Lantern
-
థాయ్‌లాండ్‌లో దీపావళి వేడుక వేరే లెవల్! చూసి తరించాల్సిందే!
వెలుగుల పండుగ దివాలీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాటు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో దీపావళిని వేడుకగా నిర్వహించు కుంటారు. ముఖ్యంగా మిరుమిట్లు కొలిపే దీపకాంతులతో థాయ్‌లాండ్ మెరిసి పోతుంది. నింగిలోనూ, నీటిలోనూ లాంతర్ల వెలుగు, దీపాలతో థాయలాండ్‌లో దీపావళి వేడుక ఒక రేంజ్లో జరుగుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!థాయ్‌లాండ్‌లో నవంబర్ నెలలో లాయ్ క్రాథోంగ్, యి పెంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు . అరటి ఆకులతో చేసిన దియాలు (దీపాలు) ప్రత్యేక ఆకర్షణ. ఈ దీపాలు తామరపువ్వు ఆకారాల్లొ నదిపై తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ దీపాలపై ఒక నాణెం, ధూపంతో పాటు కొవ్వొత్తులనూ ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు .లాయ్ క్రాథోంగ్ (లాంతర్ల పండుగ)దీన్నే "ఫ్లోటింగ్ బాస్కెట్ ఫెస్టివల్" అని పిలుస్తారు. loi అంటే 'ఫ్లోట్' అని, క్రాథాంగ్ అనేది పూలతో అలంకరించబడిన బుట్ట అని అర్థం. థాయ్‌లాండ్ లైట్స్ ఫెస్టివల్ అని పిలువబడే లాయ్ క్రాథాంగ్ ఫెస్టివల్, థాయ్ చంద్ర క్యాలెండర్‌లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు , పువ్వులతో అలంకరించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదులు మరియు జలమార్గాలపై విడుదల చేయడం ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపుకు గుర్తుగా , శీతాకాలాన్ని స్వాగతించే వార్షిక వేడుకగా కూడా భావిస్తారు. మంత్రముగ్ధం చేసే ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనలు , నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు నిజంగా అద్భుతంగా ఉంటుంది. లాయ్ క్రాథాంగ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటే, ఉత్తర థాయిలాండ్‌లో, యి పెంగ్ అని చియాంగ్ మాయిలో ఈ లాంతరు పండుగ నిర్వహస్తారు. యి పెంగ్స్కై లాంతర్ ఫెస్టివల్ యి పెంగ్: రాత్రివేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లను ఎగువేవేస్తారు. చియాంగ్ మాయిలో మాత్రమే ఈ రెండు పండుగలను ఒకే రోజు జరుపు కుంటారు.దురదృష్టాన్ని గాల్లోకి వదిలి, అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా ఈ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమంలో బౌద్ధసన్యాసులు, స్థానికులు, పర్యాటకులు వేలాదిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాములతో సందడిగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. -
అరుదైన లాంతరు.. ఉప్పునీటితో వెలుగుతుంది
దీపం వెలగాలంటే ఏం కావాలి? పాతకాలం దీపాలకైతే, నూనె కావాలి. ఇప్పటి దీపాలకైతే కరెంటు కావాలి. కనీసం బ్యాటరీ కావాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న లాంతరుదీపానికి మాత్రం ఉప్పునీరు ఉంటే చాలు. ఇది వెలుతురు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు, ఈ లాంతరుకు ఉన్న యూఎస్బీ పోర్టు ద్వారా దీపం వెలుగుతూ ఉండగా, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చు కూడా. ‘లైట్‌పల్స్ ఎకో లాంతర్’ పేరిట ‘గ్యాలప్ ఇన్నోటెక్’ అనే చైనా కంపెనీ రూపొందించింది. ఇంతకీ ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనేగా మీ అనుమానం. మామూలు లాంతరులో కిరోసిన్ నింపే బదులు, ఇందులో ఉప్పునీరు నింపుకోవాలి. దీని అడుగుభాగంలో అల్యూమినియం ప్లేట్ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటూ ఉంది. చదవండి: ప్రపంచంలోనే సన్న భవనం -
మహోద్యమంగా జలసంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణను ఓ మహోద్యమంగా చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలంతా వర్షపునీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పలు నదులు, జలాశయాలు ఎండిపోయి ప్రజలు నీటికి కటకటలాడుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆదివారం నిర్వహించిన తొలి మాసాంతపు మన్‌కీ బాత్(మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం పాటించడం సరైన పద్ధతి కాదని మోదీ అభిప్రాయపడ్డారు. ఒక్కో ప్రాంతంలో అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ప్రతీ నీటిచుక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నీటి వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు, ఇతర సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, జలసంరక్షణ పద్ధతులను అందరికీ వివరించాలని కోరారు. ప్రస్తుతం భారత్‌లో కురుస్తున్న వర్షంలో కేవలం 8 శాతం నీటిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామన్నారు. గ్రామసభలను ఏర్పాటుచేసి ప్రజలంతా జల సంరక్షణ విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జలసంరక్షణ చర్యల్ని ప్రజలంతా ‘జన్‌శక్తి4జల్‌శక్తి’ అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా పంచుకోవాలని సూచించారు. 2014 అక్టోబర్ 3 నుంచి 2019, ఫిబ్రవరి 24 వరకు 53 సార్లు ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని నిర్వహించిన మోదీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిపివేశారు. కేదార్‌నాథ్‌ను అందుకే దర్శించుకున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 24న మన్‌కీబాత్ కార్యక్రమంలో ఓ 3–4 నెలల తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పాను. ఈ నమ్మకం మోదీది కాదు. ఇది మీరునాపై ఉంచిన నమ్మకం. ఈ నమ్మకానికి మీరే మూలకారణం. నన్ను మళ్లీ గెలిపించి ఇక్కడకు తీసుకొచ్చారు. మరోసారి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు’ అని మోదీ తెలిపారు. ‘మన్‌కీ బాత్’ ఆగిపోయిన సమయంలో తనకు ప్రజలతో సంభాషించే అవకాశం లేకుండాపోయిందనీ, అసౌకర్యంగా, ఒంటరిగా అనిపించిందని వెల్లడించారు. ‘ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ కేదార్నాథ్, బద్రీనాథ్‌లను దర్శించుకున్నాను. ఎన్నికల మధ్యలో ఎందుకు వెళ్లారని నన్ను చాలామంది అడిగారు. రాజకీయ ప్రచారం కోసమే వెళ్లానని కొందరు అనుకున్నారు. కానీ నా అంతరాత్మను కలుసుకోవడానికి, నన్ను నేను సమీక్షించుకోవడానికే కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లాను. అక్కడ ధ్యానం చేయడం మన్‌కీబాత్ కార్యక్రమం లేనిలోటును పూడ్చింది’ అన్నారు. మోదీ నోట ‘ఊటకుంట’ అడ్డాకుల (దేవరకద్ర): ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మహబూబ్‌నగర్ జిల్లాలోని తిమ్మాయిపల్లితండా శివారులో నిర్మించిన ఊటకుంటను ప్రస్తావించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన ఈ ఊటకుంట సత్ఫలితాలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. వర్షాలు కురిసినప్పుడు నీరు వృథాగా వెళ్లకుండా ఉండేందుకుగాను 4–5 ఏళ్ల క్రితం ఈ కుంటను నిర్మించారు. దీనికి అనుబంధంగా మరో రెండింటిని ఏర్పాటుచేశారు. దీనివల్ల వర్షం కురిసినప్పుడు గుట్టల పైనుంచి వచ్చే వర్షపునీరు కుంటలోనే నిలిచి పరిసరాల్లో ఉండే బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పెద్దపెద్ద చెరువుల వల్ల కలిగే ప్రయోజనాలు ఉపాధిహామీలో చిన్న కుంటలతోనూ లభిస్తున్నాయని చెబుతూ మోదీ ఈ ఊటకుంటను ప్రస్తావించారు. ప్రజాస్వామ్య గొప్పతనం తెలియట్లేదు.. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రోజూ సమయానికి భోజనం చేసే వ్యక్తికి ఆకలి కేకలు ఎలా ఉంటాయో తెలియదు. అలాగే ప్రస్తుతం ప్రజాస్వామ్య హక్కులను హాయిగా అనుభవిస్తున్న ప్రజలకు వాటి విలువ పోగొట్టుకుంటే తప్ప బోధపడదు. ఏదైనా మన దగ్గరున్నప్పుడు దాని విలువను అర్థం చేసుకోలేం. ఎమర్జెన్సీ సమయంలో ప్రతీపౌరుడికి తమకు సంబంధించినదేమో లాక్కున్న భావన కలిగింది. దీంతో 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేశారు. అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం నిజంగా మన అదృష్టమే. కానీ దాన్ని మనం తగినరీతిలో గౌరవించడం లేదు’ అని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఏకంగా 61 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రధాని వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా జనాభాకు రెట్టింపని తెలిపారు. భారత్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య యూరప్ ఖండం జనాభా కంటే ఎక్కువన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారనీ, ప్రస్తుతం పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. ప్రజలంతా గూగుల్ ద్వారా ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌ను ‘గూగుల్ గురు’గా ప్రధాని అభివర్ణించారు. -
దీపాన్ని బాగు చేయనా?
ఒకసారి ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (ర) ఇంటికి రాత్రి బాగా పొద్దుపోయాక అతిథులు వచ్చారు. రాత్రి ఇషా నమాజు తరువాత ఖలీఫా తన ఇంటికి వచ్చిన అతిథితో ముచ్చటిస్తున్నారు. అంతలోనే లాంతరులో చమురు అయిపోవడంతో దీపం ఆరిపోసాగింది. దీన్ని గమనించిన అతిథి ‘‘ఓ ఖలీఫా; నేను ఈ దీపాన్ని బాగుచేయనా’ అని అడిగారు. ‘‘ఇంటికి వచ్చిన అతిథితో పనులు చేయించడం భావ్యంకాదు’’ అని చెప్పారు. దానికి ఆ అతిథి ‘‘ఇంట్లో సేవకుడిని లేపమంటారా’’ అని అడిగాడు. అందుకు ఖలీపా ‘‘రోజంతా పనిచేసి అతను అలసిపోయాడు. ఇప్పుడే అతని కళ్లు మూతలు పడ్డాయి’’ అని చెప్పి లాంతరులో చమురు పోసి లాంతరును వెలిగించారు. పైన ప్రవక్త (స), ఖలీఫాల గాథలలో మనకెన్నో వెలకట్టలేని అమూల్యమైన జీవిత సత్యాలున్నాయి. మనం చెప్పే మాటలు అందరూ వినాలని భావిస్తాం. మన మాట చెల్లుబాటు కావాలని ఆశిస్తాం. కానీ మనం చెప్పే మాటలు మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో ఆలోచించము. ఎదుటివారిపై మనం చెరగని ముద్ర వేయాలంటే, మనం చెప్పకుండానే మన మాటకు గౌరవం దక్కేలా చేసుకోవాలంటే ముందు మనం ఆచరించి చూపాలి. మన పనులు మనం చేసుకోవడం వల్ల సమాజంలో ఆదరణ లభిస్తుంది. గౌరవ మర్యాదలు కలుగుతాయి. -
ఆకట్టుకుంటున్న ఆక్లాండ్ లాంతరెన్ ఫెస్టివల్
చైనా కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లాంతర్ల వెలుగులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆక్లాండ్ మునుపెన్నడూ లేని విధంగా 800 లాంతర్లతో దేదీప్యమానమైంది. ఉత్సవాలను చూసేందుకు వచ్చే జనంకోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. లాంతరెన్ పండుగలో వివిధ ఆకృతుల్లో తయారుచేసిన 800 చైనీస్ హ్యాండ్ మేడ్ లాంతర్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వారి నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన స్టేజ్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చైనా చిత్రకళలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అన్ని వయసుల వారినీ ఆకర్షించేలా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను సందర్శకులు ఉచితంగా తిలకించే సౌకర్యం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా రుచికరమైన ఆసియా వంటకాలు నోరూరిస్తున్నాయి. చేతిపనులు, అల్లికలు, లాంతర్ల తయారీ ప్రదర్శనలు అభిమానుల మనసు దోస్తున్నాయి. చైనా సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, లైవ్ మ్యూజిక్ తో పాటు... అనేక అంతర్జాతీయ ప్రదర్శనలు వేడుకల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆదివారం ముగింపు వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకోనుంది. -
ఆవిష్కరణం: టార్చ్‌లైట్ పూర్వరూపం లాంతరే!
నిప్పును నిరంతరం వెలిగే దీపంగా మార్చుకొని, దాన్ని ఒక కాంతిజనకంగా ఉపయోగించుకోవడం క్రీస్తు పూర్వం వేల ఏళ్ల క్రితమే మొదలైందని పరిశీలకుల భావన. గ్రీకు భాషలో వీటినే ‘లంపాస్’ అనే వారు. అవే ఇంగ్లిష్‌లో ‘ల్యాంప్’లు అయ్యాయి. క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో ఈ పదం వాడకంలోకి వచ్చింది. ఆ తొలినాళ్ల దీపాలే ‘టార్చ్లైట్లు’. అలాగే లాంతర్లను కూడా టార్చ్లుగానే భావించవచ్చు. నేటికీ వినియోగంలో ఉన్న లాంతర్లు 1783లో తొలిసారి ఆవిష్కృతం అయ్యాయి. అమీ ఆర్గండ్ అనే స్విస్ట్ కెమిస్ట్ వీటిని రూపొందించాడు. ఇవే చీకటిని చేధించి ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే నమ్మకమైన హ్యాండ్ ల్యాంప్స్‌గా మారాయి. తొలిరోజుల్లో జంతువుల కొవ్వుతో ఈ దీపాలను వెలిగించి, చీకటిలో ఉపయోగించే వారు. తర్వాత వంద సంవత్సరాలకు గ్యాస్, కిరోసిన్ ఇంధనంగా ఉండే లాంత ర్లను తయారు చేశారు. ఇవి ఆధునికంగా రూపాంతరం చెంది డ్రై సెల్ బ్యాటరీగా 1896లో అందుబాటులోకి వచ్చింది. అదే మనం వాడే ‘టార్చ్’. లిక్విడ్ రూపంలోని ఇంధనానికి భిన్నంగా పేస్ట్ ఎలక్ట్రోలైట్ల ద్వారా ఒక లైట్‌ను వెలిగించాలనే ఐడియా హ్యాండ్ బ్యాటరీ రూపకల్పనకు దారి తీసింది. తొలిసారి ఈ హ్యాండ్ల్యాంప్స్ను న్యూయార్క్ సిటీ పోలీసులు ఉపయోగించారు. రాత్రిపూట గస్తీ కోసం పరిశోధకులు వీటిని పోలీసులకు డొనేట్ చేశారు. ఆ విధంగా టార్చ్లైట్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. ఆ తర్వాత లైట్ల విషయంలోనూ, ముందువైపు ఉండే అద్దం విషయంలో అనే మార్పులు వచ్చాయి. తర్వాత ఎల్ఈడీలు, హెచ్ఐడీల రూపంలోని లైట్లతో బ్యాటరీలను రూపొందించారు. విద్యుత్ఘటాలతో, చార్జింగ్‌తో, కరెంట్‌తో పనిచేసే రకరకాల టార్చ్‌లైట్లూ వినియోగంలోకి వచ్చాయి.