సంతోషంగా పార్టీ.. కళ్ల ముందే ఘోర ప్రమాదం! | Plane crashes in front of guests at gender reveal party - Sakshi
Sakshi News home page

Plane Crash: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం!

Published Mon, Sep 4 2023 11:28 AM | Last Updated on Mon, Sep 4 2023 11:52 AM

plane crash in front of guests - Sakshi

సోషల్‌ మీడియాలో ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక జంట ఘనంగా జండర్‌ రివీల్‌ పార్టీని ఏర్పాటు చేయడాన్ని గమనించవచ్చు. పార్టీకి భారీగా అతిథులు హాజరయ్యారు. అయితే వీరందరి కళ్ల ముందే విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అది ఒక స్టంట్‌ విమానం. పార్టీలో రంగులు వెదజల్లేందుకు దానిని వినియోగించారు. ఇదే ప్రమాదానికి కారణంగా నిలిచింది. ఈ వీడియో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో షేర్‌ అయ్యింది.

న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట  ఎవరన్నదీ వెల్లడికాలేదు. అయితే ఈ వీడియోలో జండర్‌ రివీల్‌ పార్టీలో పాల్గొన్న జంట కావలించుకోవడం, పైన విమానం నుంచి రంగులు జాలువారడాన్ని గమనించవచ్చు. ఇంతలోనే విమానం అదుపుతప్పడాన్ని చూడవచ్చు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం విమాన ప్రమాదంలో గాయపడిన పైలెట్‌ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా తమకు పుట్టబోయే శిశువు.. పాప లేక బాబు అనేది సన్నిహితుల మధ్య వెల్లడించేందుకు జండర్‌ రివీల్‌ పార్టీని ఏర్పాటు చేస్తారు.  

ఈ వీడియో వైరల్‌ అయిన నేపధ్యంలో నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌ ‘ఇటువంటి జండర్‌ రివీల్‌ పార్టీలు అదుపు తప్పుతున్నాయని, ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని’ కామెంట్‌ చేశారు. మరో యూజర్‌ ‘కొద్ది సేపు నిర్వహించే పార్టీకి ఇంత హడావుడి అనవసరం’ అని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: చీతాతో ఫుడ్‌ షేర్‌ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement