కారు డ్రైవిం చేసే సమయంలో సీట్‌బెల్ట్ పెట్టుకోవడంతో కేవలం యాక్సిడెంట్స్‌లో ప్రాణరక్షణ మాత్రమేగాక... కిడ్నీలకూ మంచి రక్షణ కలుగుతుందంటున్నారు అధ్యయన వేత్తలు. సీట్ బెల్ట్స్ కట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్‌బ్యాగ్ తెరచుకొని, వాహనంలోని వ్యక్తుల ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే.
సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్న అంశం కారణంగా వాహనంలోని ఎయిర్‌బ్యాగ్స్ తెరచుకుని, ప్రయాణికుల తలనూ, ఛాతీనీ అన్నివైపుల నుంచి ఆవరించడం వల్ల యాక్సిడెంట్ తాలూకు దెబ్బలను ప్రయాణికులకు తగలకుండా చూస్తాయి. అయితే ఇది మాత్రమే కాకుండా ఈ ఎయిర్‌బ్యాగ్ అనేది డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుందని అమెరికన్ యూరాలజీ అసోసియేషన్‌కు చెందిన కొందరు అధ్యయన వేత్తలు చెబుతున్నారు.
దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా యాక్సిడెంట్ తర్వాత ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించిందంటూ వారు వివరించారు.
(చదవండి: ముక్కుదిబ్బడ బాధిస్తోందా?! )
Comments
Please login to add a commentAdd a comment