
ఒకసారి ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర) ఇంటికి రాత్రి బాగా పొద్దుపోయాక అతిథులు వచ్చారు. రాత్రి ఇషా నమాజు తరువాత ఖలీఫా తన ఇంటికి వచ్చిన అతిథితో ముచ్చటిస్తున్నారు. అంతలోనే లాంతరులో చమురు అయిపోవడంతో దీపం ఆరిపోసాగింది. దీన్ని గమనించిన అతిథి ‘‘ఓ ఖలీఫా; నేను ఈ దీపాన్ని బాగుచేయనా’ అని అడిగారు. ‘‘ఇంటికి వచ్చిన అతిథితో పనులు చేయించడం భావ్యంకాదు’’ అని చెప్పారు. దానికి ఆ అతిథి ‘‘ఇంట్లో సేవకుడిని లేపమంటారా’’ అని అడిగాడు. అందుకు ఖలీపా ‘‘రోజంతా పనిచేసి అతను అలసిపోయాడు. ఇప్పుడే అతని కళ్లు మూతలు పడ్డాయి’’ అని చెప్పి లాంతరులో చమురు పోసి లాంతరును వెలిగించారు.
పైన ప్రవక్త (స), ఖలీఫాల గాథలలో మనకెన్నో వెలకట్టలేని అమూల్యమైన జీవిత సత్యాలున్నాయి. మనం చెప్పే మాటలు అందరూ వినాలని భావిస్తాం. మన మాట చెల్లుబాటు కావాలని ఆశిస్తాం. కానీ మనం చెప్పే మాటలు మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో ఆలోచించము. ఎదుటివారిపై మనం చెరగని ముద్ర వేయాలంటే, మనం చెప్పకుండానే మన మాటకు గౌరవం దక్కేలా చేసుకోవాలంటే ముందు మనం ఆచరించి చూపాలి. మన పనులు మనం చేసుకోవడం వల్ల సమాజంలో ఆదరణ లభిస్తుంది. గౌరవ మర్యాదలు కలుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment