Montenegro Lying Down Championship: Winner Zarko Penjavic Receives Rs 27k In Competition -Sakshi
Sakshi News home page

Lying Down Championship: అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్‌!

Published Sun, Aug 28 2022 9:21 AM | Last Updated on Sun, Aug 28 2022 10:27 AM

Man Receives Rs 27k Annual Lie Down Championship Held In Montenegro  - Sakshi

పనీపాటా లేకుండా తిని, పడుకుంటే డబ్బులొస్తాయా? అంటారు కానీ... ని­జంగా­నే ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్‌డౌన్‌ కాంపిటీషన్‌’.

పన్నెండో ఏడాది దిగ్విజయంగా జరిగిన ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహు­మ­తి గెలుచుకున్నాడు జర్కో పెజనోవిక్‌. నగదు­తోపాటు ఇద్దరికి రెస్టారెంట్‌లో భోజనం, ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్‌స్టే, రివర్‌ రాఫ్టింగ్‌ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు.

యూరప్‌ దేశమైన మాంటెనెగ్రోలోని నగరం నిక్సిక్‌లో ఈ వింత పోటీ జరిగింది. ‘ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడమేగా. ఈజీగా చేసేయొచ్చు అనుకు­న్నాను.. కానీ కష్టమే’ అన్నాడు జర్కో. చూడ­టా­నికి కుటుంబసభ్యు­లెవరైనా వచ్చినప్పుడు కూడా లేవకుండా ఉండగలగడం కష్టమైన విషయమని చెప్పాడు.

వంద సంవత్సరాల కిందటి ఓ చెట్టు కింద పోటీ నిర్వహించారు. తొమ్మిది మందితో పోటీ ప్రారంభమైనా.. ఏడుగురు మొదటిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండురోజులు మిగిలిన ఇద్దరి మధ్యే కాంపిటీషన్‌ జరిగింది. చివరకు జర్కో గెలిచాడు.  

(చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్‌ ఎంట్రీతో..:)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement