వైరల్‌: పెళ్లిలో అదనంగా తిన్నాడని బిల్‌ కట్టాలన్న కొత్త జంట | Viral: Newly Weds Guest Pay Rs 366 For Eating Extra Slice Wedding Cake Video | Sakshi
Sakshi News home page

Viral: పెళ్లిలో అదనంగా తిన్నాడని బిల్‌ కట్టాలన్న కొత్త జంట

Published Sat, Oct 2 2021 5:12 PM | Last Updated on Sat, Oct 2 2021 5:30 PM

Viral: Newly Weds Guest Pay Rs 366 For Eating Extra Slice Wedding Cake Video - Sakshi

సాధారణంగా వివాహం అంటే అతిథుల రాక, భోజన మర్యాదలు, చివర్లో వారి ఆశీర్వాదాలు ఉండడం సహజమే. కొందరు అయితే తమ పెళ్లి పది కాలాలు గుర్తుండి పోవాలని ఖర్చుకు  ఏ మాత్రం వెనకాడరు. ఇక పెళ్లంటే ప్రధానంగా భోజనాలు గురించే ఎక్కువగా మాట్లాడుతారు. అందుకే పెళ్లిలో వంటకాల విషయంలో ఏ మాత్రం రాజీపడరు. తాజాగా ఓ పెళ్లిలో మాత్రం కాస్త ఎక్కువగా తిన్నందుకు అతిథిని బిల్‌ కట్టాలన్నారు ఓ నవవధూవరులు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా అది నిజమే..

వివరాల్లోకి వెళితే..  ఓ వ్యక్తి తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లాడు. అయితే అక్కడ వెడ్డింగ్‌ కేక్‌ ముక్కను అదనంగా తిన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత అతనికి ఆ జంట నుంచి చిన్న వీడియో క్లిప్‌ రాగా దాన్ని చూసిన సదరు వ్యక్తి షాక్‌ అయ్యాడు. అందులో..  ‘మేము మా పెళ్లి వీడియో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాం. అందులో నువ్వు వెడ్డింగ్‌ కేక్‌ రెండు ముక్కలు తిన్నావు, నవ్వు అదనపు ముక్క తిన్నందుకు దానికి అయిన ఖర్చు 3.66 పౌండ్లు (రూ.366) పంపాలని అందులో రాసి పంపారు.

కాగా, వెడ్డింగ్‌ కేక్‌ ఒక్క ముక్కే ఇవ్వనున్నట్లు అందుకు గెస్ట్‌లు పైసలు కూడా చెల్లించాలని ఆ జంట ముందుగానే పేర్కొంది.  కాగా, తనకు ఎదురైన ఈ అనుభవాన్ని రెడ్డిట్‌తో పంచుకున్న ఆ వ్యక్తి, వధువు పంపిన ఈ మెసేజ్‌ను కూడా అందులో పోస్ట్‌ చేశారు. దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోని చూసిన నెటిజన్లు దీనిపై మండిపడ్డారు. వెడ్డింగ్‌ కేక్‌ కోసం గెస్ట్‌ల నుంచి చార్జ్‌ చేస్తారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: చైసామ్‌ విడాకులు.. ఏంటీ? ఏం జరిగింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement