చంద్రబాబు ఇక్కడ అతిథి మాత్రమే
చంద్రబాబు ఇక్కడ అతిథి మాత్రమే
Published Tue, Jul 8 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తుందని, దానిని ఉల్లంఘించి గవర్నర్‌కు అధికారం కట్టబెట్టాలని చేసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొందరు కావాలని ఇబ్బందులు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు సోమవారం ఆయన ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వద్ద మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగంలో కల్పించిన హక్కును మార్పు చేయడానికి వీల్లేదని, దీనిపై అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే.. అభినందించాల్సింది పోయి ఏపీ సీఎం అభిప్రాయాలు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
గురుకుల్‌ట్రస్టు, అయ్యప్ప సొసైటీల్లో చంద్రబాబుకు బినామీ పేర్లతో భూములు ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ పరిసరాల్లో ఆయనకు భూములున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై పొరుగు రాష్ట్ర సీఎం స్పందించడం వింతగా ఉందన్నారు. చంద్రబాబు పదేళ్ల వరకు తెలంగాణ ప్రభుత్వ అతిథి మాత్రమేనని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదన్నారు.
Advertisement
Advertisement