న్యూఢిల్లీ: కారులో కనిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండటాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఎనిమిది మంది ప్రయాణించగలిగే కారులో తయారీదారులు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంచాలని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. 2019 జూలై 1 నుంచే డ్రైవర్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేశామని, ఇక 2022 జనవరి 1 నుంచే డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో ఉన్నవారికి ఎయిర్‌బ్యాగ్ ఉండాలన్న నిబంధన అమల్లో ఉందన్నారు. వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల దృష్ట్యా ఇప్పుడు అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్స్‌ను తప్పనిసరి చేశామని గడ్కరీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment