guest
-
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. అతిథుల జాబితా ఇదే!
ఎక్కడ, ఎవరి నోట విన్న పవిత్రమైన అయోధ్య, రామ మందిరం, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట, ఈ మాటలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశంలోని వేలాది మంది అతిథులకు ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన వారిలో రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ప్రముఖుల నివాసాలకు వెళ్లి అయోధ్యలో జరిగే రాముడి మహా వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే సోమవారం జరిగే బృహత్తర కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ప్రయివేటు చార్టెడ్ ప్లేన్‌లో కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్లనున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సరోద్ మాస్ట్రో అంజద్ అలీ ఖాన్, గీత రచయిత మనోజ్ ముంతాషీర్, అతని భార్య ప్రసూన్ జోషి, డైరెక్టర్లు సంజయ్ భన్సాల్, చంద్రప్రకాశ్ ద్వివేదితో పాటు పలువురు ఉన్నారు. పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, కాబోయే మరో కోడలు రాధిక మర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య నీరజ, పిరమల్ గ్రూప్ చైర్పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజయ్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివసన్ హాజరు కానున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కే సతీశ్ రెడ్డి, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఆయన భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ హెడ్ నవీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మన్ నరేశ్ త్రెహాన్ ఉన్నారు. అలాగే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీఈఓ షెర్పా అమితాబ్ కాంత్, మాజీ అటార్నీ జనరల్స్ కేకే వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ, ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? వీరిలో కొందరు జనవరి 22న ప్రైవేట్ జెట్లలో అయోధ్యకు వెళ్లనుండగా.. మరికొందరు సాధారణ విమానాల్లో ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని రాత్రి అయోధ్య, లక్నో వంటి సమీప నగరాల్లో బసచేయనున్నారు. -
మేడమ్ చీఫ్ మినిస్టర్
డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇది సామాజిక చిత్రంలా అనిపిస్తోంది. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అమెరికాలో చదువుకుని, ఓ సంస్థ స్థాపించి, ఇండియాకొచ్చి ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చెప్పాలని ఈ సినిమా ఆరంభించాను. ఇది పొలిటికల్ చిత్రం కాదు.. పబ్లిక్ మూవీ’’ అన్నారు డా.సూర్య రేవతి. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి.కొండకండ్ల, కెమెరా: వల్లెపు రవికుమార్. -
సంతోషంగా పార్టీ.. కళ్ల ముందే ఘోర ప్రమాదం!
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక జంట ఘనంగా జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేయడాన్ని గమనించవచ్చు. పార్టీకి భారీగా అతిథులు హాజరయ్యారు. అయితే వీరందరి కళ్ల ముందే విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అది ఒక స్టంట్ విమానం. పార్టీలో రంగులు వెదజల్లేందుకు దానిని వినియోగించారు. ఇదే ప్రమాదానికి కారణంగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో షేర్ అయ్యింది. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట ఎవరన్నదీ వెల్లడికాలేదు. అయితే ఈ వీడియోలో జండర్ రివీల్ పార్టీలో పాల్గొన్న జంట కావలించుకోవడం, పైన విమానం నుంచి రంగులు జాలువారడాన్ని గమనించవచ్చు. ఇంతలోనే విమానం అదుపుతప్పడాన్ని చూడవచ్చు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం విమాన ప్రమాదంలో గాయపడిన పైలెట్‌ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా తమకు పుట్టబోయే శిశువు.. పాప లేక బాబు అనేది సన్నిహితుల మధ్య వెల్లడించేందుకు జండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇటువంటి జండర్ రివీల్ పార్టీలు అదుపు తప్పుతున్నాయని, ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని’ కామెంట్ చేశారు. మరో యూజర్ ‘కొద్ది సేపు నిర్వహించే పార్టీకి ఇంత హడావుడి అనవసరం’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు! Pilot killed after his Piper PA-25 left wing failed at a gender reveal party in the town of San Pedro, Mexico. pic.twitter.com/6JILK7fsGm — Breaking Aviation News & Videos (@aviationbrk) September 3, 2023 -
విద్యుత్ సంస్కరణలకు నేనే మార్గదర్శిని
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అప్పట్లో తాను విజన్ 2020 రూపకల్పన చేస్తే తనను అందరూ 420 అంటూ ఎద్దేవా చేశారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన విజన్ 2020 వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తొలి గ్రాడ్యుయేషన్ వేడుకకి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో వచ్చిన పలు ఆర్థిక సంస్కరణలకు తానే కారణమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణకు తానే మార్గదర్శినన్నారు. తాను తెచ్చిన సంస్కరణల వల్ల ఇప్పుడు దేశంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందన్నారు. అదేవిధంగా టెలికాంలోనూ సంస్కరణలు తేవాలని నాటి ప్రధాని వాజ్‌పేయ్‌కు చెప్పానని చెప్పుకున్నారు. ఇక తాను రూపకల్పన చేసిన పాలసీల కారణంగానే హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, జినోమ్ వ్యాలీ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు వచ్చాయని చెప్పారు. జినోమ్ వ్యాలీలోనే ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి చెక్ రూ.500, రూ.2 వేల పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలో నల్లదనం ప్రవాహం, అవినీతిని రూపుమాపవచ్చని చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ వంటి అవినీతికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీ–4)తో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను అప్పట్లో ప్రైవేట్, పబ్లిక్, పార్ట్నర్షిప్ (పీ–3) పాలసీతోనే తాను హైటెక్ సిటీని నిర్మించానన్నారు. బయోటెక్నాలజీకి సంబంధించి అప్పట్లో బిల్‌గేట్స్ తనకు చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ చాన్స్‌లర్ వీరేందర్‌సింగ్ చౌహాన్, ప్రెసిడెంట్ ఎం.శ్రీభరత్, వీసీ ప్రొఫెసర్ దయానంద సిద్దవటం, ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైరల్: పెళ్లిలో అదనంగా తిన్నాడని బిల్ కట్టాలన్న కొత్త జంట
సాధారణంగా వివాహం అంటే అతిథుల రాక, భోజన మర్యాదలు, చివర్లో వారి ఆశీర్వాదాలు ఉండడం సహజమే. కొందరు అయితే తమ పెళ్లి పది కాలాలు గుర్తుండి పోవాలని ఖర్చుకు ఏ మాత్రం వెనకాడరు. ఇక పెళ్లంటే ప్రధానంగా భోజనాలు గురించే ఎక్కువగా మాట్లాడుతారు. అందుకే పెళ్లిలో వంటకాల విషయంలో ఏ మాత్రం రాజీపడరు. తాజాగా ఓ పెళ్లిలో మాత్రం కాస్త ఎక్కువగా తిన్నందుకు అతిథిని బిల్ కట్టాలన్నారు ఓ నవవధూవరులు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా అది నిజమే.. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లాడు. అయితే అక్కడ వెడ్డింగ్ కేక్ ముక్కను అదనంగా తిన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత అతనికి ఆ జంట నుంచి చిన్న వీడియో క్లిప్ రాగా దాన్ని చూసిన సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. అందులో.. ‘మేము మా పెళ్లి వీడియో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాం. అందులో నువ్వు వెడ్డింగ్ కేక్ రెండు ముక్కలు తిన్నావు, నవ్వు అదనపు ముక్క తిన్నందుకు దానికి అయిన ఖర్చు 3.66 పౌండ్లు (రూ.366) పంపాలని అందులో రాసి పంపారు. కాగా, వెడ్డింగ్ కేక్ ఒక్క ముక్కే ఇవ్వనున్నట్లు అందుకు గెస్ట్‌లు పైసలు కూడా చెల్లించాలని ఆ జంట ముందుగానే పేర్కొంది. కాగా, తనకు ఎదురైన ఈ అనుభవాన్ని రెడ్డిట్తో పంచుకున్న ఆ వ్యక్తి, వధువు పంపిన ఈ మెసేజ్‌ను కూడా అందులో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోని చూసిన నెటిజన్లు దీనిపై మండిపడ్డారు. వెడ్డింగ్ కేక్ కోసం గెస్ట్‌ల నుంచి చార్జ్ చేస్తారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చైసామ్ విడాకులు.. ఏంటీ? ఏం జరిగింది? -
తన పెళ్లికి రానందుకు అతిథికి 17 వేల బిల్లు పంపిన వధువు
ఇంట్లో శుభకార్యాలకు అతిథులను పిలవడం ఆనవాయితీ. ఇక మనకు కావాల్సిన వాళ్లని తప్పకుండా రావాలని మరీ మరీ పిలుస్తుంటాం కూడా. వారి వారి మధ్య ఉన్న బంధం బట్టి అతిథులు పిలిచిన కార్యాలకు హాజరుకావడం సహజం. ఈ క్రమంలో కొందరు వీలు లేకనో లేదా అంత కంటే ముఖ్యమైన పని ఉన్న కారణంగానో కార్యానికి వెళ్లలేకపోవచ్చు. ఇది మామూలుగా జరిగే తతంగమే. కానీ ఓ పెళ్లి కూతురు తన పెళ్లికి రానందుకు ఓ అతిథికి 17 వేల రూపాయల ఫైన్ వేసి కట్టాలని పంపడంతో అతడు షాక్ అయ్యాడు. అసలేం జరిగిందంటే... అమెరికాలోని చికాగోలో ఓ యువతి తన పెళ్లికి రావాల్సిందిగా ఒక వ్యక్తిని పిలిచింది. అందుకు అతను తప్పక హాజరవుతానని చెప్పాడు. అందులోనూ జంటగా వస్తామని మాటివ్వడంతో.. ఇద్దరి కోసం ఆ పెళ్లి కూతురు రెండు సీట్లను రిజర్వ్ చేసింది. ఇందుకుగాను ఒక్కో సీటుకు 120 డాలర్ల చొప్పున.. 240 డాలర్లను ఖర్చు పెట్టింది. అయితే చివరకు వస్తానని చెప్పిన అతిథి ఆ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ పెళ్లి కూతురు.. ఆ వ్యక్తి రెండు సీట్లు రిజర్వ్ చేయడం కోసం అయిన ఖర్చు 240 డాలర్లు.. అంటే మన కరెన్సీలో 17,700 రూపాయల బిల్లును రానందుకు పెనాల్టీగా ఓ ఇన్వాయిస్ బిల్లును అతడికి పంపించింది. (చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్) ఆ బిల్లులో.. నువ్వు చెప్పినట్లు రిసెప్షన్‌కు రాకపోగా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. కనుక నీ కోసం రిజర్వ్ చేసిన సీట్లకు అయిన ఖర్చు నువ్వే చెల్లించాలి. జెల్లే లేదా పేపాల్.. ఇలా ఏ పేమెంట్ ద్వారా అయినా చెల్లించు.. అంటూ ఇన్వాయిస్తో పాటు.. ఒక నోట్‌ను కూడా పంపించింది ఆ నవ వధువు. ప్రసుతం ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కొందరు మండిపడగా, మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. -
అతిథి దేవోభవ!
తల్లి, తండ్రి, గురువు తర్వాత అతిథిని దేవుడిగా చూడమంది మన సంస్కృతి. ఒక మనిషి తన తావు నుంచి మన తావుకు వచ్చినప్పుడు అతని గౌరవం, మర్యాద దెబ్బ తినకుండా ఆదరించి పంపడం చాలా అవసరమైన గొప్ప సంస్కారమని మన సంస్కృతిచెబుతుంది. మన పురాణాలు కూడా ఉదాహరణలిస్తున్నాయి. ఇంటికి వచ్చిన శత్రువునైనా ఆదరించాలనిభారతీయ సంస్కృతి చెబుతుంది. ‘అతిథి’ అంటే తిథి, వార, నక్షత్రాలు లేకుండా వచ్చేవాడని అర్థం. అంటే అనుకోకుండా రావటమన్నమాట. అలా వచ్చారంటే వారు భగవంతునితో సమానం. సాక్షాత్తు ఆ దేవుడే అతిథి రూపంలో మన ఇంటికి వచ్చి, మనకు సేవ చేసే భాగ్యం కలిగించాడని దీని భావం.మన సంప్రదాయంలో నలుగురిని భగవంతుడిగా భావించాలని కృష్ణ యజుర్వేదంలోని తైత్తరీయోపనిషత్తు చెబుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మొదటి ముగ్గురితో మనకు రక్త సంబంధం, విజ్ఞాన సంబంధం ఉంటాయి. కాని నాలుగో వ్యక్తితో ఎటువంటి సంబంధమూ లేకపోయినా వారిలోనూ భగవంతుడిని దర్శించాలని ఈఉపనిషత్తు చెబుతోంది. ఇంటికి వచ్చిన అతిథి ఎవరో మనకు తెలియకపోయినా, గుమ్మంలోకి రాగానే, కాళ్లుకడుక్కోవడానికి నీరు ఇచ్చి, లోపలకు సాదరంగా ఆహ్వానించి, దాహానికి మంచి నీళ్లు ఇచ్చి, వింజామర వీచి, కుశల సమాచారాలు అడగాలి. వచ్చిన అతిథికి బడలిక తీరాక, భోజనం చేయమనిఅడగాలి. ఇంట్లో ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నప్పటికీ, అతిథిని సంతృప్తి పరచి, ఆతిథ్యం ఇచ్చేవారు ఉపవాసం చేయాలని పెద్దలు చెబుతారు. అలాగే అతిథికి కేటాయించిన గదిలో సుగంధ పరిమళాలు వెదజల్లేలా ధూపం, వెలుగు కోసం దీపం ఉంచాలని, భగవంతుడికి నైవేద్యం సమర్పించినట్లుగా, పవిత్ర భావంతో భోజనం వడ్డించాలని, భోజనం అయిన తరవాత అతిథికి అక్షంతలు ఇచ్చి, వారి దీవెనలు అందుకోవాలని భారతీయ సంప్రదాయం చెబుతోంది.వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విశ్వామిత్రుడు రాజలాంఛనాలతో, తన పరివారంతో అకస్మాత్తుగా వచ్చినప్పుడు వశిష్ఠుడు తన దగ్గరున్న కామధేనువును స్మరించి వారందరికీ షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, వారిని సంతృప్తులను చేయడం మనకు కనిపిస్తుంది.పాండవులు అరణ్య వాసంలో ఉండగా వారి వద్దకు దుర్వాసుడు తన శిష్యులతో అతిథిగా వస్తాడు. అప్పటికి పాండవులు భోజనాలు ముగించి, అక్షయపాత్రను కడిగి బోర్లించారు. అతిథిని ఏ విధంగా గౌరవించాలో తోచక ద్రౌపది శ్రీకృష్ణుyì ని ప్రార్థించింది. ఆయన వెంటనే దుర్వాస మహర్షికి, ఆయన శిష్యులకు కడుపు నిండిపోయేలా చేశాడు. వారు పాండవులదగ్గరకు వచ్చి, కడుపులు నిండుగా ఉన్నాయని, పాండవులను ఆశీర్వదించి తరలి వెళ్లిపోయారు. అలా పరోక్షంగా ఆ అతిథులను సంతృప్తులనుచేశారు. శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుడు శ్రీకృష్ణుని దర్శించుకోవటానికి రాజ్యానికివచ్చాడు. కృష్ణుడు సింహాసనం దిగి వచ్చి, కుచేలు కి అతిథి సత్కారాలు చేసి, దారిద్య్ర బాధలు తొలగించాడు. స్నేహితుడే అయినా అతిథిలా వచ్చాడు. ఆనందంగా తరలివెళ్లాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు అతిథి గొప్పదనం చెబుతూ ‘రావణుడు వచ్చి శరణు కోరినా ఆయనకు నేను అతిథిలా భావించి, సేవించుకుంటాను’ అంటాడు. గొప్ప అతిథి మర్యాదలు చేసినవాడిగా బలి చక్రవర్తిని చెప్పుకోవచ్చు. ఆయన యజ్ఞం చేసి, వచ్చిన అతిథులకు అడిగినది లేదనకుండా దానం చేశాడు. అంతేనా? వామనుడు అతిథిగా వచ్చి, మూడు అడుగుల నేల కోరగానే, అన్నీ ధారపోసి, అందరి మన్ననలు పొందాడు. శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం నాటకంలో ఒకనాటి రాత్రి ఒక దొంగ చారుదత్తుడి ఇంటికి దొంగతనానికి వస్తాడు. అతడికి ఆ ఇంట్లో ఏమీ దొరకదు. అందుకు చారుదత్తుడు బాధపడి, అయ్యో వచ్చిన అతిథి రిక్తహస్తాలతో వెళ్లిపోతున్నాడే అనుకుంటాడు. చిరుతొండనంబిని పరీక్షించడానికి శివుడే అతిథి రూపంలో వస్తాడు. బిడ్డలు ఉన్న ఇంట్లోనే భోజనం చేస్తానంటాడు. అప్పటికి వారికుమారుడు శిరియాళుడు మరణిస్తాడు. అతిథి మర్యాదలు ఎలా చేస్తాడో తెలుసుకోవటం కోసమే శివుడు ఈ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో చిరుతొండ నంబి నెగ్గి, శివసాయుజ్యం పొందాడని బసవ పురాణం చెబుతోంది. భారతంలో సక్తుప్రస్థుడి కుటుంబం వారం రోజులుగా తిండి లేక అవస్థలు పండుతుంది. ఆ రోజు వారికి పేలాల పిండి దొరుకుతుంది. నలుగురు నాలుగు భాగాలు చేసుకుని తినబోతారు. అంతలోనే ఇంద్రుడు అతిథిగా వస్తాడు. ఆయనను ఆహ్వానించి నక్తుప్రస్థుడు తన భాగాన్ని ఆయనకు వడ్డిస్తాడు. ఆయనకు ఆకలి తీరదు. తర్వాత భార్య, ఆ తరవాత కుమారుడు, కోడలు కూడా వారివారి భాగం పేలాల పిండితోఅతిథిని సంతృప్తిపరుస్తారు. మెచ్చిన ఇంద్రుడు ఆ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు.మానవులే కాదు జంతువులు కూడా అతిథి సత్కారం చేశాయి. ఒక పావురాల జంటలో ఆడ పావురం, ఇంటికి వచ్చిన అతిథి కోసం అగ్నిలో దూకుతుంది. తన మాంసంతో అతిథిని సంతృప్తి పరుస్తుంది.రామాయణంలో అరణ్యవాసం చేస్తున్న రాముడు సీతను వెతుకుతూ, తన ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి పండ్లతో అతిథి సత్కారాలు చేసింది.ఇక ఈ ఉదంతం అందరికీ తెలిసిందే. అత్రి మహర్షి భార్య అనసూయ ఇంటికి త్రిమూర్తులు అతిథిలుగా వస్తారు. ఆతిథ్యం ఇచ్చేవారు వివస్త్రలుగా వడ్డించాలని నియమం పెడతారు. అప్పుడు అనసూయ త్రిమూర్తులను చంటిపిల్లలుగా మార్చి, వారికి పాలిచ్చి అతిథిసత్కారాలు పూర్తి చేస్తుంది. అతిథికి భోజనం పెడితేనే కానీ భోజనం చేయకూడదనే నియమం కొందరికి ఉండేది. సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఇంటికి అతిథులు రావాలనే ఆశతో వంట సిద్ధంగా ఉంచేవారు. ఇవాళ అతిథులకు వెళ్లడానికి సమయం ఉండటం లేదు. ఆతిథ్యం ఇచ్చేవారికి సమయం ఉండటం లేదు. అతిథులు వచ్చిపోయే ఇల్లు, ఊరు, దేశం కళకళలాడతాయి. మనం వొండుకొని మనం మాత్రమే తినే జీవితంలో నిజమైన రుచి ఉందంటారా?– వైజయంతి పురాణపండ -
దీపాన్ని బాగు చేయనా?
ఒకసారి ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర) ఇంటికి రాత్రి బాగా పొద్దుపోయాక అతిథులు వచ్చారు. రాత్రి ఇషా నమాజు తరువాత ఖలీఫా తన ఇంటికి వచ్చిన అతిథితో ముచ్చటిస్తున్నారు. అంతలోనే లాంతరులో చమురు అయిపోవడంతో దీపం ఆరిపోసాగింది. దీన్ని గమనించిన అతిథి ‘‘ఓ ఖలీఫా; నేను ఈ దీపాన్ని బాగుచేయనా’ అని అడిగారు. ‘‘ఇంటికి వచ్చిన అతిథితో పనులు చేయించడం భావ్యంకాదు’’ అని చెప్పారు. దానికి ఆ అతిథి ‘‘ఇంట్లో సేవకుడిని లేపమంటారా’’ అని అడిగాడు. అందుకు ఖలీపా ‘‘రోజంతా పనిచేసి అతను అలసిపోయాడు. ఇప్పుడే అతని కళ్లు మూతలు పడ్డాయి’’ అని చెప్పి లాంతరులో చమురు పోసి లాంతరును వెలిగించారు. పైన ప్రవక్త (స), ఖలీఫాల గాథలలో మనకెన్నో వెలకట్టలేని అమూల్యమైన జీవిత సత్యాలున్నాయి. మనం చెప్పే మాటలు అందరూ వినాలని భావిస్తాం. మన మాట చెల్లుబాటు కావాలని ఆశిస్తాం. కానీ మనం చెప్పే మాటలు మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో ఆలోచించము. ఎదుటివారిపై మనం చెరగని ముద్ర వేయాలంటే, మనం చెప్పకుండానే మన మాటకు గౌరవం దక్కేలా చేసుకోవాలంటే ముందు మనం ఆచరించి చూపాలి. మన పనులు మనం చేసుకోవడం వల్ల సమాజంలో ఆదరణ లభిస్తుంది. గౌరవ మర్యాదలు కలుగుతాయి. -
అదిగదిగో బంగరు లేడి
తన ఆశ్రమంలో ధ్యానంలో లీనమై ఉన్న మారీచుడి ముందు వచ్చి నిలిచాడు రావణుడు. తమ రాజుని చూసిన మారీచుడు అతిథి సత్కారాలు చేశాడు. కుశలప్రశ్నలు వేశాడు. అంతటి మహా బలశాలి, పరాక్రమవంతుడు అయిన రావణుడు తన వద్దకు ఎందుకు వచ్చాడో తెలియలేదు. అదే విషయం వినయంగా అడిగాడు. సమాధానంగా రావణుడు ‘‘నాయనా! నేనిప్పుడు మహా కోపంతో ఉన్నాను. వాడెవడో రాముడట. దశరథ మహారాజు కొడుకట. తండ్రి అడవులకు వెళ్లమని ఆజ్ఞాపిస్తే, ఇక్కడకు వచ్చాడు. అతనొక్కడే నా బలగంలోని పద్నాలుగువేల మంది రాక్షసుల్ని, మా సైన్యాధ్యక్షుడైన త్రిశిరుణ్ణి, నా తమ్ముళ్లు ఖరదూషణాదుల్నీ చంపేసి, నన్ను దెబ్బతీశాడు. అతని అందచందాలకు ముగ్ధురాలై, చెంత చేరబోయిన నా చెల్లెలు శూర్పణఖ ముక్కూచెవులూ కోసి, కురూపిని చేసి, తీవ్రంగా పరాభవించాడు. నా చెల్లెలు దీనంగా నా వద్దకొచ్చి నిలుచుంటే, నా గుండె ద్రవించిపోయింది. ఆ రాముడి భార్య సీత మహా సౌందర్యవతి అట. ఆమె అంటే రాముడికి వల్లమాలిన ప్రేమట. ఆ సీతను అపహరించుకునిపోయి, రాముణ్ణి మానసికంగా దెబ్బతీయాలి. అప్పుడు కానీ, నా గుండె మంట చల్లారదు. నువ్వు నాకు మిత్రుడివి, మాయలు తెలిసిన వాడివి కాబట్టి సీతాపహరణకు నాకు సాయం చేయాలి’’ అన్నాడు. మారీచుడు రావణుడితో ‘‘మహారాజా! నీకు రాముడి సంగతి తెలియదు. అతడు మహా బలపరాక్రమ వంతుడు. ధర్మస్వరూపుడు. సీత ఆయన ప్రాణసఖి. ఆమెను ఆయన నుంచి వేరు చేసిన వారెవరయినా సరే, బతికి బట్టకట్టడం అసాధ్యం. ఇప్పటివరకు ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నావు. కోరికోరి వైరం పెట్టుకుని, ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు?’’ అని హితవు చెప్పబోయాడు. ఆ మాటలను రావణుడు ఏమాత్రం చెవిన వేసుకోకపోగా, నీవన్నీ సోమరిపోతు మాటలు. పనికిమాలిన ప్రబోధాలు. రాజు వచ్చి అడిగితే బంటు కాదని అనడం ఎక్కడైనా ఉందా? దిక్పాలకులే నా మాట మీరరే, నీవెంత? నీ సాయమడిగానని మిడిసిపడుతున్నావా? మర్యాదగా నీకు చెప్పిన పని చేయి. లేదంటే నిన్ను ఇక్కడికిక్కడే హతమారుస్తాను’’అని బెదిరించాడు. దుష్టుడైన రావణుడి చేతిలో చచ్చేకంటే, పురుషోత్తముడైన రాముడి చేతిలో మరణించడం మేలనుకున్నాడు మారీచుడు. వెంటనే వెండిచుక్కలున్న బంగారులేడిలా మారిపోయి, పంచవటి వైపు పయనించాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, శత్రువైనా సరే, అతడిలోని మంచిగుణాలను మెచ్చుకోవలసిందే! అదేవిధంగా, పోగాలం దాపురించిన వాడికి ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా, తలకెక్కవు అని. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఖాళీ చేసుకోవడం ముందు తెలిస్తే...
ఇద్దరూ టీ తాగడం కోసం ఆసీనులయ్యారు. వారి మధ్యలో టీ పాత్ర, కప్పులు ఉన్నాయి. నాన్ ఇన్ అతిథి కప్పులోకి టీ వంపసాగాడు. కప్పు నిండిపోయింది. పంతొమ్మిదవ శతాబ్దంలో జపాన్‌లో ఒక జెన్ గురువు ఉండేవాడు. ఆయన పేరు నాన్ ఇన్. జెన్ అంటే ధ్యానం ద్వారా సత్యాన్ని దర్శించే ఒక మార్గం. ఒకరోజు ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు జెన్ గురించి తెలుసుకోవడానికి నాన్ ఇన్ దగ్గరికి వచ్చాడు. ఆ ఆచార్యుడి దృక్పథమూ, ఆలోచనలూ నాన్ ఇన్‌కు తెలుసు. అయినా అతిథిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. ఇద్దరూ టీ తాగడం కోసం ఆసీనులయ్యారు. వారి మధ్యలో టీ పాత్ర, కప్పులు ఉన్నాయి. నాన్ ఇన్ అతిథి కప్పులోకి టీ వంపసాగాడు. కప్పు నిండిపోయింది. అయినా అలాగే పోస్తున్నాడు. టీ కప్పు అంచులు దాటి బయటికి రావడం మొదలైంది. అయినా అలాగే పోస్తున్నాడు. ఇక దీన్ని చూడలేక ఆ ఆచార్యుడు, ‘మాస్టర్, టీ కప్పు నిండిపోయింది. ఇంక అందులో మీరు ఏమీ నింపలేరు’ అన్నాడు. అప్పుడు నవ్వి, టీ పాత్రను పక్కకు పెడుతూ చెప్పాడు గురువు: ‘మీరు కూడా ఈ కప్పులాగానే మీవైన అభిప్రాయాలూ భావనలతో పూర్తిగా మీ మెదడును నింపుకునివున్నారు. మరింక నేను మీకు జెన్ గురించి ఏం చెప్పగలను? ఏం చెప్పినా అది మీ లోపలికి మాత్రం ఎలా వెళ్లగలుగుతుంది?’ ఆ ఆచార్యుడికి ఒక వెలుగు ఏదో గోచరించింది. తన మెదడు అనే కప్పును ఖాళీ చేసుకోకుండా జెన్ సాక్షాత్కరించదని అర్థమైంది. -
అతిథిపూజకు ప్రేమే పుష్పం
కుచేలుడు పరమ దరిద్రుడు. బ్రహ్మజ్ఞాని. ఒక్క కాసుదొరికితే పదివేల కాసులని మురిసిపోతాడు. ఉంటే తింటాడు. లేకపోతే మానేస్తాడు. ఎప్పుడూ బ్రహ్మానందంలో ఉండేవాడు. ఒకనాడు భార్య ...‘‘ఏమండీ, కష్ణుడు మీకు స్నేహితుడు కదా, ఒక్కసారి ఆయనను దర్శించుకుంటే మన దరిద్రం తీరిపోతుందికదా !’ అంది. అక్కడికి వెడితే కష్ణుడికి అతిథి అవుతాడు కుచేలుడు. ‘‘నీ సలహా మంచిదే. కానీ స్నేహితుడి దగ్గరకు వెడుతూ ఏమీ పట్టుకెళ్ళకుండా ఎలా..ఏదయినా ఉందా...అయినా నీ పిచ్చికానీ నేను వెడితే మన దరిద్రం పోయేంత ఐశ్వర్యం ఇస్తాడా !!!’’ అని కుచేలుడు అన్నాడు. కలలోసయితం భగవంతుని పేరెత్తని వాడికి కూడా ఆపదవచ్చినపుడు తలచుకోగానే వచ్చి రక్షించే స్వభావం ఉన్నవాడు కదా ఈశ్వరుడు ! అటువంటివాడు నిత్యం భగవంతుని నమ్ముకుని ఉండే మీ కోర్కె తీర్చడా.. వెళ్ళండి’’ అని భార్య చెప్పింది.కుచేలం అంటే చిరిగిన బట్ట. ఆయన ఒంటిమీద ఉన్న బట్టకన్నా దానికి కన్నాలు ఎక్కువ. ఇంట్లో ఉన్న అటుకులను ఆ చినుగుల ఉత్తరీయంలోనే మూటగట్టుకుని కుచేలుడు ద్వారకా నగరంలో కష్ణుడి నివాసం వద్దకు చేరుకున్నాడు. సాక్షాత్ లకీ‡్ష్మదేవి అవతారమైన రుక్మిణితో కలిసి కష్ణుడు హంసతూలికా తల్పంమీద ఉన్నాడు. బయట సేవకులు కుచేలుడిని ఆపి ఎవరికోసం వచ్చావు, ఎవరుకావాలని అడుగుతున్నారు. కష్ణుడు తన ప్రియస్నేహితుడని కలిసిపోదామని వచ్చానని చెప్పాడు. ‘ఎలా వీలవుతుంది ! ఇప్పుడు ఆయన రుక్మిణీదేవితో ఆంతరంగిక మందిరంలో ఉన్నారు. ఇప్పుడు కలిసే అవకాశం లేదు’అని వాళ్ళంటున్నారు. దూరంనుంచి కష్ణుడు కుచేలుడిని చూసి గుర్తుపట్టిఒక్కసారిగా మంచం మీదినుంచి దూకి పరుగుపరుగున వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుని ‘ఎన్నాళ్ళకొచ్చావోయ్, మిత్రమా..’అంటూ తీసుకెళ్ళి తన శయ్యామందిరంలోని హంసతూలికాతల్పంమీద కూర్చోబెట్టాడు. అతిథి సత్కారం ఎలా చేయాలో కష్ణభగవానుడు మనకు నేర్పాడు. అలా కూర్చోబెట్టి‘రుక్మిణీ ! అలా చూస్తావేం. ఇతను బ్రహ్మవేత్త, నా బాల్యమిత్రుడు– కుచేలుడు. బంగారు చెంబుతో నీళ్ళు తీసుకురా’..అని చెప్పి పళ్ళెంపెట్టి అందులో కుచేలుడి పాదాలుంచి రుక్మిణీ దేవి బంగారు కలశంతో నీళ్ళుపోస్తుంటే కడిగి అలా కడిగిన నీటిని పరమ భక్తితో తన తలమీద చల్లుకున్నాడు. పళ్ళెం తీసేసి తన ఉత్తరీయంతో పాదాలు తుడిచి, ఒళ్లంతా గంధం రాసి, విసెన కర్రతో విసిరి, మంచి ధూపం వేసి, హారతిచ్చాడు. ‘మిత్రమా! ఎన్నాళ్ళకొచ్చావ్, మనిద్దరి గురుకులవాసం గుర్తుందా..’ అంటూ పాతజ్ఞాపకాలు గుర్తుచేస్తూ మంచి భోజనం పెట్టి కాళ్ళొత్తి పక్కన కూర్చుని నాకోసం ఏదో తెచ్చి ఉంటావంటూ చొరవగా వెతికి ఉత్తరీయానికి వేలాడుతున్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకుని ‘చాలా బాగున్నాయి’ అంటూ పరమ ప్రీతితో వాటిని పరపర నమిలి తినేసాడు. మరో పిడికెడు తీసుకుని నోట్లో వేసుకోబోతుండగా రుక్మిణీదేవి వారించింది. ఇప్పటికే ఇవ్వాల్సిన ఐశ్వర్యమంతా ఇచ్చేసారు. రెండో గుప్పిటతో మిమ్మల్నీ నన్నూ సమర్పించుకుంటారని వారించింది. అదీ అతిథి పూజంటే. ఇంటికొచ్చినవాడు ఏమిచ్చాడన్నది కాదు ప్రధానం, ఇంటికొచ్చినవాడిపట్ల నీవెలా ప్రవర్తించావన్నది ముఖ్యం. అన్నీ పెట్టక్కర్లేదు, అన్నీ చేయక్కర్లేదు. ఎంత ప్రేమతో నీవు మాట్లాడిపంపించావన్నదికూడా అతిథిపూజే. అతిథిరూపంలో వచ్చినవాడికి నీకున్న వాటినిపెట్టి ప్రీతితో సేవించగలగాలి. వచ్చినవాడు ఈశ్వరుడు అన్నభావనతో, ఆ ప్రేమతో, ఆదరబుద్ధితో చేయాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విందు భోజనం
విందు భోజనానికి రమ్మని రాజప్రాసాదం నుంచి ఓ రోజు ముల్లా నస్రుద్దీన్‌కి ఆహ్వానం అందింది. వెళ్లాడు. అయితే అక్కడి సేవకులెవ్వరూ అతడిని పట్టించుకోలేదు. మాసి, చిరుగులు పట్టిన దుస్తుల్ని ధరించి ఉన్న నస్రుద్దీన్ని ఒక్కరూ భోజనానికి పిలవలేదు. నస్రుద్దీన్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. తనకు ఉన్నవాటిలో అతి ఖరీదైన దుస్తులను ధరించి మళ్లీ రాజప్రాసాదానికి చేరుకున్నాడు. ఈసారి ప్రవేశ ద్వారం దగ్గర్నుంచే అతడికి స్వాగతం మొదలైంది! కొందరు సేవకులు నస్రుద్దీన్ వెంటే వుండి అతడిని భోజన బల్లల దగ్గరికి తీసుకెళ్లి, విలాసవంతులు భుజించే వరుసలో కూర్చోబెట్టారు. వెంటనే మరికొందరు సేవకులు వచ్చి నస్రుద్దీన్‌కి భయభక్తులతో వేడివేడి విందు భోజనం వడ్డించారు. అయితే నస్రుద్దీన్ భోజనాన్ని ఆరగించకుండా, ఆహార పదార్ధాలను చేత్తో తీసుకుని, తన దుస్తులకు పూసుకోవడం మొదలుపెట్టాడు! అది చూసి, పక్కనే ఉన్న మరొక అతిథి ఆశ్చర్యపోయి, ‘‘మీరేం చేస్తున్నారో.. మీకు తెలుస్తోందా?’’ అని అడిగాడు. నస్రుద్దీన్ నవ్వాడు. ‘‘తెలుస్తూనే ఉంది’’ అన్నాడు. ‘‘ఏం తెలుస్తోంది? ఆహారాన్ని బట్టలకు అలా పూసుకోవడం ఏంటి?’’ అని అడిగాడు అతిథి. నస్రుద్దీన్ మళ్లీ నవ్వాడు. ‘‘నేను భోజనం చేయడానికి ముందు.. నా బట్టలకు భోజనం పెట్టడం నా ధర్మం అనుకున్నాను. ఎందుకంటే ఈ బట్టల కారణంగానే ఈ రాజప్రాసాదంలో నేను భోజనాన్ని పొందగలిగాను’’అన్నాడు నస్రుద్దీన్. మనం ఎంత గొప్పవాళ్లం అయినా కావచ్చు, ఆ గొప్పదనాన్ని ప్రపంచం చేత గుర్తుపట్టించేవి మనం ధరించే దుస్తులేనని నస్రుద్దీన్ తన సహజమైన వ్యంగ్య ధోరణిలో చక్కగా చెప్పారు. -
మర్యాదగా పలుకరించండి
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు విజయవాడ ఆతిథ్యం ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నగరవాసులకు పిలుపునిచ్చారు. నగరంలోని ఏ 1 కన్వెన్షన్ సమావేశ మందిరంలో ‘మారుతున్న విజయవాడ’ అనే అంశంపై నగరపాలకసంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొన్నారు. సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, వైష్ణవి ఆర్కిటెక్, నలంద, మేరీస్టెల్లా, పీబీ సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ, కేబీన్ కళాశాలల విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్స్, ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు సుమారు 8వేల మీటర్లు పెయింటింగ్స్ వేసి విజయవాడను అందంగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకోసం నగరంలోని ప్రతి వ్యక్తి వారికి తోచిన సాయం చేయాలని కోరారు. విద్యార్థులు పుష్కరాలకు ఇచ్చిన సెలవులను వృధా చేయకుండా భక్తుల కోసం వినియోగించాలని కోరారు. విద్యార్థులు వలెంటీర్లుగా పనిచేసేందుకు ముందుకు రావాలన్నారు. విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన నగరని చెన్నై తరువాత అంతటి పేరున్న నగరం విజయవాడేనని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో తొలుత విద్యార్థినులు నృత్యాలతో అలరించారు. చెట్ల పెంపకంతో కలిగే ప్రయోజనా లు.. పరిశుభ్రత.. పుష్కర స్నానం చేసే విధానంపై విన్నూత్న ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కలుషితమవుతున్న నీరు, పెరుగుతున్న మంచినీళ్ల ధరలుపై విన్నూత్న ప్రదర్శన నిర్వహించారు. వివిధ ¯ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులను సీఎం అభినందించారు. అదే విధంగా విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో మంత్రి మోపిదేవి ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, విజయవాడ నగర మేయర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ బాబు.ఏ, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గోల్ఫ్ కోర్స్‌లో 'మిల్కీ బ్యూటీ'
-
అనుకోని అతిథి!
అటెన్షన్ ప్లీజ్! స్పీకర్స్‌లో మృదువుగా ఎయిర్‌హోస్టెస్ వాయిస్! ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ఎక్కుతున్నారు. లోపలికి అడుగు పెట్టగానే షాక్! ఎదురుగా సీట్లో దర్జాగా ఆశీనుడై ఉన్నాడో అనుకోని అతిథి! ఉలుకు... బెరుకు లేదు! హుందాగా కూర్చుని... వచ్చినవారందరినీ ఓ లుక్ వేస్తున్నాడు. అలాగని ఏ ఫుట్‌బాల్ స్టారో కాదు. హాలీవుడ్ సూపర్స్టారూ కాదు. ‘రెక్కలు తొడిగి’ మనం గగనంలో విహరిస్తుంటే... ‘రెక్కలు ముడిచి’ తన యజమానితో కలసి విమానంలో ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాడా అతిథి. ఇంతకీ ఎవరనేగా..! టర్కీ కోడి! సన్నివేశం చూసి ఓ క్షణంపాటు నిశ్చేష్టు లైనా... ఆ వెంటనే తేరుకుని అబ్బురంగా సెల్ కెమెరాల్లో ‘క్లిక్’మనిపించారు ప్రయాణికులు! అలా తీసిందే ఈ చిత్రం. ఓ ఫ్లయిట్ అటెండెంట్ మిత్రుడు సామాజిక మాధ్యమంలో దీన్ని షేర్ చేస్తే వేల కొద్దీ లైక్‌లు కొట్టేస్తోంది. ‘షేరింగ్’లతో నెట్టింట పాకేస్తోంది. ‘భావోద్వేగ మద్దతునిచ్చే జంతువుల’ కోటాలో ఈ కోడి విమానం ఎక్కేసింది. విమాన ప్రయాణమంటే ఉండే ఉత్సుకత, భయం దరిచేరకుండా ఉండేందుకు అమెరికాలోని కొన్ని ఎయిర్‌లైన్స్ శునకం తదితర తమ పెంపుడు జంతువులను వెంట తెచ్చుకోవడానికి ప్రయాణికులకు అనుమతినిస్తున్నాయి. ఇందుకు గాను కొన్ని అదనపు చార్జి వసూలు చేస్తుండగా, కొన్ని ఉచితంగా ఈ సేవలందిస్తున్నాయి. అన్నట్టు... యూకేలో కూడా ఈ తరహా వెసులుబాటు ఉంది. -
ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా...
ఘనంగా జరిగిన హర్భజన్ రిసెప్షన్ న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు మాజీలు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ రిసెప్షన్లో పాల్గొన్నారు. మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమరావతి అతిథులకు జాంధానీ చీరలు !
పిఠాపురం: నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తున్న అతిథులకు ఉప్పాడ జాంధానీ చీరలు అందించనున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ అధికారులు రెండు రోజుల నుంచి ఈ చీరలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప తదితర గ్రామాల్లో కొన్ని చీరలు కొనుగోలు చేసిన అధికారులు మరిన్ని చీరలకు ఆర్డర్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ వ్యవహారం బయటకు పొక్కకూడదని అధికారులు హెచ్చరించడంతో ఎన్ని చీరలు ఆర్డర్లు ఇచ్చారన్న విషయాన్ని వ్యాపారులు వెల్లడించడంలేదు. శంకుస్థాపనకు వచ్చే మహిళా అతిథుల్లో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారుల వంటి ముఖ్యమైన వారికి వీటిని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు విలువైన చీరలకు ఆర్డర్లు ఇచ్చారని, చేనేత, జౌళి శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో తమ వంతు సహకారం అందిస్తున్నారని సమాచారం. వీటికి సుమారు రూ. కోటి వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
పాపం అతిథి
వర్షపు నీటి ఉధృతికి కాలువలో పడిన ఆరేళ్ల చిన్నారి వెంటనే కొట్టుకుపోయిన వైనం రక్షించేందుకు స్థానికులు విఫలయత్నం దొరకని పాప ఆచూకీ మద్దిలపాలెం (విశాఖ) : ట్యూషన్‌కు వెళ్లొస్తూ ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు గెడ్డలో కొట్టుకుపోయిన వైనమిది. సీతమ్మధారలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్.అండ్ బి ఇంజినీర్ సి.హెచ్.రమణమూర్తి మనుమరాలు అతిథి(6) టింపనీ స్కూల్లో 1వ తరగతి చదువుతుంది. గురువారం సాయంత్రం ట్యూషన్ సెంటర్‌కి వెళ్లింది. 6 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కాలువలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్యూషన్ నుంచి తిరిగి వస్తూ చిన్నారి రోడ్డుపై ఉన్న నీటిలో దిగి కారు ఎక్కబోయింది. పక్కడే డ్రెయిన్ కాలువ ఉండటంతో వర్షపు నీటి ఉధృతికి అతిథి అందులో పడిపోయింది. వెంటనే కొట్టుకుపోయింది. అక్కడివారు వెంటనే వెతికేందుకు ప్రయత్నించారు. కాలువపై 200 మీటర్ల మేరకు అక్రమంగా సిమెంట్ పలకలతో కప్పేయడంతో రక్షించడానికి ఫలితం లేకపోయింది. అయినప్పటికి స్థానికులు సాహసించి కాలువలో దూకి వెతికేందుకు ప్రయత్నించారు.అయినా ఫలితం లేకపోయింది. అతిథి సుమారు 6 గంటల ప్రాంతంలో గల్లంతయినప్పటికి అధికారులు 8 గంటల వరకు సంఘటనా స్థలానికి చేరకుకోలేదు. గాలింపు చర్యలు చేపట్టలేదు సరికదా కనీసం ప్రొక్లైనర్స్‌ని తీసుకొచ్చి సిమెంట్ దిమ్మలను తొలగించలేదు. దీంతో స్థానికులు ఆగ్రహించారు. ఎట్టకేలకు 9 గంటల సమయంలో ప్రొక్లైనర్తో త్రవ్వకాలు చేపట్టారు. జీవీఎంసీ నిర్లక్ష వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరో ప్రక్క ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చినప్పటికి టార్చ్లైట్లు చార్జింగ్‌లేవనే సాకుతో, సహాయక చర్యలు చేపట్టకపోవడం విచారకరం. పాప తల్లితండ్రులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. -
అతిథి పాత్రలో తాప్సీ
-
భగవంతునికి భక్తులు చేసే సేవలు
షోడశోపచారాలు ఆవాహనం: మనం పూజించే దేవుణ్ణి మన గృహంలోని పటం లేదా విగ్రహం లోనికి రావలసిందిగా ఆహ్వానించడమే ఆవాహనం. ఈ సేవ చేసేటప్పుడు ఎడమచేతిని మన హృదయం మీద ఉంచుకుని, కుడిచేతిని భగవంతుని పాదాల మీద ఉంచి, రెండు అక్షతలు వేయాలి. ఆసనం: విగ్రహంలోనికి లేదా పటంలోనికి భగవంతుడు వచ్చిన తర్వాత చేయవలసిన సేవ ఆసనం అందించడం. మనం పూజించే ఆ దైవాన్ని పేరు పెట్టి స్తుతిస్తూ, ‘నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి’ అని పూవులు, అక్షతలు ఆయన ముందు ఉంచాలి. అర్ఘ్యం, పాద్యం, ఆచమనం: ఈ మూడు సేవలూ ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి. దైవానికి కాళ్లు కడుగుతున్నట్లుగా భావిస్తూ, పంచపాత్రలోని నీటిని తీసుకుని, ‘పాద్యం సమర్పయామి’ అంటూ ఆ విగ్రహం లేదా పటం ముందు ఉంచిన ఒక చిన్న గిన్నె (దీనిని అర్ఘ్యపాత్ర అంటారు)లో ఉద్ధరిణెడు వేయాలి. ఆ తర్వాత చేతులు కడుగుతున్నట్లుగా భావిస్తూ ‘అర్ఘ్యం సమర్పయామి’ అని, రెండు ఉద్ధరిణల నీటిని విగ్రహానికి చూపిస్తూ, ఆ పాత్రలో వేయాలి. తర్వాత మంచినీరందించినట్లుగా మూడు ఉద్ధరిణల నీటిని తీసుకుని, అర్ఘ్యపాత్రలో వేయాలి. పంచామృతస్నానం: భగవంతునికి స్నానం చేయిస్తున్న భావనతో, ‘పంచామృతస్నానం సమర్పయామి’ అంటూ ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేయాలి. అనంతరం ‘శుద్ధోదక స్నానం సమర్పయామి’ అంటూ పవిత్రోదకంతో అభిషేకం చేయాలి. వస్త్రం: స్నానం చేసిన అతిథికి వస్త్రం ఇవ్వాలి కదా! రెండు గుండ్రటి ఒత్తులు తీసుకుని, పసుపు, కుంకుమ అద్ది, ‘వస్త్రయుగ్మం సమర్పయామి’ అంటూ విగ్రహం లేదా పటం మీద ఉంచాలి. విగ్రహం పెద్దదైతే గనుక ఆ విగ్రహానికి పంచనుకట్టబెట్టి, కండువాను మెడలో వేయాలి. ఉపవీతం: భగవంతునికి (స్త్రీ దేవత అయినా సరే) పత్తితో చేసిన మూడు వత్తులకు పసుపు, కుంకుమలతో అలంకరించి యజ్ఞోపవీతంలా అలంకరించాలి. పరిమాణాన్ని బట్టి సిసలైన యజ్ఞోపవీతాన్ని కూడా అలంకరింపవచ్చు. ధూపం, దీపం: రెండు లేదా మూడు అగరువత్తులను వెలిగించి, స్వామివారు లేదా అమ్మవారికి చూపించి, ధూపం సమర్పయామి’ అంటూ స్టాండులో ఉంచాలి. ఆ తర్వాత ‘దీపం దర్శయామి’ అంటూ రెండు లేదా మూడు వత్తులను వెలిగించి, చేతితోనే చూపించాలి. గంధ, పుష్ప, అక్షతలు: ‘గంధం సమర్పయామి’ అంటూ మంచి గంధాన్ని లేదా శ్రీ చందనాన్ని పుష్పంతో తీసుకుని, విగ్రహం మీద చిలకరించాలి. అనంతరం ‘పుష్పాన్ సమర్పయామి’, అంటూ సువాసన గల పూవులను అలంకరించాలి. ఆ తర్వాత దైవానికి సంబంధించిన శత లేదా సహస్ర నామాలనో అష్టోత్తరాన్నో చదువుతూ అక్షతలతో లేదా పూలతో పూజించాలి. నైవేద్యం: బెల్లం ముక్క మొదలుకొని, అరటిపండు, కొబ్బరికాయ, రసం గల పండ్లు, ఎండుపండ్లు, ప్రత్యేక పూజలలో అయితే నవకాయ పిండివంటలను నివేదించాలి. ఆ సమయంలో గాయత్రీ మంత్రాన్ని చదువుతూ, ‘నైవేద్యం సమర్పయామి’ అంటూ ఆ పదార్థాల మీద లేదా పండ్ల మీద నీటిని చల్లి, భగవంతునికి చూపుతూ, దైవానికి స్వయంగా మనమే తినిపిస్తున్నంత భక్తిశ్రద్ధలతో సమర్పించాలి. తాంబూలం: నైవేద్యానంతరం దక్షిణతో కూడిన తాంబూలాన్ని ‘తాంబూలాన్ సమర్పయామి’ అంటూ సమర్పించాలి. నీరాజనం: తాంబూలానంతరం హారతి పళ్లెంలో కర్పూరాన్ని వెలిగించి, ‘ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి’ అంటూ ముందుగా ముఖానికి, ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు హారతి ఇవ్వాలి. ‘నీరాజనానంతరం శుద్ధోదకం సమర్పయామి’ అంటూ పుష్పంతో రెండు చుక్కల నీటిని చిలకరించి, హారతిని భక్తితో కన్నులకు అద్దుకోవాలి. క్షమాప్రార్థన:మనం చేసిన పూజ, చదివిన మంత్రం లేదా, క్రియలో లేదా భక్తిలో ఏదైనా లోపం ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ... ‘‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం... యత్పూజితం మయ్యా దేవ పరిపూర్ణం తదస్తుతే అంటూ కొన్ని అక్షతలు తీసుకుని, ఉద్ధరిణ డు నీటిని విడవాలి. ఆత్మప్రదక్షిణ- సాష్టాంగ దండప్రణామాలు: ఆ తర్వాత మూడుమార్లు సవ్యదిశలో ప్రదక్షిణ చేసి, అవకాశాన్ని బట్టి, శరీరంలోని అన్ని భాగాలూ నేలకు తగిలేవిధంగా సాగిలబడి, నమస్కరించాలి. (స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయనక్కరలేదు) నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అంటూ నృత్య, గీతాలతో కూడా భగవంతుని తృప్తిపరచాలి. పూజలో రాజోపచారాలు, దైవోపచారాలు, భక్త్యోపచారాలు, శక్త్యోపచారాలు అని ఉంటాయి. అంటే, భక్తులమైన మనం సర్వశక్తిమంతుడైన భగవంతునికి సేవకులమేనన్న భావనతో ఈ సేవలన్నీ చేయాలి. ఉద్వాసన: పూజ ముగిసిన తర్వాత, ఉద్వాసన చెప్పడం కూడా ముఖ్యమైనదే. అంటే, దైవాన్ని మనం విగ్రహంలోనికి ఆహ్వానించాక తిరిగి, సగౌరవంగా సాగనంపడం కూడా అవసరమే కదా! అందుకే పూజ పూర్తయిన తర్వాత, ‘ఉద్వాసయామి’ అంటూ విగ్రహాన్ని వెనక్కు జరిపి, ‘యథాస్థానం ప్రవేశయామి’ అంటూ యథాస్థానంలోకి తీసుకురావాలి. పూజించే దైవాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి పై పూజావిధానంలో కొద్దిపాటి భేదాలున్నప్పటికీ, షోడశోపచారాలు చేయవలసిన తీరు ఇది. - డి.వి.ఆర్. భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎన్నో రకాల ఉపచారాలు చేస్తారు. వాటిలో పదహారు సేవలు అతి ముఖ్యమైనవి. వాటికే షోడశోపచారాలు అని పేరు. నిత్యపూజలో భాగంగా చేసే ఈ ఉపచారాలు ఏమిటో, ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటే వాటిని ఆచరించడం తేలిక. ఇంటికి ఎవరైనా ముఖ్య అతిథి వస్తే సాదరంగా లోనికి ఆహ్వానిస్తాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిస్తాం. తాగడానికి మంచినీరందిస్తాం. ముఖం తుడుచుకోవడానికి కండువా ఇస్తాం. ఆసనంపై కూర్చోబెడతాం. సేదతీరిన తర్వాత స్నానానికి ఏర్పాట్లు చేస్తాం. వస్త్రాభరణాలతో గౌరవిస్తాం. రకరకాల పిండివంటలతో భోజనం పెడతాం. అనంతరం వక్కపలుకు లేదా తాంబూలం అందిస్తాం. పక్కవేసి, కాసేపు విశ్రమించిన తర్వాత కబుర్లు చెబుతాం. మనకేమైనా కోరికలు వుంటే విన్నవించుకుంటాం. ఆ తర్వాత చేతనైన కానుకలు ఇచ్చి ఘనంగా వీడ్కోలు చెబుతాం. భగవంతుడు కూడా మనకు అతిథి వంటివాడే. అందుకే అతిథినీ, దేవుడినీ ఒక గాటన కట్టేశారు మన పెద్దలు. అటువంటి ది మన ఇంటికి భగవంతుడే స్వయంగా విచ్చేస్తే మనం ఆయనకు ఏమేం ఉపచారాలు చేస్తామో లేదా ఏమేం ఉపచారాలు చేయాలో తెలియజెప్పేవే ఈ షోడశోపచారాలు. -
8న కేసీఆర్ రాక
కరీంనగర్ స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నెల 8 నుంచి 12 వరకు 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలిక ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలు కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్లో నిర్వహిస్తున్నారు. కేసీఆర్ 8న ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 11.30 గంటలకు కొత్తపల్లికి చేరుకుని పోటీలను ప్రారంభిస్తారని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ జిల్లాస్థాయి అధికారులతో ఆదివారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం సీఎం కరీంనగర్ చేరుకుని నేరుగా ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి వెళ్తారని తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి కొత్తపల్లి వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, వైద్యబృందాలు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ ్బరాయుడు, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్ లాట్కర్, వివిధ శాఖ ఉన్నతాధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. కాగా కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టులో జిల్లాకు వచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకా న్ని ఇక్కడినుంచే ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి రెండోసారి కేసీఆర్ జిల్లాకు వస్తున్నారు. ఖోఖో పోటీల ప్రారంభోత్సవం తర్వాత.. అదే రోజు ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న గిరి జన పోరాట యోధుడు కొమురం భీమ్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
నాడు రిక్షావాలా... నేడు రాష్ట్రపతికి అతిథి!
విజయం రిక్షా కార్మికుడిగా మొదలైన ఆయన ఇప్పుడు సాక్షాత్తూ భారత రాష్ట్రపతి నివాసంలో అతిథి. ఇరవై ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో ఈ బ్రిటిష్ కాలపు భవనాలను అబ్బురంగా చూస్తూ తిరిగిన ఆయనకు ఇది ఊహించని అనుభవం. హర్యానా వాసి అయిన 51 ఏళ్ళ ధరమ్వీర్ కాంబోజ్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉంది. ఎంతోమందికి ఉపయోగపడే యంత్రాన్ని రూపొందించిన పట్టుదల ఉంది. ధరమ్వీర్ కథ అచ్చంగా ఓ సినిమా కథలా ఉంటుంది. హర్యానాలోని యమునా నగర్ ధరమ్వీర్ సొంత ఊరు. ఒకానొక దశలో కన్నకూతురి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుర్భర స్థితిలో గడిపారు. భార్యాబిడ్డల్ని పోషించలేక, తండ్రితో మాటా మాటా రావడంతో, 23 ఏళ్ళ వయసప్పుడు 1986లో ధరమ్వీర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఢిల్లీకి చేరిన ఆ యువకుడు రిక్షా కార్మికుడిగా మారాడు. కానీ, 1987లో ప్రమాదానికి గురవడంతో తప్పనిసరై, ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఓ ఆలోచన ఆయన మెదడును తొలిచేసింది. రైతులైన తాము గ్రామాల్లో పండించే పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలకు ఆట్టే లాభం రావడం లేదనీ, అదే గనక వాటిని ప్రాసెస్ చేసి, ప్యాకేజ్ చేస్తే లాభం వస్తోందని ఢిల్లీలో ఉండగా ఆయన గమనించారు. ఆ ఆలోచన జీవితాన్నే మార్చేసింది. ప్రమాదం నుంచి కోలుకోగానే రైతులతో మాట్లాడడం మొదలుపెట్టారు. సేంద్రియ వ్యవసాయంలో అనేక రకాల ప్రయోగాలు చేశారు. చివరకు రూపొందించిన ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రం ఘన విజయం సాధించింది. గంటకు 200 కిలోలకు పైగా టమోటాల నుంచి గుజ్జు తీసే యంత్రమది. కలబంద, ఉసిరి, నేరేడు లాంటి వాటి నుంచి, అనేక ఇతర ఔషధమూలికల నుంచి రసం తీయడానికీ, వాటిని రకరకాల ఉత్పత్తులుగా తయారు చేయడానికి కూడా ఉపకరించే ఆ యంత్రమే ఇప్పుడు ఆయనను దేశ ప్రథమ పౌరుడికి అతిథిని చేసింది. రాష్ట్రపతి భవన్ అతిథులుగా ఎంపిక చేసిన అయిదుగురు నవీన ఆవిష్కర్తల్లో ఒకరిని చేసింది. ‘‘ఈ యంత్రాన్ని తయారుచేయడానికి నాకు 11 నెలలు పట్టింది. ‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’కు చెందిన అధికారులు 2008లో నేనుంటున్న దామ్లా గ్రామానికి వచ్చి, యంత్రం ఎలా పనిచేస్తుందో చూశారు’’ అని ధరమ్వీర్ చెప్పుకొచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి, గుర్తింపు తేవడంతో ఈ నెల ఒకటి నుంచి ఇరవై రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో అతిథిగా గడుపుతున్నారాయన. ధరమ్వీర్ రూపొందించిన యంత్రం ద్వారా పువ్వుల నుంచి, ఔషధ మొక్కల నుంచి సారం తీసి, జెల్ లాగా కూడా చేయవచ్చు. ‘‘హోలీ రంగుల కోసం మా అమ్మ పువ్వులు సేకరించడం, వాటి నుంచి రసం తీయడం లాంటి నా చిన్ననాటి సంగతులు ఇప్పటికీ గుర్తే’’ అంటూ ఔషధ రసాలు తీయడం వెనుక తనకున్న ఆసక్తికి కారణాన్ని ఈ అయిదుపదుల సృజనశీలి తెలిపారు. చెరుకుగడల పిప్పి సాయంతో పుట్టగొడుగులు పెంచి, రికార్డు స్థాయి దిగుబడి సాధించారు. టేప్ రికార్డర్ మోటార్‌ను వాడుతూ, బ్యాటరీ ద్వారా పని చేసే స్ప్రేయింగ్ యంత్రం, అలాగే క్రిమికీటకాలను పట్టుకొనే మరో సాధనం లాంటివి కూడా రూపొందించారు. ఆయన ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ, ఇవాళ నవ్విన నాపచేనే పండింది. ఈ యంత్రాల కోసం ఇప్పటికే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘‘కెన్యాలోని ఓ సంస్థకు ఇలాంటి 20 యంత్రాలు సరఫరా చేస్తున్నా’’ అని ధరమ్వీర్ చెప్పారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, పదో తరగతి పైన చదువుకోలేకపోయిన ఆయన బడిలో చదువుకుంటున్నప్పుడే సైన్స్ ఎగ్జిబిషన్లలో ఎమర్జెన్సీ లైట్ తయారు చేశారు. ఆ దశ నుంచి గంటలో 100 కిలోల కలబందను ప్రాసెస్ చేసే యంత్రాన్ని రూపొందించే స్థాయికొచ్చారు. అది బాయిలర్‌గా, స్టెరిలైజర్‌గా, కుకర్‌గా రకరకాలుగా ఉపయోగపడుతుంది. దాంతో, బియ్యం ఉడికించవచ్చు. టొమేటా కెచప్ చేయవచ్చు. మసాలా దినుసులు, పండ్ల నుంచి పొడి తీయవచ్చు. ఈ ఉత్సాహవంతుడి కృషిని గమనించి హర్యానా ప్రభుత్వం ఇప్పటికే తమ హిసార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోర్డ్ సభ్యుడిగా కూడా ఆయనను నియమించింది. అనేక అవార్డులూ వచ్చాయి. అయితే, ఒకప్పుడు తిట్టిన తండ్రి ఈ ఘన విజయాలను కళ్ళారా చూడలేకపోయారని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. తిండికి గడవని రోజుల నుంచి ఇవాళ నెలకు రూ. 50 వేలు సంపాదిస్తూ, కనీసం పాతికమందికి పైగా ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆయన ఘనత. తాను పెద్దగా చదువుకోకపోయినా కొడుకును కంప్యూటర్ ఇంజనీర్‌నూ, కూతుర్ని ఎం.బి.ఎ. పట్టభద్రురాలినీ చేశారు. అలోవెరా షాంపూలూ, చూర్ణాలు, జెల్, ఫేస్‌ప్యాక్, ఉసిరికాయ జ్యూస్, లడ్డూ, బర్ఫీ లాంటివి తన కుమారుడు ప్రిన్స్ పేరు మీద తయారు చేస్తున్నారు. ఉత్తరాదిన ఈ ఉత్పత్తులు జోరుగా అమ్ముడవుతున్నాయి. భార్య సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందంటున్న ధరమ్వీర్ సానుకూల దృక్పథం, కఠోర పరిశ్రమ, ఏదైనా సరే నేర్చుకోవాలన్న తపన తన బలాలంటున్నారు. విజయ సాధకులకు కావాల్సినవేమిటో ఇక వేరే చెప్పాలా? - మహతి -
చంద్రబాబు ఇక్కడ అతిథి మాత్రమే
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తుందని, దానిని ఉల్లంఘించి గవర్నర్‌కు అధికారం కట్టబెట్టాలని చేసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొందరు కావాలని ఇబ్బందులు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు సోమవారం ఆయన ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కును మార్పు చేయడానికి వీల్లేదని, దీనిపై అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే.. అభినందించాల్సింది పోయి ఏపీ సీఎం అభిప్రాయాలు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. గురుకుల్‌ట్రస్టు, అయ్యప్ప సొసైటీల్లో చంద్రబాబుకు బినామీ పేర్లతో భూములు ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ పరిసరాల్లో ఆయనకు భూములున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై పొరుగు రాష్ట్ర సీఎం స్పందించడం వింతగా ఉందన్నారు. చంద్రబాబు పదేళ్ల వరకు తెలంగాణ ప్రభుత్వ అతిథి మాత్రమేనని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదన్నారు. -
టీవీక్షణం: అందం+ఆత్మవిశ్వాసం = దామిని!
ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అతిథుల సంగతేమోగానీ, ఏదైనా కొత్త సీరియల్ ప్రారంభమవుతోందంటే దానికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ టైముకి వస్తుంది, ఎలా ఉంటుంది అంటూ మొదట ఆసక్తి. సీరియల్ కానీ నచ్చిందంటే... తర్వాత ఏమవుతుంది, కథ ఏ మలుపులు తిరుగుతుంది అంటూ ఉత్కంఠ. ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టే... ప్రతి చానెల్ అడపా దడపా ఏదో ఒక కొత్త సీరియల్ మొదలుపెడుతూనే ఉంటోంది. అలా ఇటీవలే ప్రారంభమైన సీరియల్... దామిని. అచ్చమైన ఆధునిక యువతి దామిని. ఆకట్టుకునే అందం, ఎవరినైనా ఎదిరించగల ఆత్మవిశ్వాసం, ఎంతటి పోరాటానికైనా వెరవని దృఢత్వం ఆమె సొంతం. అదే ఆమెకు ఓ యువకుడితో గొడవ తెచ్చిపెడుతుంది. అతడి అహంకారానికి, ఆమె ఆత్మవిశ్వాసానికి మధ్య పోరాటం మొదలవుతుంది. ఆ తరువాత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఊపిరాడనివ్వకుండా చేస్తోందీ ధారావాహిక. దామిని పాత్రలో ఒదిగిపోయిన ప్రీతి అభినయం, శ్రీరామ్ లాంటి ఫేమస్ హీరో నెగిటివ్ రోల్ చేయడం, చాలాకాలం తరువాత సీనియర్ నటి యమున ఓ వైవిధ్యభరితమైన పాత్ర పోషించడం వంటి వాటితో పాటు... బలమైన కథ, అందమైన స్క్రీన్‌ప్లే ఈ సీరియల్‌కు ప్లస్ పాయింట్స్. అయితే ఆదిలో ఉన్న పటుత్వం రోజులు గడిచేకొద్దీ సన్నగిల్లడం కొన్ని సీరియళ్లలో కనిపిస్తోంది. దామిని అలా కాదనే అనుకుందాం. ముందు ముందు దామిని జీవితం ఏ మలుపులు తిరుగుతుందో, తెలుగు ప్రేక్షకులను ఇంకెంత కట్టిపడేస్తుందో చూద్దాం! -
అతిథికి అందమైన ఆహ్వానం
ఇంటికొచ్చిన అతిథికి సాదరస్వాగతంతోపాటు చక్కని విందు భోజనం పెట్టాలన్న తాపత్రయం ఉంటుంది. కానీ చక్కగా అమర్చి వడ్డించడానికి అందమైన టేబుల్ లేదనే బెంగ చాలామందిలో ఏదో ఒక మూల ఉంటుంది. అలాంటిదేదైనా ఉంటే ఈ టేబుల్ డెకరేషన్ స్టయిల్స్‌ని గమనించండి. ఇక్కడ ఉన్న టేబుళ్లలో ఏదీ ప్రత్యేకమైన మోడల్ కాదు, అన్నీ సాధారణమైనవే. అయితే కలర్‌ఫుల్ క్లాత్, ఫ్లవర్పాట్స్, టేబుల్ నాప్కిన్స్తో అందంగా తీర్చిదిద్దారు. సందర్భానికి అనుగుణంగా టేబుల్ డెకరేషన్ ఉంటే చాలు, అతిథులు మీ ఆతిథ్యాన్ని ఆహ్లాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం టీ, స్నాక్స్‌తో ఆతిథ్యం ఇస్తుంటే... టీ పాట్, కప్పులు, ఒక ప్లేట్, ఆ ప్లేట్‌కు కుడివైపున నైఫ్, ఎడమవైపున ఫోర్క్ అమర్చాలి. పిల్లల బర్త్‌డే పార్టీకి వచ్చే అతిథులు కూడా పిల్లలే అయి ఉంటారు. కాబట్టి పెద్ద బొమ్మలున్న టేబుల్ క్లాత్ వేసి, పక్కనే మోడరన్ ప్రింట్స్ కర్టెన్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. రాత్రిపూట గార్డెన్లో మూన్లైట్ డిన్నర్ చేయాలనుకుంటే... ముదురు రంగు టేబుల్ క్లాత్ పరిచి తెల్లటి ప్లేట్లు పెట్టాలి. పొడవాటి గాజు గ్లాసులో క్యాండిల్ పెట్టి వెలిగించాలి.