ఎక్కడ, ఎవరి నోట విన్న పవిత్రమైన అయోధ్య, రామ మందిరం, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట, ఈ మాటలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశంలోని వేలాది మంది అతిథులకు ఆహ్వానం అందింది.
రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన వారిలో రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ప్రముఖుల నివాసాలకు వెళ్లి అయోధ్యలో జరిగే రాముడి మహా వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే సోమవారం జరిగే బృహత్తర కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ప్రయివేటు చార్టెడ్ ప్లేన్‌లో కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్లనున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సరోద్ మాస్ట్రో అంజద్ అలీ ఖాన్, గీత రచయిత మనోజ్ ముంతాషీర్, అతని భార్య ప్రసూన్ జోషి, డైరెక్టర్లు సంజయ్ భన్సాల్, చంద్రప్రకాశ్ ద్వివేదితో పాటు పలువురు ఉన్నారు.
పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, కాబోయే మరో కోడలు రాధిక మర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్‌పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య నీరజ, పిరమల్ గ్రూప్ చైర్‌పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజయ్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివసన్ హాజరు కానున్నారు.
డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కే సతీశ్ రెడ్డి, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఆయన భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ హెడ్ నవీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మన్ నరేశ్ త్రెహాన్ ఉన్నారు. అలాగే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీఈఓ షెర్పా అమితాబ్ కాంత్, మాజీ అటార్నీ జనరల్స్ కేకే వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ, ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
వీరిలో కొందరు జనవరి 22న ప్రైవేట్ జెట్‌లలో అయోధ్యకు వెళ్లనుండగా.. మరికొందరు సాధారణ విమానాల్లో ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని రాత్రి అయోధ్య, లక్నో వంటి సమీప నగరాల్లో బసచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment