జీఏడీలో 14 వేల పుస్తకాలు డిజిటలై జేషన్ -నేడు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లనున్న నాలుగు శాఖలు -ఉదయం 6 గంటలకు సచివాలయంలో బస్సులు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఫర్నీచర్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో కొత్త ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని ఫర్నీచర్, ఎయిర్ కండీషన్స్‌ను అవసరమైతే గుంటూరు, విజయవాడలకు తరలివెళ్లిన శాఖాధిపతుల కార్యాలయాలకు ఇవ్వాలని టక్కర్ సూచించారు. ఈ మేరకు సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉమ్మడి ఫైళ్లను తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయంతో స్కానింగ్ చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఫైళ్ల స్కానింగ్ ఏ ధరకైతే చేయించారో అదే ధరకు స్కానింగ్ చేయించాలని, ఇందుకు ఐటీ శాఖతో సంప్రదింపులు జరపాలని ఆయన స్పష్టం చేశారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ శాఖలను, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలను ఒకే చోట కేటాయింపులు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఇలా ఉండగా హైదరాబాద్ సచివాలయం నుంచి బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయానికి పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, కార్మిక, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య శాఖలు తరలివెళ్లనున్నాయి. ఇందుకోసం బుధవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సచివాలయంలో ఆరు బస్సులను ఏర్పాటు చేశారు. న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలను డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఒకే పుస్తకం రెండేసి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకే పుస్తకం ఉంటే డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రణాళికా శాఖ లైబ్రరీలో ఏడు వేల పుస్తకాలున్నాయి. వీటిని కూడా డిజిటలైజేషన్ చేయాలని ఆయన సూచించారు. సాధారణ పరిపాలన శాఖలో 12,600 ఇంగ్లీషు, 1700 తెలుగు కలిపి మొత్తం 14,300 పుస్తకాలున్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాలు, ఉమ్మడి మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా గెజిటీర్స్, జనాభా లెక్కల పుస్తకాలు, నిజాం కాలానికి చెందిన దస్త్రాలున్నాయని, వీటిని డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. 21వ తేదీ కల్లా సచివాలయ శాఖలన్నీ తరలింపు జూలై 21వ తేదీ నాటికల్లా సచివాలయంలోని అన్ని శాఖలు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లేందుకు వీలుగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. జూలై 6వ తేదీన వెలగపూడిలోని ఐదవ భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు, జూలై 15వ తేదీన ఒకటి నుంచి నాలుగు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి కొన్ని శాఖలు, జూలై 21వ తేదీన ఒకటి నుంచి నాల్గో భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు తరలివెళ్లాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు