
భోపాల్: ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తే వాళ్లని కోతిలా ప్రవర్తించకు అంటారు. అలా ఎందుకు అంటారో తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. ఓ వ్యక్తి ఆటోలో మూటగట్టిన లక్ష డబ్బులను ఒక కోతి లాక్కొనిపోయింది. అంతటితో ఊరుకుందా అది.. దగ్గర్లోని చెట్టు పైకి ఎక్కి ఆ టవల్‌ను విదిలించి ఆ డబ్బులన్నీ రోడ్డుపై పడేసింది.
కటవ్ ఘాట్ ప్రాంతంలో.. ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అంతలో వారి మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఆటోలోని ఒక వ్యక్తి తన వద్ద ఉన్న లక్ష నగదును టవల్‌లో చుట్టి ఉంచాడు. కాసేపు గడిచినా ట్రాఫిక్ క్లియర్ కాకపోయేసరికి ఆ ముగ్గురు ఆటోలోంచి బయటకు వచ్చారు. సరిగ్గా ఆ కోతి ఒక వ్యక్తి చేతిలో ఉన్న టవల్‌ని తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం పోయి ఓ చెట్టుపైకి ఎక్కింది.
పాపం అందులో ఆహారం ఉందనుకుని టవల్‌ను విదిలించింది. దీంతో మూటలో ఉన్న డబ్బులు రోడ్డు పై వర్షంలా పడ్డాయి. ఇంకేముంది కొందరు దొరికిన నోట్లను తమ జేబులో వేసుకోగా.. చివరకు రూ.56 వేలు మాత్రమే డబ్బు యజమానికి దక్కింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా.. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మిగతా డబ్బులు ఎవరు తీసుకున్నారని తెలియలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
చదవండి: Viral Video: ఏటీఎం సెంటర్‌లో యువతి.. సడన్‌గా ఏమైందో అలా ప్రవర్తించింది!