వర్షపు నీటి ఉధృతికి కాలువలో పడిన ఆరేళ్ల చిన్నారి
వెంటనే కొట్టుకుపోయిన వైనం రక్షించేందుకు
స్థానికులు విఫలయత్నం దొరకని పాప ఆచూకీ
మద్దిలపాలెం (విశాఖ) : ట్యూషన్‌కు వెళ్లొస్తూ ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు గెడ్డలో కొట్టుకుపోయిన వైనమిది. సీతమ్మధారలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్.అండ్ బి ఇంజినీర్ సి.హెచ్.రమణమూర్తి మనుమరాలు అతిథి(6) టింపనీ స్కూల్లో 1వ తరగతి చదువుతుంది. గురువారం సాయంత్రం ట్యూషన్ సెంటర్‌కి వెళ్లింది. 6 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కాలువలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్యూషన్ నుంచి తిరిగి వస్తూ చిన్నారి రోడ్డుపై ఉన్న నీటిలో దిగి కారు ఎక్కబోయింది. పక్కడే డ్రెయిన్ కాలువ ఉండటంతో వర్షపు నీటి ఉధృతికి అతిథి అందులో పడిపోయింది. వెంటనే కొట్టుకుపోయింది. అక్కడివారు వెంటనే వెతికేందుకు ప్రయత్నించారు. కాలువపై 200 మీటర్ల మేరకు అక్రమంగా సిమెంట్ పలకలతో కప్పేయడంతో రక్షించడానికి ఫలితం లేకపోయింది.
అయినప్పటికి స్థానికులు సాహసించి కాలువలో దూకి వెతికేందుకు ప్రయత్నించారు.అయినా ఫలితం లేకపోయింది. అతిథి సుమారు 6 గంటల ప్రాంతంలో గల్లంతయినప్పటికి అధికారులు 8 గంటల వరకు సంఘటనా స్థలానికి చేరకుకోలేదు. గాలింపు చర్యలు చేపట్టలేదు సరికదా కనీసం ప్రొక్లైనర్స్‌ని తీసుకొచ్చి సిమెంట్ దిమ్మలను తొలగించలేదు. దీంతో స్థానికులు ఆగ్రహించారు. ఎట్టకేలకు 9 గంటల సమయంలో ప్రొక్లైనర్‌తో త్రవ్వకాలు చేపట్టారు. జీవీఎంసీ నిర్లక్ష వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరో ప్రక్క ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చినప్పటికి టార్చ్‌లైట్లు చార్జింగ్‌లేవనే సాకుతో, సహాయక చర్యలు చేపట్టకపోవడం విచారకరం. పాప తల్లితండ్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.
పాపం అతిథి
Published Thu, Sep 24 2015 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement
Advertisement