Ayodhya: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం | Ayodhya ram Mandir: Ayodhya Ram Temple Bala Rama idol Goes Viral | Sakshi
Sakshi News home page

Ayodhya Bala Rama Idol: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం

Published Fri, Jan 19 2024 4:15 PM | Last Updated on Fri, Jan 19 2024 5:01 PM

Ayodhya ram Mandir: Ayodhya Ram Temple Bala Rama idol Goes Viral - Sakshi

అయోధ్య:  అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి.  కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది.

కాగా గురువారమే గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం  బాలరాముని విగ్రహం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన భక్తులు.. జైశ్రీరామ్‌ అంటూ పులకించిపోతున్నారు. 

 రామ్‌లల్లా విశిష్టతలివే..

►అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.  
► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కారు.  
► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు.  
► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు.

►కాశీకి చెందిన జ్ఞానేశ్వర్‌ శాస్త్రీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట పూజలు 
► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్‌లల్లా దర్శనమిస్తాడు.  
► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్‌ ముహూర్తంలో జరుగుతుంది.  
►శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు
►శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు

► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్‌ నృత్యగోపాల్‌ మహారాజ్‌ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు.  

► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు.  
► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement