న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు వీసా కోసం ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాల్సిన అవసరం లేదు. భారతీయులకు పీసీసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
సౌదీ అరేబియా- రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా.. అంటూ ఓ ట్వీట్ చేసింది. శాంతియుతంగా జీవిస్తున్న రెండు మిలియన్లకు పైగా భారతీయ పౌరుల సహకారాన్ని రాయబార కార్యాలయం అభినందిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
— القنصلية السعودية في مومباي (@KSAconsulateBOM) November 17, 2022
వాస్తవానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాని అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే.. ప్రధాని మోదీ జీ20 సదస్సు టూర్ నేపథ్యంలో అది రద్దు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment